< 1 Weche Mag Ndalo 9 >

1 Jo-Israel duto ne ochan nying-gi e ndiko mar nonro mar anywolagi e kitap ruodhi mag Israel. Oganda mar Juda ne oter e twech Babulon nikech ne ok gibedo jo-ratiro.
ఈ విధంగా ఇశ్రాయేలీయులందరి పేర్లూ తమ వంశాల ప్రకారం ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో నమోదయ్యాయి. యూదావాళ్ళు చేసిన పాపం కారణంగా వాళ్ళు బబులోనుకి బందీలుగా కునిపోబడ్డారు.
2 Joma nokwongo dak kendo e kuondegi giwegi kod miechgi ne gin jo-Israel moko, jodolo, jo-Lawi kod jotij hekalu.
తరువాత మొదటగా కొందరు ఇశ్రాయేలీయులూ, యాజకులూ, లేవీయులూ, దేవాలయ సేవకులూ తమ సొంత పట్టణాల్లో తిరిగి నివాసం ఏర్పరచుకున్నారు.
3 Joma noa Juda, Benjamin, Efraim kod Manase mane odak Jerusalem ne gin:
అలాగే కొందరు యూదావాళ్ళూ, బెన్యామీనీయులూ, ఎఫ్రాయిము, మనష్షే గోత్రాలకు చెందిన వాళ్ళూ యెరూషలేములో నివాసమున్నారు.
4 Uthai wuod Amihud, wuod Omri, wuod Imri, wuod Bani, joka Perez ma wuod Juda.
ఈ విధంగా నివాసం ఏర్పరచుకున్న వాళ్ళలో ఊతైయూ ఉన్నాడు. ఊతైయూ అమీహూదు కొడుకు. అమీహూదు ఒమ్రీ కొడుకు. ఒమ్రీ ఇమ్రీ కొడుకు. ఇమ్రీ బానీ కొడుకు. బానీ పెరెసు వంశం వాడు. పెరెసు యూదా కొడుకు.
5 Joka Shilo ne gin: Asaya makayo to gi yawuote.
షిలోనీ వాళ్ళలో పెద్దవాడు ఆశాయా, అతని సంతానమూ,
6 Joka Zera: Jeul. Jo-Juda ne gin ji mia auchiel gi piero ochiko.
జెరహు సంతతి వాళ్ళలో యెవుయేలు, అతని సోదరులైన ఆరు వందల తొంభై మందీ ఉన్నారు.
7 Joka Benjamin ne gin: Salu wuod Meshulam, wuod Hodavia, wuod Hasenua;
ఇంకా బెన్యామీనీయుల్లో సెనూయా కొడుకు హోదవ్యాకి పుట్టిన మెషుల్లాము కొడుకైన సల్లూ,
8 Ibneia wuod Jeroham; Ela wuod Uzi, wuod Mikri kod Meshulam wuod Shefatia, wuod Reuel, wuod Ibnija.
యెరోహాము కొడుకైన ఇబ్నెయా, మిక్రి పుట్టిన ఉజ్జీకి పుట్టిన ఏలా, ఇబ్నీయా కొడుకైన రగూవేలుకి పుట్టిన షెఫట్యా కొడుకైన మెషుల్లామూ ఉన్నారు.
9 Oganda joka Benjamin kaka ochan-gi e nonro mar anywolagi kwan-gi ne romo ji mia ochiko gi piero abich gauchiel. Jogi duto ne gin jotend anywolagi.
వీళ్ళూ వీళ్ళ సోదరులూ కలసి వంశావళి లెక్కల్లో తొమ్మిది వందల యాభై ఆరు మంది అయ్యారు. వీళ్ళంతా తమ తమ వంశాలకు నాయకులుగా ఉన్నారు.
10 Koa kuom oganda jodolo ne gin: Jedaya, Jehokarib, Jakin,
౧౦యాజకుల్లో యెదాయా, యెహోయారీబు, యాకీను ఉన్నారు.
11 Azaria wuod Hilkia, wuod Meshulam, wuod Zadok, wuod Merayoth, wuod Ahitub mane jatelo morito Od Nyasaye;
౧౧అలాగే నివాసం ఏర్పరచుకున్న వాళ్ళలో అజర్యా ఉన్నాడు. ఈ అజర్యా హిల్కీయా కొడుకు. హిల్కీయా మెషుల్లాము కొడుకు. మెషుల్లాము సాదోకు కొడుకు. సాదోకు మెరాయోతు కొడుకు. మెరాయోతు దేవుని మందిరంలో అధిపతిగా ఉన్న అహీటూబు కొడుకు.
12 Adaya wuod Jeroham, wuod Pashur, wuod Malkija kod Maasai wuod Adiel, wuod Jazera, wuod Meshulam, wuod Meshilemith, wuod Imer.
౧౨అలాగే నివాసం ఏర్పరచుకున్న వాళ్ళలో అదాయా ఉన్నాడు. అదాయా యెరోహాము కొడుకు. యెరోహాము పషూరు కొడుకు. పసూరు మల్కీయా కొడుకు. ఇంకా అదీయేలు కొడుకు మశై కూడా ఉన్నాడు. అదీయేలు యహజేరా కొడుకు. యహజేరా మెషుల్లాము కొడుకు. మెషుల్లాము మెషిల్లేమీతు కొడుకు. మెషిల్లేమీతు ఇమ్మెరు కొడుకు.
13 Jodolo mane jotend anywolagi ne kwan-gi romo ji alufu achiel gi mia abiriyo kod piero auchiel. Ne gin joma niginyalo kendo molony e tij Od Nyasaye.
౧౩వీరితో పాటు వీరి వంశానికి నాయకులుగా ఉన్న ఒక వెయ్యీ ఏడు వందల అరవై మంది ఉన్నారు. వీళ్ళంతా దేవుని మందిరానికి సంబంధించిన సేవల్లో ఎంతో సమర్ధులు.
14 Joka Lawi ne gin: Shemaya wuod Hashub, wuod Azrikam, wuod Hashabia ja-Merari;
౧౪ఇక లేవీయుల్లో షెమయా ఉన్నాడు. షెమయా హష్షూబు కొడుకు. హష్షూబు అజ్రీకాము కొడుకు. అజ్రీకాము హషబ్యా కొడుకు. హషబ్యా మెరారి వంశం వాడు.
15 Bakbakar, Heresh, Galal kod Matania wuod Mika, wuod Zikri, wuod Asaf,
౧౫బక్బక్కరూ, హెరెషూ, గాలాలూ, వీరితో పాటు మత్తన్యా ఉన్నాడు. మత్తన్యా మీకా కొడుకు. మీకా జిఖ్రీ కొడుకు. జిఖ్రీ ఆసాపు కొడుకు.
16 Obadia wuod Shemaya, wuod Galal, wuod Jeduthun; kod Berekia wuod Asa, wuod Elkana mane odak e mier matindo mag jo-Netofath.
౧౬ఇంకా ఓబద్యా ఉన్నాడు. ఈ ఓబద్యా షెమయా కొడుకు. షెమయా గాలాలు కొడుకు. గాలాలు యెదూతోను కొడుకు. నెటోపాతీయుల గ్రామాల్లో నివసించిన ఎల్కానా మనుమడూ ఆసా కొడుకూ అయిన బెరెక్యా ఉన్నాడు.
17 Jorit rangeye ne gin: Shalum, Akub, Talmon, Ahiman kod owetegi; Shalum jatendgi
౧౭ఇక షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను, వీళ్ళ బంధువులూ ద్వారపాలకులుగా ఉన్నారు. వీళ్ళకి షల్లూము నాయకుడు.
18 noket e Rangaj Ruoth e yo wuok chiengʼ nyaka chil kawuono. Magi ema ne jorit dhorangeye mag kuonde bworo mag jo-Lawi.
౧౮లేవీ గోత్రానికి చెందిన వీళ్ళు తూర్పు వైపు ఉండే రాజ ద్వారానికి కాపలా కాసేవాళ్ళు.
19 Shalum wuod Kore, ma wuod Ebiasaf, wuod Kora, to gi jorit rangeye kaachiel kode moa e anywolane, ma jokora, tijgi ne rito rangeye man gohinga mag Hema mana kaka wuonegi nosebedo katimo tijno mar rito rangach midonjogo e kar dak mar Jehova Nyasaye.
౧౯కోరహు కొడుకైన ఎబ్యాసాపుకి పుట్టిన కోరే కొడుకైన షల్లూము అతని బంధువులూ, అతని తండ్రి తెగకు చెందిన కోరహీయులూ మందిర సేవలో గుడారానికి కాపలాగా ఉండేవాళ్ళు. వాళ్ళ పూర్వీకులు యెహోవా మందిర ద్వారాలకు కావలి కాస్తూ ఉండేవాళ్ళు.
20 E ndalo mokadho Finehas wuod Eliazar ema ne jatend jorit rangach kendo Jehova Nyasaye nenikode.
౨౦గతంలో ఎలియాజరు కొడుకైన ఫీనెహాసు వాళ్ళపై అధికారిగా ఉన్నాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు.
21 Zekaria wuod Meshelemia ne jarit rangach madonjo e Hemb Romo.
౨౧మెషెలెమ్యా కొడుకైన జెకర్యా మందిర ప్రవేశ ద్వారానికి కాపలాగా ఉన్నాడు.
22 Koriwore duto, jogo mane oyier mondo obed jorit rangeye man gohinga kar kwan-gi ne mia ariyo gi apar gariyo. Ne ondik nying-gi kaluwore gi nonro mar anywolagi e miechgi. Jorit rangeye ne omii tijni mogen koa e lwet Daudi gi Samuel ma jakor wach.
౨౨ఇలా ద్వారాల దగ్గర కాపలా కాయడానికి ఏర్పాటైన వాళ్ళు మొత్తం రెండువందల పన్నెండు మంది. వీళ్ళ పేర్లు తమ తమ గ్రామాల వరుసలో వంశావళిలో నమోదు అయ్యాయి. వీళ్ళు విశ్వసనీయులూ, ఆధారపడదగ్గ వాళ్ళూ కాబట్టి దావీదూ, దీర్ఘదర్శి అయిన సమూయేలూ వీరిని నియమించారు.
23 Gin gi jogegi negitelone rit mar rangeye mag od Jehova Nyasaye, ma en ot miluongo ni Hema.
౨౩వాళ్ళూ వాళ్ళ కొడుకులూ యెహోవా మందిర ద్వారాల దగ్గర, అంటే ప్రత్యక్ష గుడారం ద్వారాల దగ్గర కాపలా కాశారు.
24 Jorit rangeye ne nitie e bethe angʼwen ma gin: yo wuok chiengʼ, yo podho chiengʼ, yo nyandwat kod yo milambo.
౨౪ఇలా కాపలా కాసేవారు గుడారం నాలుగు దిక్కుల్లో తూర్పు వైపునా, పడమర వైపునా, ఉత్తరం వైపునా, దక్షిణం వైపునా నిలుచున్నారు.
25 Owetegi modak e miechgi nyaka ne bi kinde ka kinde kakonyogi tich kuom ndalo abiriyo.
౨౫గ్రామాలనుండి వాళ్ళ బంధువులు వాళ్ళ క్రమంలో ఏడు రోజులకోసారి వాళ్ళ దగ్గరికి వచ్చి సహాయం చేసేవాళ్ళు.
26 To jorit angʼwen madongo mag rangeye ma jo-Lawi ne otelo ne tich mar rito udi gi kuonde keno mag Od Nyasaye.
౨౬అయితే లేవీయులైన నలుగురు ప్రముఖ ద్వారపాలకులు మిగిలిన వాళ్ళపై అజమాయిషీ చేసేవాళ్ళు ఉన్నారు. దేవుని మందిరంలోని గదులనూ, ఖజానాలనూ భద్రపరచే బాధ్యత వాళ్ళదే.
27 Negidak ka girito Od Nyasaye nikech nyaka negirite; kendo gin ema negitingʼo rayaw ma iyawego pile gokinyi.
౨౭వాళ్ళు దేవుని మందిరానికి కావలివారు కాబట్టి రాత్రంతా మేలుకుని కాపలా కాయడం, ఉదయాన్నే మందిరపు ద్వారాలు తెరవడం వాళ్ళ విధి.
28 Jomoko kuomgi ne rito gigo mane itiyogo ei hekalu, ne gikwanogi kane okelgi kar keno kendo kogolgi.
౨౮వాళ్ళల్లో కొంతమంది మందిరంలో సేవకు ఉపయోగించే సామగ్రిని కనిపెట్టుకుని ఉండాలి. వాటిని బయటకు తీసుకు వెళ్తున్నప్పుడూ, లోపలికి తెస్తున్నప్పుడూ వాళ్ళు వాటిని లెక్కిస్తారు.
29 Moko kuomgi to ne omi tich mar rito gik miberogo ot to gi gik mamoko duto mowal mane itiyogo e kama ler mar lemo kaachiel gi mogo kod divai, gi mo, gi ubani kod gik moko mangʼwe ngʼar.
౨౯మిగిలిన సామగ్రినీ, పరిశుద్ధ స్థలం లో పాత్రలనూ జాగ్రత్త పరిచే బాధ్యత మరి కొందరిపై ఉంటుంది. సన్నని పిండి, ద్రాక్షారసం, నూనె, సాంబ్రాణి, ఇతర పరిమళ సామగ్రి వంటి సరుకులను వీళ్ళు జాగ్రత్త చేస్తారు.
30 To jodolo mamoko ema ne omi tij ruwo gik mangʼwe ngʼar.
౩౦యాజకుల కొడుకుల్లో కొందరు సుగంధద్రవ్యాలను, పరిమళ తైలాన్నీ తయారు చేస్తారు.
31 Ja-Lawi miluongo ni Matithia, wuod Shalum ja-Kora makayo, ema ne omi tij tedo makati mar chiwo.
౩౧అర్పణల కోసం రొట్టెను తయారుచేసే బాధ్యత లేవీయుడైన మత్తిత్యాది. ఇతను కోరహు సంతతికి చెందిన షల్లూముకి పెద్ద కొడుకు.
32 To owetene mamoko mag jo-Kohath ne omi tij keto makati e mesa chiengʼ Sabato ka Sabato.
౩౨వాళ్ళ బంధువులైన కహాతీయుల్లో కొందరికి ప్రతి విశ్రాంతి దినాన సన్నిధి రొట్టెలు సిద్ధపరిచే బాధ్యత ఉంది.
33 Jogo mane gin jothum kod jotelo mag dhood Lawi ne odak e ute mag hekalu kendo ne ok omigi tije mamoko nikech gin ema negirito tich odiechiengʼ gotieno.
౩౩గాయకులూ లేవీయుల వంశ నాయకులూ పని లేనప్పుడు మందిరం గదుల్లో నివాసముంటారు. ఎందుకంటే వీళ్ళు రాత్రీ పగలూ తేడా లేకుండా సేవ చేయాలి.
34 Magi duto ne jotend anywola mag jo-Lawi, ruodhi kaka ondikgi e nonro mar anywolagi kendo negidak Jerusalem.
౩౪వీళ్ళు తమ వంశావళి జాబితా ప్రకారం లేవీ గోత్రంలో నాయకులుగా, పెద్దలుగా ఉన్నవాళ్ళు. వీళ్ళు యెరూషలేములో నివాసమున్నారు.
35 Jeyel wuon Gibeon ne odak Gibeon. Jaode niluongo ni Maaka,
౩౫గిబియోను తండ్రి యెహీయేలు. ఇతను గిబియోను పట్టణంలో నివాసమున్నాడు. ఇతని భార్య పేరు మయకా.
36 to wuode makayo ne en Abdon, kiluwe gi Zur, Kish, Baal, Ner, Nadab,
౩౬ఇతని పెద్దకొడుకు అబ్దోను. తరువాత సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు,
37 Gedor, Ahio, Zekaria kod Mikloth.
౩౭గెదోరు, అహ్యో, జెకర్యా, మిక్లోతు అనేవాళ్ళు పుట్టారు.
38 Mikloth ne en wuon Shimeam. Gin bende negidak but wedegi man Jerusalem.
౩౮మిక్లోతుకు షిమ్యాను పుట్టాడు. వీళ్ళు యెరూషలేములో నివాసముండే తమ బంధువులకు సమీపంగా ఉండే ఇళ్లలోనే నివసించారు.
39 Ner ne wuon Kish, Kish ne wuon Saulo, to Saulo ne wuon Jonathan, Malki-Shua, Abinadab kod Esh-Baal.
౩౯నేరుకి కీషు పుట్టాడు. కీషుకి సౌలు పుట్టాడు. సౌలుకి యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, ఎష్బయలు పుట్టారు.
40 Wuod Jonathan ne en: Merib-Baal mane wuon Mika.
౪౦యోనాతాను కొడుకు మెరీబ్బయలు. మెరీబ్బయలుకి మీకా పుట్టాడు.
41 Yawuot Mika ne gin: Pithon, Melek, Tarea kod Ahaz.
౪౧మీకా కొడుకులు పీతోను, మెలెకు, తరేయా, ఆహాజు అనేవాళ్ళు.
42 Ahaz ne wuon Jada, Jada ne wuon Alemeth, Azmaveth kod Zimri ne wuon Moza.
౪౨ఆహాజుకి యరా పుట్టాడు. యరాకి ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీ పుట్టారు. జిమ్రీకి మోజా పుట్టాడు.
43 Moza ne wuon Binea, Binea ne wuon Refaya, Refaya ne wuon Eliasa, Eliasa ne wuon Azel.
౪౩మోజాకు బిన్యా పుట్టాడు. బిన్యా కొడుకు రెఫాయా. రెఫాయా కొడుకు ఎలాశా. ఎలాశా కొడుకు ఆజేలు.
44 Azel ne nigi yawuowi auchiel kendo magi e nying-gi: Azrikam, Bokeru, Ishmael, Shearia, Obadia kod Hanan. Magi ema ne yawuot Azel.
౪౪ఆజేలుకి అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హానాను అనే పేర్లున్న ఆరుగురు కొడుకులున్నారు. వీళ్ళు ఆజేలు కొడుకులు.

< 1 Weche Mag Ndalo 9 >