< 1 Samuel 30 >

1 Daudi kod joge nochopo Ziklag chiengʼ mar adek. Koro jo-Amalek noyudo osemonjo Negev gi Ziklag. Negipeyo Ziklag mi giwangʼe,
దావీదు, అతనితో ఉన్నవారు మూడవ రోజున సిక్లగు వచ్చారు. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదా సిక్లగు మీదా దాడిచేసి, దోచుకుని సిక్లగు ప్రజలను ఓడించి, ఊరు తగలబెట్టి,
2 kendo gimako mon kod ji duto mane ni kanyo, jomatindo kod jomadongo ma giteroe twech. To ne ok ginego ngʼato kuomgi, to ne gikawogi ma gidhi kodgi.
పెద్దలనూ పిల్లలనూ అందులో ఉన్న స్త్రీలతో సహా చంపకుండా చెరబట్టి తీసుకుపోయారు.
3 Kane Daudi gi joge ochopo Ziklag, negiyudo ka osewangʼe gi mach kendo mondgi, yawuotgi gi nyigi nosemaki oter e twech.
దావీదు, అతని మనుషులు అ ఊరికి వచ్చి అది కాలిపోయి ఉండడం, తమ భార్యలూ, కొడుకులూ కూతుర్లూ చెరలోకి పోయి ఉండడం చూసి
4 Daudi gi joge noywak matek ma tekregi norumo makoro ok ginyal ywak.
ఇక ఏడవడానికి ఓపిక లేనంత గట్టిగా ఏడ్చారు.
5 Mond Daudi ariyo bende ne osemaki ma gin Ahinoam nyar Jezreel gi Abigael ma dhako ma chwore otho mane jaod Nabal ja-Karmel.
యజ్రెయేలీయురాలు అహీనోయము, కర్మెలు వాడైన నాబాలు భార్యగా ఉన్న అబీగయీలు అనే దావీదు ఇద్దరు భార్యలు కూడా చెరలోకి పోవడం చూసి
6 Daudi ne chunye ool nikech jogo ne wacho ni mondo ochiele gi kite; ka moro ka moro ne winjo lit nikech yawuote gi nyige. Daudi to noyudo teko moa kuom Jehova Nyasaye ma Nyasache.
దావీదు చాలా దుఃఖపడ్డాడు. తమ తమ కొడుకులూ కూతుర్లను బట్టి వారందరికీ ప్రాణం విసికి పోయి దావీదును రాళ్లు రువ్వి చంపాలని చెప్పుకున్నారు. దావీదు తన దేవుడు, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు.
7 Eka Daudi nowachone Abiathar jadolo, ma wuod Ahimelek niya, “Kelna law mayom mar dolo miluongo ni efod.” Abiathar nokelone,
అప్పుడు దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడైన అహీమెలెకు కుమారుడు అబ్యాతారుతో చెప్పాడు. అబ్యాతారు ఏఫోదును దావీదు దగ్గరికి తీసుకు వచ్చాడు.
8 mi Daudi nopenjo Jehova Nyasaye wach ni, “Bende dalaw joma osepeyowagi. Bende dajukgi?” Nodwoke niya, “Lawgi. Chutho inijukgi mi inires jogi duto.”
“నేను ఈ సేనను తరిమితే దాని కలుసుకోగలుగుతానా?” అని యెహోవా దగ్గర దావీదు విచారణ చేశాడు. అందుకు యెహోవా “తరుము, తప్పకుండా నీవు వాళ్ళని కలుసుకుని నీవారినందరినీ విడిపించుకుంటావు” అని చెప్పాడు.
9 Daudi gi joge mia auchiel nochopo e Holo mar Besor, joge moko nodongʼ kanyo,
కాబట్టి దావీదు, అతనితో ఉన్న 600 మంది బయలుదేరి, బెసోరు వాగు గట్టుకు వస్తే వారిలో 200 మంది ఆగిపోయారు.
10 nimar ji mia ariyo nool ahinya mane ok ginyal ngʼado holono. To Daudi gi ji mia angʼwen nodhi nyime gi lepo.
౧౦దావీదు, ఇంకా 400 మంది తరుముతూ పోయారు గానీ ఆ 200 మంది అలిసి పోయి బెసోరు వాగు దాటలేక ఆగిపోయారు. ఆ 400 మంది పోతుంటే
11 Negiyudo ja-Misri moro e pap mi gikele ir Daudi. Negimiye pi mondo omodhi gi chiemo mondo ocham
౧౧ఒక పొలంలో ఒక ఐగుప్తీయుడు తారసపడ్డాడు. వారు దావీదు దగ్గరికి అతణ్ణి తీసుకు వచ్చి భోజనం పెడితే, తిన్నాడు. దాహానికి నీరిస్తే, తాగాడు.
12 nus mar kek molos gi olemb ngʼowu to gi kek molos gi resin. Nochiemo ma chunye noduogo nikech noyudo pok ochiemo kata modho pi kuom odiechienge adek gi otieno bende.
౧౨వారు అతనికి అంజూరపు ముద్ద తుంచి ఇచ్చారు. రెండు ఎండు ద్రాక్ష ముద్దలు అతనికిచ్చారు. అతడు మూడు రోజులనుండి పస్తులున్నాడు. భోజనం చేసిన తరువాత అతడి ప్రాణం తెప్పరిల్లింది.
13 Daudi nopenje niya, “In ngʼat ngʼa? To in jakanye?” Nowacho niya, “An ja-Misri ma misumba ja-Amalek. Ruodha nojwangʼa moweya, ka tuo nogoya ndalo adek mokadho.
౧౩అప్పుడు దావీదు “నీవు ఏ దేశం వాడివి? ఎక్కడనుండి వచ్చావు?” అని అడిగాడు. అందుకు వాడు “నేను ఐగుప్తు వాణ్ణి. ఒక అమాలేకీయుడికి బానిసనయ్యాను. మూడు రోజుల క్రితం నాకు జబ్బు చేసింది. నా యజమాని నన్ను వదిలి వెళ్ళిపోయాడు.
14 Ne wapeyo Negev mar jo-Kereth kod gwengʼ Juda to gi Negev ma piny Kaleb mine wawangʼo Ziklag.”
౧౪మేము దండెత్తి కెరేతీ జాతి వారుండే దక్షిణ దేశానికి, యూదా దేశానికి, కాలేబు దక్షిణ దేశానికి వచ్చి వాటిని దోచుకుని సిక్లగును కాల్చివేశాం” అని చెప్పాడు.
15 Daudi nopenje niya, “Bende inyalo tera ir jopechogi?” Nodwoke niya, “Kwongʼrina e nyim Nyasaye ni ok ninega kata dwoka e lwet ruodha, to abiro teri irgi.”
౧౫“ఆ దోపిడీ గుంపును కలుసుకొనేందుకు నీవు నాకు దారి చూపుతావా” అని దావీదు అడిగితే అతడు “నేను నిన్ను చంపననీ నీ యజమాని వశం చేయననీ దేవుని పేరున నాకు మాట ఇస్తే ఆ గుంపును కలుసుకోవడానికి నీకు దారి చూపుతాను” అన్నాడు.
16 Notelo ni Daudi ka gilor mwalo, kendo ne giyudogi ka gike e pap, ka gichiemo kendo metho ka gin gimor maduongʼ nikech gik mane gipeyo e piny jo-Filistia gi piny Juda ne thoth ahinya.
౧౬తరువాత వాడు వారి దగ్గరికి దావీదును తోడుకుని పోయాడు. ఆ దోపిడీ వారు ఫిలిష్తీయుల దేశంలోనుండి, యూదా దేశం లోనుండి తాము దోచి తెచ్చుకొన్న కొల్ల సొమ్ముతో, ఆ ప్రదేశమంతా చెల్లాచెదరుగా తింటూ, తాగుతూ ఆటపాటల్లో ఉన్నారు.
17 Daudi nokedo kodgi chakre yuso piny nyaka kinyne godhiambo. Kendo ne onge ngʼat mane otony modhi makmana yawuowi mia angʼwen mane oidho ngamia kende ema noringo otony.
౧౭దావీదు అదను కనిపెట్టి సంధ్యవేళ మొదలు మరునాటి సాయంత్రం వరకూ వారిని చంపుతూ ఉంటే ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యువకులు తప్ప ఒక్కడు కూడా తప్పించుకొన్నవాడు లేకపోయాడు.
18 Daudi noreso gik moko duto mane jo-Amalek osepeyo kaachiel gi monde ariyo.
౧౮ఇలా దావీదు అమాలేకీయులు దోచుకు పోయిన దానంతటినీ తిరిగి తెచ్చుకున్నాడు. అంతేకాదు, అతడు తన ఇద్దరు భార్యలను కూడా రక్షించుకున్నాడు.
19 Onge gimoro amora mane olal bed ni en ngʼama tin kata ngʼama duongʼ, wuowi kata nyako, gik mane ope kata gik mane gikawo, Daudi nodwoko gik moko duto.
౧౯కొడుకులూ కూతుర్లూ దోపుడు సొమ్ము, ఇలా వారు ఎత్తుకుపోయిన దానంతటిలో ఏదీ తక్కువ కాకుండా మొత్తం దావీదు దక్కించుకున్నాడు.
20 Nokawo kweth mag jamni kod mag dhok mi joge nosembogi e nyim kweth mag jamni mamoko kowacho niya, “Magi gin gik ma Daudi opeyo.”
౨౦దావీదు ఇంకా అమాలేకీయుల గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటినీ చేజిక్కించుకున్నాడు. ఇవి దావీదుకు దోపుడు సొమ్ము అని భావించి తక్కిన వారు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వీటిని తోలారు.
21 Eka Daudi noduogo e Holo mar Besor kama ji mia ariyo mane ool mane ok nyal dhi kode nodongʼie. Negibiro mondo girom ni Daudi gi ji mane ni kode. Ka Daudi gi joge nosudo machiegni nomosogi.
౨౧అలిసి పోయి దావీదుతో కలిసి రాలేక బెసోరు వాగు దగ్గర నిలిచిపోయిన ఆ 200 మంది దగ్గరకి దావీదు తిరిగి వెళ్ళాడు. వారు దావీదును అతనితో ఉన్నవారిని ఎదుర్కొనడానికి బయలుదేరి వచ్చారు. దావీదు వారి దగ్గరకి వచ్చి వారి యోగక్షేమాలు అడిగాడు.
22 To joricho duto gi joma acheje mane ni ei joma luwo Daudi nowacho niya, “Nikech ne ok gidhi kodwa, ok wabi pogo kodgi gik mope ma wadwoko. To kata kamano ngʼato ka ngʼato okaw chiege gi nyithinde mondo odhigo.”
౨౨దావీదుతో కూడా వెళ్లిన వారిలో దుష్టులు, పనికిమాలిన వారు కొంతమంది “వీళ్ళు మనతో కూడా రాలేదు గనక వారి భార్యలనూ పిల్లలనూ తప్ప మనకు దక్కిన దోపుడు సొమ్ములో ఏమీ వీరికి ఇవ్వనక్కర లేదు. తమ భార్య పిల్లలను మాత్రం వారు తీసికోవచ్చు” అన్నారు.
23 Daudi nodwoko niya, “Ooyo owetena, ok onego utim kamano gi gik ma Jehova Nyasaye osemiyowa. Oseritowa mi ochiwonwa joma nomonjowa.
౨౩అందుకు దావీదు వారితో “నా సోదరులారా, యెహోవా మనలను కాపాడి మనమీదికి వచ్చిన ఈ దండును మన వశం చేసి, మనకు దయచేసిన కొల్ల సొమ్ము విషయంలో మీరు ఇలా చేయడం తగదు.
24 Ngʼama biro winjo wachu? Pok mar joma nodongʼ karito gigewa biro bedo marom gi pok ngʼat mane odhi e lweny. Ji duto biro yudo maromre.”
౨౪మీరంటున్నది ఎవరు ఒప్పుకుంటారు? యుద్దానికి పోయినవాడికీ సామాను దగ్గర కావలి ఉన్న వాడికి ఒకటే భాగం కదా. అందరూ సమానంగానే పాలు పంచుకుంటారు గదా”
25 Daudi noketo ma obedo chik e Israel chakre chiengʼno nyaka chil kawuono.
౨౫ఆ విధంగా అప్పటి నుండి ఇప్పటి వరకూ దావీదు ఇశ్రాయేలీయుల్లో అలాటి పంపకం కట్టడగా న్యాయవిధిగా ఏర్పరచి నియమించాడు.
26 Ka Daudi nochopo Ziklag nooro joote gi gik mope ne jodong Juda mosiepene, kowacho niya, “Ero aoronu mich kuom gik mope mag jowasik Jehova Nyasaye.”
౨౬దావీదు సిక్లగుకు చేరుకుని దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు పంపించాడు. యెహోవా శత్రువులనుండి నేను దోచుకొన్న సొమ్ములో కొంత కానుకగా మీకు ఇస్తున్నానని చెప్పి వారికి పంపించాడు.
27 Noorgi ni joma ne ni Bethel, Ramoth Negev gi Jatir,
౨౭బేతేలులో, దక్షిణ రామోతులో, యత్తీరులో,
28 gi joma ni Aroer, Sifmoth gi Eshtemoa,
౨౮అరోయేరులో, షిప్మోతులో, ఎష్టేమోలో,
29 gi Rakal; gi jogo mane ni e mier matindo mag jo-Jeramel gi jo-Keni,
౨౯రాకాలులో, యెరహ్మెయేలీయుల గ్రామాల్లో, కేనీయుల గ్రామాల్లో,
30 to gi joma ni Horma, Bor Ashan gi Athak
౩౦హోర్మాలో బోరాషానులో, అతాకులో
31 kod Hebron; to mago man e kuonde duto ma Daudi gi joge nosebedo kadhiye.
౩౧హెబ్రోనులో దావీదూ అతని మనుషులూ తిరుగాడిన స్థలాలన్నిటిలో ఉన్న పెద్దలకు దావీదు ఇలా పంపించాడు.

< 1 Samuel 30 >