< Salme 36 >
1 (Til sangmesteren. Af HERRENs tjener David.) Synden taler til den Gudløse inde i hans Hjerte; Gudsfrygt har han ikke for Øje;
౧ప్రధాన సంగీతకారునికి యెహోవా సేవకుడు దావీదు కీర్తన దుర్మార్గుడి హృదయంలో పాపం దివ్యవాణిలాగా మాట్లాడుతూ ఉంది. వాడి కళ్ళల్లో దేవుడి భయం కన్పించడం లేదు.
2 thi den smigrer ham frækt og siger, at ingen skal finde hans Brøde og hade ham.
౨ఎందుకంటే వాడి పాపం బయటపడదనీ, దాన్ని ఎవరూ అసహ్యించుకోరనే భ్రమలో వాడు నివసిస్తున్నాడు.
3 Hans Munds Ord er Uret og Svig, han har ophørt at handle klogt og godt;
౩వాడు పలికే మాటలు పాప భూయిష్టంగా, మోసపూరితంగా ఉన్నాయి. వాడికి జ్ఞానంగా ప్రవర్తించడం, మంచి పనులు చేయడం ఇష్టం లేదు.
4 på sit Leje udtænker han Uret, han træder en Vej, som ikke er god; det onde afskyr han ikke.
౪వాడు మంచం దిగకుండానే పాపం ఎలా చేయాలా అని ఆలోచిస్తాడు. దుర్మార్గపు మార్గాలను ఎంచుకుని వెళ్తాడు. చెడును నిరాకరించడు.
5 HERRE, din Miskundhed rækker til Himlen, din Trofasthed når til Skyerne,
౫యెహోవా, నీ నిబంధన కృప ఆకాశాన్ని అంటుతుంది. నీ విశ్వసనీయత మేఘాలను తాకుతుంది.
6 din Retfærd er som Guds Bjerge, dine Domme som det store Dyb; HERRE, du frelser Folk og Fæ,
౬నీ న్యాయం ఉన్నతమైన పర్వతాలతో సమానం. నీ న్యాయం లోతైన సముద్రంతో సమానం. యెహోవా నువ్వు మానవులను, జంతువులను సంరక్షిస్తావు.
7 hvor dyrebar er dog din Miskundhed, Gud! Og Menneskebørnene skjuler sig i dine Vingers Skygge;
౭దేవా, నీ నిబంధన కృప ఎంత ప్రశస్తమైనది! నీ రెక్కల నీడన మానవ జాతి ఆశ్రయం పొందుతుంది.
8 de kvæges ved dit Huses Fedme, du læsker dem af din Lifligheds Strøm;
౮నీ మందిరపు సమృద్ధి వలన వాళ్ళు సంపూర్ణ సంతృప్తి పొందుతున్నారు. నీ అమూల్యమైన దీవెనల జలధారలో వాళ్ళని తాగనిస్తావు.
9 thi hos dig er Livets Kilde, i dit Lys skuer vi Lys!
౯నీ దగ్గర జీవపు ఊట ఉంది. నీ వెలుగులోనే మేము వెలుగును చూస్తున్నాం.
10 Lad din Miskundhed blive over dem, der kender dig, din Retfærd over de oprigtige af Hjertet.
౧౦నువ్వంటే తెలిసినవారికి నీ నిబంధన కృపనూ, యథార్ధమైన హృదయం కలిగిన వాళ్లకు నీ కాపుదలనూ అధికంగా విస్తరింపజేయ్యి.
11 Lad Hovmods Fod ej træde mig ned, gudløses Hånd ej jage mig bort.
౧౧అహంకారి పాదం నా సమీపంలోకి రానియ్యకు. దుర్మార్గుడి హస్తం నన్ను తరమనియ్యకు.
12 Se, Udådsmændene falder, slås ned, så de ikke kan rejse sig.
౧౨అదుగో పాపం చేసే వాళ్ళు అక్కడే పడిపోయారు. ఇక లేచే సామర్ధ్యం లేకుండా కూలిపోయారు.