< Anden Krønikebog 24 >
1 Joas var syv Aar gammel, der han blev Konge, og regerede fyrretyve Aar i Jerusalem, og hans Moders Navn var Zibna fra Beersaba.
౧యోవాషు పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు అతని వయస్సు ఏడేళ్ళు. అతడు యెరూషలేములో 40 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి బెయేర్షెబాకు చెందిన జిబ్యా.
2 Og Joas gjorde det, som var ret for Herrens Øjne, i alle Præsten Jojadas Dage.
౨యాజకుడు యెహోయాదా బతికిన రోజులన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్ధంగా ప్రవర్తించాడు.
3 Og Jojada tog ham to Hustruer, og han avlede Sønner og Døtre.
౩యెహోయాదా అతనికి ఇద్దరు స్త్రీలనిచ్చి పెళ్ళి చేశాడు. అతనికి కొడుకులూ, కూతుళ్ళూ కలిగారు.
4 Og det skete derefter, at det laa Joas paa Hjerte at forny Herrens Hus.
౪ఇదంతా జరిగిన తరువాత యెహోవా మందిరాన్ని బాగుచేయాలని యోవాషు నిర్ణయించుకున్నాడు.
5 Og han samlede Præsterne og Leviterne og sagde til dem: Drager ud til Judas Stæder og samler Penge ind af al Israel til at udbedre eders Guds Hus Aar for Aar, og I skulle skynde eder med Gerningen; men Leviterne skyndte sig ikke.
౫అతడు యాజకులనూ లేవీయులనూ ఒక చోట సమావేశపరచి వారితో ఇలా అన్నాడు “మీరు యూదా పట్టణాలకు పోయి మీ దేవుని మందిరం బాగుచేయడానికి ఇశ్రాయేలీయులందరి దగ్గర నుంచి ధనం ప్రతి సంవత్సరం పోగుచేయాలి. ఈ పని మీరు త్వరగా మొదలుపెట్టాలి.” మొదట్లో లేవీయులు ఆ పని త్వరగా చేయలేదు.
6 Da kaldte Kongen ad Jojada, den Ypperstepræst, og sagde til ham: Hvorfor giver du ikke Agt paa Leviterne, at de fra Juda og Jerusalem bringe det Paalæg, som Mose, Herrens Tjener, og Israels Menighed har bestemt, ind til Vidnesbyrdets Paulun?
౬అందుకు రాజు ప్రధాన యాజకుడు యెహోయాదాను పిలిపించాడు. “సాక్ష్యపు గుడారాన్ని బాగు చేయడానికి యూదాలో నుండీ, యెరూషలేములో నుండీ, ఇశ్రాయేలీయుల సమాజానికి యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీవెందుకు చెప్పి తెప్పించ లేదు?” అని అడిగాడు.
7 Thi under den ugudelige Athalia havde hendes Sønner gjort Brud paa Guds Hus; ja endog alt det, som var helliget til Herrens Hus, havde de anvendt til Baalerne.
౭ఎందుకంటే దుర్మార్గురాలైన అతల్యా కొడుకులు దేవుని మందిరాన్ని పాడు చేసి, యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్ఠ ఉపకరణాలన్నిటినీ బయలు దేవుడి పూజకు ఉపయోగించారు.
8 Da befalede Kongen, og de gjorde en Kiste, og de satte den udenfor i Herrens Hus's Port.
౮కాబట్టి రాజాజ్ఞ ప్రకారం వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిర ద్వారం బయట ఉంచారు.
9 Og de lode udraabe i Juda og i Jerusalem, at de skulde bringe for Herren det Paalæg, som Mose, Guds Tjener, havde lagt paa Israel i Ørken.
౯దేవుని సేవకుడైన మోషే, అరణ్యంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు నిర్ణయించిన కానుకను యెహోవా దగ్గరికి ప్రజలు తీసుకు రావాలని యూదాలోనూ యెరూషలేములోనూ వారు చాటించారు.
10 Da bleve alle Øverster og alt Folket glade, og de bragte det ind og lagde det i Kisten, indtil alt var kommet ind.
౧౦అధికారులందరూ ప్రజలందరూ సంతోషంగా కానుకలు తెచ్చి, పెట్టె నిండేంత వరకూ దానిలో వేశారు.
11 Og det skete, naar man ved Leviterne bragte Kisten ind efter Kongens Befaling, og man da saa, at der var mange Penge i den, da kom Kongens Skriver og Ypperstepræstens Befalingsmand, og de tømte Kisten og bare den hen og satte den igen paa sit Sted; saa gjorde de Dag for Dag og samlede Penge i Mangfoldighed.
౧౧లేవీయులు ఆ పెట్టెను రాజు అధికారుల దగ్గరికి తీసుకువచ్చిన ప్రతిసారీ, అందులో చాలా ధనం కనిపించినప్పుడల్లా రాజు కార్యదర్శి, ప్రధాన యాజకుని అధికారీ వచ్చి, పెట్టె ఖాళీ చేసి దాన్ని యథాస్థానంలో ఉంచేవారు. అనుదినం వారు ఇలా చేస్తూ చాలా ధనం సమకూర్చారు.
12 Og Kongen og Jojada gav dem til den, som havde at gøre med Gerningen i Herrens Hus's Tjeneste, og de lejede Stenhuggere og Tømmermænd til at fornye Herrens Hus, saa og Mestre til at arbejde i Jern og Kobber, til at udbedre Herrens Hus.
౧౨అప్పుడు రాజు, యెహోయాదా, యెహోవా మందిరంలో పనిచేసే వారికి ఆ ధనాన్ని ఇచ్చారు. యెహోవా మందిరాన్ని బాగుచేయడానికి రాతి పని చేసే వారిని, వడ్రంగి వారిని, ఇనుప పనీ, ఇత్తడి పనీ చేసే వారిని కూలికి తీసుకున్నారు.
13 Saa arbejdede Folkene, og Udbedringen af det, der arbejdedes paa, gik frem ved deres Haand; og de satte Guds Hus i Stand efter dets Maal og gjorde det stærkt.
౧౩ఈ విధంగా పనివారు కష్టించి పనిచేస్తుంటే మందిర మరమ్మత్తు చక్కగా కొనసాగింది. వారు దేవుని మందిరాన్ని దాని పూర్వస్థితికి తెచ్చి దాన్ని దృఢపరచారు.
14 Og der de havde fuldendt det, bragte de de øvrige Penge frem for Kongens og Jojadas Ansigt, og for disse gjorde man Redskaber til Herrens Hus, Redskaber til Tjenesten og til at ofre, Røgelseskaaler og Guldkar og Sølvkar; og de ofrede stedse Brændofre i Herrens Hus alle Jojadas Dage.
౧౪వారు దాన్ని పూర్తి చేసిన తరువాత మిగిలిన ధనాన్ని రాజు దగ్గరికీ, యెహోయాదా దగ్గరికీ తీసుకువచ్చారు. ఆ డబ్బుతో వారు యెహోవా మందిరానికి సంబంధించిన వస్తువులనూ, సేవకు ఉపయోగపడే వస్తువులనూ, దహనబలికి ఉపయోగపడే వస్తువులనూ, గరిటెలనూ, వెండీ బంగారు ఉపకరణాలనూ చేయించారు. యెహోయాదా జీవించి ఉన్న రోజులన్నిటిలో వారు యెహోవా మందిరంలో దహనబలులను కొనసాగించారు.
15 Og Jojada blev gammel og mæt af Dage og døde; han var hundrede og tredive Aar gammel, der han døde.
౧౫యెహోయాదా వయసు మీరి పండు వృద్ధాప్యంలో చనిపోయాడు. అతడు చనిపోయినప్పుడు అతని వయస్సు 130 ఏళ్ళు.
16 Og de begrove ham i Davids Stad iblandt Kongerne, fordi han havde gjort godt i Israel og imod Gud og hans Hus.
౧౬అతడు ఇశ్రాయేలీయుల్లో దేవుని కోసం, దేవుని ఇంటి కోసం మంచి మేలు చేశాడు కాబట్టి వారు అతణ్ణి దావీదు పట్టణంలో రాజుల దగ్గర పాతిపెట్టారు.
17 Men efter Jojadas Død kom de Øverste af Juda og nedbøjede sig for Kongen; da føjede Kongen dem.
౧౭యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధికారులు వచ్చి రాజును గౌరవించారు. రాజు వారి మాటలు విన్నాడు.
18 Saa forlode de Herrens, deres Fædres Guds, Hus og tjente Astartebillederne og Afguderne; og der kom en Vrede over Juda og Jerusalem for denne deres Syndeskyld.
౧౮ప్రజలు తమ పూర్వీకుల దేవుడైన యెహోవా మందిరాన్ని విడిచి, అషేరా దేవతాస్తంభాలను, విగ్రహాలను పూజించారు. వారు చేసిన ఈ దుర్మార్గానికి యూదావారి మీదికీ యెరూషలేము నివాసుల మీదికీ దేవుని కోపం వచ్చింది.
19 Og han sendte Profeter til dem at omvende dem til Herren; og disse vidnede for dem, men de vilde ikke høre dem.
౧౯అయినా తన వైపు వారిని మళ్లించడానికి యెహోవా వారి దగ్గరికి ప్రవక్తలను పంపాడు. ఆ ప్రవక్తలు వారికి వ్యతిరేకంగా సాక్ష్యం పలికారు గానీ ప్రజలు వారి మాట వినలేదు.
20 Og Guds Aand iførte sig Sakaria, Præsten Jojadas Søn, og han stod oven over Folket og sagde til dem: Saa sagde Gud: Hvorfor overtræde I Herrens Bud? derfor skulle I ikke være lykkelige, thi I have forladt Herren, og han har forladt eder.
౨౦అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కొడుకూ అయిన జెకర్యా మీదికి వచ్చాడు. అతడు ప్రజల ముందు నిలబడి “మీరెందుకు యెహోవా ఆజ్ఞలను ధిక్కరిస్తున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను వదిలివేశారు కాబట్టి ఆయన మిమ్మల్ని వదిలివేశాడని దేవుడు చెబుతున్నాడు” అన్నాడు.
21 Men de sammensvore sig imod ham og stenede ham med Stene, efter Kongens Bud, i Forgaarden til Herrens Hus.
౨౧అయితే వారతని మీద కుట్ర పన్ని రాజాజ్ఞతో యెహోవా మందిర ఆవరణం లోపల రాళ్ళు రువ్వి అతణ్ణి చంపేశారు.
22 Og Kong Joas kom ikke den Miskundhed i Hu, som Jojada, hans Fader, havde gjort imod ham, men slog hans Søn ihjel; og der denne døde, sagde han: Herren skal se og hjemsøge det.
౨౨ఈ విధంగా రాజైన యోవాషు జెకర్యా తండ్రి యెహోయాదా తనకు చేసిన ఉపకారాన్ని మరిచిపోయి అతని కొడుకుని చంపించాడు. అతడు చనిపోయేటప్పుడు “యెహోవా దీన్ని చూసి విచారణ చేస్తాడు గాక” అన్నాడు.
23 Og det skete, der Aaret var omme, drog Syrernes Hær op imod ham, og de kom til Juda og Jerusalem og udryddede af Folket alle Folkets Øverster, og de sendte alt deres Rov til Kongen af Damaskus.
౨౩ఆ సంవత్సరం చివరిలో అరాము సైన్యం యోవాషు మీదికి వచ్చింది. వారు యూదా మీదికీ యెరూషలేము మీదికీ వచ్చి, ప్రజల అధికారులందరినీ హతమార్చి, దోపిడీ సొమ్మంతా దమస్కు రాజు దగ్గరికి పంపారు.
24 Skønt Syrernes Hær kom med faa Mænd, gav Herren dog en saare stor Hær i deres Haand, fordi den havde forladt Herren, sine Fædres Gud; og de udførte Straffedommene over Joas.
౨౪అరామీయుల సైన్యం చిన్నదే అయినా యెహోవా ఒక గొప్ప సైన్యంపై వారికి విజయం దయచేశాడు. ఎందుకంటే, యూదావారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను వదిలి వేశారు. ఈ విధంగా అరామీయులు యోవాషుకు శిక్ష అమలు చేశారు.
25 Og der de vare dragne fra ham, hvem de forlode i en svar Sygdom, indgik hans Tjenere et Forbund imod ham for Præsten Jojadas Sønners Blods Skyld, og de sloge ham ihjel paa hans Seng, og han døde; og de begrove ham i Davids Stad; men de begrove ham ikke i Kongernes Grave.
౨౫అరామీయులు వెళ్ళిపోయేటప్పటికి యోవాషు తీవ్ర గాయాలతో ఉన్నాడు. యాజకుడైన యెహోయాదా కొడుకులను చంపించినందుకు అతని సొంత సేవకులు అతని మీద కుట్ర చేశారు. అతని పడక మీదే అతణ్ణి చంపేశారు. అతడు చనిపోయిన తరువాత ప్రజలు దావీదు పట్టణంలో అతణ్ణి పాతిపెట్టారు గానీ రాజుల సమాధుల్లో అతణ్ణి పాతిపెట్టలేదు.
26 Og de, som indgik Forbund imod ham, vare: Sabad, Simeaths den ammonitiske Kvindes Søn, og Josabad, Simriths den moabitiske Kvindes Søn.
౨౬అమ్మోనీయురాలైన షిమాతు కొడుకు జాబాదు, మోయాబీయురాలు అయిన షిమ్రీతు కొడుకు యెహోజాబాదు అనేవారు అతని మీద కుట్ర చేశారు.
27 Og hvad angaar hans Sønner og den svare Byrde, som var lagt paa ham, og Grundforbedringen af Guds Hus, se, om alt dette er skrevet i Kongernes Bogs Historie. Og hans Søn Amazia blev Konge i hans Sted.
౨౭యోవాషు కొడుకులను గురించీ, అతని గురించి చెప్పిన ముఖ్యమైన ప్రవచనాల గురించీ, దేవుని మందిరాన్ని పునర్నిర్మించడం గురించీ, రాజుల గ్రంథ వ్యాఖ్యానంలో రాసి ఉంది. అతనికి బదులు అతని కొడుకు అమజ్యా రాజయ్యాడు.