< Salme 59 >
1 Til Sangmesteren. Al-tasjhet. Af David. En Miktam, da Saul udsendte Folk, som skulle vogte Huset for at dræbe ham.
౧ప్రధాన సంగీతకారుని కోసం. అల్ తశ్హేత్ అనే రాగంతో పాడేది. సౌలు పంపిన మనుషులు ఇంటి దగ్గర పొంచి ఉన్నప్పుడు దావీదు రాసిన మిఖ్తీమ్ (రసిక కావ్యం). నా దేవా, నా శత్రువుల బారినుంచి నన్ను తప్పించు. నా మీద దండెత్తే వారికి చిక్కకుండా నన్ను కాపాడు.
2 Fri mig fra mine Fjender, min Gud, bjærg mig fra dem, der rejser sig mod mig;
౨పాపం చేసేవారి నుండి నన్ను తప్పించు. రక్తం చిందించే వారి నుండి నన్ను రక్షించు.
3 fri mig fra Udaadsmænd, frels mig fra blodstænkte Mænd!
౩నా ప్రాణం తీయడానికి వారు కాపుకాశారు. యెహోవా, నేను దోషం చేసినందుకో, పాపం చేసినందుకో కాదు.
4 Thi se, de lurer efter min Sjæl, stærke Mænd stimler sammen imod mig, uden at jeg har Skyld eller Brøde.
౪నాలో ఏ అక్రమం లేకపోయినా వారు నా మీదికి పరిగెత్తి రావడానికి సిద్ధపడ్డారు. లేచి నాకు సహాయం చెయ్యి.
5 Uden at jeg har forbrudt mig, HERRE, stormer de frem og stiller sig op. Vaagn op og kom mig i Møde, se til!
౫సేనల ప్రభువైన యెహోవా, ఇశ్రాయేలు దేవా, అన్యజాతులను శిక్షించడానికి మేలుకో. ఆ దుర్మార్గుల్లో ఎవరినీ కనికరించవద్దు.
6 Du er jo HERREN, Hærskarers Gud, Israels Gud. Vaagn op og hjemsøg alle Folkene, skaan ej een af de troløse Niddinger! (Sela)
౬సాయంకాలం వారు మళ్ళీ వస్తారు. కుక్కల్లాగా మొరుగుతూ పట్టణం చుట్టూ తిరుగుతారు.
7 Ved Aften kommer de tilbage, hyler som Hunde og stryger gennem Byen!
౭మన మాటలు ఎవరు వింటారులే అనుకుని వారు తమ నోటితో మాటలు వెళ్లగక్కుతారు. వారి పెదాల్లో కత్తులున్నాయి.
8 Se, deres Mund løber over, paa deres Læber er Sværd, thi: »Hvem skulde høre det?«
౮అయితే యెహోవా, నువ్వు వాళ్ళను చూసి నవ్వుతావు. అన్యజాతులను నువ్వు ఎగతాళి చేస్తావు.
9 Men du, o HERRE, du ler ad dem, du spotter alle Folk,
౯దేవా, నా బలమా, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. నా ఎత్తయిన బురుజు నువ్వే.
10 dig vil jeg lovsynge, du, min Styrke, thi Gud er mit Værn;
౧౦నా దేవుడు తన నిబంధన నమ్మకత్వంలో నన్ను కలుసుకుంటాడు. నా శత్రువులకు జరిగిన దాన్ని దేవుడు నాకు చూపిస్తాడు.
11 med Naade kommer min Gud mig i Møde, Gud lader mig se mine Fjender med Fryd!
౧౧వారిని చంపొద్దు. ఎందుకంటే నా ప్రజలు దాన్ని మరచిపోతారేమో. మా ధ్వజం లాంటి నువ్వు నీ బలంతో వారిని చెల్లాచెదరు చేసి అణగ గొట్టు.
12 Slaa dem ikke ihjel, at ikke mit Folk skal glemme, gør dem hjemløse med din Vælde og styrt dem,
౧౨వారి పెదాల మాటలను బట్టి, వారి నోటి పాపాన్ని బట్టి, వారు పలికిన శాపాలను బట్టి, అబద్ధాలను బట్టి వారు తమ గర్వంలో చిక్కుకునేలా చెయ్యి.
13 giv dem hen, o Herre, i Mundens Synd, i Læbernes Ord, og lad dem hildes i deres Hovmod for de Eder og Løgne, de siger;
౧౩వారు ఇకపై కనబడకుండా పోయేలా కోపంతో వారిని నిర్మూలించు. దేవుడు యాకోబు సంతానాన్ని ఏలుతున్నాడని భూదిగంతాల వరకూ మనుషులు తెలుసుకునేలా చెయ్యి.
14 udryd dem i Vrede, gør Ende paa dem, saa man kan kende til Jordens Ender, at Gud er Hersker i Jakob! (Sela)
౧౪సాయంకాలం వారు మళ్ళీ వస్తారు. కుక్కల్లాగా మొరుగుతూ పట్టణం చుట్టూ తిరుగుతారు.
15 Ved Aften kommer de tilbage, hyler som Hunde og stryger gennem Byen,
౧౫తిండికోసం అటూ ఇటూ తిరుగుతారు. ఇంకా తృప్తి కలగకపోతే రాత్రి అంతా కనిపెడతారు.
16 vanker rundt efter Føde og knurrer, naar de ikke mættes.
౧౬నీవు నాకు ఎత్తయిన బురుజుగా ఉన్నావు. ఆపద రోజున నాకు ఆశ్రయంగా ఉన్నావు. నీ బలాన్ని గూర్చి నేను కీర్తిస్తాను. ఉదయాన నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేస్తాను.
17 Men jeg, jeg vil synge om din Styrke, juble hver Morgen over din Naade; thi du blev mig et Værn, en Tilflugt paa Nødens Dag. Dig vil jeg lovsynge, du, min Styrke, thi Gud er mit Værn, min naadige Gud.
౧౭దేవుడు నాకు ఎత్తయిన కోటగా, నిబంధనా దేవుడుగా ఉన్నాడు. నా బలమా, నేను నిన్ను కీర్తిస్తాను.