< Salme 111 >
1 Halleluja! jeg takker Herren af hele mit hjerte i oprigtiges kreds og i menighed!
౧యెహోవాను స్తుతించండి. యథార్థవంతుల సభలో, సమాజంలో పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను.
2 Store er Herrens gerninger, gennemtænkte til bunds.
౨యెహోవా క్రియలు గొప్పవి. వాటిని ఇష్టపడేవారంతా వాటిని తలపోస్తారు.
3 Hans værk er højhed og herlighed, hans retfærd bliver til evig tid.
౩ఆయన పనులు మహిమా ప్రభావాలు గలవి. ఆయన నీతి నిత్యం నిలకడగా ఉంటుంది.
4 Han har sørget for, at hans undere mindes, nådig og barmhjertig er Herren.
౪ఆయన తన ఆశ్చర్యకార్యాలకు జ్ఞాపకార్థ సూచన నియమించాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు.
5 Dem, der frygter ham, giver han føde, han kommer for evigt sin pagt i hu.
౫తన పట్ల భయభక్తులు గలవారికి ఆయన ఆహారమిచ్చాడు. ఆయన నిత్యం తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు.
6 Han viste sit folk sine vældige gerninger, da han gav dem folkenes eje.
౬ఆయన తన ప్రజలకు అన్యజాతుల ఆస్తిపాస్తులను అప్పగించాడు. తన క్రియల మహాత్మ్యాన్ని వారికి వెల్లడి చేశాడు.
7 Hans hænders værk er sandhed og ret, man kan lide på alle hans bud;
౭ఆయన పనులు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనాలన్నీ నమ్మదగినవి.
8 de står i al evighed fast, udført i sandhed og retsind.
౮అవి శాశ్వతంగా స్థాపించబడి ఉన్నాయి. సత్యంతో, యథార్థతతో అవి తయారైనాయి.
9 Han sendte sit folk udløsning, stifted sin pagt for evigt. Helligt og frygteligt er hans navn.
౯ఆయన తన ప్రజలకు విమోచన కలగజేసేవాడు. తన నిబంధన ఆయన శాశ్వతంగా ఉండాలని ఆదేశించాడు. ఆయన నామం పవిత్రం, పూజ్యం.
10 Herrens frygt er visdoms begyndelse; forstandig er hver, som øver den. Evigt varer hans pris!
౧౦యెహోవా పట్ల భయం జ్ఞానానికి మూలం. ఆయన శాసనాలను అనుసరించేవారంతా మంచి వివేకం గలవారు. ఆయనకు నిత్యం స్తోత్రం.