< 1 Timoteus 1 >
1 Paulus, Kristi Jesu Apostel efter Befaling af Gud, vor Frelser, og Kristus Jesus, vort Håb,
౧విశ్వాస విషయంలో నా నిజ కుమారుడు తిమోతికి మన రక్షకుడైన దేవుని సంకల్పానుసారం, మన ఆశాభావం అయిన క్రీస్తు యేసు ఆజ్ఞ ప్రకారం అపొస్తలుడైన పౌలు రాస్తున్న సంగతులు.
2 til Timotheus, sit ægte Barn i Troen: Nåde, Barmhjertig Fred fra Gud Fader og Kristus Jesus vor Herre!
౨తండ్రి అయిన దేవుని నుండీ మన ప్రభువైన క్రీస్తు యేసు నుండీ కృప, కనికరం, సమాధానం నీకు కలుగు గాక.
3 Det var derfor, jeg opfordrede dig til at blive i Efesus, da jeg drog til Makedonien, for at du skulde påbyde visse Folk ikke at føre fremmed Lære
౩నేను మాసిదోనియ వెళ్తున్నపుడు నీకు చెప్పినట్టుగా నువ్వు ఎఫెసులోనే ఉండు. భిన్నమైన సిద్ధాంతాలను బోధించే వారిని అలా చేయవద్దని నువ్వు ఆజ్ఞాపించాలి.
4 og ikke at agte på Fabler og Slægtregistre uden Ende, som mere fremme Stridigheden end Guds Husholdning i Tro.
౪అంత మాత్రమే కాక కల్పనా కథలను, అంతూ పొంతూ లేని వంశావళులను పట్టించుకోవద్దని వారికి ఆజ్ఞాపించు. ఎందుకంటే అవి వివాదాలకు కారణమౌతాయే గాని విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుకు ఎంత మాత్రమూ తోడ్పడవు.
5 Men Påbudets Endemål er Kærlighed af et rent Hjerte og af en god Samvittighed og af en uskrømtet Tro,
౫ఈ హెచ్చరికలోని ఉద్దేశం పవిత్ర హృదయం నుండీ మంచి మనస్సాక్షి నుండీ యథార్థమైన విశ్వాసం నుండీ వచ్చే ప్రేమే.
6 hvorfra nogle ere afvegne og have vendt sig til intetsigende Snak,
౬కొంతమంది వీటి నుండి తొలగిపోయి పనికిమాలిన కబుర్లకు దిగారు.
7 idet de ville være Lovlærere uden at forstå, hverken hvad de sige, eller hvorom de udtale sig så sikkert.
౭వారు మాట్లాడేవీ నొక్కి చెప్పేవీ వారికే అర్థం కాకపోయినా, ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉండాలనుకుంటారు.
8 Men vi vide, at Loven er god, dersom man bruger den lovmæssigt,
౮అయినప్పటికీ ధర్మశాస్త్రాన్ని తగిన విధంగా ఉపయోగిస్తే అది మేలైనదే అని మనకు తెలుసు.
9 idet man veed dette, at Loven ikke er sat for den retfærdige, men for lovløse og ulydige, ugudelige og Syndere, ryggesløse og vanhellige, for dem, som øve Vold imod deres Fader og Moder, for Manddrabere,
౯దేవుడు నాకు అప్పగించిన ఈ గొప్ప సువార్త ప్రకారం ధర్మశాస్త్రం ఉన్నది నీతిమంతుల కోసం కాదు. ధర్మ విరోధులూ తిరుగుబాటు చేసేవారూ భక్తిహీనులూ పాపులూ దుర్మార్గులూ భక్తిహీనులూ చెడిపోయిన వారూ తల్లిదండ్రులను చంపేవారూ హంతకులూ
10 utugtige, Syndere imod Naturen, Menneskerøvere, Løgnere, Menedere, og hvad andet der er imod den sunde Lære,
౧౦వ్యభిచారులూ స్వలింగ సంపర్కులూ బానిస వ్యాపారులూ అబద్ధికులూ అబద్ధ సాక్ష్యం చెప్పేవారూ నిజమైన బోధకు వ్యతిరేకంగా నడచుకొనేవారూ ఇలాటివారి కోసమే ధర్మశాస్త్రం ఉంది అని మనకు తెలుసు.
11 efter den salige Guds Herligheds Evangelium, som er blevet mig betroet.
౧౧ఈ మహిమగల సువార్తను మహిమగల దివ్య ప్రభువు నాకు అప్పగించాడు.
12 Jeg takker ham, som gjorde mig stærk, Kristus Jesus, vor Herre, fordi han agtede mig for tro, idet han satte mig til en Tjeneste,
౧౨నన్ను బలపరచి, నమ్మకమైన వాడుగా ఎంచి తన సేవకు నియమించిన మన యేసు క్రీస్తు ప్రభువుకి కృతజ్ఞుణ్ణి.
13 skønt jeg forhen var en Bespotter og en Forfølger og en Voldsmand; men der blev vist mig Barmhjertighed, thi jeg gjorde det vitterligt i Vantro,
౧౩అంతకు ముందు దేవ దూషకుణ్ణి, హింసించేవాణ్ణి, హానికరుణ్ణి. అయితే తెలియక అవిశ్వాసం వలన చేశాను కాబట్టి కనికరం పొందాను.
14 Ja, vor Herres Nåde viste sig overvættes rig med Tro og Kærlighed i Kristus Jesus.
౧౪మన ప్రభువు తన ధారాళమైన కృపను నాపై కుమ్మరించి, యేసుక్రీస్తులో ఉన్న ప్రేమ విశ్వాసాలను అనుగ్రహించాడు.
15 Den Tale er troværdig og al Modtagelse værd, at Kristus Jesus kom til Verden for at frelse Syndere, iblandt hvilke jeg er den største"
౧౫పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడనే సందేశం నమ్మదగినదీ, సంపూర్ణంగా అంగీకరించదగినదీ. అలాంటి పాపుల్లో నేను మొదటి వాణ్ణి.
16 Men derfor blev der vist mig Barmhjertighed, for at Jesus Kristus kunde på mig som den første vise hele sin Langmodighed, til et Forbillede på dem, som skulle tro på ham til evigt Liv. (aiōnios )
౧౬అయినా నిత్యజీవం కోసం తనపై విశ్వాసముంచబోయే వారికి నేను ఒక నమూనాగా ఉండేలా యేసు క్రీస్తు తన పరిపూర్ణమైన ఓర్పును నాలో కనుపరచేలా నన్ను కరుణించాడు. (aiōnios )
17 Men Evighedens Konge, den uforkrænkelige, usynlige, eneste Gud være Pris og Ære i Evighedernes Evigheder! Amen. (aiōn )
౧౭అన్ని యుగాల్లో రాజూ, అమర్త్యుడూ, అదృశ్యుడూ అయిన ఏకైక దేవునికి ఘనత, మహిమ యుగయుగాలు కలగాలి. ఆమేన్. (aiōn )
18 Dette Påbud betror jeg dig, mit Barn Timotheus, ifølge de Profetier, som tilforn ere udtalte over dig, at du efter dem strider den gode Strid,
౧౮తిమోతీ, నా కుమారా, గతంలో నిన్ను గూర్చి చెప్పిన ప్రవచనాలకు అనుగుణంగానే ఈ సూచనలు నీకు ఇస్తున్నాను. వాటిని పాటిస్తే నీవు మంచి పోరాటం చేయగలుగుతావు.
19 idet du har Tro og en god Samvittighed, hvilken nogle have stødt fra sig og lidt Skibbrud på Troen;
౧౯అలాటి మనస్సాక్షిని కొందరు నిరాకరించి, విశ్వాస విషయంలో ఓడ బద్దలై పోయినట్టుగా ఉన్నారు.
20 iblandt dem ere Hymenæus og Aleksander, hvilke jeg har overgivet til Satan, for at de skulle tugtes til ikke at bespotte.
౨౦వారిలో హుమెనై, అలెగ్జాండర్ ఉన్నారు. వీరు దేవదూషణ మానుకొనేలా వీరిని సాతానుకు అప్పగించాను.