< Jeremias 19 >
1 Saa sagde Herren: Gak hen og køb en Pottemagerkrukke, og tag med dig nogle af de Ældste for Folket og af de Ældste for Præsterne,
౧యెహోవా ఇలా చెప్పాడు,
2 og gak ud til Ben-Hinnoms Dal, som er uden for Solporten, og udraab der de Ord, som jeg vil tale til dig.
౨నువ్వు వెళ్లి కుమ్మరి చేసిన మట్టికుండ కొను. ప్రజల పెద్దల్లో కొంతమందినీ యాజకుల్లో పెద్దవారినీ వెంటబెట్టుకుని హర్సీతు ద్వారానికి ఎదురుగా ఉన్న బెన్ హిన్నోము లోయలోకి వెళ్ళి, నేను నీతో చెప్పే ఈ మాటలు అక్కడ ప్రకటించు.
3 Og du skal sige: Hører Herrens Ord, Judas Konger, og Jerusalems Indbyggere! saa siger den Herre Zebaoth, Israels Gud: Se, jeg lader komme Ulykke over dette Sted, saa at det skal runge for hvers Øren, som hører det,
౩“యూదా రాజులారా! యెరూషలేము నివాసులారా! యెహోవా మాట వినండి. సేనల అధిపతి యెహోవా, ఇశ్రాయేలు దేవుడు చెప్పేది వినండి. నేను ఈ స్థలం మీదికి విపత్తు రప్పిస్తున్నాను. దాని గురించి వినేవారందరి చెవులు గింగురుమనేటంత భయంకరంగా ఉంటుంది.
4 fordi de forlode mig og gjorde dette Sted fremmed og gjorde Røgelse der for andre Guder, hvilke de og deres Fædre og Judas Konger ikke havde kendt, og fordi de have fyldt dette Sted med de uskyldiges Blod
౪ఎందుకంటే వాళ్ళు నన్ను విడిచిపెట్టి ఈ స్థలాన్ని పాడు చేశారు. వాళ్ళకు తెలియని ఇతర దేవుళ్ళ ఎదుట ధూపం వేశారు. వాళ్ళూ వాళ్ళ పూర్వీకులూ యూదా రాజులు కూడా నిరపరాధుల రక్తంతో ఈ స్థలాన్ని నింపారు.
5 og have bygget Baals Høje for at opbrænde deres Sønner med Ild, til Brændofre for Baal; hvilket jeg ikke havde budt og ikke talt om, og som ikke var kommet mig i Tanke.
౫వాళ్ళు తమ కొడుకులను దహనబలులుగా కాల్చడానికి బయలుకు బలిపీఠాలు కట్టించారు. అలా చేయమని నేను వాళ్లకు చెప్పలేదు, అది నా మనస్సుకు ఎన్నడూ తోచలేదు.”
6 Derfor se, de Dage komme, siger Herren, da man ikke mere skal kalde dette Sted Tofeth, eller Ben-Hinnoms Dal, men Morderdal.
౬కాబట్టి యెహోవా చెప్పేదేమిటంటే “రాబోయే రోజుల్లో ఈ స్థలాన్ని ‘వధ లోయ’ అంటారు. తోఫెతు అని గానీ బెన్ హిన్నోము లోయ అని గానీ అనరు.
7 Og jeg vil udtømme Judas og Jerusalems Raad paa dette Sted og lade dem falde ved Sværdet for deres Fjenders Ansigt og i deres Haand, som søge efter deres Liv; og jeg vil give Himmelens Fugle og Dyrene paa Jorden deres døde Kroppe til Føde.
౭ఈ స్థలం లోనే యూదావారి ఆలోచనను యెరూషలేమువారి ఆలోచనను నేను వ్యర్ధం చేస్తాను. తమ శత్రువుల ఎదుట కత్తిపాలయ్యేలా చేస్తాను. తమ ప్రాణాలను తీయాలని చూసే వాళ్ళ చేతికి అప్పగిస్తాను. వాళ్ళ శవాలను రాబందులకూ అడవి జంతువులకూ ఆహారంగా ఇస్తాను.
8 Og jeg vil gøre denne Stad til Gru og til Spot; hver som gaar forbi den, skal grue og spotte over alle dens Plager.
౮ఈ పట్టణాన్ని పాడు చేసి ఎగతాళికి గురి చేస్తాను. ఆ దారిలో వెళ్ళే ప్రతివాడూ దాని కడగండ్లన్నీ చూసి నిర్ఘాంతపోయి హేళన చేస్తారు.
9 Og jeg vil lade dem æde deres Sønners Kød og deres Døtres Kød, og de skulle æde hver sin Næstes Kød, i den Belejring og Trængsel, med hvilken deres Fjender og de, som søge efter deres Liv, skulle trænge dem.
౯వాళ్ళు తమ కొడుకుల, కూతుళ్ళ శరీరాలను తినేలా చేస్తాను. తమ ప్రాణం తీయాలని చూసే శత్రువులు ముట్టడి వేసి బాధించే కాలంలో వాళ్ళు ఒకరి శరీరాన్ని ఒకరు తింటారు.
10 Og du skal sønderslaa Krukken for de Mænds Øjne, som gik med dig.
౧౦ఈ మాటలు చెప్పిన తరువాత నీతో వచ్చిన మనుష్యులు చూస్తుండగా నువ్వు ఆ కుండ పగలగొట్టి వాళ్ళతో ఇలా చెప్పాలి.”
11 Og du skal sige til dem: Saa siger den Herre Zebaoth: Saaledes vil jeg sønderslaa dette Folk og denne Stad, som man sønderslaar et Pottemagerkar, som ikke kan heles mere; og de skulle begrave i Tofeth af Mangel paa Plads til at begrave.
౧౧“సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు, మళ్ళీ బాగుచేయడానికి వీలు లేకుండా కుమ్మరివాని కుండను ఒకడు పగలగొట్టినట్టు నేను ఈ ప్రజలనూ ఈ పట్టణాన్నీ పగలగొట్టబోతున్నాను. తోఫెతులో పాతిపెట్టే చోటు దొరకనంతగా వాళ్ళను అక్కడే పాతిపెడతారు.”
12 Saaledes vil jeg handle med dette Sted, siger Herren, og med dets Indbyggere; og det for at gøre denne Stad som Tofeth.
౧౨యెహోవా వాక్కు ఇదే. “ఈ పట్టణాన్ని తోఫెతులాంటి స్థలంగా నేను చేస్తాను. ఈ స్థలానికీ అక్కడి నివాసులకూ నేనలా చేస్తాను.
13 Og Jerusalems Huse og Judas Kongers Huse skulle vorde som det Sted Tofeth, da de ere urene; ja alle de Huse, hvor de gjorde Røgelse paa Tagene til al Himmelens Hær og udøste Drikofre for andre Guder.
౧౩యెరూషలేము ఇళ్ళు, యూదా రాజుల రాజ భవనాలూ ఆ తోఫెతు స్థలం లాగే అపవిత్రమవుతాయి. ఏ ఇళ్ళ మీద ప్రజలు ఆకాశ నక్షత్ర సమూహానికి మొక్కి ఇతర దేవుళ్ళకు పానార్పణలు చేశారో ఆ ఇళ్ళన్నిటికీ ఆలాగే జరుగుతుంది.”
14 Og Jeremias kom fra Tofeth, hvor Herren havde sendt ham hen for at spaa; og han stillede sig i Herrens Hus's Forgaard og sagde til alt Folket:
౧౪యిర్మీయా ఆ ప్రవచనం చెప్పడానికి యెహోవా తనను పంపిన తోఫెతులో నుంచి వచ్చి యెహోవా మందిరపు ఆవరణంలో నిలబడి ప్రజలందరితో ఇలా చెప్పాడు,
15 Saa siger den Herre Zebaoth, Israels Gud: Se, jeg lader komme over denne Stad og over alle Stæder, som høre til den, alt det onde, som jeg har talt imod den; thi de have forhærdet deres Nakke for ikke at høre mine Ord.
౧౫“సేనల ప్రభువు యెహోవా, ఇశ్రాయేలు దేవుడు ఈ మాట చెబుతున్నాడు. ఈ ప్రజలు నా మాటలు వినకుండా మొండికెత్తారు. కాబట్టి ఈ పట్టణం గురించి నేను చెప్పిన విపత్తునంతా దాని మీదికీ దానికి సంబంధించిన పట్టణాలన్నిటి మీదికీ రప్పిస్తున్నాను.”