< 1 Mosebog 38 >
1 Ved den Tid forlod Juda sine Brødre og sluttede sig til en Mand fra Adullam ved Navn Hira.
౧ఆ కాలంలో యూదా తన సోదరులను విడిచిపెట్టి హీరా అనే ఒక అదుల్లాము వాడితో నివసించాడు.
2 Der saa Juda en Datter af Kana'anæeren Sjua, og han tog hende til Ægte og gik ind til hende.
౨అక్కడ షూయ అనే ఒక కనానీ యువతిని చూసి ఆమెను వివాహమాడి ఆమెతో కాపురం చేశాడు.
3 Hun blev frugtsommelig og fødte en Søn, som hun gav Navnet Er;
౩ఆమె గర్భవతి అయ్యి ఒక కొడుకును కన్నప్పుడు వాడికి ఏరు అని పేరు పెట్టారు.
4 siden blev hun frugtsommelig igen og fødte en Søn, som hun gav Navnet Onan;
౪ఆమె మళ్ళీ గర్భం ధరించి మరొక కొడుకును కని వాడికి ఓనాను అని పేరు పెట్టింది.
5 og hun fødte endnu en Søn, som hun gav Navnet Sjela; da hun fødte ham, var hun i, Kezib.
౫ఆమె మళ్ళీ గర్భం ధరించి మూడవ కొడుకును కని వాడికి షేలా అని పేరు పెట్టింది. వారు కజీబులో ఉన్నప్పుడు ఆమె వాణ్ణి కన్నది.
6 Juda tog Er, sin førstefødte, en Hustru, der hed Tamar.
౬యూదా తన పెద్ద కొడుకు ఏరుకి తామారు అనే యువతిని పెళ్ళి చేశాడు.
7 Men Er, Judas førstefødte, vakte HERRENS Mishag, derfor lod HERREN ham dø.
౭యూదా జ్యేష్ఠ కుమారుడు ఏరు యెహోవా దృష్టికి దుష్టుడు కాబట్టి యెహోవా అతణ్ణి చంపాడు.
8 Da sagde Juda til Onan: »Gaa ind til din Svigerinde og indgaa Svogerægteskab med hende for at skaffe din Broder Afkom!«
౮అప్పుడు యూదా ఓనానుతో “నీ అన్నభార్య దగ్గరికి వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకి సంతానం కలిగించు” అని చెప్పాడు.
9 Men Onan, som vidste, at Afkommet ikke vilde blive hans, lod, hver Gang han gik ind til sin Svigerinde, sin Sæd spildes paa Jorden for ikke at skaffe sin Broder Afkom.
౯ఓనాను ఆ సంతానం తనది కాబోదని తెలిసి ఆమెతో పండుకున్నప్పుడు తన అన్నకి సంతానం కలగకూడదని తన వీర్యాన్ని నేలపై విడిచాడు.
10 Denne hans Adfærd vakte HERRENS Mishag, derfor lod han ogsaa ham dø.
౧౦అతడు చేసింది యెహోవా దృష్టికి చెడ్డది కాబట్టి ఆయన అతణ్ణి కూడా చంపాడు.
11 Da sagde Juda til sin Sønnekone Tamar: »Bliv som Enke i din Faders Hus, til min Søn Sjela bliver voksen!« Thi han var bange for, at han ogsaa skulde dø ligesom sine Brødre. Saa gik Tamar hen og blev i sin Faders Hus.
౧౧అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నల్లాగా చనిపోతాడేమో అని భయపడి “నా కుమారుడు షేలా పెద్దవాడయ్యే వరకూ నీ తండ్రి ఇంట్లో విధవరాలుగా ఉండు” అని తామారుతో చెప్పాడు. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట్లో నివసించింది.
12 Lang Tid efter døde Judas Hustru, Sjuas Datter; og da Juda var hørt op at sørge over hende, rejste han med sin Ven, Hira fra Adullam, op til dem, der klippede hans Faar i Timna.
౧౨చాలా రోజుల తరువాత యూదా భార్య అయిన షూయ కూతురు చనిపోయింది. తరువాత యూదా దుఃఖనివారణ పొంది, అదుల్లామీయుడైన హీరా అనే తన స్నేహితుడితో కలిసి తిమ్నాతులో తన గొర్రెల బొచ్చు కత్తిరించే వారి దగ్గరికి వెళ్ళాడు.
13 Og da Tamar fik at vide, at hendes Svigerfader var paa Vej op til Faareklipningen i Timna,
౧౩తన మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి తిమ్నాతుకు వెళ్తున్నాడని తామారుకు తెలిసింది.
14 aflagde hun sine Enkeklæder, hyllede sig i et Slør, saa det skjulte hende, og satte sig ved Indgangen til Enajim ved Vejen til Timna; thi hun saa, at hun ikke blev givet Sjela til Ægte, skønt han nu var voksen.
౧౪షేలా పెద్దవాడైనప్పటికీ తనను అతనికి భార్యగా తీసుకోకుండా ఉండడం చూసి తామారు తన విధవరాలి బట్టలు తీసివేసి, ముసుగు వేసుకుని, శరీరమంతా కప్పుకుని, తిమ్నాతుకు వెళ్ళే మార్గంలో ఏనాయిము అనే ద్వారం దగ్గర కూర్చుంది.
15 Da nu Juda saa hende, troede han, det var en Skøge; hun havde jo tilhyllet sit Ansigt;
౧౫యూదా ఆమెను చూసి, ఆమె ముఖం కప్పుకుని ఉండడం వలన ఆమె వేశ్య అనుకుని,
16 og han bøjede af fra Vejen og kom hen til hende og sagde: »Lad mig gaa ind til dig!« Thi han vidste ikke, at det var hans Sønnekone. Men hun sagde: »Hvad giver du mig derfor!«
౧౬ఆమె దగ్గరికి వెళ్ళి, ఆమె తన కోడలని తెలియక “నీతో సుఖిస్తాను, రా” అని పిలిచాడు. అందుకు ఆమె “నువ్వు నాతో సుఖించినందుకు నాకేమిస్తావు?” అని అడిగింది.
17 Han svarede: »Jeg vil sende dig et Gedekid fra Hjorden!« Da sagde hun: »Ja, men du skal give mig et Pant, indtil du sender det!«
౧౭అందుకు అతడు “నా మందలో నుండి ఒక మేక పిల్లను పంపుతాను” అన్నాడు. ఆమె “అది పంపే వరకూ ఏమైనా తాకట్టు పెడితే సరే” అని అంది.
18 Han spurgte: »Hvad skal jeg give dig i Pant?« Hun svarede: »Din Seglring, din Snor og din Stav, som du har i Haanden!« Saa gav han hende de tre Ting og gik ind til hende, og hun blev frugtsommelig ved ham.
౧౮అతడు “ఏమి తాకట్టు పెట్టమంటావ్?” అని ఆమెను అడిగాడు. ఆమె “నీ ముద్ర, దాని దారం, నీ చేతికర్ర” అని చెప్పింది. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో వెళ్ళాడు. ఆమె అతని వలన గర్భవతి అయ్యింది.
19 Derpaa gik hun bort, tog Sløret af og iførte sig sine Enkeklæder.
౧౯అప్పుడామె లేచి వెళ్లిపోయి ముసుగు తీసేసి తన విధవరాలి వస్త్రాలు ధరించింది.
20 Imidlertid sendte Juda sin Ven fra Adullam med Gedekiddet for at faa Pantet tilbage fra Kvinden; men han fandt hende ikke.
౨౦తరవాత యూదా ఆ స్త్రీ దగ్గర నుండి ఆ తాకట్టు వస్తువులను తీసుకోడానికి తన స్నేహితుడయిన అదుల్లామీయుడి ద్వారా మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు.
21 Han spurgte da Folkene paa Stedet: »Hvor er den Skøge, som sad paa Vejen ved Enajim?« Og de svarede: »Her har ikke været nogen Skøge!«
౨౧కాబట్టి అతడు “ఆ మార్గంలో ఏనాయిము దగ్గర కనిపించిన ఆ వేశ్య ఎక్కడ ఉంది?” అని అక్కడి మనుషులను అడిగాడు. అయితే వారు “ఇక్కడ వేశ్య ఎవరూ లేదు” అని అతనికి చెప్పారు.
22 Saa vendte han tilbage til Juda og sagde: »Jeg fandt hende ikke, og Folkene paa Stedet siger, at der har ikke været nogen Skøge.«
౨౨కాబట్టి అతడు యూదా దగ్గరికి తిరిగి వెళ్ళి “ఆమె నాకు కనబడలేదు. అంతేగాక, అక్కడి మనుషులు ఇక్కడికి వేశ్య ఎవరూ రాలేదని చెప్పారు” అన్నాడు.
23 Da sagde Juda: »Saa lad hende beholde det, hellere end at vi skal blive til Spot; jeg har nu sendt det Kid, men du fandt hende ikke.«
౨౩యూదా “మనలను అపహాస్యం చేస్తారేమో, ఆమె వాటిని ఉంచుకోనీ. నేను నీతో ఈ మేక పిల్లను పంపాను, ఆమె నీకు కనబడలేదు” అని అతనితో అన్నాడు.
24 En tre Maaneders Tid efter meldte man Juda: »Din Sønnekone Tamar har øvet Utugt og er blevet frugtsommelig!« Da sagde Juda: »Før hende ud, for at hun kan blive brændt!«
౨౪సుమారు మూడు నెలలైన తరువాత “నీ కోడలు తామారు జారత్వం జరిగించింది. అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయ్యింది” అని యూదాకు కబురొచ్చింది. అప్పుడు యూదా “ఆమెను తీసుకు రండి, ఆమెను సజీవ దహనం చెయ్యాలి” అని చెప్పాడు.
25 Men da hun førtes ud, sendte hun Bud til sin Svigerfader og lod sige: »Jeg er blevet frugtsommelig ved den Mand, som ejer disse Ting.« Og hun lod sige: »Se dog efter, hvem der ejer denne Ring, denne Snor og denne Stav!«
౨౫ఆమెను బయటికి తీసుకు వచ్చినప్పుడు, ఆమె తన మామ దగ్గరికి అతని వస్తువులను పంపి “ఇవి ఎవరివో ఆ మనిషి వలన నేను గర్భవతినయ్యాను. ఈ ముద్ర, ఈ దారం, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తు పట్టండి” అని చెప్పించింది.
26 Da Juda havde set efter, sagde han: »Retten er paa hendes Side og ikke paa min, fordi jeg ikke gav hende til min Søn Sjela!« Men siden havde han ikke Omgang med hende.
౨౬యూదా వాటిని గుర్తు పట్టి “నేను నా కుమారుడు షేలాను ఆమెకు ఇయ్యలేదు కాబట్టి ఆమె నాకంటే నీతి గలది” అని చెప్పి ఇంకెప్పుడూ ఆమెతో పండుకోలేదు.
27 Da Tiden kom, at hun skulde føde, se, da var der Tvillinger i hendes Liv.
౨౭నెలలు నిండినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు.
28 Under Fødselen stak der en Haand frem, og Jordemoderen tog og bandt en rød Snor om den, idet hun sagde: »Det var ham, der først kom frem.«
౨౮ఆమె ప్రసవిస్తున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాపాడు. మంత్రసాని ఒక ఎర్ర దారం వాడి చేతికి కట్టి “వీడు మొదట బయటికి వచ్చాడు” అని చెప్పింది.
29 Men han trak Haanden tilbage, og Broderen kom frem; saa sagde hun: »Hvorfor bryder du frem? For din Skyld er der sket et Brud.« Derfor gav man ham Navnet Perez.
౨౯వాడు తన చెయ్యి వెనక్కి తీయగానే అతని సోదరుడు బయటికి వచ్చాడు. అప్పుడామె “నువ్వెందుకురా చొచ్చుకు వచ్చావు?” అంది. అందుచేత వాడికి “పెరెసు” అని పేరు పెట్టారు.
30 Derefter kom Broderen med den røde snor om Haanden frem, og ham kaldte man Zera.
౩౦ఆ తరువాత చేతికి దారం కట్టి ఉన్న అతని సోదరుడు బయటికి వచ్చాడు. అతనికి “జెరహు” అని పేరు పెట్టారు.