< Første Krønikebog 28 >
1 Derpaa samlede David i Jerusalem alle Israels Øverster, Stammeøversterne, Skifternes Øverster, som var i Kongens Tjeneste, Tusind— og Hundredførerne, Overopsynsmændene over alle Kongens og hans Sønners Ejendele og Kvæg, ligeledes Hofmændene, Kærnetropperne og alle dygtige Krigere.
౧గోత్రాల పెద్దలనూ, వంతుల చొప్పున రాజుకు సేవ చేసే అధిపతులనూ సహస్రాధిపతులనూ, శతాధిపతులనూ, రాజుకూ, రాకుమారులకూ ఉన్న యావత్తు స్థిర చరాస్తుల మీదా ఉన్న అధిపతులను అంటే ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ, రాజు దగ్గరున్న పరివారాన్నీ, పరాక్రమశాలురనూ, సేవా సంబంధులైన పరాక్రమశాలులందరినీ రాజైన దావీదు యెరూషలేములో సమావేశపరిచాడు.
2 Kong David rejste sig op og sagde: »Hør mig, mine Brødre og mit Folk! Jeg havde i Sinde at bygge HERRENS Pagts Ark og vor Guds Fodskammel et Hus at hvile i og havde truffet forberedelser til at bygge.
౨అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి “నా సహోదరులారా, నా ప్రజలారా, నా మాట ఆలకించండి. యెహోవా నిబంధన మందసానికీ, మన దేవుని పాదపీఠంగా ఉండడానికీ, ఒక మందిరం కట్టించాలని నేను నా హృదయంలో నిశ్చయం చేసుకుని సమస్తం సిద్ధపరచాను.”
3 Men Gud sagde til mig: Du skal ikke bygge mit Navn et Hus, thi du er en Krigens Mand og har udgydt Blod!
౩అయితే “నువ్వు యుద్ధాలు జరిగించి రక్తం ఒలికించిన వాడవు గనుక నువ్వు నా పేరట మందిరం కట్టించకూడదు” అని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు.
4 Af mit Fædrenehus udvalgte HERREN, Israels Gud, ene mig til Konge over Israel evindelig, thi han udvalgte Juda til Fyrste og af Juda mit Fædrenehus, og mellem min Faders Sønner fandt han Behag i mig, saa han gjorde mig til Konge over hele Israel.
౪ఇశ్రాయేలీయుల మీద నిత్యం రాజుగా ఉండడానికి ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నా తండ్రి ఇంటి వాళ్ళందర్లో నన్ను కోరుకున్నాడు. ఆయన యూదా గోత్రానికి, యూదా గోత్రం వాళ్ళలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటినీ, నా తండ్రి ఇంట్లో నన్నూ ఏర్పరచుకుని, నా మీద దయ చూపించి, ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాడు.
5 Og af alle mine Sønner — HERREN har givet mig mange Sønner — har han udvalgt min Søn Salomo til at sidde paa HERRENS Kongetrone og herske over Israel.
౫యెహోవా నాకు చాలా మంది కొడుకులను దయ చేశాడు. అయితే ఇశ్రాయేలీయుల మీద, యెహోవా రాజ్యసింహాసనం మీద కూర్చోడానికి ఆయన నా కొడుకులందరిలో సొలొమోనును కోరుకున్నాడు. ఆయన నాతో,
6 Og han sagde til mig: Din Søn Salomo er den, som skal bygge mit Hus og mine Forgaarde, thi ham har jeg udvalgt til min Søn, og jeg vil være ham en Fader;
౬“నేను నీ కొడుకు సొలొమోనును నాకు కొడుకుగా ఏర్పరచుకొన్నాను. నేను అతనికి తండ్రిగా ఉంటాను. అతడు నా మందిరాన్నీ, నా ఆవరణాలూ కట్టిస్తాడు.
7 jeg vil grundfæste hans Kongedømme til evig Tid, hvis han holder fast ved mine Bud og Lovbud og gør efter dem saaledes som nu.
౭ఈ రోజు చేస్తున్నట్టుగా అతడు ధైర్యంతో నా ఆజ్ఞలూ, నా న్యాయవిధులూ పాటిస్తే, నేను అతని రాజ్యాన్ని నిత్యం స్థిరపరుస్తాను” అన్నాడు.
8 Og nu, for hele Israels, HERRENS Forsamlings, Øjne og i vor Guds Paahør siger jeg: Stræb at holde alle HERREN eders Guds Bud, at I maa eje dette herlige Land og lade det gaa i Arv til eders Efterkommere til evig Tid!
౮“కాబట్టి మీరు ఈ మంచి దేశాన్ని స్వాస్థ్యంగా అనుభవించి, మీ తరువాత మీ సంతానానికి శాశ్వత స్వాస్థ్యంగా దాన్ని అప్పగించేలా మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఆజ్ఞలు అన్నీ తెలుసుకుని వాటిని పాటించండి.
9 Og du, min Søn Salomo! Kend din Faders Gud og tjen ham med et helt Hjerte og en villig Sjæl, thi HERREN ransager alle Hjerter og kender alt, hvad der rører sig i deres Tanker. Hvis du søger ham, vil han lade sig finde af dig, men forlader du ham, vil han forkaste dig for evigt.
౯సొలొమోనూ, నా కుమారా, నీ తండ్రి దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశీలిస్తాడు. ఆయన అందరి ఆలోచనలూ, ఉద్దేశాలూ తెలిసిన వాడు. నువ్వు ఆయన్ని తెలుసుకుని హృదయ పూర్వకంగా, మనస్పూర్తిగా, ఆయన్ని సేవించు. ఆయన్ని కోరుకుంటే ఆయన నీకు ప్రత్యక్షం ఔతాడు, నువ్వు ఆయన్ని విడిచి పెడితే ఆయన నిన్ను శాశ్వతంగా తోసివేస్తాడు.
10 Saa se da til, thi HERREN har udvalgt dig til at bygge et Hus til Helligdom! Gaa til Værket med Frimodighed!«
౧౦పరిశుద్ధ స్థలంగా ఉండడానికి ఒక మందిరాన్ని కట్టించడానికి యెహోవా నిన్ను కోరుకున్న సంగతి గుర్తించి ధైర్యంగా ఉండి, అది జరిగించు” అన్నాడు.
11 Derpaa gav David sin Søn Salomo Planen til Forhallen, Templets Bygninger, Forraadskamrene, Rummene paa Taget, de indre Kamre og Hallen til Sonedækket
౧౧అప్పుడు దావీదు మంటపానికీ, మందిర నిర్మాణానికి, గిడ్డంగులకు, మేడ గదులకూ, లోపలి గదులకూ, ప్రాయశ్చిత్త వేదిక ఉన్న గదికీ, యెహోవా మందిరపు ఆవరణాలకూ,
12 og Planen til alt, hvad der stod for hans Tanke med Hensyn til HERRENS Hus's Forgaarde og alle Kamrene rundt om, Guds Hus's Skatkamre og Skatkamrene til Helliggaverne,
౧౨వాటి చుట్టూ ఉన్న గదులకూ, దేవుని మందిర గిడ్డంగులకు, ప్రతిష్ఠిత వస్తువుల గిడ్డంగులకు, తాను ఏర్పాటు చేసి సిద్ధం చేసిన నిర్మాణ ప్రణాళికలను తన కొడుకు సొలొమోనుకు అప్పగించాడు.
13 fremdeles Anvisninger om Præsternes og Leviternes Skifter og alt Arbejdet ved Tjenesten i HERRENS Hus og alting, som hørte til Tjenesten i HERRENS Hus,
౧౩యాజకులూ, లేవీయులూ, సేవ చెయ్యవలసిన వంతుల జాబితా, యెహోవా మందిరపు సేవను గూర్చిన జాబితా, యెహోవా మందిరపు సేవ ఉపకరణాల జాబితా దావీదు అతనికి అప్పగించాడు.
14 om Guldet, den Vægt, der skulde til hver enkelt Ting, som hørte til Tjenesten, og om alle Sølvtingene, den Vægt, der skulde til hver enkelt Ting, som hørte til Tjenesten,
౧౪ఇంకా, అనేక సేవాక్రమాలకు కావలసిన బంగారు ఉపకారణాలన్నిటినీ చెయ్యడానికి తూకం ప్రకారం బంగారం, అనేక సేవాక్రమాలకు కావలసిన వెండి ఉపకారణాలన్నిటినీ చెయ్యడానికి తూకం ప్రకారం వెండిని దావీదు అతనికి అప్పగించాడు.
15 fremdeles om Vægten paa Guldlysestagerne og deres Guldlamper, Vægten paa hver enkelt Lysestage og dens Lamper, og paa Sølvlysestagerne, Vægten paa hver enkelt Lysestage og dens Lamper, svarende til hver enkelt Lysestages Brug ved Tjenesten,
౧౫బంగారు దీపస్తంభాలకూ, వాటి బంగారు ప్రమిదెలకూ, ఒక్కొక్క దీపస్తంభానికీ, దాని ప్రమిదెలకూ కావలసినంత బంగారం తూకం ప్రకారంగా, వెండి దీపస్తంభాలకూ ఒక్కొక దీపస్తంభానికీ, దాని దాని ప్రమిదలకూ కావలసినంత వెండిని తూకం ప్రకారంగా,
16 fremdeles om Vægten paa Guldet til Skuebrødsbordene, til hvert enkelt Skuebrødsbord, og paa Sølvet til Sølvbordene
౧౬సన్నిధి రొట్టెలు ఉంచే ఒక్కొక బల్లకు కావలసినంత బంగారం తూకం ప్రకారంగా వెండి బల్లలకు కావలసినంత వెండినీ,
17 og om Gaflerne, Skaalene og Krukkerne af purt Guld og om Guldbægrene, Vægten paa hvert enkelt Bæger, og Sølvbægrene, Vægten paa hvert enkelt Bæger,
౧౭ముళ్ళ కొంకులకూ, గిన్నెలకూ, పాత్రలకూ కావలసినంత స్వచ్ఛమైన బంగారం, గిన్నెల్లో ఒక్కొక్క గిన్నెకూ కావలసినంత బంగారం తూకం ప్రకారం, వెండి గిన్నెల్లో ఒక్కొక గిన్నెకు కావలసినంత వెండిని తూకం ప్రకారం,
18 og om Vægten paa Røgofferalteret af purt Guld og om Tegningen til Vognen, til Guldkeruberne, som udbredte Vingerne skærmende over HERRENS Pagts Ark.
౧౮ధూపపీఠానికి కావలసినంత స్వచ్ఛమైన బంగారం తూకం ప్రకారం, రెక్కలు విప్పుకుని యెహోవా నిబంధన మందసాన్ని కప్పే కెరూబుల రూపకల్పనకు కావలసినంత బంగారం అతనికి అప్పగించాడు.
19 »HERREN har sat mig ind i alt dette ved et Skrift, jeg har fra hans egen Haand, i alle de Arbejder, Planen omfatter.«
౧౯ఇవన్నీ అప్పగించి “యెహోవా నాకిచ్చిన అవగాహన, నడిపింపును బట్టి ఈ నిర్మాణ ప్రణాళిక అంతా రాసి పెట్టాను” అని సొలొమోనుతో చెప్పాడు.
20 Derpaa sagde David til sin Søn Salomo: »Gaa til Værket og vær frimodig og stærk, frygt ikke og tab ikke Modet, thi Gud HERREN, min Gud, vil være med dig! Han vil ikke slippe dig og ikke forlade dig, før alt Arbejdet med HERRENS Hus er fuldført.
౨౦ఇంకా దావీదు తన కొడుకు సొలొమోనుతో “నువ్వు బలం పొంది ధైర్యం తెచ్చుకుని ఈ పనికి పూనుకో. భయపడొద్దు, కంగారు పడొద్దు. నా దేవుడైన యెహోవా నీతో ఉంటాడు. యెహోవా మందిర సేవను గూర్చిన పనంతా నువ్వు ముగించే వరకూ ఆయన నిన్ను ఎంతమాత్రం విడిచిపెట్టడు.
21 Se, Præsternes og Leviternes Skifter er rede til alt Arbejdet ved Guds Hus; og til alt, hvad der skal udføres, har du Folk hos dig, der alle er villige og forstaar sig paa Arbejder af enhver Art, og Øversterne og hele Folket er rede til alt, hvad du kræver.«
౨౧దేవుని మందిర సేవంతటికీ, యాజకులూ, లేవీయులూ వంతుల ప్రకారం ఏర్పాటయ్యారు. నీ ఆజ్ఞకు లోబడి ఉంటూ ఈ పనంతా నెరవేర్చడానికి వివిధ పనుల్లో ప్రవీణులైన వాళ్ళూ, మనస్పూర్తిగా పని చేసేవాళ్ళూ, అధిపతులూ, ప్రజలందరూ, నీకు సహాయకులుగా ఉంటారు” అన్నాడు.