< Anden Krønikebog 7 >
1 Da Salomo havde endt sin Bøn, for Ild ned fra Himmelen og fortærede Brændofferet og Slagtofrene, og HERRENS Herlighed fyldte Templet,
౧సొలొమోను తన ప్రార్థన ముగించగానే ఆకాశం నుండి అగ్ని దిగి దహనబలులనూ ఇతర బలులనూ దహించివేసింది. యెహోవా తేజస్సు మందిరాన్ని పూర్తిగా నింపింది.
2 og Præsterne kunde ikke gaa ind i HERRENS Hus, fordi HERRENS Herlighed fyldte det.
౨యెహోవా తేజస్సుతో మందిరం నిండిపోవడం వలన యాజకులు అందులో ప్రవేశించలేక పోయారు.
3 Og da alle Israeliterne saa Ilden og HERRENS Herlighed fare ned over Templet, kastede de sig paa Knæ paa Stenbroen med Ansigtet mod Jorden og tilbad og lovede HERREN med Ordene »thi han er god, og hans Miskundhed varer evindelig!«
౩అగ్నీ యెహోవా తేజస్సూ మందిరం పైకి దిగటం చూసి ఇశ్రాయేలీయులంతా సాష్టాంగ నమస్కారం చేసి “యెహోవా దయ గలవాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది” అంటూ ఆయనను ఆరాధించి స్తుతించారు.
4 Kongen ofrede nu sammen med alt Folket Slagtofre for HERRENS Aasyn.
౪రాజూ, ప్రజలూ కలిసి యెహోవా ముందు బలులు అర్పించారు.
5 Til Slagtofferet tog Kong Salomo 22 000 Stykker Hornkvæg og 120 000 Stykker Smaakvæg. Saaledes indviede Kongen og alt Folket Guds Hus.
౫సొలొమోను రాజు 22,000 పశువులనూ 1, 20,000 గొర్రెలనూ బలులుగా అర్పించాడు. రాజు, ప్రజలు, అందరూ కలిసి దేవుని మందిరాన్ని ప్రతిష్టించారు.
6 Og Præsterne stod paa deres Pladser, og Leviterne stød med HERRENS Musikinstrumenter, som Kong David havde ladet lave, for at love HERREN med Davids Lovsangs Ord »thi hans Miskundhed varer evindelig!« og Præsterne stod lige over for dem og blæste i Trompeter, og hele Israel stod op:
౬యాజకులు తమ తమ సేవా స్థలాల్లో నిలిచారు. లేవీయులు “యెహోవా కృప నిత్యమూ నిలుస్తుంది” అంటూ దేవుణ్ణి స్తుతించడానికి దావీదు ఏర్పాటు చేసిన యెహోవా గీతాలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. యాజకులు వారికి ఎదురుగా నిలబడి బూరలు ఊదుతూ ఉంటే, ఇశ్రాయేలు ప్రజలంతా నిలబడి ఉన్నారు.
7 Og Salomo helligede den mellemste Del af Forgaarden foran HERRENS Hus, thi der maatte han ofre Brændofrene og Fedtstykkerne af Takofrene, da Kobberalteret, som Salomo havde ladet lave, ikke kunde rumme Brændofferet, Afgrødeofferet og Fedtstykkerne.
౭సొలొమోను తాను చేయించిన ఇత్తడి బలిపీఠం దహనబలులకూ నైవేద్యాలకూ కొవ్వుకూ సరిపోక పోవడం వలన యెహోవా మందిరం ముందు ఉన్న మధ్య ఆవరణాన్ని ప్రతిష్ఠించి, అక్కడ దహనబలులనూ శాంతి బలిపశువుల కొవ్వునూ అర్పించాడు.
8 Samtidig fejrede Salomo i syv Dage Højtiden sammen med hele Israel, en vældig Forsamling lige fra Egnen ved Hamat og til Ægyptens Bæk.
౮సొలొమోను, అతనితో కూడా హమాతు సరిహద్దు నుండి ఐగుప్తు నది వరకూ ఉన్న దేశం నుండి గొప్ప సమూహంగా వచ్చిన ఇశ్రాయేలీయులందరూ ఏడు రోజులు పండగ ఆచరించారు.
9 Ottendedagen holdt man festlig Samling, thi de fejrede Alterets Indvielse i syv Dage og Højtiden i syv.
౯ఎనిమిదో రోజు వారు పండగ ముగించారు. ఏడు రోజులూ బలిపీఠాన్ని ప్రతిష్టిస్తూ పండగ ఆచరించారు.
10 Og paa den tre og tyvende Dag i den syvende Maaned lod han Folket gaa hver til sit, glade og vel til Mode over den Godhed, HERREN havde vist sin Tjener David og Salomo og sit Folk Israel.
౧౦ఏడవ నెల ఇరవై మూడో రోజున సొలొమోను దావీదుకు, తనకు, తన ప్రజలు ఇశ్రాయేలీయులకు యెహోవా చేసిన మేలుల విషయంలో సంతోషిస్తూ, మనసులో ఆనందపడుతూ, ఎవరి గుడారాలకు వారిని వెళ్ళమని ప్రజలకి అనుమతినిచ్చి పంపేశాడు.
11 Salomo var nu færdig med at opføre HERRENS Hus og Kongens Palads; og alt, hvad Salomo havde sat sig for at udføre ved HERRENS Hus og sit Palads, havde han lykkeligt ført igennem.
౧౧ఆ విధంగా సొలొమోను యెహోవా మందిరాన్ని, రాజనగరాన్ని కట్టించి, యెహోవా మందిరంలో, తన నగరంలో చేయాలని తాను ఆలోచించిన దానంతటినీ ఏ లోపమూ లేకుండా నెరవేర్చి పని ముగించాడు.
12 Da lod HERREN sig til Syne for Salomo om Natten og sagde til ham: »Jeg har hørt din Bøn og udvalgt mig dette Sted til Offersted.
౧౨అప్పుడు యెహోవా రాత్రి వేళ సొలొమోనుకు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పాడు “నేను నీ విన్నపాన్ని అంగీకరించి ఈ స్థలాన్ని నాకు బలులు అర్పించే మందిరంగా కోరుకున్నాను.
13 Dersom jeg tillukker Himmelen, saa Regnen udebliver, eller jeg opbyder Græshopperne til at æde Landet op, eller jeg sender Pest i mit Folk,
౧౩నేను ఆకాశాన్ని మూసివేసి వాన కురవకుండా చేసినప్పుడూ, దేశాన్ని నాశనం చేయడానికి మిడతలకు సెలవిచ్చినప్పుడూ, నా ప్రజల మీదికి తెగులు రప్పించినప్పుడూ,
14 og mit Folk, som mit Navn nævnes over, da ydmyger sig, beder og søger mit Aasyn og vender om fra deres onde Veje, saa vil jeg høre det i Himmelen og tilgive deres Synd og læge deres Land,
౧౪నా పేరు పెట్టుకున్న నా ప్రజలు తమని తాము తగ్గించుకుని, ప్రార్థన చేసి, నన్ను వెతికి, తమ దుష్టత్వాన్ని విడిచి నన్ను వేడుకుంటే, నేను పరలోకం నుండి వారి ప్రార్థన విని, వారి పాపాన్ని క్షమించి, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను.
15 Nu skal mine Øjne være aabne og mine Ører lytte til Bønnen, der bedes paa dette Sted.
౧౫ఈ స్థలం లో చేసే ప్రార్థన మీద నా దృష్టి ఉంటుంది, నా చెవులు దాన్ని వింటాయి.
16 Og nu har jeg udvalgt og billiget dette Hus, for at mit Navn kan bo der til evig Tid, og mine Øjne og mit Hjerte skal være der alle Dage.
౧౬నా పేరు ఈ మందిరానికి నిత్యమూ ఉండేలా నేను దాన్ని కోరుకుని పరిశుద్ధపరిచాను. నా కనులు, నా మనస్సు నిత్యం దాని మీద ఉంటాయి.
17 Hvis du nu vandrer for mit Aasyn som din Fader David, saa du gør alt, hvad jeg har paalagt dig, og holder mine Anordninger og Lovbud,
౧౭నీ తండ్రి దావీదు నడుచుకున్నట్టు నువ్వు కూడా నాకు అనుకూలంగా ప్రవర్తించి, నేను నీకాజ్ఞాపించిన దానంతటినీ జరిగించి, నా కట్టడలనీ నా న్యాయవిధులనీ అనుసరిస్తే,
18 saa vil jeg opretholde din Kongetrone, som jeg tilsagde din Fader David, da jeg sagde: En Efterfølger skal aldrig fattes dig til at herske over Israel.
౧౮ఇశ్రాయేలీయులను పాలించడానికి నీ సంతతి వాడు ఒకడు నీకుండకుండా పోడు, అని నేను నీ తండ్రి దావీదుతో చేసిన నిబంధనను అనుసరించి నేను నీ రాజ్య సింహాసనాన్ని స్థిరపరుస్తాను.
19 Men hvis I vender eder bort og forlader mine Anordninger og Bud, som jeg har forelagt eder, og gaar hen og dyrker fremmede Guder og tilbeder dem,
౧౯అయితే మీరు దారి తొలగి, నేను మీకు నియమించిన కట్టడలనూ ఆజ్ఞలనూ విడిచిపెట్టి, ఇతర దేవుళ్ళను అనుసరించి వాటిని పూజిస్తే,
20 saa vil jeg rykke eder op fra mit Land, som jeg gav eder; og dette Hus, som jeg har helliget for mit Navn, vil jeg forkaste fra mit Aasyn og gøre det til Spot og Spe blandt alle Folk,
౨౦నేను మీకిచ్చిన నా దేశంలోనుండి మిమ్మల్ని పెళ్ళగించి, నా నామం కోసం నేను పరిశుద్ధపరచిన ఈ మందిరాన్ని నా సన్నిధి నుండి తీసేసి, సమస్త జాతుల్లో దాన్ని సామెతకు, ఎగతాళికీ కారణంగా చేస్తాను.
21 og dette Hus, som var saa ophøjet, over det skal enhver, som kommer der forbi, blive slaaet af Rædsel. Og naar man siger: Hvorfor har HERREN handlet saaledes mod dette Land og dette Hus?
౨౧అప్పుడు గొప్ప పేరు పొందిన ఈ మందిరం పక్కగా వెళ్ళేవారంతా విస్మయం చెంది, ‘యెహోవా ఈ దేశానికీ మందిరానికీ ఎందుకిలా చేశాడు?’ అని అడుగుతారు.
22 skal der svares: Fordi de forlod HERREN, deres Fædres Gud, som førte dem ud af Ægypten, og holdt sig til andre Guder, tilbad og dyrkede dem; derfor har HERREN bragt al denne Elendighed over dem!«
౨౨అప్పుడు మనుషులు, ‘ఈ దేశ ప్రజలు తమ పూర్వికులను ఐగుప్తు దేశం నుండి రప్పించిన తమ దేవుడు యెహోవాను విసర్జించి ఇతర దేవుళ్ళను వెంబడించి వాటిని పూజించారు కాబట్టి యెహోవా ఈ విపత్తునంతటినీ వారిమీదకి రప్పించాడు’ అని చెబుతారు.”