< Ordsprogene 2 >
1 Min Søn, naar du tager imod mine Ord og gemmer mine Paalæg hos dig,
౧కుమారా, నీవు నా మాటలు అంగీకరించి, నా ఆజ్ఞలను నీ మనసులో ఉంచుకుంటే దేవుణ్ణి గూర్చిన వివేచన నీకు దొరుకుతుంది.
2 idet du laaner Visdom Øre og bøjer dit Hjerte til Indsigt,
౨జ్ఞానంపై మనసు నిలిపి హృదయపూర్వకంగా వివేచన అభ్యాసం చేసినప్పుడు,
3 ja, kalder du paa Forstanden og løfter din Røst efter Indsigt,
౩తెలివితేటల కోసం మొరపెట్టినప్పుడు, వివేచన కోసం వేడుకొన్నప్పుడు,
4 søger du den som Sølv og leder den op som Skatte,
౪పోగొట్టుకున్న వెండిని వెతికినట్టు దాన్ని వెదికినప్పుడు, దాచుకున్న ధనం కోసం వెతికినట్టు జ్ఞానాన్ని వెతికినప్పుడు,
5 da nemmer du HERRENS Frygt og vinder dig Kundskab om Gud.
౫యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఉండడం ఎలా ఉంటుందో నువ్వు గ్రహిస్తావు. దేవుణ్ణి గూర్చిన విజ్ఞానం నీకు దొరుకుతుంది.
6 Thi HERREN, han giver Visdom, fra hans Mund kommer Kundskab og Indsigt.
౬యెహోవా మాత్రమే జ్ఞానం అనుగ్రహిస్తాడు. తెలివి, వివేచన ఆయన మాటల్లో నిండి ఉంటాయి.
7 Til retsindige gemmer han Lykke, han er Skjold for alle med lydefri Vandel,
౭యథార్థవంతులను ఆయన వర్ధిల్లజేస్తాడు. సరియైన మార్గం నుండి తప్పిపోకుండా నడుచుకునే వాళ్ళకు ఆయన రక్షణ కలుగజేస్తాడు.
8 idet han værner Rettens Stier og vogter sine frommes Vej.
౮న్యాయ ప్రవర్తన నుండి తొలగిపోకుండా ఆయన కనిపెట్టుకుని ఉంటాడు. తన భక్తులు మంచి ప్రవర్తనలో కొనసాగేలా ఆయన కావలి కాస్తాడు.
9 Da nemmer du Retfærd, Ret og Retsind, hvert et Spor, som er godt.
౯అప్పుడు నీతి, న్యాయం, యథార్థత అనే మంచి మార్గాలు నువ్వు తెలుసుకుంటావు.
10 Thi Visdom kommer i dit Hjerte, og Kundskab er liflig for din Sjæl;
౧౦జ్ఞానం నీ హృదయంలోకి చొచ్చుకుపోతుంది. తెలివి కలిగి ఉండడం నీకు ఇష్టంగా ఉంటుంది.
11 Kløgt skal vaage over dig, Indsigt være din Vogter —
౧౧తెలివితేటలు నిన్ను కాపాడతాయి. వివేకం నీకు కాపలా కాస్తుంది.
12 idet den frier dig fra den ondes Vej, fra Folk, hvis Ord kun er vrange,
౧౨అది దుష్టులు నడిచే మార్గాల నుండి, మూర్ఖపు మాటలు మాట్లాడే వారి బారి నుండి నిన్ను కాపాడుతుంది.
13 som gaar fra de lige Stier for at vandre paa Mørkets Veje.
౧౩దుష్టులు చీకటి మార్గాల్లో నడవడం కోసం యథార్థమైన మార్గాలను విడిచిపెడతారు.
14 som glæder sig ved at gøre ondt og jubler over vrangt og ondt,
౧౪కీడు చేసేవాళ్ళు తమ పనుల వల్ల సంతోషిస్తారు. తీవ్రమైన మూర్ఖత్వంతో ప్రవర్తించే వాళ్ళను చూసి ఆనందిస్తారు.
15 de, som gaar krogede Stier og følger bugtede Spor —
౧౫తమ దుష్ట మార్గాలగుండా పయనిస్తారు. వాళ్ళు కపటంతో ఉంటారు.
16 idet den frier dig fra Andenmands Hustru, fra fremmed Kvinde med sleske Ord,
౧౬వ్యభిచారి వలలో పడకుండా, తియ్యగా మాట్లాడి మోసపుచ్చే వేశ్య బారి నుండి జ్ఞానం నిన్ను కాపాడుతుంది.
17 der sviger sin Ungdoms Ven og glemmer sin Guds Pagt;
౧౭అలాంటి స్త్రీ తన యవ్వనకాలంలో తన భర్తను విడిచిపెట్టి తన దేవుని నిబంధన పెడచెవిన పెడుతుంది.
18 thi en Grav til Døden er hendes Hus, til Skyggerne fører hendes Spor;
౧౮ఆ స్త్రీ ఇల్లు మరణానికి నడిపిస్తుంది. ఆ స్త్రీ నడిచే మార్గం శవాల దగ్గరికి చేరుతుంది.
19 tilbage vender ingen, som gaar ind til hende, de naar ej Livets Stier —
౧౯ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎవ్వరూ వెనక్కి తిరిగిరారు. వాళ్ళు జీవమార్గం చేరుకోలేరు.
20 at du maa vandre de godes Vej og holde dig til de retfærdiges Stier;
౨౦నేను చెప్పే మాటలు విని ఆ విధంగా నడుచుకుంటే నువ్వు యథార్థవంతులు నడిచే మార్గంలో నడుచుకుంటావు. నీతిమంతుల ప్రవర్తన అనుసరిస్తావు.
21 thi retsindige skal bo i Landet, lydefri levnes deri,
౨౧నిజాయితీపరులు దేశంలో కాపురం ఉంటారు. సత్యవర్తనులు దేశంలో స్థిరంగా ఉంటారు.
22 men gudløse ryddes af Landet, troløse rykkes derfra.
౨౨చెడ్డ పనులు చేసేవారు నిర్మూలం అవుతారు. నమ్మకద్రోహులు దేశంలో లేకుండా పోతారు.