< Salme 58 >
1 (Til sangmesteren. Al-tasjhet. Af David. En miktam.) Er det virkelig Ret, I taler, I Guder, dømmer I Menneskenes Børn retfærdigt?
౧ప్రధాన సంగీతకారుని కోసం. అల్ తశ్హేత్ అనే రాగంతో పాడేది. దావీదు రాసిన మిఖ్తీమ్ (రసిక కావ్యం) అధికారులారా! మీరు న్యాయంగా మాట్లాడటం నిజమేనా? మనుషులకు, మీరు నిజాయితీగా న్యాయ తీర్పు తీరుస్తారా?
2 Nej, alle øver I Uret på Jord, eders Hænder udvejer Vold.
౨లేదు, అలా చెయ్యరు. మీరు ఇష్టపూర్వకంగా చెడుతనం జరిగిస్తారు. దేశంలో మీ చేతులారా దౌర్జన్యాన్ని కొలిచి మరీ జరిగిస్తున్నారు.
3 Fra Moders Liv vanslægted de gudløse, fra Moders Skød for Løgnerne vild.
౩దుర్మార్గులు పుట్టుకతోనే విపరీత బుద్ధి కలిగి ఉంటారు. పుట్టిన వెంటనే అబద్ధాలాడుతూ తప్పిపోతారు.
4 Gift har de i sig som Slangen, den stumme Øgle, der døver sit Øre
౪వారు చిమ్మేది నాగుపాము విషం. వారు చెవులు మూసుకున్న చెవిటి పాముల వంటివారు.
5 og ikke vil høre på Tæmmerens Røst, på den kyndige Slangebesværger.
౫మంత్రగాళ్ళు ఎంతో నేర్పుగా మంత్రం వేసినా వారు ఎంతమాత్రం పట్టించుకోరు.
6 Gud, bryd Tænderne i deres Mund, Ungløvernes Kindtænder knuse du, HERRE;
౬దేవా, వారి నోట్లో పళ్ళు విరగ్గొట్టు. యెహోవా, ఆ సింహం పిల్లల కోరలు ఊడబెరుకు.
7 lad dem svinde som Vand, der synker, visne som nedtrampet Græs.
౭పారుతున్న నీరులాగా వారు గతించిపోతారు గాక. వారు విడిచిన బాణాలు ముక్కలుగా విరిగిపోతాయి గాక.
8 Lad dem blive som Sneglen, opløst i Slim som et ufuldbårent Foster, der aldrig så Sol.
౮వారు కరిగిపోయి కనిపించకుండా పోయే నత్తల్లాగా ఉంటారు. నవమాసాలు నిండకుండానే పుట్టే పిండంలాగా సూర్యుణ్ణి ఎన్నటికీ చూడలేరు.
9 Før eders Gryder mærker til Tjørnen, ja, midt i deres Livskraft river han dem bort i sin Vrede
౯మీ కుండలకు ముళ్లకంపల మంట వేడి తగలకముందే అది ఉడికినా ఉడకకపోయినా ఆయన సుడిగాలిలో దాన్ని ఎగరగొడతాడు.
10 Den retfærdige glæder sig, når han ser Hævn, hans Fødder skal vade i gudløses Blod;
౧౦వారికి కలిగిన శిక్షను చూసి నీతిమంతులు సంతోషిస్తారు. ఆ దుష్టుల రక్తంలో వారు తమ పాదాలు కడుక్కుంటారు.
11 Og Folk skal sige: "Den retfærdige får dog sin Løn, der er dog Guder, som dømmer på Jord!"
౧౧కాబట్టి నీతిమంతులకు కచ్చితంగా బహుమానం కలుగుతుంది. న్యాయం తీర్చే దేవుడు నిజంగా ఈ లోకంలో ఉన్నాడు, అని మనుషులు ఒప్పుకుంటారు.