< Matouš 8 >
1 Velké zástupy se hrnuly za Ježíšem, když sestupoval s hory.
౧ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ప్రజలు గుంపులు గుంపులుగా ఆయనను అనుసరించారు.
2 Tu se k němu přiblížil malomocný, klekl před ním a řekl: „Pane, budeš-li chtít, můžeš mne uzdravit!“
౨ఒక కుష్టు రోగి వచ్చి ఆయనకు మొక్కి, “ప్రభూ, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు” అన్నాడు.
3 Ježíš zvedl ruku, dotkl se toho muže a řekl: „Ano, chci. Ať tvá nemoc zmizí!“A hned byl ten malomocný zdráv.
౩యేసు చెయ్యిచాపి అతణ్ణి తాకి, “నాకిష్టమే, నువ్వు బాగుపడు” అన్నాడు. వెంటనే అతని కుష్టు రోగం నయమైంది.
4 Ježíš mu pak řekl: „Nikomu nic neříkej, ale jdi, ukaž se knězi a vezmi s sebou obětní dar, který ustanovil Mojžíš pro uzdravené od malomocenství. To bude veřejné svědectví o tvém uzdravení.“
౪అప్పుడు యేసు అతనితో, “చూడు, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. వెళ్ళి యాజకుడికి కనబడు. వారికి సాక్ష్యంగా ఉండేందుకు మోషే నియమించిన కానుక అర్పించు” అని చెప్పాడు.
5 Když Ježíš přicházel do Kafarnaum, přistoupil k němu římský setník s prosbou:
౫యేసు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు రోమా సైన్యంలో ఒక శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చి,
6 „Pane, můj služebník leží doma ochrnutý a má velké bolesti.“
౬“ప్రభూ, నా పనివాడు పక్షవాతంతో ఇంట్లో పడి ఉన్నాడు. చాలా బాధపడుతున్నాడు” అని చెప్పాడు.
7 Ježíš mu odpověděl: „Přijdu za ním a uzdravím ho.“
౭“నేను వచ్చి అతణ్ణి బాగు చేస్తాను” అని యేసు అతనికి జవాబిచ్చాడు.
8 Setník mu však na to řekl: „Pane, nezasloužím si, aby ses namáhal ke mně domů. Vždyť stačí tvé slovo, a bude uzdraven.
౮ఆ శతాధిపతి, “ప్రభూ, నీవు నా యింట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు. మాట మాత్రం అనండి. నా పనివాడు బాగుపడతాడు.
9 Já vím, jak to je: sám poslouchám i poroučím. Když vojákovi rozkážu, tak jde, když ho zavolám, přijde. A když uložím svému služebníkovi práci, tak ji vykoná. Takovou moc máš ty i nad nemocemi.“
౯నేను కూడా అధికారం కింద ఉన్నవాడినే. నా చేతి కింద కూడా సైనికులున్నారు. నేను ఎవడినైనా ‘వెళ్ళు’ అంటే వాడు వెళ్తాడు. ఎవడినైనా ‘రా’ అంటే వాడు వస్తాడు. నా పనివాణ్ణి ‘ఇది చెయ్యి’ అంటే చేస్తాడు” అని జవాబిచ్చాడు.
10 Když to Ježíš uslyšel, podivil se a řekl těm, kteří šli s ním: „Řeknu vám, že s tak velikou vírou jsem se nesetkal v celém Izraeli.
౧౦యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, తన వెంట వస్తున్న వారితో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఎవరికైనా ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని కచ్చితంగా చెబుతున్నాను.
11 Je to opravdu tak, že mnozí lidé z celého světa budou přijati do Boží věčné říše,
౧౧తూర్పు నుంచీ పడమర నుంచీ చాలా మంది వచ్చి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు పరలోక రాజ్యంలో విందులో కూర్చుంటారు.
12 zatímco mnozí Izraelci, pro které byla připravena, budou z ní vyloučeni; zbyde jim beznaděj, bolest a pláč.“
౧౨అయితే రాజ్య కుమారులను మాత్రం బయట చీకట్లోకి తోసేయడం జరుగుతుంది. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి.”
13 Potom se Ježíš obrátil opět k setníkovi: „Jdi domů. Čemu jsi uvěřil, ať se stane.“V tu chvíli se služebník uzdravil.
౧౩యేసు శతాధిపతితో, “వెళ్ళు. నీవు నమ్మినట్టే నీకు జరుగుతుంది” అన్నాడు. ఆ క్షణంలోనే అతని పనివాడు బాగుపడ్డాడు.
14 Pak Ježíš navštívil Petra a našel jeho tchyni schvácenou horečkou.
౧౪తరవాత యేసు, పేతురు ఇంట్లోకి వెళ్ళి, జ్వరంతో పడుకుని ఉన్న అతని అత్తను చూశాడు.
15 Dotkl se její ruky, teplota klesla a jí se ulevilo natolik, že vstala a obsloužila hosta.
౧౫యేసు ఆమె చేతిని తాకగానే జ్వరం ఆమెను విడిచి పోయింది. అప్పుడామె లేచి ఆయనకు సేవ చేయసాగింది.
16 Večer k němu přivedli mnoho posedlých, on je pouhým slovem zbavil zlého a všechny nemocné uzdravil.
౧౬సాయంకాలం అయినప్పుడు దయ్యాలు పట్టిన చాలా మందిని ప్రజలు ఆయన దగ్గరికి తీసుకు వచ్చారు. ఆయన ఒక్క మాటతో దయ్యాలను వెళ్ళగొట్టి రోగులందరినీ బాగు చేశాడు.
17 Tím se naplnilo, co předpověděl prorok Izajáš: „On na sebe vzal naše slabosti a nesl naše nemoci.“
౧౭యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా ఇలా జరిగింది. అదేమిటంటే, “ఆయనే మన బాధలను తనపై వేసుకున్నాడు. మన రోగాలను భరించాడు.”
18 Když Ježíš viděl, jak se kolem něj kupí množství lidí, chtěl se na loďce přeplavit na druhou stranu jezera;
౧౮యేసు తన చుట్టూ ఉన్న పెద్ద గుంపులను చూసి గలిలయ సరస్సు అవతలికి వెళ్దామని ఆదేశించాడు.
19 zadržel ho však ještě jeden učitel zákona: „Mistře, chci být stále s tebou.“
౧౯అప్పుడు ధర్మశాస్త్ర పండితుడు ఒకడు వచ్చి, “బోధకా! నీవు ఎక్కడికి వెళ్ళినా సరే, నేను నీ వెంటే వస్తాను” అన్నాడు.
20 Ježíš mu odpověděl: „Každá liška má svou noru, pták hnízdo, ale já často nemám kde spát.“
౨౦అందుకు యేసు అతనితో, “నక్కలకు గుంటలున్నాయి. పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడికి మాత్రం తల వాల్చుకునే స్థలం కూడా లేదు” అన్నాడు.
21 Jeden z jeho žáků mu zase řekl: „Pane, než půjdu s tebou, dovol mi ještě pohřbít mého otce.“
౨౧ఆయన శిష్యుల్లో మరొకడు, “ప్రభూ, మొదట నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టడానికి నాకు అనుమతి ఇవ్వండి” అని ఆయనను అడిగాడు.
22 Ale Ježíš mu odpověděl: „Ty pojď se mnou! Poslední službu mrtvému může poskytnout za tebe i ten, kdo se ještě duchovně neprobudil.“
౨౨అయితే యేసు అతనితో, “నాతో రా. చనిపోయిన వారిని పాతి పెట్టడానికి చనిపోయిన వారు ఉన్నారులే!” అన్నాడు.
23 Pak vyplul spolu se svými učedníky.
౨౩ఆయన పడవ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయనతో వెళ్ళారు.
24 Nad jezerem se strhla prudká bouře, takže člunu hrozilo potopení ve vlnách. Ježíš však klidně spal.
౨౪అప్పుడు సముద్రం మీద తీవ్రమైన తుఫాను చెలరేగి, పడవ మీదికి అలలు ముంచుకు వచ్చాయి. అయితే యేసు నిద్రపోతూ ఉన్నాడు.
25 Probudili ho: „Pane, zachraň nás. Jde o život!“
౨౫శిష్యులు ఆయనను నిద్ర లేపి, “ప్రభూ, చచ్చిపోతున్నాం. మమ్మల్ని రక్షించండి” అంటూ కేకలు వేశారు.
26 Ale on jim řekl: „Proč se bojíte? Kde je vaše víra?“Vstal, okřikl vítr i vlny, a nastal klid.
౨౬యేసు వారితో, “అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు?” అని చెప్పి, లేచి గాలినీ సముద్రాన్నీ గద్దించాడు. అప్పుడు అంతా చాలా ప్రశాంతమై పోయింది.
27 Kteří to viděli, byli naplněni údivem a říkali si: „Kdo to vlastně je, že ho poslouchají vítr i moře?“
౨౭శిష్యులు ఆశ్చర్యపడి, “ఈయన ఎలాంటివాడో! గాలీ సముద్రం ఈయన మాట వింటున్నాయే” అని చెప్పుకున్నారు.
28 Když přistáli na druhém břehu jezera poblíž Gadary, narazili na dva muže posedlé démony. Ti žili ve skalních hrobech a byli tak nebezpeční, že se nikdo neodvážil tudy chodit.
౨౮ఆయన అవతలి ఒడ్డున ఉన్న గదరేనీయుల ప్రాంతం చేరుకున్నప్పుడు దయ్యాలు పట్టిన ఇద్దరు వ్యక్తులు సమాధుల్లో నుంచి బయలుదేరి ఆయనకు ఎదురు వచ్చారు. వారు చాలా క్రూరంగా ప్రవర్తిస్తుండడం వలన ఎవరూ ఆ దారిన వెళ్ళలేక పోయేవారు.
29 Na Ježíše začali křičet: „Co je ti do nás, Boží Synu? Ještě na nás nemáš právo!“
౨౯ఆ దయ్యాలు, “దైవకుమారా, నీతో మాకేంటి? మా కాలం రాకముందే మమ్మల్ని వేధించడానికి వచ్చావా?” అని కేకలు వేశారు.
30 Opodál se páslo velké stádo vepřů.
౩౦వారికి కొంత దూరంలో పెద్ద పందుల మంద మేస్తూ ఉంది.
31 „Když nám bereš moc nad lidmi, nech nám ji aspoň nad těmi vepři, “prosili démoni.
౩౧“నీవు మమ్మల్ని బయటికి వెళ్ళగొడితే, ఆ పందుల మందలోకి పోనియ్యి” అని ఆ దయ్యాలు యేసును ప్రాధేయపడ్డాయి.
32 On jim řekl: „Zmizte!“Démoni opustili muže a zmocnili se zvířat. V tom okamžiku se celé stádo splašilo a hnalo se dolů k jezeru, kde se utopilo.
౩౨యేసు “సరే, పో” అని వాటితో అన్నాడు. అవి బయటికి వచ్చి ఆ పందుల మందలోకి చొరబడ్డాయి. వెంటనే ఆ మంద అంతా నిటారుగా ఉన్న కొండ మీద నుంచి వేగంగా పరుగెత్తుకుంటూ పోయి సముద్రంలో పడి చచ్చాయి.
33 Pasáci vepřů utekli do města a všude roznesli, co se stalo.
౩౩ఆ పందుల మందను కాసేవారు పరిగెత్తుకుంటూ ఊరిలోకి వెళ్ళి జరిగిన సంగతి, ఇంకా దయ్యాలు పట్టిన వాడికి జరిగిన సంగతీ తెలియజేశారు.
34 Celé město se šlo na Ježíše podívat, ale žádali ho, aby z jejich kraje odešel.
౩౪అప్పుడు ఆ ఊరి వారంతా యేసును కలవడానికి వచ్చారు. ఆయనను చూసి తమ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపొమ్మని ఆయనను బతిమాలారు.