< Ezra 7 >
1 Og efter disse Begivenheder under Artakserkses, Kongen af Persiens, Regering, drog Esra op, en Søn af Seraja, der var en Søn af Asaria, en Søn af Hilkia,
౧ఈ విషయాలన్నీ జరిగిన తరువాత పర్షియా దేశపు రాజు అర్తహషస్త పాలనలో ఎజ్రా బబులోను నుండి యెరూషలేము పట్టణానికి వచ్చాడు. ఇతడు శెరాయా కొడుకు. శెరాయా అజర్యా కొడుకు, అజర్యా హిల్కీయా కొడుకు.
2 en Søn af Sallum, en Søn af Zadok, en Søn af Ahitub,
౨హిల్కీయా షల్లూము కొడుకు, షల్లూము సాదోకు కొడుకు, సాదోకు అహీటూబు కొడుకు,
3 en Søn af Amaria, en Søn af Asaria, en Søn af Merajoth,
౩అహీటూబు అమర్యా కొడుకు, అమర్యా అజర్యా కొడుకు, అజర్యా మెరాయోతు కొడుకు,
4 en Søn af Serakia, en Søn af Ussi, en Søn af Bukki,
౪మెరాయోతు జెరహ్యా కొడుకు, జెరహ్యా ఉజ్జీ కొడుకు, ఉజ్జీ బుక్కీ కొడుకు,
5 en Søn af Abisua, en Søn af Pinehas, en Søn af Eleasar, som var en Søn af Ypperstepræsten Aron, —
౫బుక్కీ అబీషూవ కొడుకు, అబీషూవ ఫీనెహాసు కొడుకు, ఫీనెహాసు ఎలియాజరు కొడుకు, ఎలియాజరు ప్రధాన యాజకుడు అహరోను కొడుకు.
6 denne Esra drog op fra Babel, og han var en skriftlærd, forfaren i Mose Lov, som Herren Israels Gud havde givet, og Kongen gav ham, efterdi Herren, hans Guds Haand var over ham, al hans Begæring.
౬ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే ధర్మశాస్త్రంలో ప్రావీణ్యం ఉన్న లేఖికుడు. దేవుడైన యెహోవా కాపుదల అతనిపై ఉండడం వల్ల అతడు ఏమి కోరినా రాజు అతని మనవులు అంగీకరించాడు.
7 Og der drog nogle af Israels Børn og af Præsterne og Leviterne og Sangerne og Portnerne og de livegne op til Jerusalem i Kong Artakserkses's syvende Aar.
౭రాజైన అర్తహషస్త పాలన ఏడో సంవత్సరంలో కొందరు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, గాయకులు, ద్వార పాలకులు, దేవాలయ సేవకులు బయలుదేరి యెరూషలేము పట్టణానికి వచ్చారు.
8 Og han kom til Jerusalem i den femte Maaned, det var Kongens syvende Aar.
౮రాజు పాలనలో ఏడో సంవత్సరం ఐదో నెలలో ఎజ్రా యెరూషలేము వచ్చాడు.
9 Thi paa den første Dag i den første Maaned besluttede han at drage op fra Babel, og paa den første Dag i den femte Maaned kom han til Jerusalem, efterdi hans Guds gode Haand var over ham.
౯అతడు మొదటి నెల మొదటి రోజున బబులోను దేశం నుండి బయలుదేరి, తన దేవుని కాపుదలతో ఐదో నెల మొదటి రోజుకు యెరూషలేము చేరుకున్నాడు.
10 Thi Esra havde beredt sit Hjerte til at søge Herrens Lov og at gøre og at lære Israel Skik og Ret.
౧౦ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని ప్రకారం నడుచుకోవాలని, ఇశ్రాయేలీయులకు దాని చట్టాలను, ఆజ్ఞలను నేర్పాలని స్థిరంగా నిశ్చయం చేసుకున్నాడు.
11 Og dette er Afskriften af Brevet, som Kong Artakserkses gav den skriftlærde Esra, Præsten, den skriftlærde i Herrens Ord, angaaende hans Bud og hans Skikke for Israel:
౧౧యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞల, చట్టాల విషయంలో లేఖికుడు, యాజకుడు అయిన ఎజ్రాకు అర్తహషస్త రాజు పంపిన ఉత్తరం నకలు.
12 Artakserkses, Kongers Konge, til Esra, Præsten, den skriftlærde i Himmelens Guds Lov, og saa videre.
౧౨“రాజైన అర్తహషస్త రాస్తున్నది, ఆకాశంలో ఉండే దేవుని ధర్మశాస్త్రంలో ప్రవీణుడు, యాజకుడు అయిన ఎజ్రాకు క్షేమం కలుగు గాక.
13 Der er givet Befaling af mig, at af Israels Folk og dets Præster og Leviter, hver i mit Rige, som frivilligt vil drage op til Jerusalem, maa drage med dig,
౧౩నీ చేతిలో ఉన్న నీ దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి యూదా, యెరూషలేము పరిస్థితులను తనిఖీ చేయడానికి రాజు, ఏడుగురు మంత్రులు నిన్ను పంపించారు. కాబట్టి మేము ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాం.
14 fordi du er sendt af Kongen og hans syv Raadsherrer til at anstille Undersøgelse i Juda og i Jerusalem ved din Guds Lov, som er i din Haand,
౧౪మా రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలీయుల్లోని యాజకులు, లేవీయుల్లో ఎవరైతే యెరూషలేము పట్టణానికి వెళ్ళడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారో వాళ్ళంతా నీతో కలసి వెళ్లవచ్చు.
15 og for at føre med dig det Sølv og Guld, som Kongen og hans Raadsherrer frivilligt have givet til Israels Gud, hvis Bolig er i Jerusalem,
౧౫యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు దేవునికి రాజు, అతని మంత్రులు ఇష్టపూర్వకంగా సమర్పించిన వెండి బంగారాలను నీ వెంట తీసుకు వెళ్ళాలి.
16 samt alt det Sølv og Guld, som du kan finde i hele Babels Land, tillige med den frivillige Gave, som Folket og Præsterne give frivilligt til deres Guds Hus, som er i Jerusalem.
౧౬ఇంకా బబులోను రాజ్యమంతటా నీకు దొరికే వెండి బంగారంతో పాటు ప్రజలు, యాజకులు యెరూషలేములో ఉన్న తమ దేవుని మందిరానికి స్వచ్ఛందంగా సమర్పించే వస్తువులను కూడా నువ్వు తీసుకు వెళ్ళాలి.
17 Derfor skal du straks købe for samme Sølv: Øksne, Vædre, Lam og deres Madoffer og deres Drikoffer, og du skal ofre dem paa Alteret, som er ved eders Guds Hus, som er i Jerusalem.
౧౭ఆలస్యం చేయకుండా నువ్వు ఆ సొమ్ముతో ఎద్దులను, పొట్లేళ్లను, గొర్రె పిల్లలను, వాటికి చెందిన నైవేద్యాలను, పానార్పణలను కొనుగోలు చేసి యెరూషలేములో ఉన్న మీ దేవుని మందిరంలో బలిపీఠం మీద వాటిని అర్పించు.
18 Tilmed hvad der synes dig og dine Brødre godt at gøre med det øvrige Sølv og Guld, det gører efter eders Guds Vilje!
౧౮మిగిలిన వెండి బంగారాలతో మీ దేవుని చిత్తానుసారం నీకూ, మీవారికీ సముచితంగా అనిపించిన దాన్ని చేయవచ్చు.
19 Og de Kar, som ere givne dig til din Guds Hus's Tjeneste, dem skal du aflevere for Gud i Jerusalem.
౧౯మీ దేవుని మందిరం సేవ కోసం నీకు ఇచ్చిన వస్తువులన్నిటినీ యెరూషలేములోని దేవుని సన్నిధిలో అప్పగించాలి.
20 Og det øvrige, som behøves til din Guds Hus, som tilfalder dig at give, skal du udrede af Kongens Skatkammer.
౨౦మీ దేవుని మందిర విషయంలో మీకు అవసరమైనవి ఇంకా ఏవైనా కావలసివస్తే వాటిని రాజు ధనాగారం నుండి నువ్వు పొందవచ్చు.”
21 Og af mig, mig Kong Artakserkses, er given Befaling til alle Skatmestre, som ere paa hin Side Floden, at hvad som Esra, Præsten, den skriftlærde i Himmelens Guds Lov, begærer af eder, det skal ydes straks,
౨౧అంతే గాక అతడు “రాజునైన అర్తహషస్త అనే నేను స్వయంగా నది అవతల ఖజానా అధికారులైన మీకు ఇచ్చే ఆజ్ఞ ఏమిటంటే, ఆకాశంలో ఉండే దేవుని ధర్మశాస్త్రం లేఖికుడు, యాజకుడు అయిన ఎజ్రా మిమ్మల్ని ఏదైనా అడిగినప్పుడు ఆలస్యం చేయకుండా మీరు వాటిని అతనికి అందజేయండి.
22 indtil hundrede Centner Sølv og indtil hundrede Kor Hvede og indtil hundrede Bath Vin og indtil hundrede Bath Olie, og Salt uden foreskrevet Maal.
౨౨మూడున్నర టన్నుల వెండి, వెయ్యి తూముల గోదుమలు రెండు వేల రెండు వందల లీటర్ల ద్రాక్షారసం, మూడు వందల తూముల నూనె, ఇంకా అవసరమైన దాని కంటే మించి ఉప్పు ఇవ్వండి.
23 Alt det, som er efter Himmelens Guds Befaling, skal omhyggeligt udføres for Himmelens Guds Hus, at der ikke skal komme en Vrede over Kongens og hans Børns Rige.
౨౩ఆకాశంలో ఉండే దేవుడు ఏమి నిర్ణయించాడో దానినంతా ఆ దేవుని మందిరానికి జాగ్రత్తగా చేయించండి. రాజ్యం మీదికి, రాజు మీదికి, రాజ కుమారుల మీదికి ఎందుకు దేవుని కోపం రగులుకొనేలా చేసుకోవాలి?
24 Og vi lade eder vide om alle Præster og Leviter, Sangere, Portnere, livegne og dette Guds Hus's Tjenere, at I ikke skulle have Magt til at lægge Skat, Told eller aarlig Rente paa dem.
౨౪యాజకులు, లేవీయులు, గాయకులు, ద్వారపాలకులు, దేవాలయ పరిచారకులు, దేవుని మందిరంలో పనిచేసేవారి విషయంలో మా నిర్ణయం ఏమిటంటే, వారిపై శిస్తు గానీ, సుంకం గానీ, పన్ను గానీ విధించే అధికారం మీకు లేదని గ్రహించండి.
25 Og du, Esra, efter din Guds Visdom, som er hos dig, beskik Dommere og lovkyndige, at de maa dømme over alt Folket, som er paa hin Side Floden, over alle dem, som kender din Guds Lov; og den, som ikke kender den, skulle I bringe til at kende den.
౨౫ఎజ్రా, నీవు నది అవతలి వైపు ప్రజలకు న్యాయం చేయడానికి నీ దేవుడు నీకు అనుగ్రహించిన జ్ఞానంతో నువ్వు నీ దేవుని ధర్మశాస్త్ర విధులు తెలిసిన వారిలో కొందరిని అధికారులుగా, న్యాయాధిపతులుగా నియమించాలి. ధర్మశాస్త్ర విధులు తెలియని వారికి వాటిని నేర్పించాలి.
26 Og hver den, som ikke gør efter din Guds Lov og Kongens Lov, over ham skal Dommen straks udføres, enten til Døden eller til Landflygtighed eller til Straf paa Gods eller til Fængsel.
౨౬మీ దేవుని ధర్మశాస్త్రాన్ని, రాజు నియమించిన చట్టాలను గైకొనని వారిపై త్వరగా విచారణ జరిపి, వారికి మరణశిక్షగానీ, దేశ బహిష్కరణగానీ, వారి ఆస్తులను జప్తు చేయడం గానీ, చెరసాల గానీ విధించాలి.”
27 Lovet være Herren, vore Fædres Gud, som har indgivet Kongens Hjerte saadant, at han vilde pryde Herrens Hus, som er i Jerusalem,
౨౭యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి ఘనత కలిగేలా చేయడానికి రాజుకు అలాంటి ఆలోచన పుట్టించినందుకు మన పూర్వీకుల దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగు గాక. రాజు, అతని మంత్రులు, ఆస్థాన అధిపతులు నాపై దయ చూపేలా దేవుడు అనుగ్రహించాడు.
28 og har tilvendt mig Miskundhed fra Kongen og hans Raadsherrer og fra alle Kongens vældige Fyrster! Og jeg følte mig stærk, efterdi Herrens, min Guds, Haand var over mig og samlede de Øverste af Israel til at drage op med mig.
౨౮నా దేవుడైన యెహోవా కాపుదల నాకు తోడుగా ఉన్నందువల్ల నేను బలపడి, నాతో కలసి పనిచేయడానికి ఇశ్రాయేలీయుల ప్రధానులను సమావేశపరిచాను.