< Anden Krønikebog 30 >

1 Siden sendte Ezekias til al Israel og Juda og skrev ogsaa Breve til Efraim og Manasse, at de skulde komme til Herrens Hus i Jerusalem, at holde Herren, Israels Gud, Paaske.
హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు పస్కాపండగ ఆచరించడానికి యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి రావాలని ఇశ్రాయేలు, యూదావారందరికీ వార్తాహరులనూ, ఎఫ్రాయిమీయులకు మనష్షే వారికి ఉత్తరాలనూ పంపాడు.
2 Thi Kongen havde holdt et Raad med sine Fyrster og hele Forsamlingen i Jerusalem, at de vilde holde Paaske i den anden Maaned.
అప్పుడు తమను పవిత్రం చేసుకున్న యాజకులు చాలినంతమంది లేరు గనక ప్రజలు యెరూషలేములో సమకూడలేదు. కాబట్టి మొదటి నెలలో పస్కాపండగ జరపలేక పోయారు.
3 Thi de kunde ikke holde den til den rette Tid; thi Præsterne havde ikke helliget sig i tilstrækkeligt Antal, og Folket var ikke samlet til Jerusalem.
రాజూ, అతని అధికారులూ, యెరూషలేములో ఉన్న సమాజం వారంతా పస్కాను రెండవ నెలలో ఆచరించాలని నిర్ణయించారు.
4 Og den Sag syntes ret for Kongens Øjne og for den ganske Forsamlings Øjne.
ఈ విషయం రాజుకూ సమాజం వారందరికీ సమంజసం అనిపించింది.
5 Og de toge den Bestemmelse, at de vilde lade udraabe igennem al Israel fra Beersaba og indtil Dan, at de skulde komme og holde Herren, Israels Gud, Paaske i Jerusalem; thi de havde ikke holdt den i noget stort Antal, som det var foreskrevet.
చాలా కాలం నుంచి లేఖనంలో రాసినట్టు ఎక్కువమంది ప్రజలు పండగ ఆచరించ లేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండగ ఆచరించడానికి రావాలని బెయేర్షెబా నుంచి దాను వరకూ ఇశ్రాయేలు దేశమంతా చాటించాలని వారు నిర్ణయించారు.
6 Og Løberne gik med Breve fra Kongens og hans Øversters Haand igennem al Israel og Juda og efter Kongens Befaling og sagde: I Israels Børn! vender om til Herren, Abrahams, Isaks og Israels Gud, saa skal han vende sig om til de undkomne, som ere blevne tilovers for eder fra Assyriens Kongers Haand.
కాబట్టి వార్తాహరులు రాజు దగ్గరా అతని అధికారుల దగ్గరా ఉత్తరాలు తీసుకు, యూదా ఇశ్రాయేలు దేశాలంతా తిరిగి రాజాజ్ఞను ఇలా చాటించారు, “ఇశ్రాయేలు ప్రజలారా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగండి. మీరు ఆయన వైపు తిరిగితే, అప్పుడు అష్షూరు రాజుల చేతిలోనుంచి తప్పించుకుని మిగిలిన మీ వైపు ఆయన తిరుగుతాడు.
7 Og værer ikke som eders Fædre og som eders Brødre, der forgrebe sig imod Herren, deres Fædres Gud; derfor gav han dem hen til en Ødelæggelse, saaledes som I se.
తమ పూర్వీకుల దేవుడైన యెహోవా పట్ల ద్రోహంగా ప్రవర్తించిన మీ పూర్వీకులలాగా మీ సోదరులలాగా మీరు ప్రవర్తించవద్దు. మీరు చూస్తున్నట్టు ఆయన వారిని నాశనానికి అప్పగించాడు.
8 Nu, forhærder ikke eders Nakke som eders Fædre, giver Herren Haanden og kommer til hans Helligdom, som han har helliget evindelig, og tjener Herren eders Gud, saa skal hans strenge Vrede vende sig fra eder.
మీ పూర్వికుల్లాగా మీరు అవిధేయులుగ ప్రవర్తించ కండి. యెహోవాకు లోబడి, ఆయన శాశ్వతంగా పరిశుద్ధ పరచిన ఆయన పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి, మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీది నుంచి తొలగి పోయేలా ఆయన్ని సేవించండి.
9 Thi naar I omvende eder til Herren, skulle eders Brødre og eders Børn finde Barmhjertighed for deres Ansigt, som holde dem fangne, saa at de skulle komme tilbage til dette Land; thi Herren eders Gud er naadig og barmhjertig og skal ikke lade sit Ansigt vige fra eder, dersom I omvende eder til ham.
మీరు యెహోవా వైపు తిరిగితే మీ సోదరుల పైనా, మీ పిల్లల పైనా వారిని బందీలుగా తీసుకు పోయిన వారికి దయ కలుగుతుంది. వారు ఈ దేశానికి తిరిగి వస్తారు. మీ దేవుడైన యెహోవా కృప, జాలి గలవాడు కాబట్టి మీరు ఆయనవైపు తిరిగితే ఆయన మీ వైపునుంచి తన ముఖం తిప్పుకోడు.”
10 Og Løberne gik fra den ene Stad til den anden i Efraims og Manasses Land og indtil Sebulon; men man lo ad dem og bespottede dem.
౧౦వార్తాహరులు జెబూలూను దేశం వరకూ, ఎఫ్రాయిము మనష్షేల దేశాల్లో ఉన్న ప్రతి పట్టణానికీ వెళ్ళారు గాని అక్కడి వారు ఎగతాళి చేసి వారిని అపహసించారు.
11 Dog nogle af Aser og Manasse og af Sebulon ydmygede sig og kom til Jerusalem.
౧౧అయినా, ఆషేరు మనష్షే, జెబూలూను గోత్రాల్లో కొంతమంది తమను తాము తగ్గించుకుని యెరూషలేము వచ్చారు.
12 Guds Haand var og over Juda, saa at han gav dem et Hjerte til at gøre efter Kongens og de Øverstes Bud, efter Herrens Ord.
౧౨యెహోవా ఆజ్ఞను బట్టి రాజు, అతని అధికారులు, ఆజ్ఞాపించిన వాటిని నెరవేర్చేలా యూదా వారికి ఏక మనస్సు కలిగించ డానికి దేవుని హస్తం వారి మీద ఉంది.
13 Og der samledes meget Folk til Jerusalem for at holde de usyrede Brøds Højtid i den anden Maaned, en saare stor Forsamling.
౧౩రెండవ నెలలో పొంగని రొట్టెల పండగ ఆచరించడానికి ప్రజలు గొప్ప సమూహంగా యెరూషలేములో సమకూడారు.
14 Og de gjorde sig rede og borttoge Altrene, som vare i Jerusalem, og de borttoge alle Røgelsekar og kastede dem i Kedrons Bæk.
౧౪యెరూషలేములో ఉన్న బలిపీఠాలను ధూపవేదికలను తీసివేసి, కిద్రోను వాగులో పారవేశారు.
15 Og de slagtede Paaskelammet den fjortende Dag i den anden Maaned; og Præsterne og Leviterne bleve skamfulde, og de helligede sig og førte Brændofre til Herrens Hus.
౧౫రెండవ నెల 14 వ రోజున వారు పస్కాగొర్రెపిల్లను వధించారు. యాజకులు లేవీయులు సిగ్గుపడి, తమను ప్రతిష్ఠించుకుని దహనబలిపశువులను యెహోవా మందిరంలోకి తీసుకు వచ్చారు.
16 Og de stode paa deres Sted, efter deres Skik, efter Moses, den Guds Mands Lov; Præsterne stænkede Blodet, hvilket de modtoge af Leviternes Haand.
౧౬దేవుని సేవకుడు మోషే నియమించిన ధర్మశాస్త్రంలోని ఉపదేశం ప్రకారం, వారు తమ స్థలం లో నిలబడ్డారు. యాజకులు, లేవీయుల చేతికి బాలి రక్తం అందించగా వారు దాన్ని చిలకరించారు.
17 Thi der var mange i Forsamlingen, som ikke havde helliget sig, derfor slagtede Leviterne Paaskelammene for alle dem, som ikke vare rene, for at hellige dem for Herren.
౧౭సమాజంలో తమను పరిశుద్ధ పరచుకొనని వారు అనేకమంది ఉన్నారు. అలా పరిశుద్ధ పరచుకొనని వారి కోసం పస్కా పశువులను లేవీయులు వధించాల్సి వచ్చింది.
18 Thi der var meget Folk, meget af Efraim og Manasse, Isaskar og Sebulon, som ikke vare rensede, men dog aade Paaskelam, ikke som det var foreskrevet; men Ezekias bad for dem og sagde: Herren, som er god, gøre Forligelse
౧౮ఎఫ్రాయిము మనష్షే ఇశ్శాఖారు జెబూలూను ప్రదేశాలనుంచి వచ్చిన ప్రజల్లో చాలామంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండా లేఖనాలకు విరుద్ధంగా పస్కా భుజించారు. వారి కోసం హిజ్కియా ఇలా ప్రార్థించాడు,
19 for hver den, som har beredet sit Hjerte til at søge Gud Herren, sine Fædres Gud, om det end ikke er efter Helligdommens Renhed!
౧౯“పరిశుద్ధమందిర శుద్ధీకరణ ప్రమాణాల ప్రకారం అశుద్ధంగా ఉన్నవారు, తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను వెదకడానికి తమ హృదయాన్ని సిద్ధపరచుకుంటే, అలాటి వారినందరినీ దయ గల యెహోవా క్షమించును గాక.”
20 Og Herren bønhørte Ezekias og lægede Folket.
౨౦యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి ప్రజలను బాగుచేశాడు.
21 Saa holdt Israels Børn, som fandtes i Jerusalem, de usyrede Brøds Højtid syv Dage med stor Glæde; og Præsterne og Leviterne lovede Herren Dag for Dag med stærkt lydende Instrumenter for Herren.
౨౧యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలువారు ఏడు రోజులు తను పరిశుద్ధ పరచుకోకుండా ఉండిపోయిన వారు అనేకమంది ఉన్నారు. అలా పరిశుద్ధ పరచుకొనని వారి కోసం పస్కా పశువులను లేవీయులు వధించాల్సి వచ్చింది. ఏడూ రోజులపాటు రొట్టెల పండగను చాలా ఆనందంగా ఆచరించారు. లేవీయులూ, యాజకులూ సంగీత వాద్యాలతో పాటలు పాడుతూ ప్రతిరోజూ యెహోవాను స్తుతించారు.
22 Og Ezekias talte kærligt til alle de Leviter, som viste god Forstand paa, hvad der vedkom Herren; og de aade Højtidsofre syv Dage og ofrede Takofre og takkede Herren, deres Fædres Gud.
౨౨యెహోవా సేవను అర్థం చేసుకున్న లేవీయులందరితో హిజ్కియా ప్రోత్సాహకరమైన మాటలు పలికాడు. ఏడురోజులపాటు వారు సమాధాన బలులు అర్పిస్తూ, తమ పూర్వీకుల దేవుడైన యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఏడు రోజులు పస్కా పండగ సమయమంతా తమ నియమిత భాగం తింటూ ఆచరించారు.
23 Da den ganske Forsamling havde holdt Raad om at holde andre syv Dage, saa holdt de endnu syv Dage med Glæde.
౨౩సమాజమంతా ఇది చూసి, ఇంకా 7 రోజులు పండగ ఆచరించాలని ఆలోచించి మరి 7 రోజులు ఆనందంగా దాన్ని ఆచరించారు.
24 Thi Ezekias, Judas Konge, gav til Forsamlingen tusinde Okser og syv Tusinde Faar, og de Øverste gave til Forsamlingen tusinde Okser og ti Tusinde Faar; saa helligede mange Præster sig.
౨౪యూదా రాజు హిజ్కియా, సమాజానికి బలి అర్పణల కోసం 1,000 కోడెలను, 7,000 గొర్రెలను ఇచ్చాడు. అధికారులు 1,000 కోడెలను, 10,000 గొర్రెలూ మేకలూ ఇచ్చారు. చాలామంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నారు.
25 Og hele Forsamlingen af Juda glædede sig og Præsterne og Leviterne og den hele Forsamling, som var kommen fra Israel, og de fremmede, som vare komne fra Israels Land, og de som boede i Juda.
౨౫అప్పుడు యాజకులు, లేవీయులు, యూదా, ఇశ్రాయేలువారిలో నుంచి వచ్చిన సమాజమంతా, ఇశ్రాయేలు దేశంలోనుంచి వచ్చి యూదాలో నివాసమున్న అన్యులు కూడా సంతోషించారు.
26 Og der var en stor Glæde i Jerusalem; thi fra Salomos, Davids Søns, Israels Konges, Dage af var ikke sket noget saadant i Jerusalem.
౨౬యెరూషలేము నివాసులు ఎంతో ఆనందించారు. ఇశ్రాయేలు రాజు దావీదు కొడుకు సొలొమోను కాలం తరువాత ఇలా జరగలేదు.
27 Da stode Præsterne, Leviterne, op og velsignede Folket, og deres Røst blev hørt; thi deres Bøn kom til hans hellige Bolig i Himmelen.
౨౭అప్పుడు లేవీయులైన యాజకులు లేచి ప్రజలను దీవిస్తే వారి మాటలు వినబడ్డాయి. వారి ప్రార్థన దేవుడు ఉండే పరిశుద్ధ స్థలం, అంటే పరలోకానికి చేరింది.

< Anden Krønikebog 30 >