< Første Krønikebog 22 >

1 Da sagde David: »Her skal Gud HERRENS Hus staa, her skal Israels Brændofferalter staa!«
దావీదు “దేవుడైన యెహోవా నివాసం ఉన్న స్థలం ఇదే. ఇశ్రాయేలీయులు అర్పించే దహనబలులకు స్థానం ఇదే” అని చెప్పాడు.
2 David bød saa, at man skulde samle alle de fremmede, som boede i Israels Land, og han satte Stenhuggere til at tilhugge Kvadersten til Opførelsen af Guds Hus;
తరువాత దావీదు, ఇశ్రాయేలీయుల దేశంలో ఉన్న అన్యజాతి వాళ్ళను సమకూర్చమని ఆజ్ఞ ఇచ్చి, దేవుని మందిరం కట్టించడానికి రాళ్లు చెక్కేవారుగా వారిని నియమించాడు.
3 fremdeles anskaffede David Jern i Mængde til Nagler paa Portfløjene og til Kramper, en umaadelig Mængde Kobber
వాకిలి తలుపులకు కావలసిన మేకులకు, బందులకు భారీగా ఇనుమును, తూయడానికి వీలులేనంత ఇత్తడిని,
4 og talløse Cederbjælker, idet Zidonierne og Tyrierne bragte David Cederbjælker i Mængde.
లెక్కలేనన్ని దేవదారు మానులను దావీదు సంపాదించాడు. సీదోనీయులూ, తూరీయులూ దావీదుకు విస్తారమైన దేవదారు మానులను తీసుకు వస్తూ ఉన్నారు.
5 Thi David tænkte: »Min Søn Salomo er ung og uudviklet, men Huset, som skal bygges HERREN, skal være stort og mægtigt, for at det kan vinde Navnkundighed og Ry i alle Lande; jeg vil træffe Forberedelser for ham.« Og David traf store Forberedelser, før han døde.
దావీదు “నా కొడుకు సొలొమోనుది అనుభవం లేని లేత వయస్సు. యెహోవా కోసం కట్టబోయే మందిరం దాని కీర్తిని బట్టి, అందాన్ని బట్టి, అన్ని దేశాల్లో ప్రసిద్ధి చెందినది, చాలా వైభవోపేతంగా ఉండాలి. కాబట్టి, దానికి కావలసిన సరంజామా అంతటినీ సిద్ధపరుస్తాను” అని చెప్పి, అతడు తన మరణానికి ముందు విస్తారంగా సామగ్రిని సమకూర్చాడు.
6 Derpaa lod han sin Søn Salomo kalde og bød ham bygge HERREN, Israels Gud, et Hus.
తరువాత అతడు తన కొడుకు సొలొమోనును పిలిపించి, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు ఒక మందిరం కట్టాలని అతనికి ఆజ్ఞ ఇచ్చాడు.
7 Og David sagde til Salomo: »Min Søn! Jeg havde selv i Sinde at bygge HERREN min Guds Navn et Hus;
దావీదు సొలొమోనుతో “నా కుమారా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కోసం ఒక మందిరం కట్టించాలని నా హృదయంలో నిశ్చయం చేసుకొన్నప్పుడు,
8 men da kom HERRENS Ord til mig saaledes: Du har udgydt meget Blod og ført store Krige; du maa ikke bygge mit Navn et Hus, thi du har udgydt meget Blod paa Jorden for mit Aasyn.
యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నువ్వు చాలా రక్తపాతం, చాలా యుద్ధాలు చేసిన వాడివి, నువ్వు నా పేరట మందిరం కట్టించకూడదు, నా దృష్టిలో నువ్వు విస్తారంగా రక్తం చిందించావు.
9 Se, en Søn skal fødes dig; han skal være en Fredens Mand, og jeg vil skaffe ham Fred for alle hans Fjender rundt om; thi hans Navn skal være Salomo, og jeg vil give Israel Fred og Ro i hans Dage.
నీకు పుట్టబోయే ఒక కొడుకు శాంతిపరుడు. చుట్టూ ఉండే అతని శత్రువులందరిని నేను తోలివేసి అతనికి శాంతిసమాధానాలు కలగజేస్తాను. ఆ కారణంగా అతనికి సొలొమోను అను పేరు ఉంటుంది. అతని కాలంలో ఇశ్రాయేలీయులకు శాంతి సమాధానాలు, విశ్రాంతి దయచేస్తాను.
10 Han skal bygge mit Navn et Hus; og han skal være mig en Søn, og jeg vil være ham en Fader, og jeg vil grundfæste hans Kongedømmes Trone over Israel til evig Tid!
౧౦అతడు నా పేరట ఒక మందిరం కట్టిస్తాడు, అతడు నాకు కొడుకుగా ఉంటాడు. నేనతనికి తండ్రిగా ఉంటాను, ఇశ్రాయేలీయుల మీద అతని రాజ్య సింహాసనాన్ని నిత్యం స్థిరపరుస్తాను, అన్నాడు.
11 Saa være da HERREN med dig, min Søn, at du maa faa Lykke til at bygge HERREN din Guds Hus, saaledes som han har forjættet om dig.
౧౧నా కుమారా, యెహోవా నీకు తోడుగా ఉంటాడు గాక. నువ్వు వర్ధిల్లి నీ దేవుడు యెహోవా నీ గురించి చెప్పిన ప్రకారం ఆయనకు మందిరం కట్టిస్తావు.
12 Maatte HERREN kun give dig Forstand og Indsigt, saa han kan sætte dig over Israel og du kan holde HERREN din Guds Lov!
౧౨నీ దేవుడు యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించేలా యెహోవా నీకు వివేకమూ తెలివీ ఇచ్చి, ఇశ్రాయేలీయుల మీద నీకు అధికారం దయచేస్తాడు గాక.
13 Saa vil det gaa dig vel naar du nøje holder Anordningerne og Lovbudene, som HERREN bød Moses at paalægge Israel. Vær frimodig og stærk, frygt ikke og tab ikke Modet!
౧౩యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారంగా, ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగా, లోబడడానికి జాగ్రత్త పడితే నీవు వృద్ధి పొందుతావు. ధైర్యం తెచ్చుకుని బలంగా ఉండు. భయపడొద్దు, దిగులు పడొద్దు.
14 Se, med stor Møje har jeg til HERRENS Hus tilvejebragt 100 000 Talenter Guld og en Million Talenter Sølv og desuden Kobber og Jern, som ikke er til at veje, saa meget er der; dertil har jeg tilvejebragt Bjælker og Sten; og du skal sørge for flere.
౧౪చూడు, నేను చాలా బాధ తీసుకుని యెహోవా మందిరం కోసం మూడు వేల నాలుగు వందల యాభై టన్నుల బంగారం, ముప్ఫై నాలుగు వేల ఐదు వందల టన్నుల వెండీ, తూయడానికి వీలు కానంత విస్తారమైన ఇత్తడీ, ఇనుమూ సమకూర్చాను. మానులను, రాళ్లను తెచ్చి పెట్టాను. దీని కన్నా మరింత ఎక్కువగా నువ్వు సమకూరుస్తావు గాక.
15 En Mængde Arbejdere staar til din Raadighed, Stenhuggere, Murere, Tømrere og alle Slags Folk, der forstaar sig paa Arbejder af enhver Art.
౧౫ఇంకా, పని చేయగలిగిన ఎందరో శిల్పకారులూ తాపీ పనివాళ్ళూ వడ్రంగులు, నిపుణులైన పనివాళ్ళు నీ దగ్గర ఉన్నారు.
16 Af Guld, Sølv, Kobber og Jern er der umaadelige Mængder til Stede — saa tag da fat, og HERREN være med dig!«
౧౬లెక్కకు మించిన బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము నీదగ్గర ఉంది. కాబట్టి నువ్వు పనికి పూనుకో, యెహోవా నీకు తోడుగా ఉంటాడు” అన్నాడు.
17 Og David bød alle Israels Øverster hjælpe hans Søn Salomo og sagde:
౧౭దావీదు తన కొడుకు సొలొమోనుకు సాయం చెయ్యాలని ఇశ్రాయేలీయుల అధిపతులందరికీ ఆజ్ఞాపించాడు.
18 »Er HERREN eders Gud ikke med eder, har han ikke skaffet eder Ro til alle Sider? Han har jo givet Landets Indbyggere i min Haand, og Landet er underlagt HERREN og hans Folk;
౧౮అతడు వారితో “మీ దేవుడు యెహోవా మీతో ఉన్నాడు గదా? మీ సరిహద్డులంతటా ఆయన మీకు శాంతినిచ్చాడు గదా? దేశనివాసులను ఆయన నా వశం చేశాడు. యెహోవా భయం వల్ల, ఆయన ప్రజల భయం వల్ల దేశం స్వాధీనం అయింది.
19 saa giv da eders Hjerter og Sjæle hen til at søge HERREN eders Gud og tag fat paa at bygge Gud HERRENS Helligdom, saa at HERRENS Pagts Ark og Guds hellige Ting kan føres ind i Huset, der skal bygges HERRENS Navn.«
౧౯కాబట్టి, హృదయపూర్వకంగా మీ దేవుడు యెహోవాను కోరుకోడానికి మీ మనస్సులు దృఢపరచుకుని, ఆయన నిబంధన మందసాన్ని, దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణాలను, ఆయన పేరు కోసం కట్టే ఆ మందిరంలోకి చేర్చడానికి మీరు పూనుకుని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలాన్ని కట్టండి” అన్నాడు.

< Første Krønikebog 22 >