< Salme 33 >

1 Jubler i HERREN, I retfærdige, for de oprigtige sømmer sig Lovsang;
నీతిపరులారా, యెహోవాలో ఆనందించండి. న్యాయబద్ధంగా ఉండేవాళ్ళు స్తుతించడం యుక్తమైనది.
2 lov HERREN med Citer, tak ham til tistrenget Harpe;
వీణలు మోగించి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి. పది తీగెలున్న వాయిద్యంతో ఆయనకు స్తుతులు పాడండి.
3 en ny Sang synge I ham, leg lifligt paa Strenge til Jubelraab!
ఆయనను గూర్చి ఒక కొత్త పాట పాడండి. నైపుణ్యంతో కమ్మగా వాయిస్తూ సంతోషాతిరేకంతో పాడండి.
4 Thi sandt er HERRENS Ord, og al hans Gerning er trofast;
ఎందుకంటే యెహోవా వాక్కు న్యాయబద్ధమైనది. ఆయన చేసే ప్రతిదీ న్యాయమే.
5 han elsker Retfærd og Ret, af HERRENS Miskundhed er Jorden fuld.
ఆయన నీతినీ న్యాయాన్నీ ప్రేమిస్తాడు. నిబంధన పట్ల యెహోవాకు ఉన్న విశ్వసనీయతతో లోకం నిండి ఉంది.
6 Ved HERRENS Ord blev Himlen skabt og al dens Hær ved hans Munds Aande.
యెహోవా తన నోటి మాట వల్ల ఆకాశాలను చేశాడు. తన నోటి శ్వాస చేత నక్షత్రాలను చేశాడు.
7 Som i Vandsæk samled han Havets Vand, lagde Dybets Vande i Forraadskamre.
ఆయన సముద్ర జలాలను రాశిగా సమకూరుస్తాడు. మహా సముద్ర జలాలను గిడ్డంగిలో నిలవ చేస్తాడు.
8 Al Jorden skal frygte for HERREN, Alverdens Beboere skælve for ham;
భూలోకం అంతా యెహోవాకు భయపడాలి. లోకంలో నివసించే వాళ్ళంతా యెహోవా పట్ల భయభీతులు కలిగి విస్మయం చెందాలి.
9 thi han talede, saa skete det, han bød, saa stod det der.
ఆయన మాట పలికాడు. ఆ మాట ప్రకారమే జరిగింది. ఆయన ఆజ్ఞాపించాడు. అది స్థిరంగా నిలిచింది.
10 HERREN kuldkasted Folkenes Raad, gjorde Folkeslags Tanker til intet;
౧౦దేశాల మధ్య మైత్రిని యెహోవా నిష్ఫలం చేస్తాడు. జనాల ప్రణాళికలను ఆయన రద్దు చేస్తాడు.
11 HERRENS Raad staar fast for evigt, hans Hjertes Tanker fra Slægt til Slægt.
౧౧యెహోవా ప్రణాళికలు నిత్యమూ అమలవుతాయి. ఆయన తన హృదయంలో అన్ని తరాల కోసం ఆలోచనలు చేస్తాడు.
12 Saligt det Folk, der har HERREN til Gud, det Folkefærd, han valgte til Arvelod!
౧౨యెహోవా ఏ ప్రజలకు దేవుడుగా ఉన్నాడో ఆ ప్రజలు ధన్యజీవులు. తనకు సొత్తుగా ఆయన ఎంచుకున్న జనం ధన్యజీవులు.
13 HERREN skuer fra Himlen, ser paa alle Menneskens Børn;
౧౩ఆకాశం నుండి యెహోవా చూస్తున్నాడు. ఆయన మనుషులందర్నీ పరికించి చూస్తున్నాడు.
14 fra sit Højsæde holder han Øje med alle, som bor paa Jorden;
౧౪తాను నివాసమున్న చోటు నుండి ఆయన భూమిపై నివసిస్తున్న వాళ్ళందర్నీ చూస్తున్నాడు.
15 han, som danned deres Hjerter til Hobe, gennemskuer alt deres Værk.
౧౫అందరి హృదయాలనూ మలచిన వాడు వాళ్ళు చేసే పనులన్నిటినీ గమనిస్తున్నాడు.
16 Ej frelses en Konge ved sin store Stridsmagt, ej fries en Helt ved sin store Kraft;
౧౬ఏ రాజూ తనకున్న అపారమైన సైన్యం వల్ల రక్షణ పొందలేడు. యోధుడు తనకున్న గొప్ప శక్తి వల్ల తనను తాను రక్షించుకోలేడు.
17 til Frelse slaar Stridshesten ikke til, trods sin store Styrke redder den ikke.
౧౭గుర్రం విజయానికి పూచీ కాదు. దానికి గొప్ప శక్తి ఉన్నప్పటికీ అది ఎవర్నీ రక్షించలేదు.
18 Men HERRENS Øje ser til gudfrygtige, til dem, der haaber paa Naaden,
౧౮చూడండి, వాళ్ళ ప్రాణాలను మరణం నుండి తప్పించడానికీ, కరువులో వాళ్ళను సజీవులుగా నిలబెట్టడానికీ,
19 for at fri deres Sjæl fra Døden og holde dem i Live i Hungerens Tid.
౧౯యెహోవా పట్ల భయభక్తులుగల వాళ్ళ పైనా నిబంధన పట్ల ఆయనకున్న నిబద్ధతపై ఆధారపడే వాళ్ల పైనా ఆయన కనుచూపు నిలిచి ఉంది.
20 Paa HERREN bier vor Sjæl, han er vor Hjælp og vort Skjold;
౨౦మనం యెహోవా కోసం వేచి చూస్తున్నాం. మన సహాయమూ భద్రతా ఆయనే.
21 thi vort Hjerte glæder sig i ham, vi stoler paa hans hellige Navn.
౨౧మన హృదయాలు ఆయనలో ఆనందిస్తున్నాయి. ఆయన పవిత్ర నామంపై మన నమ్మకం ఉంది.
22 Din Miskundhed være over os, HERRE, saa som vi haaber paa dig.
౨౨యెహోవా, ఆశగా నీవైపు చూస్తున్నాం. నీ నిబంధన నిబద్ధత మాపై ఉండనియ్యి.

< Salme 33 >