< Job 34 >
1 Og Elihu tog til Orde og sagde:
౧అప్పుడు ఎలీహు మళ్ళీ ఇలా చెప్పసాగాడు.
2 "Hør mine Ord, I vise, I forstandige Mænd, lån mig Øre!
౨జ్ఞానులారా, నా మాటలు వినండి. అనుభవశాలులారా, వినండి.
3 Thi Øret prøver Ord, som Ganen smager på Mad;
౩అంగిలి ఆహారాన్ని రుచి చూసినట్టు చెవి మాటలను పరీక్షిస్తుంది.
4 lad os udgranske, hvad der er Ret, med hinanden skønne, hvad der er godt!
౪న్యాయమైనదేదో విచారించి చూద్దాం రండి. మేలైనదేదో మనంతట మనం విచారించి తెలుసుకుందాము రండి.
5 Job sagde jo: "Jeg er retfærdig, min Ret har Gud sat til Side;
౫“నేను నీతిమంతుణ్ణి, దేవుడు నాకు అన్యాయం చేసాడు.
6 min Ret til Trods skal jeg være en Løgner? Skønt brødefri er jeg såret til Døden!"
౬నేను న్యాయవంతుడినైనా అబద్ధికునిగా చూస్తున్నారు. నేను తిరుగుబాటు చేయకపోయినా నాకు మానని గాయం కలిగింది” అని యోబు అంటున్నాడు.
7 Er der mon Mage til Job? Han drikker Spot som Vand,
౭యోబులాంటి మానవుడెవరు? అతడు మంచి నీళ్లవలె తిరస్కారాన్ని పానం చేస్తున్నాడు.
8 søger Selskab med Udådsmænd og Omgang med gudløse Folk!
౮అతడు చెడుతనం చేసే వారికి మిత్రుడయ్యాడు. భక్తిహీనుల చెలికాడు అయ్యాడు.
9 Thi han sagde: "Det båder ikke en Mand, at han har Venskab med Gud!"
౯మనుషులు దేవునితో సహవాసం చేయడం వారికేమాత్రం ప్రయోజనకరం కాదని అతడు చెప్పుకుంటున్నాడు.
10 Derfor, I kloge, hør mig: Det være langt fra Gud af synde, fra den Almægtige at gøre ondt;
౧౦విజ్ఞానం గల మనుషులారా, నా మాట ఆలకించండి దేవుడు అన్యాయం చేయడం అసంభవం. సర్వశక్తుడు దుష్కార్యం చేయడం అసంభవం.
11 nej, han gengælder Menneskets Gerning, handler med Manden efter hans Færd;
౧౧మనుషుల క్రియలకు తగినట్టుగా ఆయన వారికి ప్రతిఫలం ఇస్తాడు అందరికీ ఎవరి మార్గాలను బట్టి వారికి ఫలమిస్తాడు.
12 Gud forbryder sig visselig ej, den Almægtige bøjer ej Retten!
౧౨దేవుడు ఏ మాత్రం దుష్కార్యం చేయడు. సర్వశక్తుడు న్యాయం తప్పడు.
13 Hvo gav ham Tilsyn med Jorden, hvo vogter, mon hele Verden?
౧౩ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టాడా? ఎవడైనా సర్వప్రపంచ భారాన్ని ఆయనకు అప్పగించాడా?
14 Drog han sin Ånd tilbage og tog sin Ånde til sig igen,
౧౪ఆయన తన మనస్సు తన దగ్గరే ఉంచుకున్నట్టయితే, తన ఆత్మను, ఊపిరినీ తన దగ్గరికి తిరిగి తీసుకుంటే,
15 da udånded Kødet til Hobe, og atter blev Mennesket Støv!
౧౫శరీరులంతా ఒక్కపెట్టున నశిస్తారు. మనుషులు మళ్ళీ ధూళిగా మారిపోతారు.
16 Har du Forstand, så hør derpå, lån Øre til mine Ord!
౧౬కాబట్టి దీన్ని విని వివేచించు, నా మాటలు ఆలకించు.
17 Mon en, der hadede Ret, kunde styre? Dømmer du ham, den Retfærdige, Vældige?
౧౭న్యాయాన్ని ద్వేషించేవాడు లోకాన్ని ఏలుతాడా? న్యాయసంపన్నునిపై నేరం మోపుతావా?
18 Han, som kan sige til Kongen: "Din Usling!" og "Nidding, som du er!" til Stormænd,
౧౮నువ్వు పనికిమాలిన వాడివని రాజుతోనైనా, మీరు దుష్టులని ప్రధానులతోనైనా అనవచ్చా?
19 som ikke gør Forskel til Fordel for Fyrster ej heller foretrækker rig for ringe, thi de er alle hans Hænders Værk.
౧౯రాజుల పట్ల పక్షపాతం చూపని వాడితో పేదలకన్నా ధనికులను ఎక్కువగా చూడని వాడితో అలా పలకవచ్చా? వారందరూ ఆయన నిర్మించినవారు కారా?
20 Brat må de dø, endda midt om Natten; de store slår han til, og borte er de, de vældige fjernes uden Menneskehånd.
౨౦వారు నిమిషంలో చనిపోతారు. అర్థరాత్రి వేళ ప్రజలు కల్లోలం పాలై నాశనమౌతారు. బలవంతులను తీసుకు పోవడం జరుగుతుంది, అయితే అది మానవ హస్తాల వలన కాదు.
21 Thi Menneskets Veje er ham for Øje, han skuer alle dets Skridt;
౨౧ఆయన దృష్టి మనుషుల మార్గాల మీద ఉంది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు.
22 der er intet Mørke og intet Mulm, som Udådsmænd kan gemme sig i.
౨౨చెడు కార్యాలు చేసే వారు దాక్కోడానికి చీకటైనా మరణాంధకారమైనా లేదు.
23 Thi Mennesket sættes der ingen Frist til at møde i Retten for Gud;
౨౩ఒక మనిషిని న్యాయవిమర్శలోకి తీసుకు రాక ముందు అతణ్ణి ఎక్కువ కాలం విచారణ చేయడం దేవుడికి అవసరం లేదు.
24 han knuser de vældige uden Forhør og sætter andre i Stedet.
౨౪విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలం చేస్తున్నాడు. వారి స్థానంలో ఇతరులను నియమిస్తున్నాడు.
25 Jeg hævder derfor: Han ved deres Gerninger, og ved Nattetide styrter han dem;
౨౫వారి క్రియలను ఆయన తెలుసుకుంటున్నాడు. రాత్రివేళ ఇలాటి వారిని ఆయన కూలదోస్తాడు. వారు నాశనమై పోతారు.
26 for deres Gudløshed slås de sønder, for alles Øjne tugter han dem,
౨౬అందరూ చూస్తుండగానే దుష్టులను వారి దుర్మార్గాన్ని బట్టి నేరస్తులను శిక్షించినట్టు ఆయన శిక్షిస్తాడు.
27 fordi de veg borf fra ham og ikke regned hans Veje det mindste,
౨౭ఎందుకంటే వారు ఆయనను అనుసరించడం మానుకున్నారు. ఆయన ఆజ్ఞల్లో దేన్నీ లక్ష్య పెట్టలేదు.
28 så de voldte, at ringe råbte til ham, og han måtte høre de armes Skrig.
౨౮పేదల మొరను ఆయన దగ్గరికి వచ్చేలా చేశారు. దీనుల మొర ఆయనకు వినబడేలా చేశారు.
29 Tier han stille, hvo vil dømme ham? Skjuler han sit Åsyn, hvo vil laste ham? Over Folk og Mennesker våger han dog,
౨౯ఆయన మౌనంగా ఉండిపోతే తీర్పు తీర్చగలవాడెవడు? ఆయన తన ముఖాన్ని దాచుకుంటే ఆయనను చూడగలవాడెవడు? ఆయన జాతులనైనా వ్యక్తులనైనా ఒకే విధంగా పరిపాలిస్తాడు.
30 for at ikke en vanhellig skal herske, en af dem, der er Folkets Snarer.
౩౦భక్తిహీనులు రాజ్యపాలన చేయకుండా, వారు ప్రజలను ఇకపై చిక్కించుకోకుండా ఆయన చేస్తాడు.
31 Siger da en til Gud: "Fejlet har jeg, men synder ej mer,
౩౧ఒకడు “నేను దోషినే, కానీ ఇకపై పాపం చేయను.
32 jeg ser det, lær du mig; har jeg gjort Uret, jeg gør det ej mer!"
౩౨నాకు తెలియని దాన్ని నాకు నేర్పించు. నేను పాపం చేశాను. ఇకపై చేయను” అని దేవునితో చెప్పాడనుకో,
33 skal han da gøre Gengæld, fordi du vil det, fordi du indvender noget? Ja du, ikke jeg, skal afgøre det, så sig da nu, hvad du ved!
౩౩దేవుడు చేస్తున్నది నీకు నచ్చడం లేదు గనక అలాటి మనిషిని దేవుడు శిక్షిస్తాడు అనుకుంటున్నావా? నేను కాదు, నువ్వే నిశ్చయించుకోవాలి. కాబట్టి నీకు తెలిసినది చెప్పు.
34 Kloge Folk vil sige til mig som og vise Mænd, der hører mig:
౩౪వివేచన గలవారు, జ్ఞానంతో నా మాట వినేవారు నాతో ఇలా అంటారు.
35 "Job taler ikke med Indsigt, hans Ord er uoverlagte!
౩౫యోబు తెలివితక్కువ మాటలు పలుకుతున్నాడు. అతని మాటలు బుద్ధిహీనమైనవి.
36 Gid Job uden Ophør må prøves, fordi han svarer som slette Folk!
౩౬యోబు దుష్టులవలె మాట్లాడుతున్నాడు గనక అతనిపై సునిశితమైన విచారణ జరిగితే ఎంత బాగుంటుంది!
37 Thi han dynger Synd på Synd, han optræder hovent iblandt os og fremfører mange Ord imod Gud!"
౩౭అతడు తన పాపానికి తోడుగా ద్రోహం సమకూర్చుకుంటున్నాడు. మన ఎదుట ఎగతాళిగా చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు కుప్పగా పోస్తున్నాడు.