< 4 Mosebog 21 >
1 Der Kananiten, Arads Konge, som boede i Sydlandet, hørte, at Israel kom ind ad Spejdernes Vej, da stred han imod Israel og førte nogle af dem bort i Fangenskab.
౧ఇశ్రాయేలీయులు అతారీం మార్గంలో వస్తున్నారని దక్షిణం వైపు నివాసం ఉన్న కనానీయుడైన అరాదు రాజు విని, అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసి వారిల్లో కొంతమందిని బందీలుగా పట్టుకున్నాడు.
2 Da lovede Israel Herren et Løfte og sagde: Dersom du giver dette Folk i min Haand, da vil jeg lyse deres Stæder i Band.
౨ఇశ్రాయేలీయులు యెహోవాకు మొక్కుకుని “నువ్వు మాకు ఈ జనం మీద జయం ఇస్తే, మేము నీ పేరట వారి పట్టణాలు పూర్తిగా నాశనం చేస్తాం” అన్నారు.
3 Og Herren hørte Israels Røst og overgav Kananiterne, og man bandlyste dem og deres Stæder og kaldte det Steds Navn Horma.
౩యెహోవా ఇశ్రాయేలీయుల స్వరం విని, ఆ కనానీయుల మీద వాళ్లకు జయం ఇచ్చాడు. అప్పుడు వారు ఆ కనానీయులను, వారి పట్టణాలను పూర్తిగా నాశనం చేశారు. ఆ చోటికి “హోర్మా” అని పేరు.
4 Saa rejste de fra det Bjerg Hor paa Vejen til det røde Hav, for at drage omkring Edoms Land; og Folkets Sjæl blev utaalmodig paa Vejen.
౪ఆ తరువాత వారు ఎదోము చుట్టూ తిరిగి వెళ్లాలని, హోరు కొండనుంచి ఎర్ర సముద్రం దారిలో ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో అలసటతో ప్రజలు సహనం కోల్పోయారు.
5 Og Folket talede imod Gud og imod Mose: Hvorfor førte I os op af Ægypten for at dø i Ørken? thi her er hverken Brød eller Vand, og vor Sjæl kedes ved denne ringe Mad.
౫అప్పుడు ప్రజలు దేవునికి, మోషేకి విరోధంగా మాట్లాడుతూ “ఈ నిర్జన బీడు ప్రాంతంలో చావడానికి ఐగుప్తులోనుంచి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించారు? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, ఈ నికృష్టమైన భోజనం మాకు అసహ్యం” అన్నారు.
6 Da sendte Herren giftige Slanger iblandt Folket, og de bed Folket, og der døde meget Folk af Israel.
౬అప్పుడు యెహోవా ప్రజల్లోకి విషసర్పాలు పంపించాడు. అవి ప్రజలను కాటువేసినప్పుడు ఇశ్రాయేలీయుల్లో చాలామంది చనిపోయారు.
7 Da kom Folket til Mose, og de sagde: Vi have syndet, thi vi have talet imod Herren og imod dig, bed til Herren, at han vil tage de Slanger fra os; og Mose bad for Folket.
౭కాబట్టి ప్రజలు మోషే దగ్గరికి వచ్చి “మేము యెహోవాకు, నీకు విరోధంగా మాట్లాడి పాపం చేశాం. యెహోవా మా మధ్యనుంచి ఈ సర్పాలు తొలగించేలా ఆయనకు ప్రార్ధించండి” అన్నారు.
8 Da sagde Herren til Mose: Gør dig en Slange, og sæt den paa en Stang; og det skal ske, at hver som er bidt og ser den, han skal leve.
౮మోషే ప్రజల కోసం ప్రార్థన చేసినప్పుడు యెహోవా “పాము ఆకారం చేయించి స్థంభం మీద పెట్టు. అప్పుడు పాము కాటేసిన ప్రతి వాడు దానివైపు చూసి బతుకుతాడు” అని మోషేకు చెప్పాడు.
9 Da gjorde Mose en Kobberslange og satte den paa en Stang; og det skete, naar en Slange havde bidt nogen, og han saa til den Kobberslange, da blev han i Live.
౯కాబట్టి మోషే, ఇత్తడి పాము ఒకటి చేయించి, స్థంభం మీద దాన్ని పెట్టాడు. అప్పుడు పాము కాటు తిన్న ప్రతివాడూ ఆ ఇత్తడి పాము వైపు చూసినప్పుడు అతడు బతికాడు.
10 Og Israels Børn rejste derfra, og de lejrede sig i Oboth.
౧౦తరువాత ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసి ఓబోతులో శిబిరం వేసుకున్నారు.
11 Og de rejste fra Oboth, og de lejrede sig ved Abirams Høje i Ørken, som er lige foran Moab, mod Solens Opgang.
౧౧ఓబోతులోనుంచి వారు ప్రయాణం చేసి తూర్పు వైపు, అంటే మోయాబుకు ఎదురుగా ఉన్న బంజరు భూమి ఈయ్యె అబారీము దగ్గర శిబిరం వేసుకున్నారు.
12 Derfra rejste de og lejrede sig ved den Bæk Sered.
౧౨అక్కడనుంచి వారు ప్రయాణం చేసి, జెరెదు లోయలో శిబిరం వేసుకున్నారు.
13 Derfra rejste de og lejrede sig paa denne Side Arnon, som er i Ørken, og som gaar ud fra Amoriternes Landemærke; thi Arnon var Moabs Landemærke imellem Moab og imellem Amoriterne.
౧౩అక్కడనుంచి వారు ప్రయాణం చేసి బంజరు భూమిలో అర్నోను నది అవతల శిబిరం వేసుకున్నారు. ఆ నది అమోరీయుల దేశ సరిహద్దులనుంచి ప్రవహిస్తుంది. అర్నోను నది మోయాబుకు, అమోరీయులకు మధ్య ఉన్న మోయాబు సరిహద్దు.
14 Derfor siges i Herrens Stridsbog: „Vaheb i Sufa og Arnons Bække,
౧౪ఆ కారణంగా యెహోవా యుద్ధాల గ్రంథంలో “సుఫాలో ఉన్న వాహేబు, అర్నోను లోయలు, ఆరు అనే స్థలం వరకూ ఉన్న అర్నోను లోయలు,
15 og Bækkenes Løb, som strækker sig til Ars Bolig og støder paa Moabs Landemærke.
౧౫మోయాబు సరిహద్దుకు దగ్గరగా ఉన్న పల్లపు లోయలు” అని రాసి ఉంది.
16 Og derfra rejste de til Beer, det er den Brønd, som Herren talede om til Mose: Saml Folket, og jeg vil give dem Vand.
౧౬అక్కడనుంచి వారు బెయేరుకు వెళ్ళారు. అక్కడ ఉన్న బావి దగ్గర యెహోవా మోషేతో “ప్రజలను సమకూర్చు. నేను వాళ్లకు నీళ్ళు ఇస్తాను” అన్నాడు.
17 Da sang Israel denne Sang: „Stig, Brønd! sjunger om den.
౧౭అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడారు. “బావీ, పైకి ఉబుకు! ఆ బావిని కీర్తించండి. నాయకులు దాన్ని తవ్వారు.
18 Brønd, som er graven af Fyrsterne, kastet af de ædle iblandt Folket, med Fyrstespir, med deres Herskerstave!‟ Og fra den Ørk rejste de til Matthana,
౧౮వారు తమ అధికార దండంతో, చేతికర్రలతో ప్రజల నాయకులు దాన్ని తవ్వారు.”
19 og fra Matthana til Nahaliel, og fra Nahaliel til Bamoth,
౧౯వారు ఆ ఎడారిలోనుంచి మత్తానుకూ, మత్తాను నుంచి నహలీయేలుకూ, నహలీయేలు నుంచి బామోతుకూ,
20 og fra Bamoth til den Dal, som er paa Moabs Mark, mod Toppen af Pisga, der skuer ud over Ørken.
౨౦మోయాబు దేశంలోని లోయలో ఉన్న బామోతు నుంచి ఎడారికి ఎదురుగా ఉన్న పిస్గా కొండ దగ్గరికి వచ్చారు.
21 Og Israel sendte Bud hen til Sihon, Amoriternes Konge, og lod sige:
౨౧ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను దగ్గరికి రాయబారులను పంపించి “మమ్మల్ని నీ దేశం గుండా వెళ్లనివ్వు,
22 Lad mig gaa igennem dit Land, vi ville ikke bøje ind paa Ager eller paa Vingaard, vi ville ikke drikke Vand af nogen Brønd, vi ville drage ad Kongevejen, indtil vi ere komne igennem dit Landemærke.
౨౨మేము పొలాల్లోకైనా, ద్రాక్షతోటల్లోకైనా వెళ్ళం. బావుల్లో నీళ్లు తాగం. మేము నీ సరిహద్దులు దాటే వరకూ రాజమార్గంలోనే నడిచి వెళ్తాం” అని అతనితో చెప్పించారు.
23 Og Sihon vilde ikke tilstede Israel at gaa igennem sit Landemærke; men Sihon samlede alt sit Folk og drog ud mod Israel i Ørken og kom til Jaza; og han stred imod Israel.
౨౩కాని, సీహోను ఇశ్రాయేలీయులను తన సరిహద్దుల గుండా వెళ్ళనివ్వ లేదు. ఇంకా సీహోను తన జనమంతా సమకూర్చుకుని ఇశ్రాయేలీయుల మీద దాడి చెయ్యడానికి ఎడారిలోకి వెళ్లి, యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశాడు.
24 Men Israel slog ham med skarpe Sværd og indtog hans Land til Ejendom, fra Arnon indtil Jabok, indtil Ammons Børn; men Ammons Børns Landemærke var fast.
౨౪ఇశ్రాయేలీయులు అతన్ని కత్తితో హతం చేసి, అతని దేశం అర్నోను మొదలు యబ్బోకు వరకూ, అంటే అమ్మోనీయుల దేశం వరకూ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు అమ్మోనీయుల సరిహద్దు బలోపేతం అయ్యింది.
25 Saa indtog Israel alle disse Stæder, og Israel tog Bolig i alle Amoriternes Stæder, i Hesbon, og alle dens tilliggende Byer.
౨౫ఇశ్రాయేలీయులు ఆ పట్టాణాలన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఇశ్రాయేలీయులు అమోరీయుల పట్టాణాలన్నిట్లో, హెష్బోనులో, దాని పల్లెలన్నిట్లో శిబిరం వేసుకున్నారు.
26 Thi Hesbon var Sihons, Amoriternes Konges, Stad; og han havde stridt mod Moabiternes forrige Konge og taget alt hans Land fra ham indtil Arnon.
౨౬హెష్బోను, అమోరీయుల రాజైన సీహోను పట్టణం. అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధం చేసి అర్నోను వరకూ అతని దేశమంతా స్వాధీనం చేసుకున్నాడు.
27 Derfor sige de, som tale Ordsprog: „Kommer til Hesbon! Sihons Stad skal bygges og grundfæstes.
౨౭కాబట్టి సామెతలు పలికే వారు “హెష్బోనుకు రండి. సీహోను పట్టణం కట్టాలి, దాన్ని స్థాపించాలి,
28 Thi der er udgangen en Ild af Hesbon, en Lue af Sihons Stad, den har fortæret Ar i Moab, Herrerne over Arnons Høje.
౨౮హెష్బోను నుంచి అగ్ని బయలువెళ్ళింది, సీహోను పట్టణంనుంచి జ్వాలలు బయలువెళ్ళాయి, అది మోయాబుకు ఆనుకున్న ఆర్ దేశాన్ని కాల్చేసింది, అర్నోను కొండ ప్రదేశాలను కాల్చేసింది.
29 Ve dig, Moab! du, Kamos Folk, er fortabt! han har givet sine Sønner som Flygtninge og sine Døtre som Fanger til Sihon, Amoriternes Konge.
౨౯మోయాబూ, నీకు బాధ, కెమోషు ప్రజలారా, మీరు నశించారు. తన కొడుకులను పలాయనం అయ్యేలా, తన కూతుళ్ళను అమోరీయులరాజైన సీహోనుకు బందీలుగా చేశాడు.
30 Og vi have nedskudt dem; Hesbon er tabt indtil Dibon; og vi have lagt dem øde indtil Nofa, som naar indtil Medba.‟
౩౦కాని మేము సీహోనును జయించాం. హెష్బోను దీబోను వరకూ నాశనం అయ్యింది. నోఫహు వరకూ దాన్ని పాడు చేశాం. అగ్నితో మేదెబా వరకూ తగల బెట్టాం” అంటారు.
31 Saa tog Israel Bolig i Amoriternes Land.
౩౧కాబట్టి ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశంలో నివాసం ఉండడం ఆరంభించారు.
32 Og Mose sendte ud at bespejde Jaeser, og de indtoge dens tilliggende Byer; og han fordrev Amoriterne, som vare der.
౩౨అప్పుడు, యాజెరు దేశాన్ని సంచారం చేసి చూడడానికి మోషే మనుషులను పంపినప్పుడు వారు దాని గ్రామాలు స్వాధీనం చేసుకుని అక్కడున్న అమోరీయులను తోలివేశారు.
33 Og de vendte sig og droge op ad Vejen til Basan; da drog Og, Kongen af Basan, ud imod dem, han og alt hans Folk til Strid, til Edrei.
౩౩వారు తిరిగి బాషాను మార్గంలో ముందుకు వెళ్లినప్పుడు బాషాను రాజైన ఓగు, అతని జనమంతా ఎద్రెయీలో యుద్ధం చెయ్యడానికి బయలుదేరారు.
34 Og Herren sagde til Mose: Frygt ikke for ham; thi jeg har givet ham i din Haand, og alt hans Folk og hans Land; og du skal gøre ved ham, ligesom du gjorde ved Sihon, Amoriternes Konge, som boede i Hesbon.
౩౪యెహోవా మోషేతో “అతనికి భయపడొద్దు. నేను అతని మీద, అతని జనం మీద, అతని దేశం మీద నీకు విజయం ఇచ్చాను. నువ్వు హెష్బోనులో నివాసం ఉన్న అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్టు ఇతనికి కూడా చేస్తావు” అన్నాడు.
35 Og de sloge ham og hans Sønner og alt hans Folk, saa at man ikke lod nogen blive tilovers for ham, og de indtoge hans Land til Ejendom.
౩౫కాబట్టి వారు అతన్ని, అతని కొడుకులను, ఒక్కడు కూడా మిగలకుండా అతని జనం అంతటినీ హతం చేసి అతని దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.