< 1 Mosebog 23 >
1 Og Sara levede hundrede og syv og tyve Aar, disse vare Saras Livsaar.
౧శారా నూట ఇరవై ఏడు సంవత్సరాలు జీవించింది.
2 Og Sara døde i Kirjath-Arba, det er Hebron i Kanaans Land; da kom Abraham for at sørge over Sara og at begræde hende.
౨కనాను దేశంలో హెబ్రోను అని పిలిచే కిరియత్ ఆర్బా అనే ప్రాంతంలో ఆమె మరణించింది. అప్పుడు అబ్రాహాము శారా కోసం దుఃఖించడానికి, విలపించడానికీ వచ్చాడు.
3 Siden stod Abraham op fra sin dødes Aasyn og talede til Heths Børn og sagde:
౩తరువాత అబ్రాహాము చనిపోయిన తన భార్య దగ్గరనుండి లేచి హేతు వారసులతో ఇలా మాట్లాడాడు,
4 Jeg er en fremmed og Gæst hos eder, giver mig en Ejendom til en Begravelse hos eder, at jeg kan begrave min døde og bringe hende bort fra mit Ansigt.
౪“నేను మీ మధ్య ఒక పరదేశిగానూ పరాయి వాడిగానూ ఉన్నాను. చనిపోయిన నా భార్య నా కళ్ళెదుట ఉంది. చనిపోయిన నా వాళ్ళను పాతిపెట్టడానికి నాకు ఒక స్మశాన భూమిని సొంతానికి ఇవ్వండి” అన్నాడు.
5 Da svarede Heths Børn Abraham og sagde til ham:
౫దానికి హేతు వారసులు ఇలా అన్నారు “అయ్యా, మేము చెప్పేది వినండి. నువ్వు మా మధ్య ఒక మహారాజులా ఉన్నావు.
6 Hør os, min Herre! du er en Guds Fyrste iblandt os, begrav din døde i vore bedste Grave, ingen af os skal formene dig sin Grav, at du jo maa begrave din døde.
౬మా శ్మశాన భూముల్లో అతి శ్రేష్ఠమైన దాంట్లో చనిపోయిన నీ వాళ్ళను పాతి పెట్టు. చనిపోయిన నీ భార్యను పాతి పెట్టడానికి మాలో ఎవరూ తమ భూమిని నీకివ్వడానికి నిరాకరించరు.”
7 Da stod Abraham op og bøjede sig for Folket i Landet, for Heths Børn.
౭అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశ ప్రజలైన హేతు వారసుల ముందు సాగిల పడ్డాడు.
8 Og han talede med dem sigende: Dersom det er med eders Villie, at jeg maa begrave min døde og bringe hende bort fra mit Ansigt, da hører mig og beder for mig hos Efron, Zokars Søn,
౮“చనిపోయిన నా భార్యను పాతిపెట్టే విషయంలో మీరు నాతో ఏకీభవిస్తే నా మాట వినండి. సోహరు కొడుకైన ఎఫ్రోనుతో నా తరపున మాట్లాడండి.
9 at han vil give mig Hulen Makpela, som er hans, som er ved Enden af hans Ager; han give mig den for fuld Værdi midt iblandt eder til en Begravelses Ejendom.
౯అతని పొలం చివరన ఉన్న మక్పేలా గుహను నాకు ఇమ్మని అతనితో మనవి చేయండి. అది నా సొంత స్మశానంగా ఉండటానికి దాన్ని పూర్తి వెలకు నాకు అమ్మమని చెప్పండి” అన్నాడు.
10 Men Efron sad midt iblandt Heths Børn; da svarede Efron den Hethiter Abraham, saa at Heths Børn hørte derpaa, alle de, som gik ind ad hans Stads Port sigende:
౧౦ఆ ఎఫ్రోను హేతు సంతతివారి మధ్యలోనే కూర్చుని ఉన్నాడు. హిత్తీయుడైన ఎఫ్రోను ఆ పట్టణ ద్వారం లో ప్రవేశించే వారందరి ముందు హేతు సంతతివారు వింటుండగా అబ్రాహాముకు ఇలా చెప్పాడు.
11 Nej, min Herre, hør mig! jeg giver dig den Ager, og Hulen, som er paa den, giver jeg dig, for mit Folks Børns Øjne giver jeg dig den, begrav din døde!
౧౧“అయ్యా, అలా కాదు. నేను చెప్పేది వినండి. ఆ పొలాన్నీ దానిలో ఉన్న గుహను కూడా మీకిస్తున్నాను. నా ప్రజలందరి సమక్షంలోనే దాన్ని మీకిస్తున్నాను. చనిపోయిన మీ భార్యను పాతిపెట్టడానికి మీకిస్తున్నాను.”
12 Da bøjede Abraham sig for Folket i Landet,
౧౨అప్పుడు అబ్రాహాము ఆ దేశపు ప్రజల ముందు సాగిల పడ్డాడు.
13 og han talede med Efron i Folkets Paahør i Landet og sagde: Gid du dog blot vilde høre mig; jeg giver Sølv for Ageren, tag det af mig, og jeg vil begrave min døde der.
౧౩“నీ కిష్టమైతే నా మనవి విను. ఆ పొలానికి వెల చెల్లిస్తాను. నా దగ్గర వెల పుచ్చుకో. అప్పుడు నా భార్యను అక్కడ పాతిపెడతాను” అని అందరికీ వినపడేలా చెప్పాడు.
14 Da svarede Efron Abraham og sagde til ham:
౧౪దానికి ఎఫ్రోను ఇలా జవాబిచ్చాడు.
15 Min Herre, hør mig! den Jord er fire Hundrede Sekel Sølv værd; hvad er det imellem mig og dig? begrav ikkun din døde.
౧౫“అయ్యా, విను. ఆ భూమి వెలగా నాలుగు వందల షెకెల్ల వెండి చెల్లిస్తే చాలు. ఆ మాత్రం మొత్తం నీకూ నాకూ ఎంత? చనిపోయిన నీ భార్యను పాతిపెట్టుకో” అన్నాడు.
16 Og Abraham lød Efron, og Abraham tilvejede Efron det Sølv, hvilket han havde nævnet, i Heths Børns Paahør, fire Hundrede Sekel Sølv, gængse i Køb.
౧౬అబ్రాహాము ఎఫ్రోను చెప్పిన మాట విన్నాడు. హేతు కుమారులకు వినబడేలా ఎఫ్రోను చెప్పిన వెలను అంటే వర్తకుల తూకం ప్రకారం నాలుగు వందల షెకెల్ల వెండిని అబ్రాహాము తూచి అతనికి ఇచ్చాడు.
17 Saa blev Efrons Ager, som er ved Makpela, som er tværs over for Mamre, Ageren og Hulen, som er paa den, og alle Træer, som vare paa Ageren inden al dens Grænse, stadfæstede
౧౭ఆ విధంగా మమ్రే పక్కనే ఉన్న మక్పేలా లోని ఎఫ్రోను పొలం, దాంట్లో ఉన్న గుహ, ఆ పొలంలోనూ దాని సరిహద్దుల్లోనూ ఉన్న చెట్లతో సహా
18 Abraham til en Ejendom i Heths Børns Aasyn, for alle, som gik ind ad hans Stads Port.
౧౮ఆ ఊరి ద్వారంలో ప్రవేశించే వారందరి ముందు హేతు వారసుల సమక్షంలో అబ్రాహాముకు స్వాధీనం అయింది.
19 Og siden begrov Abraham Sara, sin Hustru, i Hulen paa Ageren, i Makpela tværs over for Mamre, det er Hebron i Kanaans Land.
౧౯ఆ తరువాత అబ్రాహాము కనాను దేశంలో హెబ్రోను అని పిలిచే మమ్రే పక్కనే ఉన్న మక్పేలా పొలం లోని గుహలో తన భార్య శారాను పాతిపెట్టాడు.
20 Saa blev Ageren og Hulen paa den stadfæstede Abraham til en Begravelses Ejendom af Heths Børn.
౨౦ఆ విధంగా ఆ పొలాన్నీ, దాంట్లో ఉన్న గుహనీ శ్మశానం కోసం అబ్రాహాముకు హేతు సంతతి వారు ఇవ్వడం వల్ల అవి అతని సొంతం అయ్యాయి.