< 1 Weche Mag Ndalo 20 >
1 E kinde chakruok oro, e ndalo ma ruodhi thoro wuok kadhi kedo, Joab nowuok gi jolwenjgo momanore gi gige lweny. Ne omuko moketho piny jo-Amon bangʼe odhi Raba ma olwore gi jolweny, Daudi to nodongʼ Jerusalem. Joab nomonjo Raba moweyo kokethe chuth.
౧తరువాతి సంవత్సరం రాజులు సాధారణంగా యుద్ధానికి బయలుదేరే కాలంలో యోవాబు సైన్యంలో శూరులైన వాళ్ళను సమకూర్చి, అమ్మోనీయుల దేశాన్ని ధ్వంసం చేసి, రబ్బా పట్టణాన్ని ముట్టడించాడు. దావీదు యెరూషలేములోనే ఉండగా, యోవాబు రబ్బాను ఓడించి ప్రజలను హతం చేశాడు.
2 Daudi nogolo osimbo ewi ruodhgi, ma pek mar dhahabu molosego nonwangʼ ni dirom kilo piero adek gangʼwen, kendo nochom kuome kite ma nengogi tek mi nosidhe ewi Daudi. Nokawo gik mangʼeny mane oyako e dala maduongʼno
౨దావీదు వచ్చి, వాళ్ళ రాజు తల మీద ఉన్న కిరీటం తీసుకున్నాడు. దాని బరువు 34 కిలోగ్రాములు. అందులో విలువైన రత్నాలు పొదిగి ఉన్నాయి. దాన్ని దావీదు ధరించాడు. ఇంకా అతడు ఎంతో విస్తారమైన కొల్లసొమ్ము ఆ పట్టణంలో నుంచి తీసుకుపోయాడు.
3 kendo nodaro joma nodak kanyo moketogi e tich mar tiyogi musmende, kod tindo mag chuma kod ledhi. Daudi notimo mano ne mier duto mag jo-Amon. Bangʼe Daudi gi jolweny mage duto nodok Jerusalem.
౩దాని ప్రజలను అతడు బయటకు తీసుకొచ్చి, వాళ్ళతో రంపాలతో, ఇనుప పనిముట్లతో, గొడ్డళ్లతో బలవంతంగా పని చేయించాడు. ఈ విధంగా అతడు అమ్మోనీయుల పట్టణాలన్నిటికీ చేశాడు. తరువాత దావీదూ, సైన్యమూ, యెరూషలేముకు తిరిగి వచ్చారు.
4 E kinde mamoko lweny nowuok Gezer e kindgi gi jo-Filistia. E ndalogo Sibekai ma ja-Hushath nonego Sipai mane en achiel kuom nyikwa Refai omiyo nolo jo-Filistia.
౪అటు తరువాత గెజెరులో ఉన్న ఫిలిష్తీయులతో యుద్ధం జరిగినప్పుడు హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడు సిప్పయి అనే ఒకణ్ణి హతం చేశాడు. అందువల్ల ఫిలిష్తీయులు లొంగిపోయారు.
5 E lweny machielo gi jo-Filistia, Elhanan wuod Jair nonego Lami ma owadgi Goliath ja-Giti mane ni kod tongʼ ma bonde romo gi lodi.
౫మళ్ళీ ఫిలిష్తీయులతో యుద్ధం జరిగినప్పుడు యాయీరు కొడుకు ఎల్హానాను, గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడైన లహ్మీని చంపాడు. అతని ఈటె నేతపని చేసేవాడి అడ్డకర్ర అంత పెద్దది.
6 Lweny machielo nochako owuok Gath, kama ne nitie ngʼat marabet mane nigi lith lwedo auchiel gi lith tielo auchiel koni gi koni, lith lwetene gi mag tiendene koriw to ne romo piero ariyo gangʼwen. En bende ne en nyakwar Rafa.
౬మళ్ళీ గాతులో యుద్ధం జరిగింది. చాలా పొడవుగాగా ఉన్న వాడొకడు అక్కడ ఉన్నాడు. అతని చేతులకూ కాళ్ళకు, ఆరేసి చొప్పున ఇరవై నాలుగు వేళ్ళు ఉన్నాయి. అతడు రెఫాయీయుల సంతతికి చెందిన వాడు.
7 To kane othiano ni jo-Israel, Jonathan wuod Shimea ma owadgi Daudi nonege.
౭అతడు ఇశ్రాయేలీయులను దూషించగా దావీదు సోదరుడు షిమ్యాకు పుట్టిన యోనాతాను అతన్ని చంపాడు.
8 Magi ne nyikwa Rafa ja-Gath mane Daudi gi joge onego.
౮గాతులో ఉన్న రెఫాయీయుల సంతతి వారైన వీరు దావీదు చేత, అతని సేవకుల చేత హతమయ్యారు.