< Salme 12 >
1 (Til sangmesteren. Efter den ottende. En salme af David.) HERRE, hjælp, thi de fromme er borte, svundet er Troskab blandt Menneskens Børn;
౧ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు కీర్తన. షేమినిత్ రాగం. యెహోవా నాకు సహాయం చెయ్యి, ఎందుకంటే, భక్తిపరులు అదృశ్యమై పోయారు. నమ్మకస్తులు కనిపించడం లేదు.
2 de taler Løgn, den ene til den anden, med svigefulde Læber og tvedelt Hjerte.
౨అందరూ తమ పొరుగు వాళ్ళతో అబద్ధాలు చెబుతున్నారు. అందరూ మోసకరమైన పెదాలతో ద్వంద్వ హృదయంతో మాట్లాడుతున్నారు.
3 Hver svigefuld Læbe udrydde HERREN, den Tunge, der taler store Ord,
౩యెహోవా, మోసపు మాటలు పలికే పెదాలనూ, గొప్పలు చెప్పుకునే ప్రతి నాలుకనూ కోసివెయ్యి.
4 dem, som siger: "Vor Tunge gør os stærke, vore Læber er med os, hvo er vor Herre?"
౪మా నాలుకలతో మేము సాధిస్తాం, మా పెదాలతో మేము మాట్లాడినప్పుడు మా మీద ప్రభువుగా ఎవరు ఉండగలరు? అని అంటున్నది వీళ్ళే.
5 "For armes Nød og fattiges Suk vil jeg nu stå op", siger HERREN, "jeg frelser den, som man blæser ad."
౫పేదలకు విరోధంగా జరుగుతున్న హింస కారణంగా, అవసరతలో ఉన్నవాళ్ళ మూలుగుల కారణంగా నేను లేచి వస్తాను, అని యెహోవా అంటున్నాడు. వాళ్ళు ఎదురు చూస్తున్న ఆ రక్షణ నేను వాళ్లకు అందిస్తాను.
6 HERRENs Ord er rene Ord, det pure, syvfold lutrede Sølv.
౬యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి కొలిమిలో ఏడు సార్లు నిర్మలం చేసిన వెండి అంత పరిశుద్ధం.
7 HERRE, du vogter os, værner os evigt mod denne Slægt.
౭నువ్వు యెహోవావు! నువ్వు వాళ్ళను కాపాడతావు. భక్తిగల వాళ్ళను ఈ దుర్మార్గపు తరం నుంచి శాశ్వతకాలం సంరక్షిస్తావు.
8 De gudløse færdes frit overalt, når Skarn ophøjes blandt Menneskens Børn.
౮మనుషుల్లో చెడుతనం ప్రబలినప్పుడు, దుర్మార్గులు అన్నివైపులా తిరుగుతారు.