< Esajas 7 >
1 Og det skete i de Dage, da Akas, Jothams Søn, Usias Sønnesøn, var Konge i Juda, at Rezin, Kongen af Syrien, og Israels Konge Peka, en Søn af Remalia, droge op imod Jerusalem for at føre Krig imod den; men de formaaede ikke at stride imod den.
౧యూదా రాజైన ఉజ్జియా మనవడు, యోతాము కుమారుడు అయిన ఆహాజు దినాల్లో సిరియా రాజు రెజీను, ఇశ్రాయేలు రాజు, రెమల్యా కుమారుడు అయిన పెకహు యెరూషలేముపై దండెత్తారు. అది వారివల్ల కాలేదు.
2 Da blev det kundgjort for Davids Hus og sagt: Syrerne have lejret sig i Efraim; da bævede hans Hjerte og hans Folks Hjerte, som Træerne i Skoven bæve for Vejret.
౨అప్పుడు సిరియా వారు ఎఫ్రాయిము వారిని తోడు తెచ్చుకున్నారని దావీదు వంశం వారికి తెలిసినప్పుడు గాలికి అడవి చెట్లు ఊగినట్టు వారి హృదయాలు, వారి ప్రజల హృదయాలు గిలగిలలాడాయి.
3 Men Herren sagde til Esajas: Gak nu ud imod Akas, du og Sear-Jasub, din Søn, til Enden af Vandledningen fra den øverste Dam, ved den alfare Vej ved Blegerens Ager,
౩అప్పుడు యెహోవా యెషయాతో ఇలా చెప్పాడు. ఆహాజుకు ఎదురు వెళ్ళు. నీవు, నీ కుమారుడు షెయార్యాషూబు చాకిరేవు దారిలో ఎగువ కోనేటి కాలవ దగ్గరికి వెళ్ళండి.
4 og sig til ham: Var dig og vær stille, frygt ikke og lad ikke dit Hjerte blive forsagt for disse to Stykker rygende Brande, for Rezins og Syrernes og Remalias Søns fnysende Vrede.
౪అతనితో చెప్పు “భద్రం. కంగారు పడకు. పొగ లేస్తున్న ఈ రెండు కాగడాలకు అంటే రెజీను, సిరియా వాళ్ళు, రెమల్యా కొడుకు పెకహు-వీళ్ళ కోపాగ్నికి జడిసి పోకు. బెదిరిపోకు.
5 Fordi Syrerne have lagt onde Raad op imod dig, ligeledes Efraim og Remalias Søn, sigende:
౫సిరియా, ఎఫ్రాయిము, రెమల్యా కొడుకు నీకు కీడు చేయాలని ఆలోచించారు.
6 Vi ville drage op imod Juda og ængste det og rive det til os, og vi ville gøre Tabeals Søn til Konge derudi:
౬‘మనం యూదా దేశం మీదికి పోయి దాని ప్రజలను భయపెట్టి దాని ప్రాకారాలు పడగొట్టి టాబెయేలు కొడుకును దానిపై రాజుగా చేద్దాం రండి’ అని చెప్పుకున్నారు.”
7 Saa siger den Herre, Herre: Det skal ikke staa fast og ikke ske!
౭అయితే ప్రభువైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. “ఆ మాట నిలవదు, అది జరగదు.
8 Thi Damaskus er Hoved for Syrien og Rezin Hoved for Damaskus; og efter fem og tresindstyve Aar skal Efraim knuses, at det ikke mere skal være et Folk.
౮సిరియాకు రాజధాని దమస్కు. దమస్కుకు రాజు రెజీను. అరవై ఐదు సంవత్సరాల లోపు ఎఫ్రాయిము ఒక జాతిగా ఉండకుండా నాశనమై పోతుంది.
9 Og Samaria er Hoved for Efraim og Remalias Søn Hoved for Samaria: Ere I ej troende, blive I ej boende.
౯షోమ్రోను ఎఫ్రాయిముకు రాజధాని. షోమ్రోనుకు రాజు రెమల్యా కొడుకు. మీరు విశ్వాసంలో స్థిరంగా ఉండక పోతే భద్రంగా ఉండరు.”
10 Og Herren blev ved at tale til Akas og sagde:
౧౦యెహోవా ఆహాజుకు ఇంకా ఇలా చెప్పాడు.
11 Begær dig et Tegn af Herren, din Gud; begær det i det dybe eller oventil i det høje! (Sheol )
౧౧“నీ దేవుడైన యెహోవాను సూచన అడుగు. అది ఎంత లోతైనదైనా, ఎంత ఎత్తయినదైనా సరే.” (Sheol )
12 Men Akas sagde: Jeg vil ikke begære og ikke friste Herren.
౧౨కానీ ఆహాజు “నేను అడగను. యెహోవాను పరీక్షించను” అన్నాడు.
13 Da sagde han: Hører dog, I af Davids Hus! Er det eder lidet, at I falde Mennesker til Besvær, at I ogsaa ville falde min Gud til Besvær?
౧౩కాబట్టి యెషయా ఇలా జవాబిచ్చాడు. “దావీదు వంశస్థులారా, వినండి. మనుషులను విసికించడం చాలదన్నట్టు నా దేవుణ్ణి కూడా విసిగిస్తారా?
14 Derfor skal Herren selv give eder et Tegn: Se, Jomfruen bliver frugtsommelig og føder en Søn, og hun kalder hans Navn Immanuel.
౧౪కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపుతాడు. వినండి, కన్య గర్భం ధరించి కుమారుణ్ణి కని అతనికి ‘ఇమ్మానుయేలు’ అని పేరు పెడుతుంది.
15 Han skal æde Smør og Honning ved den Tid, han forstaar at forkaste det onde og at udvælge det gode.
౧౫కీడును తోసిపుచ్చడం, మేలును కోరుకోవడం అతనికి తెలిసి వచ్చేనాటికి అతడు పెరుగు, తేనె తింటాడు.
16 Thi førend Barnet forstaar at forkaste det onde og udvælge det gode, skal det Land, for hvis tvende Konger du gruer, vorde forladt.
౧౬కీడును తోసిపుచ్చడం, మేలును కోరుకోవడం అతనికి తెలిసి రాక ముందే ఎవరిని చూసి నువ్వు హడలి పోతున్నావో ఆ ఇద్దరు రాజుల దేశం నాశనమై పోతుంది.
17 Over dig og over dit Folk og over din Faders Hus skal Herren lade Dage komme, som ikke ere komne siden den Dag, Efraim faldt fra Juda: — Kongen af Assyrien.
౧౭యెహోవా నీ పైకి, నీ జాతి పైకి, నీ పితరుల కుటుంబం వారి మీదికి బాధ దినాలను, ఎఫ్రాయిము యూదా నుండి వేరైపోయిన దినం మొదలు నేటి వరకూ రాని దినాలను రప్పిస్తాడు. ఆయన అష్షూరు రాజును నీపైకి రప్పిస్తాడు.
18 Og det skal ske, paa den Dag skal Herren hvisle Fluerne hid, som ere yderst ved Ægyptens Floder, og Bierne, som ere i Assyriens Land,
౧౮ఆ దినాన దూరంగా ఐగుప్తు ప్రవాహాల దగ్గర ఉన్న జోరీగలను, అష్షూరు దేశపు కందిరీగలను యెహోవా ఈల వేసి పిలుస్తాడు.
19 og de skulle komme og nedlade sig alle sammen i de øde Dale og i Klippernes Revner og i alle Tornebuskene og paa alle Græsgangene.
౧౯అవన్నీ వచ్చి మెట్టల్లో లోయల్లో బండల సందుల్లో ముళ్ళ పొదలన్నిటిలో గడ్డి బీడులన్నిటిలో దిగి ఉండిపోతాయి.
20 Paa den Dag skal Herren rage Hovedet og Haarene paa Fødderne med en Ragekniv, som er lejet paa hin Side Floden, det er ved Kongen af Assyrien, og den skal ogsaa aldeles borttage Skægget.
౨౦ఆ దినాన యెహోవా నది (యూప్రటీసు) అవతలి నుండి కిరాయికి వచ్చే మంగలి కత్తితో, అంటే అష్షూరు రాజు చేత నీ తల వెంట్రుకలను కాళ్ల వెంట్రుకలను గొరిగిస్తాడు. అది నీ గడ్డాన్ని కూడా గొరిగిస్తుంది.
21 Og det skal ske paa den Dag, da skal en Mand lade en Kviekalv og to Faar leve,
౨౧ఆ దినాన ఒకడు ఒక చిన్న ఆవును, రెండు గొర్రెలను పెంచుకుంటే
22 og det skal ske, fordi de skulle give megen Mælk, at han kan æde Smør; thi hver, som bliver tilovers i Landet, skal æde Smør og Honning.
౨౨అవి సమృద్ధిగా పాలిచ్చినందువల్ల అతడు పెరుగు తింటాడు. ఎందుకంటే ఈ దేశంలో శత్రువులు వదిలేసి పోయిన వారందరూ పెరుగు తేనెలు తింటారు.
23 Og det skal ske paa den Dag, at hvert Sted, hvor der var tusinde Vinstokke, tusinde Sekel Sølv værd, skal blive til Torn og Tidsel.
౨౩ఆ దినాన వెయ్యి వెండి నాణేల విలువగల వెయ్యి ద్రాక్షచెట్లు ఉండే ప్రతి స్థలంలో ముళ్ళతుప్పలు, బ్రహ్మజెముడు చెట్లు పెరుగుతాయి.
24 Man skal gaa derhen med Pile og med Bue; thi alt Landet skal blive til Torn og Tidsel.
౨౪ఈ దేశమంతా ముళ్ళ తుప్పలతో, బ్రహ్మ జెముడు చెట్లతో నిండి ఉంటుంది గనక విల్లంబులు చేతబట్టుకుని ప్రజలు వేటకు అక్కడికి పోతారు.
25 Og til alle Bjerge, som hakkes med Hakken, skal man ikke kunne komme af Frygt for Torne og Tidsler; men de skulle være til at slippe Øksne løse paa og til at nedtrædes af Faar.
౨౫ముళ్ళతుప్పల, బ్రహ్మ జెముడు చెట్ల భయం వల్ల మునుపు పారతో తవ్వి సాగు చేసిన కొండల వైపుకు మనుషులు పోరు. అది పశువులు, గొర్రెలు పచ్చిక మేసే చోటుగా ఉంటుంది.”