< Apostelenes gerninger 16 >

1 Og han kom til Derbe og Lystra, og se, der var der en Discipel ved Navn Timotheus, Søn af en troende Jødinde og en græsk Fader.
పౌలు, దెర్బే లుస్త్ర పట్టణాలకు వచ్చాడు. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడున్నాడు. అతని తల్లి విశ్వాసి అయిన ఒక యూదు వనిత. తండ్రి గ్రీసు దేశస్థుడు.
2 Han havde godt Vidnesbyrd af Brødrene i Lystra og Ikonium.
తిమోతికి లుస్త్ర, ఈకొనియలో ఉన్న సోదరుల మధ్య మంచి పేరు ఉంది.
3 Ham vilde Paulus have til at drage med sig, og han tog og omskar ham for Jødernes Skyld, som vare paa disse Steder; thi de vidste alle, at hans Fader var en Græker.
అతడు తనతో కూడ రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులందరికీ తెలుసు గనక వారిని బట్టి అతనికి సున్నతి చేయించాడు.
4 Men alt som de droge igennem Byerne, overgave de dem de Bestemmelser at holde, som vare vedtagne af Apostlene og de Ældste i Jerusalem.
వారు ఆ పట్టణాల ద్వారా వెళ్తూ, యెరూషలేములో ఉన్న అపొస్తలులూ పెద్దలూ నిర్ణయించిన విధులను పాటించేలా వాటిని వారికి అందజేశారు.
5 Saa styrkedes Menighederne i Troen og voksede i Antal hver Dag.
కాబట్టి సంఘాలు విశ్వాసంలో బలపడి, ప్రతిరోజూ సంఖ్యలో పెరిగాయి.
6 Men de droge igennem Frygien og det galatiske Land, da de af den Helligaand vare blevne forhindrede i at tale Ordet i Asien.
ఆసియా ప్రాంతంలో వాక్కు చెప్పవద్దని పరిశుద్ధాత్మ వారిని వారించాడు, అప్పుడు వారు ఫ్రుగియ, గలతీయ ప్రదేశాల ద్వారా వెళ్ళారు. ముసియ దగ్గరికి వచ్చి బితూనియ వెళ్ళడానికి ప్రయత్నం చేశారు గానీ
7 Da de nu kom hen imod Mysien, forsøgte de at drage til Bithynien; og Jesu Aand tilstedte dem det ikke.
యేసు ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు.
8 De droge da Mysien forbi og kom ned til Troas.
అందుకని వారు ముసియ దాటిపోయి త్రోయకు వచ్చారు.
9 Og et Syn viste sig om Natten for Paulus: En makedonisk Mand stod der og bad ham og sagde: „Kom over til Makedonien og hjælp os!‟
అప్పుడు మాసిదోనియ వాసి ఒకడు కనిపించి, ‘నీవు మాసిదోనియ వచ్చి మాకు సహాయం చెయ్యి’ అని అతనిని పిలుస్తున్నట్టు రాత్రి సమయంలో పౌలుకు దర్శనం వచ్చింది.
10 Men da han havde set dette Syn, ønskede vi straks at drage over til Makedonien; thi vi sluttede, at Gud havde kaldt os derhen til at forkynde Evangeliet for dem.
౧౦అతనికి ఆ దర్శనం వచ్చినపుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియ బయలుదేరడానికి ప్రయత్నం చేశాము.
11 Vi sejlede da ud fra Troas og styrede lige til Samothrake og den næste Dag til Neapolis
౧౧మేము త్రోయ నుండి ఓడలో నేరుగా సమొత్రాకెకు, మరుసటి రోజు నెయపొలి, అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చాము.
12 og derfra til Filippi, hvilken er den første By i den Del af Makedonien, en Koloni. I denne By opholdt vi os nogle Dage.
౧౨మాసిదోనియ దేశంలో ఆ ప్రాంతానికి అది ముఖ్య పట్టణం, రోమీయుల వలస ప్రదేశం. మేము కొన్ని రోజులు ఆ పట్టణంలో ఉన్నాం.
13 Og paa Sabbatsdagen gik vi uden for Porten ved en Flod, hvor vi mente, at der var et Bedested, og vi satte os og talte til de Kvinder, som kom sammen.
౧౩విశ్రాంతి దినాన ఊరి బయటి ద్వారం దాటి నదీ తీరాన ప్రార్థనాస్థలం ఉంటుందని అనుకున్నాము. మేము అక్కడ కూర్చుని, అక్కడికి వచ్చిన స్త్రీలతో మాట్లాడాం.
14 Og en Kvinde ved Navn Lydia, en Purpurkræmmerske fra Byen Thyatira, en Kvinde, som frygtede Gud, hørte til, og hendes Hjerte oplod Herren til at give Agt paa det, som blev talt af Paulus.
౧౪లూదియ అనే దేవుని ఆరాధకురాలు ఒకామె మా మాటలు విన్నది. ఆమె ఊదారంగు బట్టలు అమ్మేది. ఆమెది తుయతైర పట్టణం. పౌలు చెప్పే మాటలను శ్రద్ధగా వినేలా ప్రభువు ఆమె హృదయం తెరచాడు.
15 Men da hun og hendes Hus var blevet døbt, bad hun og sagde: „Dersom I agte mig for at være Herren tro, da kommer ind i mit Hus og bliver der!‟ Og hun nødte os.
౧౫ఆమె, ఆమె ఇంటివారూ బాప్తిసం పొందారు. “నేను ప్రభువులో విశ్వాసం గలదాన్ని అని మీరు భావిస్తే, నా ఇంటికి వచ్చి ఉండాలి,” అని ఆమె మమ్మల్ని బలవంతం చేసింది.
16 Men det skete, da vi gik til Bedestedet, at en Pige mødte os, som havde en Spaadomsaand og skaffede sine Herrer megen Vinding ved at spaa.
౧౬మరొక రోజు మేము ప్రార్థనాస్థలానికి వెళ్తూ ఉంటే సోదె చెప్పే దయ్యం పట్టిన ఒక యువతి మాకు ఎదురైంది. ఆమె సోదె చెబుతూ తన యజమానులకు చాలా లాభం సంపాదించేది.
17 Hun fulgte efter Paulus og os, raabte og sagde: „Disse Mennesker ere den højeste Guds Tjenere, som forkynde eder Frelsens Vej.‟
౧౭ఆమె పౌలునూ మమ్మల్ని వెంబడిస్తూ, “వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు. వీరు మీకు రక్షణమార్గం ప్రకటిస్తున్నారు” అని కేకలు వేసి చెప్పింది.
18 Og dette gjorde hun i mange Dage. Men Paulus blev fortrydelig derover, og han vendte sig og sagde til Aanden: „Jeg byder dig i Jesu Kristi Navn at fare ud af hende.‟ Og den for ud i den samme Stund.
౧౮ఆమె ఇలాగే చాలా రోజులు చేస్తూ వచ్చింది. కాబట్టి పౌలు చాలా చికాకు పడి ఆమె వైపు తిరిగి, “నీవు ఈమెను వదలి బయటికి వెళ్ళిపోమని యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను” అని ఆ దయ్యంతో చెప్పాడు. వెంటనే అది ఆమెను వదలిపోయింది.
19 Men da hendes Herrer saa, at deres Haab om Vinding var forsvundet, grebe de Paulus og Silas og slæbte dem hen paa Torvet for Øvrigheden.
౧౯ఆమె యజమానులు ఆమె యజమానులు పోయిందని చూసి, పౌలునూ సీలనూ పట్టుకొని రచ్చబండకు అధికారుల దగ్గరికి ఈడ్చుకు పోయారు.
20 Og de førte dem til Høvedsmændene og sagde: „Disse Mennesker, som ere Jøder, forvirre aldeles vor By,
౨౦న్యాయాధిపతుల దగ్గరికి వారిని తీసుకు వచ్చి, “వీరు యూదులై ఉండి
21 og de forkynde Skikke, som det ikke er tilladt os, der ere Romere, at antage eller øve.‟
౨౧రోమీయులమైన మనం అంగీకరించని, పాటించని ఆచారాలు ప్రకటిస్తూ, మన పట్టణాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు” అని చెప్పారు.
22 Og Mængden rejste sig imod dem, og Høvedsmændene lode Klæderne rive af dem og befalede at piske dem.
౨౨అప్పుడు జనసమూహమంతా వారి మీదికి దొమ్మీగా వచ్చింది. న్యాయాధిపతులు వారి బట్టలు లాగేసి బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారు.
23 Og da de havde givet dem mange Slag, kastede de dem i Fængsel og befalede Fangevogteren at holde dem sikkert bevogtede.
౨౩వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో పడేసి, భద్రంగా ఉంచాలని చెరసాల అధికారికి ఆజ్ఞాపించారు.
24 Da han havde faaet saadan Befaling, kastede han dem i det inderste Fængsel og sluttede deres Fødder i Blokken.
౨౪అతడు ఆ ఆజ్ఞను పాటించి, వారిని లోపలి చెరసాలలోకి తోసి, కాళ్ళను రెండు కొయ్య దుంగల మధ్య బిగించాడు.
25 Men ved Midnat bade Paulus og Silas og sang Lovsange til Gud; og Fangerne lyttede paa dem.
౨౫మధ్యరాత్రి సమయంలో పౌలు, సీలలు ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటే యితర ఖైదీలు వింటున్నారు.
26 Men pludseligt kom der et stort Jordskælv, saa at Fængselets Grundvolde rystede, og straks aabnedes alle Dørene, og alles Lænker løstes.
౨౬అప్పుడు అకస్మాత్తుగా పెద్ద భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలి పోయాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి సంకెళ్ళు ఊడిపోయాయి.
27 Men Fangevogteren for op af Søvne, og da han saa Fængselets Døre aabne, drog han et Sværd og vilde dræbe sig selv, da han mente, at Fangerne vare flygtede.
౨౭అంతలో చెరసాల అధికారి నిద్ర లేచి, చెరసాల తలుపులన్నీ తెరచి ఉండడం చూసి, ఖైదీలు పారిపోయారనుకుని, కత్తి దూసి, ఆత్మహత్య చేసుకోబోయాడు.
28 Men Paulus raabte med høj Røst og sagde: „Gør ikke dig selv noget ondt; thi vi ere her alle.‟
౨౮అయితే పౌలు, “నీవు ఏ హానీ చేసుకోవద్దు, మేమంతా ఇక్కడే ఉన్నాం,” అన్నాడు.
29 Men han forlangte Lys og sprang ind og faldt skælvende ned for Paulus og Silas.
౨౯చెరసాల అధికారి దీపాలు తెమ్మని చెప్పి వేగంగా లోపలికి వచ్చి, వణుకుతూ పౌలు, సీలలకు సాష్టాంగ పడి,
30 Og han førte dem udenfor og sagde: „Herrer! hvad skal jeg gøre, for at jeg kan blive frelst?‟
౩౦వారిని బయటికి తెచ్చి, “అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి?” అని అడిగాడు.
31 Men de sagde: „Tro paa den Herre Jesus Kristus, saa skal du blive frelst, du og dit Hus.‟
౩౧అందుకు వారు, “ప్రభువైన యేసులో విశ్వాసముంచు, అప్పుడు నువ్వూ, నీ ఇంటివారూ రక్షణ పొందుతారు” అని చెప్పి
32 Og de talte Herrens Ord til ham og til alle dem, som vare i hans Hus.
౩౨అతనికీ అతని ఇంట్లో ఉన్న వారందరికీ దేవుని వాక్కు బోధించారు.
33 Og han tog dem til sig i den samme Stund om Natten og aftoede deres Saar; og han selv og alle hans bleve straks døbte.
౩౩రాత్రి ఆ సమయంలోనే చెరసాల అధికారి వారిని తీసుకు వచ్చి, వారి గాయాలు కడిగాడు. వెంటనే అతడూ అతని ఇంటి వారంతా బాప్తిసం పొందారు.
34 Og han førte dem op i sit Hus og satte et Bord for dem og frydede sig over, at han med hele sit Hus var kommen til Troen paa Gud.
౩౪అతడు పౌలు సీలలను తన ఇంటికి తీసికెళ్ళి భోజనం పెట్టి, తాను దేవునిలో విశ్వాసముంచినందుకు తన ఇంటి వారందరితో కూడ ఆనందించాడు.
35 Men da det var blevet Dag, sendte Høvedsmændene Bysvendene hen og sagde: „Løslad de Mænd!‟
౩౫తెల్లవారగానే, వారిని విడిచిపెట్టండని చెప్పడానికి న్యాయాధికారులు భటులను పంపారు.
36 Men Fangevogteren meldte Paulus disse Ord: „Høvedsmændene have sendt Bud, at I skulle løslades; saa drager nu ud og gaar bort med Fred!‟
౩౬చెరసాల అధికారి ఈ మాటలు పౌలుకు తెలియజేసి, “మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధికారులు కబురు పంపారు, కాబట్టి మీరిప్పుడు బయలుదేరి క్షేమంగా వెళ్ళండి” అని చెప్పాడు.
37 Men Paulus sagde til dem: „De have ladet os piske offentligt og uden Dom, os, som dog ere romerske Mænd, og kastet os i Fængsel, og nu jage de os hemmeligt bort! Nej, lad dem selv komme og føre os ud!‟
౩౭అయితే పౌలు వారితో “వారు న్యాయం విచారించకుండానే రోమీయులమైన మమ్మల్ని బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించి, ఇప్పుడు రహస్యంగా వెళ్ళగొడతారా? మేము ఒప్పుకోము. వారే వచ్చి మమ్మల్ని బయటికి తీసుకు రావాలి” అని చెప్పాడు.
38 Men Bysvendene meldte disse Ord til Høvedsmændene; og de bleve bange, da de hørte, at de vare Romere.
౩౮భటులు ఈ మాటలు న్యాయాధికారులకు తెలియజేశారు. పౌలు సీలలు రోమీయులని విని వారు భయపడ్డారు. ఆ న్యాయాధికారులు వచ్చి
39 Og de kom og gave dem gode Ord, og de førte dem ud og bade dem at drage bort fra Byen.
౩౯వారిని బతిమాలుకుని చెరసాల బయటికి తీసుకుపోయి, పట్టణం విడిచి వెళ్ళండని వారిని ప్రాధేయపడ్డారు.
40 Og de gik ud af Fængselet og gik ind til Lydia; og da de havde set Brødrene, formanede de dem og droge bort.
౪౦పౌలు, సీల చెరసాల నుండి బయటికి వచ్చి లూదియ ఇంటికి వెళ్ళారు. వారు సోదరులను చూసి, వారిని ప్రోత్సహించి ఆ పట్టణం నుండి బయలుదేరి వెళ్ళిపోయారు.

< Apostelenes gerninger 16 >