< Matouš 11 >
1 Když Ježíš skončil s pokyny pro svých dvanáct učedníků, šel, aby učil a kázal v tamějších městech.
౧యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఉపదేశించడం అయిపోయిన తరువాత వారి పట్టణాల్లో బోధించడానికీ, ప్రకటించడానికీ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
2 Jan Křtitel ve vězení uslyšel o Ježíšových činech, poslal za ním své dva žáky a ti se ho zeptali:
౨క్రీస్తు చేస్తున్న పనుల గురించి యోహాను చెరసాల్లో విని,
3 „Jsi opravdu ten zaslíbený Mesiáš, nebo máme čekat jiného?“
౩“రాబోతున్న వాడివి నీవేనా, లేకపోతే మేము వేరే వాడి కోసం కనిపెట్టాలా?” అని ఆయనను అడగడానికి తన శిష్యులను పంపాడు.
4 Ježíš jim na to odpověděl: „Vraťte se k Janovi a povězte mu o tom, co jste viděli a slyšeli:
౪యేసు, “మీరు వెళ్ళి, విన్న వాటినీ చూసిన వాటినీ యోహానుకు తెలియజేయండి.
5 slepí vidí, chromí chodí, malomocní jsou uzdravováni, hluší slyší, mrtví vstávají k životu a ti, kteří u lidí neznamenají nic, jsou ujišťováni, že Bůh s nimi počítá.
౫గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్టరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు తిరిగి బతుకుతున్నారు, పేదవారికి సువార్త ప్రకటన జరుగుతున్నది.
6 Šťastný je ten, kdo mne přijímá bez výhrad.“
౬నా విషయం అభ్యంతరపడనివాడు ధన్యుడు” అని జవాబిచ్చాడు.
7 Když Janovi žáci odešli, řekl o něm Ježíš zástupu: „Když jste šli za Janem na poušť, jistě jste v něm nenašli slabocha – ‚kam vítr, tam plášť‘;
౭వారు వెళ్ళిపోతుంటే యేసు యోహానును గురించి ప్రజలతో ఇలా చెప్పాడు, “మీరేం చూడ్డానికి అరణ్యంలోకి వెళ్ళారు? గాలికి ఊగే గడ్డి పోచనా?
8 ani jste nenašli žádnou vysoce postavenou osobu – takoví chodí pěkně oblečeni a bydlí v palácích.
౮అయితే మరింకేమి చూడడానికి వెళ్ళారు? నాజూకు బట్టలు వేసుకొన్న వ్యక్తినా? నాజూకు బట్టలు వేసికొనే వారు రాజ భవనాల్లో ఉంటారు.
9 Šli jste za ním jako za prorokem a měli jste pravdu. Ujišťuji vás, že on je ještě víc než prorok. Proroci a celý Starý zákon až po Jana vyhlíželi Mesiáše. Chcete-li pochopit to, co míním, Jan je novým Elijášem, o kterém proroci říkali, že má přijít před začátkem království.
౯మరింకేమి చూడడానికి వెళ్ళారు? ప్రవక్తనా? సరే గాని, ఇతడు ప్రవక్త కంటే గొప్పవాడు అని మీతో చెబుతున్నాను.
10 To o něm se píše v Písmu, že půjde přede mnou, ohlásí můj příchod a připraví mi cestu k lidským srdcím.
౧౦‘నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. అతడు నీ ముందు వెళ్ళి నీ దారి సిద్ధం చేస్తాడు’ అని రాసి ఉన్నది ఇతని గురించే.
11 Opravdu, mezi všemi lidmi, kteří se kdy narodili, není nikdo, kdo by převyšoval svým posláním Jana Křtitele; a přece i nejskromnější z mých následovníků se dostal dál než on.
౧౧స్త్రీకి పుట్టిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో కచ్చితంగా చెబుతున్నాను. అయినా పరలోకరాజ్యంలో అత్యల్పమైన వాడు అతని కంటే గొప్పవాడు.
12 Od doby, kdy Jan Křtitel začal kázat a křtít, Boží vláda se prosazuje, ale násilí jí škodí. Kdo slyšíš, rozuměj!
౧౨బాప్తిసమిచ్చే యోహాను కాలం నుండి ఇప్పటి వరకూ పరలోకరాజ్యం దాడులకు గురి అవుతూ ఉంది. తీవ్రత గలవారు బలవంతంగా దానిలో ప్రవేశిస్తున్నారు.
౧౩ఎందుకంటే యోహాను కాలం వరకూ ప్రవక్తలూ, ధర్మశాస్త్రమూ ప్రవచిస్తూ వచ్చారు.
౧౪ఈ సంగతిని అంగీకరించడానికి మీకు మనసుంటే రాబోయే ఏలీయా ఇతడే.
౧౫వినే చెవులున్నవాడు విను గాక.
16 K čemu mám přirovnat tuto generaci? Je jako hrající si děti, které sedí na návsi a pokřikují nespokojeně na své kamarády:
౧౬ఈ తరం వారిని దేనితో పోల్చాలి?
17 ‚Hráli jsme vám a vy jste netancovali, smutně jsme vám zpívali a vy jste neplakali.‘
౧౭పిల్లలు వీధుల్లో ఆడుకుంటూ ‘మీ కోసం వేణువు ఊదాం గాని మీరు నాట్యం చేయలేదు. ప్రలాపించాం గాని మీరు ఏడవలేదు’ అని ఒకరితో ఒకరు చెప్పుకునే విధంగా ఉన్నారు.
18 Přišel Jan, žil odříkavě a měli ho za fanatika.
౧౮ఎందుకంటే యోహాను వచ్చి రొట్టె తినకుండా, ద్రాక్షరసం తాగకుండా ఉండేవాడు. ‘అతనికి దయ్యం పట్టింది’ అని వారంటున్నారు.
19 Přišel jsem já, Syn člověka, žiji normálně a říkají, že jsem žrout a pijan vína, přítel celníků a nejhorší lůzy. Ale Boží moudrost prokáže, co je pravda!“
౧౯మనుష్య కుమారుడు తింటూ, తాగుతూ వచ్చాడు. కాబట్టి ‘వీడు తిండిబోతూ, తాగుబోతూ, పన్నులు వసూలు చేసే వారికీ పాపులకూ స్నేహితుడు’ అని వారంటున్నారు. అయితే జ్ఞానం అది చేసే పనులను బట్టి తీర్పు పొందుతుంది.”
20 Tvrdá slova měl Ježíš pro města, která byla svědky mnoha jeho mocných činů, a přece nečinila pokání:
౨౦అప్పుడాయన ఏ పట్టణాల్లో ఎక్కువ అద్భుతాలు చేశాడో ఆ పట్టణాలను గద్దించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అవి పశ్చాత్తాప పడలేదు.
21 „Běda ti, Korozaim, běda ti, Betsaido! Kdybych udělal v Týru a Sidónu takové zázraky jako u vás, už dávno by jejich obyvatelé činili pokání a projevili nejhlubší lítost nad svými vinami.
౨౧“అయ్యో కొరాజీనూ! నీకు శిక్ష తప్పదు. అయ్యో బేత్సయిదా! నీకు శిక్ష తప్పదు. మీలో జరిగిన అద్భుతాలు తూరు, సీదోను పట్టణాల్లో గనక జరిగి ఉంటే అక్కడి ప్రజలు చాలా కాలం ముందే పశ్చాత్తాపపడి గోనె పట్ట కట్టుకుని బూడిద పూసుకునేవారే.
22 Proto vám říkám, že Týru a Sidónu bude v den soudu snáze než vám.
౨౨తీర్పు దినాన మీకు పట్టే గతి కంటే తూరు సీదోను పట్టణాల వారి గతే ఓర్చుకోదగినది అవుతుంది అని మీతో చెప్తున్నాను.
23 A ty, Kafarnaum, myslíš, že poroste tvá sláva až k nebi? Do propasti věčné záhuby padneš! Kdybych udělal v Sodomě takové zázraky jako u vás, stála by dodnes. (Hadēs )
౨౩కపెర్నహూమా, పరలోకానికి హెచ్చిపోగలను అని నీవు అనుకుంటున్నావా? నీవు పాతాళంలోకి దిగి పోతావు. నీలో జరిగిన అద్భుతాలు సొదొమలో గనక జరిగి ఉంటే అది ఈనాటి వరకూ నిలిచి ఉండేదే! (Hadēs )
24 Znovu vám říkám, že zemi Sodomské bude lehčeji v den soudu než tobě!“
౨౪తీర్పు దినాన నీకు పట్టే గతి కంటే సొదొమ నగరానికి పట్టే గతే ఓర్చుకోదగినది అవుతుంది, అని మీతో చెప్తున్నాను.”
25 Potom se Ježíš modlil: „Otče, Pane nebe i země, děkuji ti, že pravdu skrýváš před těmi, kteří se považují za moudré a učené, a odkrýváš ji nepatrným a prostým.
౨౫ఆ సమయంలో యేసు ఇలా అన్నాడు, “తండ్రీ, పరలోకానికీ భూమికీ ప్రభూ, నీవు జ్ఞానులకూ తెలివైన వారికీ ఈ సంగతులను మరుగు చేసి చిన్న పిల్లలకు వెల్లడి పరచావు. అందుకు నిన్ను స్తుతిస్తున్నాను.
26 Je to, Otče, jak sis přál.
౨౬అవును తండ్రీ, ఈ విధంగా చేయడం నీకెంతో ఇష్టం.
27 Otec mi svěřil všechno, jenom Otec zná Syna a Otce zná jenom Syn a ti, kterým ho Syn zjeví.
౨౭సమస్తాన్నీ నా తండ్రి నాకు అప్పగించాడు. తండ్రి తప్ప కుమారుణ్ణి ఎవరూ ఎరగరు. కుమారుడూ, ఎవరికి వెల్లడించాలని కుమారుడు ఉద్దేశిస్తాడో వాడూ తప్ప మరి ఎవరూ తండ్రిని ఎరగరు.
28 Pojďte ke mně všichni, kteří pracujete a nesete tíhu břemen, najdete u mne klid a úlevu.
౨౮“మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతి నిస్తాను.
29 To, co na vás já vložím, netlačí a není těžké. Učte se ode mne, mám tiché a pokorné srdce. U mne získáte mír a odpočinutí své duše.“
౨౯నేను దీనుణ్ణి, వినయ మనసు గల వాణ్ణి. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది.
౩౦ఎందుకంటే నా కాడి సుళువు. నా భారం తేలిక.”