< 2 Samuel 22 >

1 Kane Jehova Nyasaye osereso Daudi e lwet wasike duto kod e lwet Saulo, Daudi nowerne Jehova Nyasaye kopake gi weche mag wendni.
యెహోవా తనను సౌలు బారి నుండి, తన శత్రువులందరి నుండి తప్పించిన రోజున దావీదు యెహోవాకు ఈ పాట పాడాడు. అతడిలా ప్రార్థించాడు.
2 Nowacho ni: “Jehova Nyasaye en lwandana, en ohingana kendo en e jaresna;
యెహోవా నా ఆశ్రయ శిల, నా కోట, నా రక్షకుడు.
3 Nyasacha e lwandana, kuome ema apondoe, kendo en e okumbana kendo en e teko mar warruokna. En e ohingana, kar pondana, kendo jawarna en ema oresa kuom jo-mahundu.
నా ఆశ్రయ శిల, నేను ఆయన సంరక్షణలో ఉంటాను. నా డాలు, నా రక్షణ కొమ్ము, నా సురక్ష. ఆశ్రయస్థానం. హింస నుండి నన్ను కాపాడేవాడు.
4 “Aluongo Jehova Nyasaye, mowinjore pako, kendo oresa kuom wasika.
స్తుతికి అర్హుడైన యెహోవాకు నేను మొర్రపెట్టాను. నా శత్రువుల చేతిలోనుండి నేను తప్పించుకుంటాను.
5 Apaka mag tho nolwora; kendo oula mar kethruok nohewa.
మృత్యుకెరటాలు నన్ను చుట్టుకున్నాయి. భక్తిహీనుల వరద పొంగు నన్ను ముంచెత్తింది.
6 Tonde mag tho nondhoga morida kendo obadho mar tho nochika tir. (Sheol h7585)
పాతాళ పాశాలు నన్ను కట్టి వేశాయి. మరణపు ఉచ్చులు నన్ను చిక్కించుకున్నాయి. (Sheol h7585)
7 “E chandruokna ne aluongo Jehova Nyasaye kendo naluongo Nyasacha. Nowinjo dwonda ka en e hekalu mare kendo ywakna nochopo e ite.
నా దురవస్థలో నేను యెహోవాకు మొర్ర పెట్టాను. నా దేవునికి విన్నవించుకున్నాను. ఆయన తన ఆలయంలో నా ఆక్రోశం విన్నాడు. నా మొర్ర ఆయన చెవులకు చేరింది.
8 Piny notetni kendo oyiengni, mise mag polo noyiengni; negitetni nikech nokecho.
అప్పుడు భూమి కంపించింది. అదిరింది. పరమండలపు పునాదులు వణికాయి. ఆయన కోపానికి అవి కంపించాయి.
9 Iro nowuok e ume; mach mangʼangʼni nowuokie dhoge, mirni maliel maliet bende nowuok kuome.
ఆయన ముక్కుపుటాల్లో నుంచి నుండి పొగ లేచింది. ఆయన నోట నుండి జ్వాలలు వచ్చాయి. అవి నిప్పు కణాలను రగిల్చాయి.
10 Nobaro polo mobiro e piny; rumbi molil ti nonyono gi tiende.
౧౦ఆకాశాన్ని చీల్చి ఆయన దిగి వచ్చాడు ఆయన పాదాల కింద చిక్కటి చీకటి కమ్మి ఉంది.
11 Noidho kerubi mi ofuyogo ka kalausi.
౧౧ఆయన కెరూబును అధిరోహించి వచ్చాడు. గాలి రెక్కల మీద స్వారీ చేస్తూ కనిపించాడు.
12 Noloso mudho obedo ka hema molwore, ma en rumbi motwere mar koth manie polo.
౧౨అంధకారాన్ని తన చుట్టూ గుడారంగా చేసుకున్నాడు. దట్టమైన కారుమబ్బులను ఆకాశంలో రాశి పోశాడు.
13 Ler nowuok kama entie mamil ka mil polo.
౧౩ఆయన సన్నిధి మెరుపుల్లోనుండి అగ్ని కణాలు కురిశాయి.
14 Jehova Nyasaye nomor gie polo; dwond Nyasaye Man Malo Moloyo nowuo.
౧౪యెహోవా ఆకాశం నుండి గర్జించాడు. సర్వోన్నతుడు భీకర ధ్వని చేశాడు.
15 Nodiro aserni mokeyo wasigu, mor polo gi mil polo noriembogi.
౧౫తన బాణాలు వేసి శత్రువులను చెదరగొట్టాడు. ఉరుములు కురిపించి వారిని కకావికలు చేశాడు.
16 Kude mag nam kod mise mag piny noelore, kane Jehova Nyasaye okwerogi kokudho gi much ume.
౧౬యెహోవా యుధ్ధ ధ్వనికి ఆయన ముక్కుపుటాల నుండి వెలువడిన సెగకి భూగోళం పునాది రాళ్లు బయట పడ్డాయి.
17 “Norieyo bade ka en malo momaka, nogola ei pige matut.
౧౭పైనుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు. నురగలు కక్కుతున్న జలరాసుల్లో నుండి నన్ను బయటికి తీశాడు.
18 Noresa e lwet jasika maratego, kuom jowasika, mane tek moloya.
౧౮బలవంతులైన పగవారి నుండి, నన్ను ద్వేషించే వారినిండి, నన్ను లొంగదీసుకునే వారి నుండి ఆయన నన్ను రక్షించాడు.
19 Negimonja e kinde mane an gi masira, to Jehova Nyasaye ema nokonya.
౧౯విపత్కర సమయంలో వారు నా మీదికి వచ్చారు. కానీ యెహోవా నాకు అండగా ఉన్నాడు.
20 Nokela kama ni thuolo; noresa nikech nomor koda.
౨౦యెహోవా విశాలమైన చోటికి నన్ను తోడుకుని వచ్చాడు. నేనంటే ఆయనకు ఇష్టం గనక ఆయన నన్ను రక్షించాడు.
21 “Jehova Nyasaye osetimona mana maromre gi timna makare; osechula kaluwore gi tich lweta maler.
౨౧నా నీతినిబట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చాడు. నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు పూర్వ క్షేమ స్థితి కలిగించాడు.
22 Nimar aserito yore Jehova Nyasaye; ok asetimo marach kuom weyo Nyasacha.
౨౨ఎందుకంటే యెహోవా మార్గాలను నేను అనుసరిస్తున్నాను. నా దేవుని నుండి వైదొలగి దుర్మార్గంగా ప్రవర్తించలేదు.
23 Chikene duto ni e nyima; pok alokora aweyo buchene.
౨౩ఆయన న్యాయవిధులన్నీ నా కళ్ళెదుటే ఉన్నాయి. ఆయన కట్టడల నుండి ఎప్పుడూ దారి తొలగ లేదు.
24 Asebedo maonge ketho e nyime, kendo aseritora mondo kik atim richo.
౨౪ఆయన దృష్టికి నిర్దోషిగా ఉన్నాను. పాపానికి దూరంగా ఉన్నాను.
25 Jehova Nyasaye osemiya pokna mowinjore gi timna makare, mana machal gi kaka aler e wangʼe.
౨౫నా నీతినిబట్టి యెహోవా నాకు పూర్వ క్షేమస్థితి కలిగించాడు తన దృష్టిలో నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలమిచ్చాడు.
26 “Ne jo-adiera, ibedonegi ja-adiera, to ni joma onge ketho, to ibedonegi maonge ketho,
౨౬నమ్మదగిన వారికి నీవు నమ్మదగిన వాడిగా ఉంటావు. యథార్థవంతుల పట్ల నీవు యథార్థవంతుడవుగా ఉంటావు.
27 ne jomaler, inyisori kaka ngʼama ler, to ne joma yoregi obam, inyisori kaka ngʼama rach.
౨౭నిష్కళంకుల యెడల నీవు నిష్కళంకంగా ఉంటావు. వక్ర బుద్ది గలవారి యెడల వికటంగా ఉంటావు.
28 Ireso joma muol, to wangʼi rango josunga mondo idwokgi piny.
౨౮యాతన పడే వారిని రక్షిస్తావు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచి వేస్తావు.
29 In e tacha, yaye Jehova Nyasaye Jehova Nyasaye loko mudho momaka bedo ler.
౨౯యెహోవా, నీవు నాకు దీపం. యెహోవా నా చీకటిని వెలుగుగా మార్చు.
30 Ka ikonya to anyalo loyo jolweny momonja; ka an gi Nyasacha to anyalo lwenyo ohinga.
౩౦నీ సహాయంతో నేను అడ్డుకంచెలు అధిగమిస్తాను. నా దేవుని సహాయంతో నేను ప్రాకారాలను దాటుతాను.
31 “Yor Nyasaye en yo malongʼo; wach Jehova Nyasaye onge ketho. En okumba ni jogo duto mopondo kuome.
౩౧దేవుని మార్గం పరిపూర్ణం యెహోవా వాక్కు నిర్మలం ఆయన అండజేరిన వారికందరికి ఆయన డాలు.
32 Ere Nyasaye moro makmana Jehova Nyasaye? Kendo en ngʼatno ma en Lwanda makmana Nyasachwa?
౩౨యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?
33 Nyasaye ema miya teko kendo omiyo yora bedo mokwe.
౩౩దేవుడు నాకు బలమైన కోట. ఆయన తన మార్గాల్లో యథార్థవంతులను నడిపిస్తాడు.
34 Omiyo tiendena bedo mayot ka tiende mwanda; kendo en ema omiyo achungʼ kuonde man malo maboyo.
౩౪ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేస్తాడు. పర్వతాలపై నన్ను నిలుపుతాడు.
35 Otiego lwetena ne lweny; bedena nyalo ywayo atungʼ mar nyinyo.
౩౫నా చేతులకు యుద్ధం నేర్పేవాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెడతాయి.
36 Imiya okumbani mar loch; ikulori piny mondo imi abed maduongʼ.
౩౬నీవు నీ రక్షణ డాలును నాకు అందిస్తావు. నీ అనుగ్రహం నన్ను గొప్పచేస్తుంది.
37 Imiyo yo mawuothoe bedo malach, mondo tiendena kik ba yo.
౩౭నా పాదాల కింద స్థలం విశాలం చేస్తావు. అందువల్ల నా కాళ్ళు జారవు.
38 “Ne alawo wasika mi atiekogi; ne ok aweyogi nyaka negirumo.
౩౮నా శత్రువులను తరిమి నాశనం చేస్తాను. వారిని నాశనం చేసేదాకా నేను వెనుదిరగను.
39 Ne atiekogi chuth, mane ok ginyal chungʼ; negipodho e tienda.
౩౯నేను వారిని మింగి వేశాను. ముక్కలుచెక్కలు చేశాను. వారిక లేవలేరు. వారు నా కాళ్ళ కింద ఉన్నారు.
40 Ne imiya teko mar kedo lweny; ne imiyo jomamon koda kulore e nyima.
౪౦నడికట్టు బిగించి కట్టినట్టు యుద్ధం కోసం నాకు బలాన్ని ధరింపజేస్తావు. నా మీదికి లేచిన వారిని నీవు అణచివేస్తావు.
41 Ne imiyo wasika oringo kadhi, mine atieko joma ok dwara.
౪౧నా శత్రువుల మెడలను నా ముందు వంచావు. నన్ను ద్వేషించే వారిని నేను సమూలనాశనం చేస్తాను.
42 Ne giywak mondo okonygi, to ne onge ngʼama ne nyalo resogi; ne giywakne Jehova Nyasaye, to ne ok odwokogi.
౪౨వారు సహాయం కోసం అరిచారు. కానీ రక్షించే వాడు ఎవడూ లేడు. వారు యెహోవా కోసం ఎదురు చూసినా ఆయన వారికి జవాబియ్యడు.
43 Ne agoyogi ma giregore ka buru mayom mar lowo; nanyonogi mawuotho kuomgi ka chwodho man e yo.
౪౩నేను నేల దుమ్ము లాగా వారిని పొడి చేస్తాను. వీధిలోని బురదలాగా నేను వారిని వెదజల్లి అణగదొక్కుతాను.
44 “Iseresa e lwet jowa mane monja; iserita kaka jatelo mar ogendini. Joma ne ok angʼeyo nobet e bwo lochna,
౪౪నా స్వజనుల కలహాల్లో నుండి కూడా నీవు నన్నువిడిపించావు. ప్రజల అధికారిగా నన్ను నిలిపావు. నేను ఎరుగని ప్రజానీకం నన్ను సేవిస్తారు.
45 kendo jopinje mamoko biro ira kobolore, ka awuoyo to giwinja kendo gitimo gima adwaro.
౪౫పరదేశులు గత్యంతరం లేక నాకు లోబడతారు. వారు నన్నుగూర్చి వింటే చాలు, నాకు విధేయులౌతారు.
46 Negibiro ka gitetni; kendo ka chunygi ool, ka gia kuondegi mag pondo.
౪౬అన్యులు వణకుతూ తమ భద్రమైన స్థలాలు విడిచి వస్తారు.
47 “Jehova Nyasaye ngima! Pak obed ne Lwandana! Duongʼ obed ni Nyasaye, ma Lwanda kendo ma Jawarna.
౪౭యెహోవా సజీవుడు. నాకు అండ అయిన వాడికి స్తుతి. నా విముక్తి శిల అయిన దేవుడు ఘనత నొందుగాక.
48 En e Nyasaye ma chulona kuor, maketo ogendini e bwoya,
౪౮ఆయన నా పక్షంగా ప్రతీకారం చేసే దేవుడు జాతులను నాకు లోబరిచేవాడు ఆయనే.
49 ma gonya e lwet wasika. Nitingʼa malo moloyo wasika; ne iresa e lwet jo-mahundu.
౪౯ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిస్తాడు. నా మీద దాడి చేసే వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చిస్తావు. హింసాత్మకుల నుండి నన్ను కాపాడుతావు.
50 Emomiyo anapaki e kind ogendini, yaye Jehova Nyasaye, kendo anawer wende mapako nyingi.
౫౦కాబట్టి యెహోవా, జాతుల మధ్య నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. నీ నామానికి స్తుతి పాడుతాను.
51 “Jehova Nyasaye kelo resruok maduongʼ ne ruoth moketo; onyiso ngʼwonone mogundho ma ok rum ne ngʼate mowir, ni Daudi gi nyikwaye nyaka chiengʼ.”
౫౧తాను నియమించిన రాజుకు ఆయన గొప్ప విజయాన్నిస్తాడు. తాను అభిషేకించిన దావీదుకు అతని సంతానానికి నిబంధన విశ్వసనీయత చూపే వాడు ఆయన.

< 2 Samuel 22 >