< Esajas 28 >

1 Ve Efraims berusedes stolte Krans og dets herlige Smykkes visnende Blomster paa Tindingen af de druknes fede Dal!
ఎఫ్రాయీములో తాగుబోతులకు గర్వకారణంగా ఉన్న పూలమాలకు బాధ. వాడిపోతున్న పువ్వులాంటి అతడి ప్రాభవ సౌందర్యానికి బాధ. అది ద్రాక్షారసం వశంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు నివసించే పచ్చని లోయ తలపై ఉన్న కిరీటం.
2 Se, Herren har en vældig Kæmpe til Rede; som Skybrud af Hagl, som hærgende Storm, som Skybrud af mægtige skyllende Vande slaar han til Jorden med Vælde.
వినండి! శక్తిశాలీ, బలశాలీ అయిన ఒకడు ప్రభువుకి ఉన్నాడు. అతడు వడగళ్ళ లాంటి వాడు. అతడు వినాశనకారి అయిన తుఫాను వంటివాడు. ముంచెత్తే బలమైన జడివాన వంటివాడు. ఆయన తన చేతితో భూమిని కొడతాడు.
3 Med Fødderne trampes de ned, Efraims berusedes stolte Krans
ఎఫ్రాయీములో తాగుబోతులకు గర్వకారణంగా ఉన్న కిరీటాన్ని కింద పడేసి కాళ్ళతో తొక్కుతారు.
4 og dets herlige Smykkes visnende Blomster paa Tindingen af den fede Dal; det gaar den som en tidligmoden Figen før Frugthøst: Hvo der faar Øje paa den, plukker den, og knap er den i Haanden, før han har slugt den.
పచ్చని లోయ తలపై ఉన్న వాడిపోతున్న పువ్వులాంటి అతడి ప్రాభవ సౌందర్యం కోతకాలం రాకముందే పండిపోయిన మొదటి అంజూరపు పండులా ఉంటుంది. మొదట దాన్ని చూసినవాడు దాన్ని చేతిలోకి తీసుకున్న వెంటనే నోట్లో వేసుకుని మింగివేస్తాడు.
5 Paa hin Dag bliver Hærskarers HERRE en smuk Krans og en herlig Krone for sit Folks Rest
ఆ రోజున సేనల ప్రభువైన యెహోవా మిగిలి ఉన్న తన ప్రజలకు తానే అందమైన కిరీటంగానూ, అందమైన రాజ మకుటంగానూ ఉంటాడు.
6 og en Rettens Aand for dem, som sidder til Doms, og Styrke for dem, der driver Krigen tilbage til Portene.
ఆయన న్యాయం చెప్పడానికి న్యాయపీఠం పైన కూర్చున్న వాడికి న్యాయం నేర్పే ఆత్మగానూ, తమ ద్వారాల దగ్గర శత్రువులను తరిమి కొట్టే వాళ్లకి బలంగానూ ఉంటాడు.
7 Ogsaa disse raver af Vin, er svimle af Drik, Præst og Profet, de raver af Drik, fra Samling af Vin og svimle af Drik; de raver under Syner, vakler, naar de dømmer.
అయితే వీళ్ళు కూడా ద్రాక్షారసం తాగి తూలుతారు. మద్యపానం చేసి తడబడతారు. యాజకుడైనా, ప్రవక్త అయినా మద్యం తాగి తూలుతారు. ద్రాక్షారసం వాళ్ళని వశం చేసుకుంటుంది. మద్యపానం చేసి తడబడుతూ ఉంటారు. దర్శనం కలిగినప్పుడు తూలుతూ ఉంటారు. తీర్పు చెప్పాల్సి వచ్చినప్పుడు తడబడతారు.
8 Thi alle Borde er fulde af Spy, Uhumskhed flyder paa hver en Plet.
వాళ్ళు భోజనం చేసే బల్లలు అన్నీ వాంతితో నిండి ఉన్నాయి. శుభ్రమైన స్థలం అక్కడ కనిపించదు.
9 »Hvem vil han belære, hvem tyder han Syner — mon afvante Børn, nys tagne fra Brystet?
వాడు జ్ఞానాన్ని ఎవరికి బోధిస్తాడు? వర్తమానాన్ని ఎవరికి వివరిస్తాడు? పాలు విడిచిన వాళ్ళకా? లేక తల్లి రొమ్ము విడిచిన వాళ్ళకా?
10 Kun hakke og rakke, rakke og hakke, lidt i Vejen her og lidt i Vejen der!«
౧౦ఎందుకంటే “ఆజ్ఞ వెంట ఆజ్ఞ, ఆజ్ఞ వెంట ఆజ్ఞ, సూత్రం వెంట సూత్రం, సూత్రం వెంట సూత్రంగా, ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెంగా ఉంటుంది.” అని వాళ్ళు అనుకుంటారు.
11 Ja, med lallende Læber, med fremmed Maal vil han tale til dette Folk,
౧౧అప్పుడు ఆయన నిజంగానే వాళ్ళతో వెక్కిరించే పెదాలతో, విదేశీ భాషలో మాట్లాడతాడు.
12 han, som dog sagde til dem: »Her er der Hvile, lad den trætte hvile, her er der Ro!« — men de vilde ej høre.
౧౨గతంలో ఆయన వాళ్ళతో “ఇది విశ్రాంతి స్థలం. అలసి పోయిన వాళ్ళని విశ్రాంతి తీసుకోనివ్వండి” అన్నాడు. కానీ వాళ్ళు వినలేదు. కాబట్టి వాళ్ళు వెళ్ళి వెనక్కి పడి, కుంగిపోయి, వలలో చిక్కుకుని, బందీలు అయ్యేలా యెహోవా మాట వాళ్లకి ఇలా వస్తుంది.
13 Saa bliver for dem da HERRENS Ord: »Hakke og rakke, rakke og hakke, lidt i Vejen her og lidt i Vejen der!« saa de gaar hen og styrter bagover, sønderslaas, fanges og hildes.
౧౩“ఆజ్ఞ వెంట ఆజ్ఞ, ఆజ్ఞ వెంట ఆజ్ఞ, సూత్రం వెంట సూత్రం, సూత్రం వెంట సూత్రం, ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెం.”
14 Hør derfor HERRENS Ord, I spotske Mænd, I Nidvisens Mestre blandt dette Jerusalems Folk!
౧౪కాబట్టి ఎగతాళి చేసేవాళ్ళూ, యెరూషలేములో ఈ ప్రజలను పాలించే వాళ్ళు, యెహోవా మాట వినండి.
15 Fordi I siger: »Vi slutted en Pagt med Døden, Dødsriget gjorde vi Aftale med; naar den susende Svøbe gaar frem, da naar den ej os, thi Løgn har vi gjort til vort Ly, vi har gemt os i Svig; « (Sheol h7585)
౧౫మీరు ఇలా అన్నారు “మేం చావుతో నిబంధన చేసుకున్నాం. పాతాళంతో ఒక ఒప్పందానికి వచ్చాం. కాబట్టి కీడు ప్రవాహంలా వచ్చినా అది మమ్మల్ని తాకదు. ఎందుకంటే మేం అబద్ధాన్ని ఆశ్రయించాం. మిథ్య వెనుక దాక్కున్నాం.” (Sheol h7585)
16 derfor, saa siger den Herre HERREN: Se, jeg lægger i Zion en prøvet Sten, en urokkelig, kostelig Hjørnesten; tror man, haster man ikke.
౧౬దానికి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “చూడండి, నేను సీయోనులో ఒక పునాది రాయి వేస్తాను. అది పరిశోధనకి గురైన రాయి. ఒక ప్రశస్తమైన మూలరాయిని వేస్తాను. అది దృఢమైన పునాది రాయి. విశ్వాసం ఉంచే వాడు సిగ్గుపడడు.
17 Og jeg gør Ret til Maalesnor, Retfærd til Blylod; Hagl skal slaa Løgnelyet ned, Vand skylle Gemmestedet bort.
౧౭నేను న్యాయాన్ని కొలబద్దగానూ, నీతిని ఒడంబంగానూ చేస్తాను. వడగళ్ళు మీ అబద్దాలనే ఆశ్రయాన్ని తుడిచి పెట్టేస్తాయి. మీరు దాగి ఉన్న చోటును వరద నీళ్ళు ముంచెత్తుతాయి.
18 Eders Pagt med Døden skal brydes, Aftalen med Dødsriget glippe. Naar den susende Svøbe gaar frem, skal den slaa jer til Jorden, (Sheol h7585)
౧౮చావుతో మీరు చేసుకున్న నిబంధనను రద్దు చేస్తాను. పాతాళంతో మీరు చేసుకున్న ఒప్పందం చెల్లదు. వరద ప్రవాహంలా విపత్తు మీకు పైగా దాటినప్పుడు మీరు ఉక్కిరిబిక్కిరి అవుతారు. (Sheol h7585)
19 jer skal den ramme, hver Gang den gaar frem; thi Morgen efter Morgen gaar den frem, ved Dag og ved Nat, idel Angst skal det blive at faa Syner tydet.
౧౯అవి వచ్చినప్పుడల్లా మిమ్మల్ని ముంచెత్తి వేస్తాయి. ప్రతి ఉదయమూ, ప్రతి పగలూ, ప్రతి రాత్రీ అది వస్తుంది. ఈ వార్త అర్థం అయినప్పుడు అది మహాభయాన్ని కలిగిస్తుంది.
20 Vil man strække sig, er Lejet for kort; vil man dække sig, er Tæppet for smalt.
౨౦పడుకుని కాళ్ళు చాపుకోడానికి మంచం పొడవు చాలదు. కప్పుకోడానికి దుప్పటి వెడల్పు చాలదు.
21 Thi som paa Perazims Bjerg vil HERREN staa op, som i Gibeons Dal vil han vise sin Vrede for at gøre sin Gerning — en underlig Gerning, og øve sit Værk — et sælsomt Værk.
౨౧యెహోవా తన పనిని జరిగించడానికి, ఆశ్చర్యకరమైన తన పనిని చేయడానికి, విచిత్రమైన తన పనిని జరిగించడానికి పెరాజీము పర్వతం పైన లేచినట్టుగా లేస్తాడు. గిబియోను లోయలో ఆయన తనను తాను రెచ్చగొట్టుకున్నట్టుగా లేస్తాడు.
22 Derfor hold inde med Spot, at ej eders Baand skal snære; thi om hele Landets visse Undergang hørte jeg fra Herren, Hærskarers HERRE.
౨౨కాబట్టి పరిహాసం చేయకండి. లేకుంటే మీ సంకెళ్ళు మరింతగా బిగుసుకుంటాయి. సేనల ప్రభువైన యెహోవా నుండి భూమిపైన నాశనం జరుగుతుందనే సమాచారం నేను విన్నాను.
23 Lyt til og hør min Røst, laan Øre og hør mit Ord!
౨౩కాబట్టి మనస్సు పెట్టి నేను చెప్పేది వినండి. జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి.
24 Bliver Plovmanden ved med at pløje til Sæd, med at bryde og harve sin Jord?
౨౪రైతు విత్తడానికి ఎప్పుడూ పొలం దున్నుతూనే ఉంటాడా? ఎప్పుడూ పొలంలో మట్టి పెళ్లలను పగలగొడుతూ ఉంటాడా?
25 Mon han ikke, naar den er jævnet, saar Dild og udstrør Kommen, lægger Hvede, Hirse og Byg paa det udsete Sted og Spelt i Kanten deraf?
౨౫అతడు నేలను చదును చేసిన తర్వాత సోపు గింజలు చల్లడా? జీలకర్ర చల్లడా? గోధుమలు వరుసల్లో, బార్లీ సరైన స్థలంలో వేసి చేను అంచుల్లో మిరప మొక్కలు నాటడా?
26 Hans Gud vejleder ham, lærer ham det rette.
౨౬అతడి దేవుడే అతడికి ఆ క్రమాన్ని నేర్పించాడు. ఎలా చేయాలో జ్ఞానంతో అతనికి బోధించాడు.
27 Thi med Tærskeslæde knuser man ikke Dild, lader ikke Vognhjul gaa over Kommen; nej, Dilden tærskes med Stok og Kommen med Kæp.
౨౭జీలకర్రను యంత్రంలో ఉంచి నూర్చారు. జీలకర్ర పై బండి చక్రాన్ని దొర్లించరు. కానీ సోపుని చువ్వతో, జీలకర్రను కర్రతో దుళ్ళకొడతారు.
28 Mon Brødkorn knuses? Nej, det bliver ingen ved med at tærske; Vognhjul og Heste drives derover, man knuser det ikke.
౨౮మనుషులు రొట్టెల కోసం గోధుమలను నూర్చి పిండి చేస్తారు. కానీ అదేపనిగా గోధుమలను పిండి చేస్తూనే ఉండరు కదా! గోధుమలను దుళ్ళగొట్టడానికి గుర్రాలనూ బండి చక్రాలనూ నడిపిస్తారు గానీ దాన్ని పిండి చేయడానికి కాదు కదా!
29 Ogsaa dette kommer fra Hærskarers HERRE, underfuld i Raad og stor i Visdom.
౨౯దీన్ని కూడా మనుషులకు సేనల ప్రభువైన యెహోవా నేర్పిస్తున్నాడు. ఆయన బోధ అద్భుతంగానూ ఆయన ఆలోచన శ్రేష్టంగానూ ఉంటుంది.”

< Esajas 28 >