< Ordsprogene 13 >
1 Viis Søn elsker tugt, spotter hører ikke på skænd.
౧తండ్రి క్రమశిక్షణకు లోబడిన కుమారుడు వివేకం గలవాడు. బుద్ధి లేనివాడు దిద్దుబాటుకు తల వంచడు.
2 Af sin Munds Frugt nyder en Mand kun godt, til Vold står troløses Hu.
౨మనిషి తన నోటి నుంచి వచ్చే మాటల వలన ప్రతిఫలం పొందుతాడు. నమ్మకద్రోహులు తమ దుష్ట క్రియల చేత నాశనం తెచ్చుకుంటారు.
3 Vogter man Munden, bevarer man Sjælen, den åbenmundede falder i Våde.
౩తన నోటిని అదుపులో ఉంచుకున్నవాడు తనను కాపాడుకుంటాడు. వ్యర్థంగా మాట్లాడే వాడు నాశనం కొని తెచ్చుకుంటాడు.
4 Den lade attrår uden at få, men flittiges Sjæl bliver mæt.
౪సోమరిపోతు ఎక్కువగా ఆశ పడతాడు గానీ వాడికి ఏమీ మిగలదు. కష్టపడి పని చేసేవాడు సుఖంగా జీవిస్తాడు.
5 Den retfærdige hader Løgnetale, den gudløse spreder Skam og Skændsel.
౫నీతిమంతులకు అబద్దాలంటే అసహ్యం. దుష్టుడు నిందలు మోపుతూ, అవమానపరుస్తూ ఉంటాడు.
6 Retfærd skærmer, hvo lydefrit vandrer, Synden fælder de gudløse.
౬నిజాయితీపరులకు వారి యథార్థ ప్రవర్తన కాపుదలగా ఉంటుంది. పాపులు తమ భక్తిహీనత వల్ల నాశనమౌతారు.
7 Mangen lader rig og ejer dog intet, mangen lader fattig og ejer dog meget.
౭తాము ధనవంతులమని చెప్పుకునే పేదలు ఉన్నారు. దరిద్రులమని చెప్పుకునే ధనవంతులు కూడా ఉన్నారు.
8 Mands Rigdom er Løsepenge for hans Liv, Fattigmand får ingen Trusel at høre.
౮ఒకడి సంపద అతని ప్రాణాన్ని విడిపిస్తుంది. దరిద్రుడు హెచ్చరిక మాటలు లక్ష్యపెట్టడు.
9 Retfærdiges Lys bryder frem, gudløses Lampe går ud.
౯నీతిమంతుల వెలుగు ప్రకాశిస్తుంది. భక్తిహీనుల దీపం ఆరిపోతుంది.
10 Ved Hovmod vækkes kun Splid, hos dem, der lader sig råde, er Visdom.
౧౦గర్వాంధుడు కలహాలు రేపుతాడు. మంచి మాటలు ఆలకించే వారికి జ్ఞానం చేకూరుతుంది.
11 Rigdom, vundet i Hast, smuldrer hen, hvad der samles Håndfuld for Håndfuld, øges.
౧౧మోసం చేసి సంపాదించిన సొత్తు తరిగి పోతుంది. కష్టపడి ధనం సంపాదించిన వాడు దాన్ని వృద్ధి పరుచుకుంటాడు.
12 At bie længe gør Hjertet sygt, opfyldt Ønske er et Livets Træ.
౧౨కోరుకున్నది జరగకపోతే హృదయం క్షీణిస్తుంది. తీరిన కోరిక జీవవృక్షం వంటిది.
13 Den, der lader hånt om Ordet, slås ned, den, der frygter Budet, får Løn.
౧౩హితబోధను తిరస్కరించేవాడు దాన్ని బట్టి శిక్షకు పాత్రుడౌతాడు. ఆజ్ఞల పట్ల భయభక్తులు చూపి వాటిని ఆచరించేవాడు తగిన ఫలం పొందుతాడు.
14 Vismands Lære er en Livsens Kilde, derved undgås Dødens Snarer.
౧౪జ్ఞానుల ఉపదేశం జీవం కలిగించే ఊట. మనుషులు దాని మూలంగా మరణ బంధకాల నుండి తప్పించుకుంటారు.
15 God Forstand vinder Yndest, troløses Vej er deres Undergang.
౧౫మంచి బుద్ధి కలిగి ఉంటే దయాగుణం అలవడుతుంది. నమ్మకద్రోహుల మార్గం కష్టాల కడలి.
16 Hver, som er klog, går til Værks med Kundskab, Tåben udfolder Dårskab.
౧౬వివేకం గలవారు తెలివిగా తమ పనులు జరిగిస్తారు. బుద్ధిహీనులు తమ మూర్ఖత్వాన్ని బయటపెట్టుకుంటారు.
17 Gudløs Budbringer går det galt, troværdigt Bud bringer Lægedom.
౧౭దుర్మార్గుడైన ప్రతినిధి కష్టాల పాలవుతాడు. సమర్ధుడైన రాయబారి తన వారికి క్షేమం కలిగిస్తాడు.
18 Afvises Tugt, får man Armod og Skam; agtes på Revselse, bliver man æret.
౧౮క్రమశిక్షణను లక్ష్యపెట్టని వాడికి అవమానం, దరిద్రం దాపురిస్తాయి. మందలింపును శిరసావహించేవాడు గౌరవం పొందుతాడు.
19 Opfyldt Ønske er sødt for Sjælen, at vige fra ondt er Tåber en Gru.
౧౯కోరిక నెరవేరితే ప్రాణానికి ఊరట కలుగుతుంది. చెడుతనాన్ని విడిచి పెట్టడం మూర్ఖులకు ఏవగింపు.
20 Omgås Vismænd, så bliver du viis, ilde faren er Tåbers Ven.
౨౦జ్ఞానులతో స్నేహం చేసే వారు జ్ఞానం సంపాదించుకుంటారు. మూర్ఖులతో స్నేహం చేసేవాడు నాశనమైపోతాడు.
21 Vanheld følger Syndere, Lykken når de retfærdige.
౨౧కీడు పాపులను వెంటాడుతుంది. నీతిమంతులకు ప్రతిఫలంగా మేలు కలుగుతుంది.
22 Den gode efterlader Børnebrn Arv, til retfærdige gemmes Synderens Gods.
౨౨న్యాయవంతుడు తన మనుమలకు ఆస్తి సమకూరుస్తాడు. పాపాత్ముల సంపాదన నీతిమంతుల వశం అవుతుంది.
23 På Fattigfolks Nyjord er rigelig Føde, mens mangen rives bort ved Uret.
౨౩పేదవాళ్ళు సేద్యం చేసిన భూమి విస్తారంగా పండుతుంది. అక్రమ క్రియలు జరిగించిన వాళ్ళు నాశనమైపోతారు.
24 Hvo Riset sparer, hader sin Søn, den, der elsker ham, tugter i Tide.
౨౪బెత్తం వాడకుండా తన కుమారుణ్ణి క్రమశిక్షణలో పెట్టకుండా ఉన్న తండ్రి అతనికి శత్రువు వంటివాడు. ప్రేమించే తండ్రి తన కుమారుణ్ణి తప్పకుండా శిక్షిస్తాడు.
25 Den retfærdige spiser, til Sulten er stillet, gudløses Bug er tom.
౨౫ఉత్తముడు కడుపునిండా భోజనం చేస్తాడు. భక్తిహీనులు తినడానికి ఏమీ మిగలదు.