< Kolossensern 1 >
1 Paulus, Kristi Jesu Apostel ved Guds Villie, og Broderen Timotheus
౧దేవుని సంకల్పం ప్రకారం యేసు క్రీస్తుకు అపొస్తలుడైన పౌలూ మన సోదరుడు తిమోతీ కొలస్సై పట్టణంలో ఉన్న దేవుని పరిశుద్ధులకూ,
2 til de hellige og troende Brødre i Kristus i Kolossæ: Naade være med eder og Fred fra Gud vor Fader!
౨క్రీస్తులో విశ్వాసముంచిన సోదరులకూ శుభాకాంక్షలతో రాస్తున్న సంగతులు. మన తండ్రి అయిన దేవుని నుండి కృపా శాంతీ మీకు కలుగు గాక!
3 Vi takke Gud og vor Herres Jesu Kristi Fader altid, naar vi bede for eder,
౩పరలోకంలో మీకోసం భద్రంగా ఉంచిన నిశ్చయమైన నిరీక్షణనుబట్టి మీరు క్రీస్తు యేసుపై నిలిపిన విశ్వాసాన్ని గూర్చీ, పరిశుద్ధులందరి పట్ల మీరు చూపుతున్న ప్రేమను గూర్చీ, మేము విని మీ గురించి ప్రార్థన చేసే ప్రతిసారీ మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సత్యవాక్కు అయిన సువార్త మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ నిరీక్షణను గూర్చి మొదటిసారి మీరు విన్నారు.
4 da vi have hørt om eders Tro paa Kristus Jesus og den Kærlighed, som I have til alle de hellige
౪
5 paa Grund af det Haab, som er henlagt til eder i Himlene, om hvilket I forud have hørt i Evangeliets Sandheds Ord,
౫
6 der er kommet til eder, ligesom det ogsaa er i den hele Verden, idet det bærer Frugt og vokser, ligesom det ogsaa gør iblandt eder fra den Dag, I hørte og erkendte Guds Naade i Sandhed,
౬ఈ సువార్త మీరు విని దేవుని కృపను నిజంగా తెలుసుకున్నప్పటి నుంచీ అది మీలో ఫలించి అభివృద్ధి చెందినట్టే ప్రపంచమంతటా ఈ సువార్త ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ ఉంది.
7 saaledes som I have lært af Epafras, vor elskede Medtjener, som er en tro Kristi Tjener for eder,
౭ఇది ప్రియమైన మా తోటి దాసుడూ, యేసుక్రీస్తుకు నమ్మకమైన సేవకుడూ అయిన ఎపఫ్రా నుండి ఆ విషయాలు నేర్చుకున్న ప్రకారమే.
8 han, som ogsaa gav os eders Kærlighed i Aanden til Kende.
౮ఆత్మలో మీ ప్రేమను గూర్చి అతడు మాకు తెలియజేశాడు.
9 Derfor have ogsaa vi fra den Dag, vi hørte det, ikke ophørt at bede for eder og begære, at I maatte fyldes med Erkendelsen af hans Villie i al Visdom og aandelig Indsigt
౯ఈ ప్రేమ మూలంగా మీ గురించి మేం విన్న రోజు నుండీ మేము మీకోసం ప్రార్థన చేయడం మానలేదు. మీరు సంపూర్ణ జ్ఞానం, ఆధ్యాత్మిక వివేకం కలిగి ఆయన సంకల్పాన్ని పూర్తిగా గ్రహించాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాం.
10 til at vandre Herren værdigt, til alt Velbehag, idet I bære Frugt og vokse i al god Gerning ved Erkendelsen af Gud,
౧౦ప్రతి మంచి కార్యం విషయంలోనూ మీరు ఫలిస్తూ, దేవునికి సంబంధించిన జ్ఞానంలో పెరుగుతూ, అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టేలా, ఆయనకు తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము ప్రార్ధిస్తున్నాం.
11 idet I styrkes med al Styrke efter hans Herligheds Kraft til al Udholdenhed og Taalmodighed med Glæde
౧౧మహిమ ప్రభావాలతో కూడిన ఆయన శక్తి మిమ్మల్ని ప్రతివిధమైన సామర్థ్యం ఇచ్చి బలపరచాలని దేవుణ్ణి వేడుకుంటున్నాం. అదే మీకు సహనాన్నీ, పట్టుదలతో కొనసాగే శక్తినీ కలిగిస్తుంది.
12 og takke Faderen, som gjorde os dygtige til at have Del i de helliges Arvelod i Lyset,
౧౨వెలుగు నివాసులుగా తనకోసం ప్రత్యేకించబడిన వారి వారసత్వంలో భాగం పంచుకోడానికి మనలను అర్హులుగా చేసిన తండ్రికి మీరు సంతోషంతో కృతజ్ఞతలు చెల్లించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం.
13 han, som friede os ud af Mørkets Magt og satte os over i sin elskede Søns Rige,
౧౩ఆయన మనలను చీకటి రాజ్యపు ఆధిపత్యం నుండి విడుదల చేసి తన ప్రియ కుమారుడి రాజ్యంలోకి తరలించాడు.
14 i hvem vi have Forløsningen, Syndernes Forladelse,
౧౪ఆ కుమారుడిలోనే మనకు పాప క్షమాపణా విమోచనా ఉన్నాయి.
15 han, som er den usynlige Guds Billede, al Skabnings førstefødte;
౧౫కుమారుడు అదృశ్య దేవుని స్వరూపం. సర్వసృష్టికీ ఆయన ప్రముఖుడు.
16 thi i ham bleve alle Ting skabte i Himlene og paa Jorden, de synlige og de usynlige, være sig Troner eller Herredømmer eller Magter eller Myndigheder. Alle Ting ere skabte ved ham og til ham;
౧౬ఎందుకంటే కంటికి కనిపించేదైనా కనిపించనిదైనా ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న అన్నిటి సృష్టీ ఆయన ద్వారానే జరిగింది. సింహాసనాలైనా, ఆధిపత్యాలైనా, ప్రభుత్వాలైనా, అధికారులైనా, సర్వమూ ఆయన ద్వారా కలిగాయి, ఆయన కోసమే కలిగాయి.
17 og han er forud for alle Ting, og alle Ting bestaa ved ham.
౧౭ఆయన అన్నిటికీ పూర్వం ఉన్నవాడు. ఆయనలోనే అన్నీ ఒకదానితో మరొకటి కలిసి స్థిరంగా ఉంటాయి.
18 Og han er Legemets Hoved, nemlig Menighedens, han, som er Begyndelsen, førstefødt ud af de døde, for at han skulde blive den ypperste i alle Ting;
౧౮సంఘం అనే శరీరానికి ఆయనే తల. సర్వాధికారానికీ మూలకేంద్రం ఆయనే. అన్నిటిలో ఆయనకు ప్రథమ స్థానం కలిగేటందుకు చనిపోయిన వారిలో నుండి సజీవుడిగా లేవడంలో ఆయన ప్రథముడు.
19 thi det behagede Gud, at i ham skulde hele Fylden bo,
౧౯ఆయనలో దైవత్వం సర్వసంపూర్ణత నివసించాలనీ,
20 og ved ham at forlige alle Ting med sig, være sig dem paa Jorden eller dem i Himlene, idet han stiftede Fred ved hans Kors's Blod.
౨౦కుమారుడి ద్వారా సమస్తాన్నీ తనతో రాజీ చేసుకోవాలనీ దేవుడు ఇష్టపడ్డాడు. ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న వాటినన్నిటినీ తన కుమారుడు సిలువలో కార్చిన రక్తం ద్వారా రాజీ చేసుకోవడం ద్వారా ఆయన ఈ కార్యం చేశాడు.
21 Ogsaa eder, som fordum vare fremmedgjorte og fjendske af Sindelag i eders onde Gerninger,
౨౧ఒకప్పుడు మీరు కూడా దేవునికి పరాయివారుగా ఉన్నారు. మీ ఆలోచనల్లోనూ మీరు చేసిన దుష్క్రియల వలనా దేవునికి శత్రువులుగా ఉన్నారు.
22 har han dog nu forligt i sit Køds Legeme ved Døden for at fremstille eder hellige og ulastelige og ustraffelige for sit Aasyn,
౨౨అయితే రక్త మాంసాలున్న క్రీస్తు శరీరంలో మరణం వల్ల ఆయన మిమ్మల్ని తనతో రాజీ చేసుకున్నాడు. తన ఎదుట మిమ్మల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా నిలబెట్టుకోడానికి ఆయన ఇలా చేశాడు.
23 saa sandt I blive i Troen, grundfæstede og faste, uden at lade eder rokke fra Haabet i det Evangelium, som I have hørt, hvilket er blevet prædiket i al Skabningen under Himmelen, og hvis Tjener jeg Paulus er bleven.
౨౩ఇది జరగాలంటే మీరు దృఢంగా విశ్వాసంలో సుస్థిరంగా నిలిచి ఉండి, ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికీ, మీకూ ప్రకటించిన సువార్త వల్ల కలిగిన నిబ్బరం నుండి తొలగిపోకుండా ఉండాలి. ఈ సువార్తకు పౌలు అనే నేను సేవకుణ్ణి అయ్యాను.
24 Nu glæder jeg mig over mine Lidelser for eder, og hvad der fattes i Kristi Trængsler, udfylder jeg i mit Kød for hans Legeme, som er Menigheden,
౨౪ఇప్పుడు మీ కోసం నేను పడుతున్న హింసల్లో సంతోషిస్తున్నాను. సంఘం అనే తన శరీరం కోసం క్రీస్తు పడిన యాతనల్లో కొదువగా ఉన్న వాటిని నా వంతుగా నా శరీరంలో సంపూర్ణం చేస్తున్నాను.
25 hvis Tjener jeg er bleven efter den Guds Husholdning, som blev given mig over for eder, nemlig fuldelig at forkynde Guds Ord,
౨౫రహస్య సత్యంగా ఉన్న దేవుని వాక్కును సంపూర్ణంగా తెలియజేయడానికి దేవుడు నాకు అప్పగించిన బాధ్యత ప్రకారం నేను సంఘానికి సేవకుణ్ణి అయ్యాను.
26 den Hemmelighed, der var skjult igennem alle Tider og Slægter, men nu er bleven aabenbaret for hans hellige, (aiōn )
౨౬ఈ రహస్యం యుగయుగాలుగా తరతరాలుగా మర్మంగా ఉంది కానీ ఇప్పుడు దేవుడు తన పవిత్రులకు దాన్ని తెలియజేశాడు. (aiōn )
27 hvem Gud vilde tilkendegive, hvilken Rigdom paa Herlighed iblandt Hedningerne der ligger i denne Hemmelighed, som er Kristus i eder, Herlighedens Haab,
౨౭అన్యజనుల్లో ఈ మర్మం అనే దివ్య సంపదను తెలియజేయాలని దేవుడు తలంచాడు. ఈ మర్మం మీలో ఉన్న యేసు క్రీస్తే. ఆయనే మహిమను గూర్చిన ఆశాభావం.
28 hvem vi forkynde, idet vi paaminde hvert Menneske og lære hvert Menneske med al Visdom, for at vi kunne fremstille hvert Menneske som fuldkomment i Kristus;
౨౮మేము ప్రకటిస్తున్నది ఈయననే. ప్రతి వ్యక్తినీ క్రీస్తులో పరిపూర్ణుడిగా చేసి దేవుని ముందు నిలబెట్టాలి. ఈ ఉద్దేశంతోనే మేము సమస్త జ్ఞానంతో ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నాం బోధిస్తున్నాం.
29 hvorpaa jeg ogsaa arbejder, idet jeg kæmper ifølge hans Kraft, som virker mægtigt i mig.
౨౯దీని కోసం నేను శ్రమిస్తూ ఉన్నాను. నాలో బలంగా పని చేస్తున్న ఆయన మహత్తర శక్తిని నేను వినియోగించుకుంటూ ప్రయాసపడుతున్నాను.