< 1 Samuel 7 >
1 Jo-Kiriath Jearim nobiro mokawo Sandug Muma mar Jehova Nyasaye. Ne gitere e od Abinadab mane ni e got, kendo negiwalo Eliazar ma wuode mondo orit Sandug Muma mar Jehova Nyasaye.
౧అప్పుడు కిర్యత్యారీము ప్రజలు వచ్చి యెహోవా మందసాన్ని తీసుకువెళ్ళి గిబియాలో కొండపై ఉన్న అబీనాదాబు ఇంటి దగ్గర ఉంచి దాన్ని కాపాడడం కోసం అతని కొడుకు ఎలియాజరును నియమించారు.
2 Sandug Muma nobudho Kiriath Jearim kuom higni piero ariyo, jo-Israel duto nokuyo mi odok ir Jehova Nyasaye.
౨మందసాన్ని కిర్యత్యారీములో ఉంచి ఇరవై ఏళ్లు నిండాయి. ఇశ్రాయేలీయులంతా యెహోవాను అనుసరించాలని కోరుతూ చింతిస్తున్నారు.
3 Kendo Samuel nowachone jo-Israel duto niya, “Ka udwogo ir Jehova Nyasaye gi chunyu duto, to goluru nyiseche mag jopinje mamoko ma un-go kod mag Ashtoreth, to chiwreuru ni Jehova Nyasaye kendo en kende ema utine, mi noresu kogolou e lwet jo-Filistia.”
౩సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చి ఇలా చెప్పాడు. “మీరు మనస్ఫూర్తిగా యెహోవా వైపుకు తిరిగి, ఇతర దేవుళ్ళను, అష్తారోతు దేవుళ్ళను మీ మధ్యనుండి తీసివేసి, పట్టుదల గలిగి యెహోవా వైపు మీ మనస్సులను మళ్ళించి ఆయనను ఆరాధించండి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోనుండి మిమ్మల్ని విడిపిస్తాడు.”
4 Omiyo jo-Israel nogolo mowito nyisechegi mag Baal gi mag Ashtoreth; mine gitiyo ne Jehova Nyasaye kende.
౪ఆ తరువాత ఇశ్రాయేలీయులు బయలు దేవుళ్ళను, అష్తారోతు దేవుళ్ళను విడిచిపెట్టి యెహోవాను మాత్రమే సేవించడం మొదలుపెట్టారు.
5 Eka Samuel nowacho niya, “Chokuru jo-Israel duto Mizpa, anto abiro lemo ka akwayonu Jehova Nyasaye.”
౫అప్పుడు సమూయేలు “ఇశ్రాయేలీయులంతా మిస్పా ప్రదేశానికి చేరుకోండి. నేను మీ తరపున యెహోవాకు ప్రార్థన చేస్తాను” అని చెప్పినప్పుడు
6 Kane gisechokore kanyakla Mizpa ne giumbo pi mi gipuko e nyim Jehova Nyasaye. Odiechiengno negitweyo chiemo ka gihulo richo kagiwacho niya, “Waseketho e nyim Jehova Nyasaye.” Kendo Samuel nobedo jatend Israel e piny Mizpa.
౬వారు మిస్పాలో సమావేశమై నీళ్లు చేది యెహోవా సన్నిధిలో కుమ్మరించి ఆ రోజంతా ఉపవాసం ఉండి “యెహోవా దృష్టిలో మేమంతా పాపం చేశాం” అని ఒప్పుకున్నారు. సమూయేలు మిస్పాలో ఉంటూ ఇశ్రాయేలీయులకు తీర్పు తీరుస్తూ న్యాయం జరిగిస్తున్నాడు.
7 Kane jo-Filistia owinjo ni jo-Israel nosechokore Mizpa, ruodhi mag jo-Filistia nobiro mondo omonjgi. To kane jo-Israel owinjo wachno, luoro nomakogi.
౭ఇశ్రాయేలీయులు మిస్పాలో సమకూడారని ఫిలిష్తీయులకు తెలిసినప్పుడు ఫిలిష్తీయ దండు వారి మీద దాడికి సిద్ధమయ్యారు. ఈ విషయం ఇశ్రాయేలీయులకు తెలిసినప్పుడు వారు ఫిలిష్తీయులకు భయపడి
8 Negiwachone Samuel niya, “Kik iwe ma ok ikwayonwa Jehova Nyasaye ma Nyasachwa mondo omi oreswa e lwet jo-Filistia.”
౮“మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలోనుండి మనలను రక్షించేలా మా కోసం ప్రార్థన చేయడం మానవద్దు” అని సమూయేలును వేడుకున్నారు.
9 Eka Samuel nokawo nyarombo ma pod dhoth mi ochiwo ka misango miwangʼo pep ni Jehova Nyasaye. Noywak ni Jehova Nyasaye e lo jo-Israel, mi Jehova Nyasaye ne odwoke.
౯సమూయేలు ఇంకా పాలు తాగడం మానని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ హోమం అర్పించి, ఇశ్రాయేలీయుల తరఫున యెహోవాకు ప్రార్థించినపుడు యెహోవా అతని ప్రార్థన విన్నాడు.
10 Kane Samuel pod chiwo misango miwangʼo pep, jo-Filistia noyworo machiegni mondo oked gi jo-Israel. To chiengʼno Jehova Nyasaye nomiyo polo omor matek kuom jo-Filistia manomiyogi luoro ma gikee ka gikia kuma gidhiye, kendo negiringo e nyim jo-Israel.
౧౦సమూయేలు దహనబలి అర్పిస్తున్న సమయంలో ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీయుల పైకి వచ్చారు. అయితే యెహోవా ఆ రోజు ఫిలిష్తీయుల మీదికి విపరీతంగా ఉరుములు ఉరిమేలా చేసి వారిని కల్లోలపరచడంతో వారు ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయారు.
11 Jo-Israel nowuok Mizpa molawo jo-Filistia ma ginegogi e yo nyaka Beth-Kar.
౧౧ఇశ్రాయేలీయులు మిస్పా నుండి మొదలుపెట్టి బేత్కారు వరకూ ఫిలిష్తీయుల వెంటబడి చంపివేశారు.
12 Eka Samuel nokawo kidi mochungo e kind Mizpa gi Shen. Nochake ni Ebeneza kowacho niya, “Jehova Nyasaye osekonyowa nyaka ka.”
౧౨అప్పుడు సమూయేలు ఒక రాయి తీసుకుని మిస్పాకు, షేనుకు మధ్య దాన్ని నిలబెట్టి “ఇప్పటి వరకూ యెహోవా మనకు సహాయం చేశాడు” అని చెప్పి ఆ రాయికి “ఎబెనెజరు” అని పేరు పెట్టాడు.
13 Omiyo jo-Filistia nolo mine ok gichako gimonjo piny jo-Israel kendo. E kinde duto mane Samuel pod ngima, lwet Jehova Nyasaye nosando jo-Filistia.
౧౩ఈ విధంగా ఫిలిష్తీయులు అణగారిపోయి ఇశ్రాయేలు సరిహద్దుల్లోకి మళ్ళీ రాలేకపోయారు. సమూయేలు జీవించిన కాలమంతటిలో యెహోవా హస్తం ఫిలిష్తీయులకి విరోధంగా ఉంది.
14 Mier mane jo-Filistia omayo jo-Israel kochakore Ekron nyaka Gath nodwoknegi, Israel noreso gwenge mane okiewo kode koa e loch jo-Filistia. Kendo kwe nobedo e kind Israel gi jo-Amor.
౧౪ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల నుండి ఆక్రమించుకొన్న పట్టణాలన్నీ వారికి తిరిగి వచ్చాయి. ఎక్రోను నుండి గాతు వరకూ ఉన్న గ్రామాలనూ వాటిలోని పొలాలనూ ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించుకున్నారు. ఇశ్రాయేలీయులకు, అమోరీయులకు మధ్య శాంతి ఏర్పడింది.
15 Samuel nobedo jangʼad bura e piny Israel e ndalo duto mag ngimane.
౧౫సమూయేలు జీవించిన కాలమంతా ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు.
16 Higa ka higa nolworore koa Bethel nyaka Gilgal gi Mizpa kongʼado bura ne jo-Israel kuonde duto.
౧౬ప్రతి సంవత్సరమూ అతడు బేతేలుకు, గిల్గాలుకు, మిస్పాకు తిరుగుతూ, వివిధ ప్రాంతాల్లో ఇశ్రాయేలీయులకు న్యాయం జరిగిస్తూ వచ్చాడు.
17 To kinde duto ne odokga Rama, kuma dalane ne nitie, kanyo bende ne ongʼadoe bura ne jo-Israel. Ne ogero kendo mar misango ne Jehova Nyasaye kanyo.
౧౭అతని నివాసం రమాలో ఉన్నందువల్ల అక్కడికి తిరిగి వచ్చి అక్కడ కూడా న్యాయం జరిగిస్తూ వచ్చాడు. అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు.