< Anden Krønikebog 4 >
1 Fremdeles lavede han et Kobberalter, tyve Alen bredt og ti Alen højt.
౧సొలొమోను ఇరవై మూరలు పొడవు, ఇరవై మూరలు వెడల్పు, పది మూరలు ఎత్తు ఉన్న ఒక ఇత్తడి బలిపీఠం చేయించాడు.
2 Fremdeles lavede han Havet i støbt Arbejde, ti Alen fra Rand til Rand, helt rundt, fem Alen højt; det maalte tredive Alen i Omkreds.
౨పోత పోసిన గుండ్రటి సరస్సు గంగాళం కూడా ఒకటి చేయించాడు. అది ఆ చివరినుండి ఈ చివరి వరకూ 10 మూరల వెడల్పు. దాని ఎత్తు ఐదు మూరలు. దాని చుట్టుకొలత 30 మూరలు.
3 Under Randen var det hele Vejen rundt omgivet af agurklignende Prydelser, der omsluttede Havet helt rundt, tredive Alen; i to Rækker sad de agurklignende Prydelser, støbt i eet dermed.
౩దాని కింద ఎద్దుల రూపాలు ఒక్కొక్క మూరకు 10 చొప్పున ఆ సముద్రపు తొట్టిని ఆవరించి ఉన్నాయి. ఆ ఎద్దులను రెండు వరసల్లో నిలబెట్టి ఆ తొట్టితో సహా పోత పోశారు.
4 Det stod paa tolv Okser, saaledes at tre vendte mod Nord, tre mod Vest, tre mod Syd og tre mod Øst; Havet stod oven paa dem; de vendte alle Bagkroppen indad.
౪అది 12 ఎద్దుబొమ్మల మీద నిలబడింది. మూడు ఎద్దులు ఉత్తరం వైపు, మూడు పడమర వైపు, మూడు దక్షిణం వైపు, మూడు తూర్పు వైపుకు ఉన్నాయి. ఆ సరస్సు తొట్టిని వాటి పైన నిలబెట్టారు. వాటి వెనక భాగాలు అన్నీ లోపలికి తిరిగి ఉన్నాయి.
5 Det var en Haandsbred tykt, og Randen var formet som Randen paa et Bæger, som en udsprungen Lilje. Det tog 3000 Bat.
౫దాని మందం బెత్తెడు. దాని అంచు ఒక గిన్నె అంచులాగా ఉండి తామరపువ్వును పోలి ఉంది. దానిలో దాదాపు 66,000 లీటర్ల నీరు పడుతుంది.
6 Fremdeles lavede han ti Bækkener og satte fem til højre og fem til venstre, til Tvætning; i dem skyllede man, hvad der brugtes ved Brændofrene, medens Præsterne brugte Havet til at tvætte sig i.
౬సొలొమోను ఇంకా దహనబలులుగా అర్పించే వాటిని కడగటానికి కుడివైపున ఐదు, ఎడమ వైపున ఐదు మొత్తం పది స్నానపు గంగాళాలు చేయించాడు. అయితే సరస్సు తొట్టిలోని నీళ్ళతో కేవలం యాజకులు మాత్రమే తమను శుద్ధి చేసుకుంటారు.
7 Fremdeles lavede han de ti Guldlysestager, som de skulde være, og satte dem i Helligdommen, fem til højre og fem til venstre.
౭అతడు తనకు అందిన నమూనా సూచనల ప్రకారం పది బంగారు దీపస్తంభాలను చేయించి, దేవాలయంలో కుడివైపు ఐదు, ఎడమవైపు ఐదు నిలబెట్టాడు.
8 Fremdeles lavede han ti Borde og satte dem i Helligdommen, fem til højre og fem til venstre; tillige lavede han 100 Skaale af Guld.
౮అలాగే 10 బల్లలు చేయించి దేవాలయంలో కుడి వైపు ఐదు, ఎడమ వైపు ఐదు ఉంచాడు. అతడు 100 బంగారు తొట్లు చేయించాడు.
9 Fremdeles indrettede han Præsternes Forgaard og den store Gaard og Porte til Gaarden; Portfløjene overtrak han med Kobber.
౯అతడు యాజకులకు ఒక ఆవరణనూ ఇతరులకి దానికంటే విశాలమైన ఆవరణనూ తలుపులతో సహా చేయించి ఆ తలుపులను ఇత్తడితో పొదిగించాడు.
10 Havet opstillede han ved Templets Sydside, ved det sydøstre Hjørne.
౧౦సరస్సు తొట్టిని తూర్పు వైపున కుడి పక్కగా ముఖాన్ని దక్షిణం వైపుకు తిప్పి ఉంచాడు.
11 Fremdeles lavede Huram Karrene, Skovlene og Skaalene. Dermed var Huram færdig med sit Arbejde for Kong Salomo ved Guds Hus:
౧౧హూరాము పాత్రలనూ బూడిదెనూ ఎత్తడానికి చేటలనూ తొట్లనూ చేశాడు. సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం దేవుని మందిరానికి చేయాల్సిన పనంతా హూరాము పూర్తి చేశాడు.
12 De to Søjler og de to kugleformede Søjlehoveder ovenpaa, de to Fletværker til at dække de to, kugleformede Søjlehoveder paa Søjlerne,
౧౨దాని వివరాలు, రెండు స్తంభాలు, వాటి పళ్ళాలు, వాటి పైన ఉంచడానికి పీటలు, వాటి పళ్ళాలు, ఆ స్తంభాల పైన రెండు పళ్లాలను కప్పడానికి రెండు అల్లికలు,
13 de 400 Granatæbler til de to Fletværker, to Rækker Granatæbler til hvert Fletværk til at dække de to kugleformede Søjlehoveder paa de to Søjler,
౧౩ఆ స్తంభాల పైన రెండు పళ్లాలను కప్పే అల్లిక, దానికి రెండేసి వరసల్లో నాలుగు వందల దానిమ్మ పండ్లు.
14 de ti Stel med de ti Bækkener paa,
౧౪మట్లు, వాటిపైన తొట్టెలు,
15 Havet med de tolv Okser under.
౧౫సరస్సు తొట్టి, దాని కింద ఉన్న పన్నెండు ఎద్దులు,
16 Karrene, Skovlene og Skaalene og alle de Ting, som hørte til, lavede Huram-Abi af blankt Kobber for Kong Salomo til HERRENS Hus.
౧౬పాత్రలు, బూడిద ఎత్తడానికి చేటలు, ముండ్ల కొంకులు మొదలైనవి. వీటిని హూరాము సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం యెహోవా మందిరం కోసం మిలమిల మెరిసే ఇత్తడితో చేశాడు.
17 I Jordandalen lod Kongen dem støbe, ved Adamas Vadested mellem Sukkot og Zereda.
౧౭రాజు వాటిని యొర్దాను మైదానంలో సుక్కోతుకు జెరేదాతాకు మధ్య బంకమట్టి నేలలో పోత పోయించాడు.
18 Salomo lod alle disse Ting lave i stor Mængde, thi Kobberet blev ikke vejet.
౧౮తన దగ్గర ఉన్న తూయలేనంత ఇత్తడితో సొలొమోను ఈ వస్తువులను పెద్ద సంఖ్యలో చేయించాడు.
19 Og Salomo lod alle Tingene, som hørte til Guds Hus, lave: Guldalteret, Bordene, som Skuebrødene laa paa,
౧౯దేవుని మందిరానికి కావలసిన వస్తువులూ బంగారు పీఠమూ సన్నిధి రొట్టెలు ఉంచే బల్లలూ,
20 Lysestagerne med Lamperne, der skulde tændes paa den foreskrevne Maade, foran Inderhallen, af purt Guld,
౨౦వాటి గురించి అతడు పొందిన సూచనల ప్రకారం గర్భగుడి ముందు వెలుగుతూ ఉండడానికి ప్రశస్తమైన బంగారు దీపస్తంభాలూ,
21 med Blomsterbægrene, Lamperne og Lysesaksene af Guld, ja af det allerbedste Guld,
౨౧పుష్పాలూ, ప్రమిదలూ కత్తెరలూ పట్టుకారులూ తొట్టెలూ గిన్నెలూ ధూపకలశాలూ వీటన్నిటినీ సొలొమోను మేలిమి బంగారంతో చేయించాడు.
22 Knivene, Skaalene, Kanderne og Panderne af fint Guld og Dørhængslerne til Templet, til Inderdørene for det Allerhelligste og til Dørene for det Hellige, af Guld.
౨౨మందిర ద్వారం లోపలి తలుపులూ అతి పరిశుద్ధ స్థలం లోపలి తలుపులూ దేవాలయపు తలుపులూ అన్నీ బంగారంతో చేయించాడు.