< Tich Joote 25 >
1 Bangʼ ndalo adek ka Festo nosedonjo e loch, noa Kaisaria modhi nyaka Jerusalem,
౧ఫేస్తు అధికారానికి వచ్చిన మూడు రోజులకు కైసరయ నుండి యెరూషలేము వెళ్ళాడు.
2 kendo kuno jodolo madongo gi jotend jo-Yahudi nokel e nyime mi giwacho ketho mane gidonjonego Paulo.
౨అప్పుడు ప్రధాన యాజకులూ, యూదుల పెద్దలూ, పౌలు మీద తమ ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేశారు.
3 Ne gitemo saye mondo otimnegi ngʼwono owe Paulo odogi Jerusalem nikech negichano butone mondo ginege gie yo kodhi.
౩“దయచేసి పౌలును యెరూషలేముకు పిలిపించండి” అని ఫేస్తును వారు కోరారు. ఎందుకంటే వారు అతణ్ణి దారిలో చంపడానికి కాచుకుని ఉన్నారు.
4 Festo nodwokogi niya, “Paulo otwe Kaisaria, kendo an awuon abiro dhi ire kuno mapiyo,
౪అందుకు ఫేస్తు, “పౌలు కైసరయలో ఖైదీగా ఉన్నాడు. నేను త్వరలో అక్కడికి వెళ్ళబోతున్నాను.
5 kuom mano, oruru jotendu moko adhigo mondo gidhi gidonjne kuno, kaponi osetimo gimoro marach.”
౫కాబట్టి మీలో సమర్థులు నాతో వచ్చి అతని మీద నేరమేదైనా ఉంటే మోపవచ్చు” అని జవాబిచ్చాడు.
6 Bangʼ kane osebet kodgi kuom ndalo aboro kata apar, nolor odhi Kaisaria, eka kinyne nochoko bura mogolo chik mondo okel Paulo e nyime.
౬అతడు వారి దగ్గర ఎనిమిది లేక పది రోజులు గడిపి కైసరయ వెళ్ళి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుని పౌలును తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు.
7 Kane Paulo odonjo, jo-Yahudi mane oyudo obiro koa Jerusalem nochungʼ olwore, ka gidonjone gi weche maricho ahinya, to ne ok ginyal nyiso ni wechego gin adier.
౭పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలబడి, ఎన్నో తీవ్ర నేరాలు మోపారు గాని వాటిని రుజువు చేయలేక పోయారు.
8 Eka Paulo nowacho kore, kodwokogi niya, “Onge gima aseketho kuom chik jo-Yahudi, kata kuom hekalu, kata kuom Kaisar.”
౮పౌలు, “యూదుల ధర్మశాస్త్రం గూర్చి గానీ, దేవాలయం గూర్చి గానీ, సీజరును గూర్చి గానీ నేనే తప్పూ చేయలేదు” అని జవాబు చెప్పాడు.
9 To Festo mane dwaro mondo omor jo-Yahudi nowachone Paulo niya, “Bende inyalo yie mondo idhi Jerusalem mondo kuno ema adhi ayalie kuom wechegi?”
౯అయితే ఫేస్తు యూదుల చేత మంచి వాడని అనిపించుకోవాలని, “యెరూషలేముకు వచ్చి అక్కడ నా ముందు ఈ సంగతులను గూర్చి విచారణకు నిలవడం నీకిష్టమేనా?” అని పౌలును అడిగాడు.
10 Paulo nodwoke niya, “Sani achungʼ iyala gi Buch Kaisar, kendo ka ema owinjore ongʼadnae bura. Onge gima rach ma asetimo ne jo-Yahudi, kata in bende ingʼeyo wachno maber.
౧౦అందుకు పౌలు, “సీజరు న్యాయపీఠం ముందు నిలబడి ఉన్నాను. నన్ను విచారణ చేయవలసిన స్థలం ఇదే, యూదులకు నేను ఏ అన్యాయమూ చేయలేదని మీకు బాగా తెలుసు.
11 Ka dipo ni asetimo gimoro mowinjore gi tho, to ok atamora mondo kik nega. To ka nyalo bet ni ketho ma jo-Yahudigi odonjonago gin miriambo, to onge ngʼato man-gi teko mar chiwa e lwetgi. Kuom mano, akwayo mondo otera e nyim Kaisar.”
౧౧నేను న్యాయం తప్పి మరణానికి తగిన పని ఏదైనా చేసి ఉంటే మరణానికి భయపడను. వీరు నా మీద మోపుతున్న నేరాల్లో ఏదీ నిజం కానప్పుడు నన్ను వారికి ఎవరూ అప్పగించడానికి వీలు లేదు. నేను సీజరు ముందే చెప్పుకొంటాను” అన్నాడు.
12 Kane Festo osekuotho gi jobuche, nongʼado bura kowacho niya, “Isekwayo mondo oteri e nyim Kaisar omiyo kuno ema ibiro dhiye!”
౧౨అప్పుడు ఫేస్తు తన సలహాదారులతో ఆలోచించి, “సీజరు ముందు చెప్పుకొంటాను అన్నావు కదా, సీజరు దగ్గరకే పంపిస్తాను” అని జవాబిచ్చాడు.
13 Bangʼ ndalo manok, ruoth Agripa kod Bernike nobiro Kaisaria mondo omos Festo.
౧౩ఆ తరవాత కొన్ని రోజులకు రాజైన అగ్రిప్ప, బెర్నీకే ఫేస్తును దర్శించడానికి కైసరయ వచ్చారు.
14 Negibedo kanyo kuom ndalo mogwarore, omiyo Festo nopimo ne ruoth Agripa wach Paulo, kowachone niya, “Nitie ngʼat moro ka ma Feliks noweyo kotwe e od twech.
౧౪వారక్కడ చాలా రోజులున్న తరువాత, ఫేస్తు పౌలు గురించి రాజుకు ఇలా చెప్పాడు, “ఫేలిక్సు విడిచిపెట్టి పోయిన ఖైదీ ఒకడు నా దగ్గర ఉన్నాడు.
15 Kane adhi Jerusalem, jodolo madongo gi jodong jo-Yahudi nodonjone ka gidwaro mondo angʼadne buch tho.
౧౫నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులూ, యూదుల పెద్దలూ, అతని మీద ఫిర్యాదు చేసి అతణ్ణి శిక్షించమని కోరారు.
16 “Ne anyisogi ni ok en kit jo-Rumi mondo ochiw ngʼato angʼata ne joma odonjone, kapok omiye thuolo mar wacho kore kuom weche modonjnego.
౧౬అందుకు నేను, ‘నేరం ఎవరి మీద మోపారో ఆ వ్యక్తి నేరం మోపిన వారికి ముఖాముఖిగా, తన మీద వారు మోపిన నేరం గూర్చి సమాధానం చెప్పుకోడానికి అవకాశం ఇవ్వాలి. అది లేకుండా ఏ మనిషికీ తీర్పు తీర్చడం రోమీయుల పద్ధతి కాదు’ అని జవాబిచ్చాను.
17 Kane gibiro ka, to ne aluongo bura ma ok odeko, kendo agolo Chik mondo kel ngʼatno e nyima.
౧౭వారిక్కడికి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమీ చేయకుండా, మరునాడే న్యాయపీఠం మీద కూర్చుని ఆ వ్యక్తిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాను.
18 To ka joma nodonjone nochungʼ mondo owuo, ne ok gihulo gima oketho kata mahundu moro ma notimo kaka ne aparo.
౧౮అయితే నేరం మోపినవారు నేను ఊహించిన నేరాల్లో ఒక్కటి కూడా అతని మీద మోపలేదు.
19 Kar timo kamano, to ne gimino mana kode wach kuom kit lemogi kendo kuom ngʼat moro miluongo ni Yesu, mane osetho, to Paulo oramo ni ngʼatno ngima.
౧౯కానీ మీ మతం గూర్చీ, చనిపోయిన యేసు అనే ఒకడి గూర్చీ ఇతనితో వారికి కొన్ని వివాదాలున్నట్టు కనబడింది. ఆ యేసు బతికే ఉన్నాడని పౌలు చెబుతున్నాడు.
20 Kane amedo nono tiend wachni, to notamo wangʼa, omiyo napenje ka doyie odhi Jerusalem mondo oyale kuno kuom wechegi.
౨౦నేనలాటి వాదాల విషయం ఏ విధంగా విచారించాలో తోచక, యెరూషలేముకు వెళ్ళి అక్కడ వీటిని గూర్చి విచారించడం అతనికి ఇష్టమవుతుందేమోనని అడిగాను.
21 Eka Paulo nokwayo mondo buche oter e nyim Kaisar. Omiyo nyocha agolo chik mondo odwoke e od twech nyaka chop aore ir Kaisar.”
౨౧అయితే పౌలు, చక్రవర్తి నిర్ణయం వచ్చేదాకా తనను కావలిలో ఉంచాలని చెప్పడం చేత నేనతణ్ణి సీజరు దగ్గరికి పంపించే వరకూ కావలిలో ఉంచమని ఆజ్ఞాపించాను.”
22 Eka Agripa nowachone Festo niya, “Daher mondo awinje weche ngʼatno an bende.” Nodwoke niya, “Kiny niwinje.”
౨౨అందుకు అగ్రిప్ప, “ఆ వ్యక్తి చెప్పుకొనేది నాక్కూడా వినాలనుంది” అన్నాడు. దానికి ఫేస్తు, “రేపు వినవచ్చు” అని చెప్పాడు.
23 Kinyne Agripa kod Bernike nobiro gi dhialruok maduongʼ ka gidonjo e od bura. Negidonjo kaachiel gi jodong jolweny madongo kod jodong dalano mamoko mogen. Eka Festo nogolo chik mondo okel Paulo e nyimgi, mi nokele.
౨౩మరునాడు అగ్రిప్ప, బెర్నీకే ఎంతో ఆడంబరంగా వచ్చి, సైనికాధిపతులతో, పురప్రముఖులతో అధికార మందిరంలో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞపై పౌలును తీసుకువచ్చారు.
24 Bangʼe Festo nowacho niya, “Ruoth Agripa kaachiel gi ji duto man kodwa ka, uneno ngʼatni! Jo-Yahudi duto osekwaya chakre Jerusalem nyaka Kaisaria ka gikok ni ok owinjore oweye obed mangima.
౨౪అప్పుడు ఫేస్తు, “అగ్రిప్ప రాజా, ఇక్కడ ఉన్న సమస్త ప్రజలారా, మీరు ఈ వ్యక్తిని చూస్తున్నారు గదా. యెరూషలేములోనూ ఇక్కడా యూదులంతా వీడు ఇక బతకకూడదని కేకలు వేస్తూ అతనికి వ్యతిరేకంగా నాకు మనవి చేసుకున్నారు.
25 An to ne ayudo kaonge gima osetimo mowinjore githo, to nikech odwaro mondo Kaisar ema oyale, asengʼado mondo otere Rumi.
౨౫ఇతడు మరణానికి తగిన పని ఏదీ చేయలేదని నేను గ్రహించాను. కానీ ఇతడు చక్రవర్తి ముందు చెప్పుకొంటానని అనడం చేత ఇతనిని అక్కడికే పంపాలని నిశ్చయించాను.
26 To kata kamano, aonge gi wach malongʼo ma anyalo ndiko ni Agripa kuome. Emomiyo asekele e nyimu uduto ka, to moloyo e nyimi, in Ruoth Agripa, mondo ka wasenone eka wayud wach ma dwandik kuome.
౨౬కానీ ఇతని గూర్చి మన చక్రవర్తికి రాయడానికి నాకు సరైన కారణం ఏమీ కనబడలేదు. కాబట్టి విచారణ అయిన తరువాత రాయడానికి ఏమైనా నాకు దొరకవచ్చని మీ అందరి ఎదుటికి, మరి ముఖ్యంగా అగ్రిప్ప రాజా, మీ ఎదుటికి ఇతనిని రప్పించాను.
27 Nikech nenorena ni onge tiende oro ngʼat motwe ka ok oyang maler kethone mokwongo.”
౨౭ఖైదీ మీద మోపిన నేరాలను వివరించకుండా అతనిని పంపడం సమంజసం కాదని నా ఉద్దేశం” అని వారితో చెప్పాడు.