< 1 Weche Mag Ndalo 5 >

1 Reuben ne en wuod Israel makayo, to kane oterore gi chi wuon mare, to duongʼ mar ngʼat makayo nomi yawuot Josef ma wuod Israel, omiyo nyinge ne ok nyal wuok mokwongo ka indiko nying nyikwa Israel kaluwore gi chik mar kayo.
ఇశ్రాయేలుకు పెద్దకొడుకైన రూబేను సంతానం గూర్చిన వివరాలు. ఇతడు పెద్ద కొడుకే గానీ అతని ప్రథమ సంతానపు జన్మహక్కును అతని నుండి తీసివేసి ఇశ్రాయేలుకు మరో కొడుకైన యోసేపు కొడుకులకు బదలాయించడం జరిగింది. ఎందుకంటే రూబేను తన తండ్రి మంచాన్ని అపవిత్రం చేశాడు.
2 Kata obedo ni Juda ema ne tek moloyo owetene kendo ruoth nowuok kuome, to duongʼ mar kayo ne mar Josef.
తన సోదరులందరికంటే యూదా ప్రముఖుడు. యూదా వంశంలోనుండే పరిపాలకుడు రానున్నాడు. అయినా ప్రథమ సంతానపు జన్మహక్కు యోసేపు పరమయింది.
3 Yawuot Reuben wuod Israel makayo ne gin: Hanok, Palu, Hezron kod Karmi.
ఇశ్రాయేలుకు పెద్ద కొడుకుగా పుట్టిన రూబేను కొడుకులు ఎవరంటే హనోకు, పల్లూ, హెస్రోను, కర్మీ అనే వారు.
4 Joka Joel ne gin: Joel nonywolo Shemaya, Shemaya nonywolo Gog, Gog nonywolo Shimei,
యోవేలు వారసుల వివరాలిలా ఉన్నాయి. యోవేలు కొడుకు షెమయా, షెమయా కొడుకు గోగు, గోగు కొడుకు షిమీ,
5 Shimei nonywolo Mika, Mika nonywolo Reaya, Reaya nonywolo Baal,
షిమీ కొడుకు మీకా, మీకా కొడుకు రెవాయా, రెవాయా కొడుకు బయలు,
6 Baal nonywolo Beera mane Tiglath-Pilesa ruodh Asuria otero e twech. Beera ema ne jatend joka Reuben.
బయలు కొడుకు బెయేర. ఇతడు రూబేనీయులకు నాయకుడు. అష్షూరు రాజు తిగ్లత్పిలేసెరు ఇతణ్ణి బందీగా చేసి తీసుకు వెళ్ళాడు.
7 To owete kowuok e anywola, kaka ondikgi e chenro mar nywolgi ema: Jeyel ne jatelo, Zekaria,
వాళ్ళ వంశావళి లెక్కల్లో ఉన్న తమ కుటుంబాల ప్రకారం అతని సోదరులెవరంటే ప్రధాని అయిన యెహీయేలూ, జెకర్యా,
8 kod Bela wuod Azaz, ma wuod Shema, wuod Joel. Negidak e gwengʼ kochakore Aroer nyaka Nebo kod Baal Meon.
యోవేలు కొడుకైన షెమ మనుమడూ ఆజాజు కొడుకూ అయిన బెల అనే వాళ్ళు. వీళ్ళు అరోయేరు లోనూ, నెబో, బయల్మెయోనుల వరకూ నివాసం ఏర్పరచుకున్నారు.
9 Koa yo wuok chiengʼ, negidak e piny mokiewo gi thim kadhi nyaka Aora Yufrate nikech jambgi ne omedore e piny Gilead.
వాళ్ళ పశువులు గిలాదు దేశంలో అతి విస్తారమయ్యాయి. కాబట్టి వాళ్ళు తూర్పున యూఫ్రటీసు నది దగ్గరనుండి అరణ్యపు సరిహద్దుల వరకూ నివాసాలు ఏర్పరచుకున్నారు.
10 E ndalo loch Saulo, negikedo gi jo-Hagri mane giloyo ma gikawo kuondegi mag dak duto e piny machiegni gi Gilead.
౧౦సౌలు పరిపాలనా కాలంలో వాళ్ళు హగ్రీ జాతి వారితో యుద్ధం చేసి వాళ్ళను హతమార్చారు. గిలాదు తూర్పు వైపు వరకూ ఉన్న ప్రాంతమంతా నివాసమున్నారు.
11 Jo-Gad nodak e bathgi e piny Bashan nyaka chop Saleka.
౧౧వాళ్ళకెదురుగా ఉన్న బాషాను దేశంలో సలేకా వరకూ గాదు గోత్రం వాళ్ళు నివసించారు.
12 Joel ne jatendgi ka iluwe gi Shafam, Janai kod Shafat, e piny Bashan.
౧౨వాళ్ళ నాయకులు యోవేలు, షాపాము అనేవాళ్ళు. వీళ్ళు తమ తమ కుటుంబాల నాయకులు. వీళ్ళ తరువాత షాపాతు, యహనై అనే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు బాషానులో నివసించారు.
13 Owetene abiriyo kaluwore gi anywolagi ne gin: Mikael, Meshulam, Sheba, Jorai, Jakan, Zia kod Eber.
౧౩వీళ్ళ తండ్రుల వైపు కుటుంబాల బంధువులు మొత్తం ఏడుగురున్నారు. వాళ్ళు మిఖాయేలు, మెషుల్లాము, షేబా, యోరై, యకాను, జీయా, ఏబెరు అనే వాళ్ళు.
14 Magi ema ne yawuot Abihail wuod Huri, ma wuod Jaroa, wuod Gilead, wuod Mikael, wuod Jeshishai, wuod Jado, wuod Buz.
౧౪వీళ్ళు హూరీ అనే వాడికి పుట్టిన అబీహాయిలు కొడుకులు. ఈ హూరీ యరోయకీ, యారోయ గిలాదుకీ, గిలాదు మిఖాయేలుకీ, మిఖాయేలు యెషీషైకీ, యెషీషై యహదోకీ, యహదో బూజుకీ పుట్టారు.
15 Ahi wuod Abdiel, wuod Guni ne en jatend anywolagi.
౧౫గూనీకి పుట్టిన అబ్దీయేలు కుమారుడు అహీ వాళ్ళ తండ్రుల కుటుంబాలకు నాయకుడు.
16 Joka Gad nodak Gilead, Bashan to gi mier mokiewo kode kod lek mar Sharon duto.
౧౬వారు బాషానులోని గిలాదులోనూ, మిగిలిన ఊళ్లలోనూ, షారోను సరిహద్దుల వరకూ ఉన్న పచ్చని భూముల్లోనూ నివాసమున్నారు.
17 Magi duto ne ondiki e nonro margi mar nywol e ndalo loch Jotham ruodh Juda kod Jeroboam ruodh Israel.
౧౭యూదా రాజు యోతాము కాలంలోనూ ఇశ్రాయేలు రాజు యరొబాము కాలంలోనూ వీళ్ళను వాళ్ళ వంశావళి లెక్కల్లో నమోదు చేశారు.
18 Joka Reuben, joka Gad kod nus mar dhood joka Manase ne gin ji alufu piero angʼwen gangʼwen mia abiriyo gi piero auchiel mane oyikore ni lweny. Jolweny molony mane nyalo tiyo gi gige lweny machalo kuodi, ligangla kod atungʼ, nomi tiegruok ne lweny.
౧౮రూబేను గోత్రం, గాదు గోత్రం, మనష్షే అర్థ గోత్రం వాళ్ళల్లో బల్లెం, కత్తి పట్టగలిగిన వాళ్ళూ, బాణాలు వేయడంలో నేర్పరులూ, యుద్ధం చేయడానికి సన్నద్ధమైన వాళ్ళూ మొత్తం నలభై నాలుగు వేల ఏడు వందల అరవైమంది ఉన్నారు.
19 Negikedo gi jo-Hagri, jo-Jetur, jo-Nafish kod jo-Nodab.
౧౯వీళ్ళు హగ్రీ జాతి వాళ్ళ పైనా, యెతూరు వాళ్ళపైనా, నాపీషు వాళ్ళపైనా, నోదాబు వాళ్ళపైనా దాడులు చేసారు.
20 Ne okonygi kuom kedo kendo Nyasaye nomiyogi e lwetgi jo-Hagri, to gi jogo duto mane oriwore kodgi nikech ne giywagorene e ndalo lweny. To ne odwoko lamogi nikech negiketo yie margi kuome.
౨౦యుద్ధంలో వాళ్ళకు దేవుడు సహాయం చేశాడు. ఈ విధంగా హగ్రీ జాతి వాళ్ళూ, వాళ్ళతో ఉన్న వాళ్ళంతా ఓడిపోయారు. యుద్ధంలో ఇశ్రాయేలీయులు దేవునికి విజ్ఞాపన చేశారు. వాళ్ళు తన పైన నమ్మకముంచారు గనక దేవుడు వాళ్ళ ప్రార్థనను అంగీకరించాడు.
21 Negipeyo jamni mag jo-Hagri, ngamia alufu piero abich, rombe alufu mia ariyo gi piero abich, to gi punde alufu ariyo. To bende negimako ji alufu mia achiel ma gitero e twech,
౨౧కాబట్టి ఇశ్రాయేలీయులు జయించడానికి దేవుడు సహాయం చేశాడు. వాళ్ళు యాభై వేల ఒంటెలనూ, రెండు లక్షల యాభై వేల గొర్రెలనూ, రెండు వేల గాడిదలనూ, లక్ష మంది మనుషులనూ స్వాధీనం చేసుకున్నారు.
22 to mamoko mangʼeny to neginego, nikech lweny ne mar Nyasaye. Pinyni nobedo margi nyaka ne otergi e twech.
౨౨దేవుడు యుద్ధంలో వారికి సహాయం చేశాడు గనుక వాళ్ళు అనేక మందిని హతమార్చారు. తరువాత కాలంలో చెరలోకి వెళ్ళేంత వరకూ రూబేను గోత్రం, గాదు గోత్రం, మనష్షే అర్థగోత్రం వాళ్ళంతా హగ్రీ జాతి వాళ్ళ దేశంలోనే నివాసం ఉన్నారు.
23 Nus mar dhood jo-Manase ne ngʼeny mokadho; negidak e piny jo-Bashan nyaka Baal Hermon, gi Senir ma en Got Hermon.
౨౩మనష్షే అర్థగోత్రం వాళ్ళు ఆ బాషాను దేశంలో నివసించి అభివృద్ధి చెందారు. బాషాను నుండి బయల్హెర్మోను వరకూ ఇంకా హెర్మోను పర్వతం అయిన శెనీరు వరకూ వ్యాపించారు.
24 Magi ema ne jotelo mar anywolagi: Efer, Ishi, Eliel Azriel, Jeremia, Hodavia kod Jadiel. Ne gin jolweny mathuondi kendo marahuma kendo jotend anywolagi.
౨౪వాళ్ళ కుటుంబాలకు నాయకులు ఎవరంటే ఏఫెరు, ఇషీ, ఎలీయేలు, అజ్రీయేలు, యిర్మీయా, హోదవ్యా, యహదీయేలు అనే వాళ్లు. వీళ్ళు ధైర్యవంతులు, బలవంతులు, ప్రసిద్ధులైన వాళ్ళు. తమ తమ కుటుంబాలకు నాయకులు.
25 To negiweyo Nyasach kweregi ma gindhogore kendgi gi nyiseche mag jopinyno mane Nyasaye owachonegi ni ginegi.
౨౫కానీ వాళ్ళు తమ పూర్వీకుల దేవునిపై తిరుగుబాటు చేశారు. దేవుడు తమ కళ్ళెదుట ఏ జాతులనైతే నాశనం చేశాడో ఆ జాతుల దేవుళ్ళను పూజించారు.
26 Omiyo Nyasach jo-Israel nojiwo chuny Pul ruodh jo-Asuria (ma bende iluongo ni Tiglath-Pilesa ruodh jo-Asuria), mane otero jo-Reuben, jo-Gad, kod nus mar dhood jo-Manase e twech. Ne oterogi Hala, Habor, Hera kod but aora Gozan kuma gidakie nyaka chil kawuono.
౨౬కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజు పూలు (అంటే అష్షూరు రాజు తిగ్లత్పిలేసెరు) ను రెచ్చగొట్టాడు. ఆ రాజు రూబేను గోత్రం, గాదు గోత్రం, మనష్షే అర్థగోత్రం వాళ్ళనందర్నీ బందీలుగా హాలహుకీ, హాబోరుకీ, హారాకుకీ, గోజాను నదీ ప్రాంతాలకీ పట్టుకుని పోయాడు. ఈ రోజుకీ వీళ్ళు అక్కడ కనిపిస్తున్నారు.

< 1 Weche Mag Ndalo 5 >