< 1 Mosebog 21 >

1 HERREN saa til Sara, som han havde lovet, og HERREN gjorde ved Sara, som han havde sagt,
యెహోవా తాను చెప్పినట్టే శారా పై కనికరం చూపించాడు. తాను చేసిన వాగ్దానాన్ని శారా పట్ల దేవుడైన యెహోవా నెరవేర్చాడు.
2 og hun undfangede og fødte Abraham en Søn i hans Alderdom, til den Tid Gud havde sagt ham.
అబ్రాహాము వృద్ధాప్యంలో శారా గర్భం ధరించి అతనికి ఒక కొడుకును కన్నది. అబ్రాహాముతో దేవుడైన యెహోవా చెప్పిన సమయంలోనే ఇది జరిగింది.
3 Abraham kaldte den Søn, han fik med Sara, Isak;
అబ్రాహాము తన భార్య శారా ద్వారా తనకు పుట్టిన తన కొడుక్కి ఇస్సాకు అనే పేరు పెట్టాడు.
4 og Abraham omskar sin Søn Isak, da han var otte Dage gammel, saaledes som Gud havde paalagt ham.
దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తన కొడుకు ఇస్సాకుకు ఎనిమిదవ రోజున సున్నతి చేశాడు.
5 Abraham var 100 Aar gammel, da hans Søn Isak fødtes ham.
ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాము వయస్సు నూరేళ్ళు.
6 Da sagde Sara: »Gud ham beredt mig Latter; enhver, der hører det, vil le ad mig.«
అప్పుడు శారా “దేవుడు నాకు నవ్వు పుట్టించాడు. నా సంగతి తెలిసినవారంతా నాతో కలసి సంతోషిస్తారు” అన్నది.
7 Og hun sagde: »Hvem skulde have sagt Abraham, at Sara ammer Børn! Sandelig, jeg har født ham en Søn i hans Alderdom!«
ఆమె ఇంకా “శారా తన పిల్లలకు పాలు ఇస్తుందని అబ్రాహాముతో ఎవరు చెప్పగలిగే వారు? అయినా ముసలివాడయ్యాక నేను అతనికి ఒక కొడుకుని కని ఇచ్చాను గదా” అన్నది.
8 Drengen voksede til og blev vænnet fra, og Abraham gjorde et stort Gæstebud, den Dag Isak blev vænnet fra.
ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిపెట్టాడు. ఇస్సాకు పాలు మానిన రోజున అబ్రాహాము గొప్ప విందు చేశాడు.
9 Men da Sara saa Ægypterinden Hagars Søn, som hun havde født Abraham, lege med hendes Søn Isak,
అప్పుడు అబ్రాహాముకు ఐగుప్తు జాతిదైన హాగరు ద్వారా పుట్టిన కొడుకు ఇస్సాకును ఎగతాళి చేయడం శారా చూసింది.
10 sagde hun til Abraham: »Jag den Trælkvinde og hendes Søn bort, thi ikke skal denne Trælkvindes Søn arve sammen med min Søn, med Isak!«
౧౦ఆమె అబ్రాహాముతో ఇలా అంది. “ఈ దాసీనీ ఈమె కొడుకునీ వెళ్ళగొట్టు. ఎందుకంటే ఈ దాసీ కొడుకు నా కొడుకు ఇస్సాకుతో కలసి వారసుడిగా ఉండటానికి వీలులేదు.”
11 Derover blev Abraham saare ilde til Mode for sin Søns Skyld;
౧౧ఈ మాట విన్న అబ్రాహాము తన కొడుకు ఇష్మాయేలుని బట్టి చాలా వేదన చెందాడు.
12 men Gud sagde til Abraham: »Vær ikke ilde til Mode over Drengen og din Trælkvinde, men adlyd Sara i alt, hvad hun siger dig, thi efter Isak skal dit Afkom nævnes;
౧౨అయితే దేవుడు “ఈ అబ్బాయి కోసం, నీ దాసీ కోసం నువ్వు బాధ పడవద్దు. ఈ విషయంలో శారా నీకు చెప్పినట్టు చెయ్యి. ఎందుకంటే ఇస్సాకు వలన కలిగే సంతానమే నీకు వారసులౌతారు.
13 men ogsaa Trælkvindens Søn vil jeg gøre til et stort Folk; han er jo dit Afkom!«
౧౩అయినప్పటికీ ఈ దాసీ కొడుకు కూడా నీ సంతానం గనక నేను అతణ్ణి కూడా ఒక జాతిగా చేస్తాను” అని అబ్రాహాముతో చెప్పాడు.
14 Tidligt næste Morgen tog da Abraham Brød og en Sæk Vand og gav Hagar det, og Drengen satte han paa hendes Skulder, hvorpaa han sendte hende bort. Som hun nu vandrede af Sted, for hun vild i Be'ersjebas Ørken,
౧౪కనుక అబ్రాహాము తెల్లవారకముందే లేచి రొట్టె, నీళ్ళు పోసిన తోలు తిత్తి సిద్ధం చేసి వాటిని హాగరు భుజంపై పెట్టాడు. ఆ బాలుణ్ణి ఆమెకు అప్పగించి పంపివేశాడు. ఆమె వెళ్ళి బెయేర్షెబా అడవికి చేరి అక్కడ తిరుగుతూ ఉంది.
15 og Vandet slap op i hendes Sæk; da lagde hun Drengen hen under en af Buskene
౧౫ఆ తోలు తిత్తిలోని నీళ్ళు అయిపోయాక ఆమె బాలుణ్ణి ఒక పొద కింద విడిచిపెట్టింది.
16 og gik hen og satte sig i omtrent et Pileskuds Afstand derfra, idet hun sagde ved sig selv: »Jeg kan ikke udholde at se Drengen dø!« Og saaledes sad hun, medens Drengen græd højt.
౧౬“ఈ పిల్లవాడి చావు చూడటం నా వల్ల కాదు” అనుకుని కొంత దూరం వెళ్లి వాడికి ఎదురుగా కూర్చుంది. అక్కడ ఎలుగెత్తి బిగ్గరగా ఏడ్చింది.
17 Da hørte Gud Drengens Graad, og Guds Engel raabte til Hagar fra Himmelen og sagde til hende: »Hvad fattes dig, Hagar? Frygt ikke, thi Gud har hørt Drengens Røst der, hvor han ligger;
౧౭దేవుడు ఆ బాలుడి మొర విన్నాడు. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచాడు. “హాగరూ, నీకు వచ్చిన కష్టం ఏమిటి? భయపడవద్దు. ఆ బాలుడు ఉన్నచోటనే దేవుడు అతని మొర విన్నాడు.
18 rejs dig, hjælp Drengen op og tag ham ved Haanden, thi jeg vil gøre ham til et stort Folk!«
౧౮నువ్వు లేచి ఆ బాలుణ్ణి పైకి లేపు. అతనికి ధైర్యం చెప్పు. ఎందుకంటే నేను అతణ్ణి ఒక గొప్ప జాతిగా వృద్ది చేయబోతున్నాను” అని ఆమెకు చెప్పాడు.
19 Da aabnede Gud hendes Øjne, saa hun fik Øje paa en Brønd med Vand; og hun gik hen og fyldte Sækken med Vand og gav Drengen at drikke.
౧౯అప్పుడు దేవుడు ఆమె కళ్ళు తెరుచుకోనేలా చేశాడు. ఆమె ఎదురుగా ఉన్న ఒక నీళ్ళ ఊటను చూసింది. ఆమె వెళ్ళి తోలు తిత్తిని నీళ్ళతో నింపి ఆ బాలుడికి తాగించింది.
20 Og Gud var med Drengen, og han voksede til; og han bosatte sig i Ørkenen og blev Bueskytte.
౨౦దేవుడు ఆ అబ్బాయికి తోడుగా ఉన్నాడు. అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ అడవిలోనే నివసించి విలువిద్యలో ప్రవీణుడయ్యాడు.
21 Han boede i Parans Ørken, og hans Moder tog ham en Hustru fra Ægypten.
౨౧అతడు పారాను అటవీ ప్రాంతంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక అమ్మాయిని తెచ్చి అతనికి పెళ్ళి చేసింది.
22 Ved den Tid sagde Abimelek og hans Hærfører Pikol til Abraham: »Gud er med dig i alt, hvad du tager dig for;
౨౨ఆ రోజుల్లో అబీమెలెకూ, అతని సైన్యాధిపతి ఫీకోలూ కలసి వచ్చి అబ్రాహాముతో మాట్లాడారు. “నువ్వు చేసే పనులన్నిటిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు.
23 tilsværg mig derfor her ved Gud, at du aldrig vil være troløs mod mig eller mine Efterkommere, men at du vil handle lige saa venligt mod mig og det Land, du gæster, som jeg har handlet mod dig!«
౨౩నువ్వు నన్ను, నా కొడుకుని, నా మనుమళ్ళను మోసం చేయనని దేవుని పేరిట నాకు వాగ్దానం చెయ్యి. నేను నీకు చూపిన అదే నిబంధన విశ్వసనీయతను నా పట్లా, నువ్వు పరదేశిగా ఉన్న ఈ దేశం పట్లా చూపించు” అన్నాడు.
24 Da svarede Abraham: »Jeg vil sværge!«
౨౪అందుకు అబ్రాహాము “నేను వాగ్దానం చేస్తాను” అన్నాడు.
25 Men Abraham krævede Abimelek til Regnskab for en Brønd, som Abimeleks Folk havde tilranet sig.
౨౫అబీమెలెకు దాసులు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్న అబ్రాహాముకు చెందిన నీటి బావిని గూర్చి అబ్రాహాము తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. దానికి అబీమెలెకు “ఈ పని ఎవరు చేశారో నాకు తెలియదు.
26 Da svarede Abimelek: »Jeg ved intet om, hvem der har gjort det; hverken har du underrettet mig derom, ej heller har jeg hørt det før i Dag!«
౨౬నువ్వు కూడా దీని విషయం నాకేమీ చెప్పలేదు. నాకీ సంగతి ఈ రోజే తెలిసింది” అన్నాడు.
27 Da tog Abraham Smaakvæg og Hornkvæg og gav Abimelek det, og derpaa sluttede de Pagt med hinanden.
౨౭అబ్రాహాము గొర్రెలనూ ఎడ్లనూ తెప్పించి అబీమెలెకుకు ఇచ్చాడు. వాళ్ళిద్దరూ ఈ విధంగా ఒక నిబంధన చేసుకున్నారు.
28 Men Abraham satte syv Lam til Side,
౨౮తరువాత అబ్రాహాము తన గొర్రెల మందలో నుంచి ఏడు ఆడ గొర్రెలను తీసి వేరుగా ఉంచాడు.
29 og da Abimelek spurgte ham: »Hvad betyder de syv Lam, du der har sat til Side?«
౨౯అది చూసి అబీమెలెకు అబ్రాహాముతో “నువ్వు ఏడు ఆడ గొర్రెలను వేరుగా తీసి ఉంచావు. దాని అంతరార్ధం ఏమిటి?” అని అడిగాడు.
30 svarede han: »Jo, de syv Lam skal du modtage af min Haand til Vidnesbyrd om, at jeg har gravet denne Brønd.«
౩౦దానికి అబ్రాహాము “ఈ బావిని నేనే తవ్వించాననడానికి సాక్ష్యంగా ఈ ఏడు ఆడ గొర్రెలను నువ్వు తీసుకోవాలి” అన్నాడు.
31 Derfor kaldte man dette Sted Be'ersjeba, thi der svor de hinanden Eder;
౩౧అలా వాళ్ళిద్దరూ అక్కడ ఒక నిబంధన చేసుకున్నారు కాబట్టి ఆ స్థలానికి “బెయేర్షెబా” అనే పేరు వచ్చింది.
32 og de sluttede Pagt ved Be'ersjeba. Saa brød Abimelek og hans Hærfører Pikol op og vendte tilbage til Filisternes Land.
౩౨బెయేర్షెబాలో వాళ్ళు అలా ఒక నిబంధన చేసుకున్న తరువాత అబీమెలెకు లేచి తన సైన్యాధిపతి ఫీకోలుతో కలసి ఫిలిష్తీయుల దేశానికి తిరిగి వెళ్ళాడు.
33 Men Abraham plantede en Tamarisk i Be'ersjeba og paakaldte der HERREN den evige Guds Navn.
౩౩అబ్రాహాము బెయేర్షెబాలో ఒక తమరిస్క చెట్టు నాటాడు. అక్కడ శాశ్వత దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాడు.
34 Og Abraham boede en Tid lang; som fremmed i Filisternes Land.
౩౪అబ్రాహాము ఫిలిష్తీయుల దేశంలో చాలా రోజులు పరదేశిగా ఉన్నాడు.

< 1 Mosebog 21 >