< Romerne 6 >
1 Hvad skulle vi da sige? skulde vi blive ved i Synden, for at Nåden kunde blive desto større?
౧కాబట్టి ఏమందాం? కృప విస్తరించడం కోసం పాపంలోనే కొనసాగుదామా?
2 Det være langt fra! Vi, som jo ere døde fra Synden, hvorledes skulle vi endnu leve i den?
౨అలా ఎన్నటికీ జరగకూడదు. పాపపు జీవితం విషయంలో చనిపోయిన మనం దానిలో ఎలా కొనసాగుతాం?
3 Eller vide I ikke, at vi, så mange som bleve døbte til Kristus Jesus, bleve døbte til hans Død?
౩క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన మనమంతా ఆయన మరణంలోకి కూడా బాప్తిసం పొందామని మీకు తెలియదా?
4 Vi bleve altså begravne med ham ved Dåben til Døden, for at, ligesom Kristus blev oprejst fra de døde ved Faderens Herlighed, således også vi skulle vandre i et nyt Levned.
౪తండ్రి మహిమ వలన క్రీస్తు చనిపోయిన వారిలోనుండి ఏ విధంగా లేచాడో, అదే విధంగా మనం కూడా నూతన జీవం పొంది నడుచుకొనేలా, మనం బాప్తిసం ద్వారా మరణించి, ఆయనతో కూడా సమాధి అయ్యాము.
5 Thi ere vi blevne sammenvoksede med ham ved hans Døds Afbillede, skulle vi dog også være det ved hans Opstandelses,
౫ఆయన చావు పోలికలో ఆయనతో ఐక్యం గలవారమైతే, ఆయన పునరుత్థానంలో కూడా ఆయనతో ఐక్యం కలిగి ఉంటాం.
6 idet vi erkende dette, at vort gamle Menneske blev korsfæstet med ham, for at Syndens Legeme skulde blive til intet, for at vi ikke mere skulde tjene Synden.
౬ఎందుకంటే, మనకు తెలుసు, మనం ఇకమీదట పాపానికి దాసులుగా ఉండకుండాా పాపశరీరం నాశనం అయ్యేలా, మన పాత స్వభావం క్రీస్తుతో కలిసి సిలువ మరణం పాలైంది.
7 Thi den, som er død, er retfærdiggjort fra Synden.
౭చనిపోయిన వ్యక్తి పాపం విషయంలో నీతిమంతుడని తీర్పు పొందాడు.
8 Men dersom vi ere døde med Kristus, da tro vi, at vi også skulle leve med ham,
౮మనం క్రీస్తుతో కూడా చనిపోతే, ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముతున్నాము.
9 efterdi vi vide, at Kristus, efter at være oprejst fra de døde, ikke mere dør; Døden hersker ikke mere over ham.
౯చనిపోయిన వారిలో నుండి లేచిన క్రీస్తు ఇంక చనిపోడనీ, చావుకి ఆయన మీద అధికారం లేదనీ మనకు తెలుసు.
10 Thi det, han døde, døde han een Gang fra Synden; men det, han lever, lever han for Gud.
౧౦ఎందుకంటే ఆయన చనిపోవడం పాపం విషయంలో ఒక్కసారే చనిపోయాడు గాని, ఆయన జీవించడం మాత్రం దేవుని విషయమై జీవిస్తున్నాడు.
11 Således skulle også I anse eder selv for døde fra Synden, men levende for Gud i Kristus Jesus.
౧౧ఇదే మీకూ వర్తిస్తుంది. మీరు పాపం విషయంలో చనిపోయిన వారిగా, దేవుని విషయంలో క్రీస్తు యేసులో మిమ్మల్ని సజీవులుగా ఎంచుకోండి.
12 Så lad da ikke Synden herske i eders dødelige Legeme, så I lyde dets Begæringer;
౧౨కాబట్టి శరీర దురాశలకు లోబడేలా చావుకు లోనైన మీ శరీరాల్లో పాపాన్ని ఏలనియ్యకండి.
13 fremstiller ej heller eders Lemmer for Synden som Uretfærdigheds Våben; men fremstiller eder selv for Gud som sådanne, der fra døde ere blevne levende, og eders Lemmer som Retfærdigheds Våben for Gud.
౧౩మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించవద్దు. అయితే చనిపోయిన వారిలో నుండి బతికి లేచినవారుగా, మీ అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుకోండి.
14 Thi Synd skal ikke herske over eder I ere jo ikke under Lov, men under Nåde.
౧౪మీరు కృప కిందే గానీ ధర్మశాస్త్రం కింద లేరు కాబట్టి పాపాన్ని మీ మీద అధికారం చెలాయించ నియ్యవద్దు.
15 Hvad da? skulde vi Synde, fordi vi ikke ere under Lov, men under Nåde? Det være langt fra!
౧౫అలాగైతే, మనం కృప కిందే గాని ధర్మశాస్త్రం కింద లేము కాబట్టి పాపం చేద్దామా? అలా ఎన్నటికీ చేయకూడదు.
16 Vide I ikke, at når I fremstille eder for en som Tjenere til Lydighed, så ere I hans Tjenere, hvem I lyde, enten Syndens til Død, eller Lydighedens til Retfærdighed?
౧౬మీరు దేనికి లోబడి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొంటారో, అది చావు కోసం పాపానికైనా, నీతి కోసం విధేయతకైనా, దేనికి లోబడతారో దానికే దాసులౌతారని మీకు తెలియదా?
17 Men Gud ske Tak, fordi I have været Syndens Tjenere, men bleve af Hjertet lydige imod den Læreform, til hvilken I bleve overgivne.
౧౭దేవునికి కృతజ్ఞతలు! మీరు గతంలో పాపానికి దాసులుగా ఉన్నారు. కానీ ఏ ఉపదేశానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో దానికి హృదయపూర్వకంగా లోబడ్డారు.
18 Og frigjorde fra Synden bleve I Retfærdighedens Tjenere.
౧౮తద్వారా పాపవిమోచన పొంది నీతికి దాసులయ్యారు.
19 Jeg taler på menneskelig Vis på Grund af eders Køds Skrøbelighed. Ligesom I nemlig fremstillede eders Lemmer som Tjenere for Urenheden og Lovløsheden til Lovløshed, således fremstiller nu eders Lemmer som Tjenere for Retfærdigheden, til Helliggørelse!
౧౯మీ శరీర బలహీనతను బట్టి మానవరీతిగా మాట్లాడుతున్నాను. ఇంతకు ముందు అక్రమం జరిగించడానికి ఏ విధంగా అపవిత్రతకు, దుర్మార్గానికి మీ అవయవాలను దాసులుగా అప్పగించారో, ఆలాగే పవిత్రత కలగడానికి వాటిని ఇప్పుడు నీతికి దాసులుగా అప్పగించండి.
20 Thi da I vare Syndens Tjenere, vare I frie over for Retfærdigheden.
౨౦మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి విషయంలో మీకేమీ ఆటంకం లేదు.
21 Hvad for Frugt havde I da dengang? Ting, ved hvilke I nu skamme eder; Enden derpå er jo Død.
౨౧అప్పుడు చేసిన పనుల వలన మీకేం ప్రయోజనం కలిగింది? వాటి గురించి మీరిప్పుడు సిగ్గుపడుతున్నారు కదా? చావే వాటి ఫలితం.
22 Men nu, da I ere blevne frigjorde fra Synden og ere blevne Guds Tjenere, have I eders Frugt til Helliggørelse og som Enden derpå et evigt Liv; (aiōnios )
౨౨అయితే మీరు ఇప్పుడు పాపవిమోచన పొంది దేవునికి దాసులయ్యారు. పవిత్రతే దాని ఫలితం. దాని అంతిమ ఫలం శాశ్వత జీవం. (aiōnios )
23 thi Syndens Sold er Død, men Guds Nådegave er et evigt Liv i Kristus Jesus, vor Herre. (aiōnios )
౨౩ఎందుకంటే పాపానికి జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసులో శాశ్వత జీవం. (aiōnios )