< Job 25 >
1 Saa tog Sjuhiten Bildad til Orde og sagde:
౧అప్పుడు షూహీయుడు బిల్దదు ఇలా జవాబు ఇచ్చాడు.
2 Hos ham er der Vælde og Rædsel, han skaber Fred i sin høje Bolig.
౨అధికారం, భీకరత్వం ఆయనవి. ఆయన పరలోక స్థలాల్లో క్రమం నెలకొల్పుతాడు.
3 Er der mon Tal paa hans Skarer? Mod hvem staar ikke hans Baghold op?
౩ఆయన సేనలను లెక్కింప శక్యమా? ఆయన వెలుగు ఎవరి మీదనైనా ఉదయించకుండా ఉంటుందా?
4 Hvor kan en Mand have Ret imod Gud, hvor kan en kvindefødt være ren?
౪మనిషి దేవుని దృష్టికి నీతిమంతుడు ఎలా కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎలా శుద్ధుడు కాగలడు?
5 Selv Maanen er ikke klar i hans Øjne og Stjernerne ikke rene,
౫ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. నక్షత్రాలు పవిత్రమైనవి కావు.
6 endsige en Mand, det Kryb, et Menneskebarn, den Orm!
౬మరి నిశ్చయంగా పురుగు-పురుగులాంటి నరుడు అంతే కదా.