< Jan 4 >
1 Stále více lidí se připojovalo k Ježíšovi a jeho učedníci je křtili.
౧యేసు యోహాను కన్నా ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుంటున్నాడని, అతని కన్నా ఎక్కువ మందికి బాప్తిసమిస్తున్నాడని పరిసయ్యులు విన్నారని ప్రభువుకు తెలిసింది.
౨నిజానికి యేసు తానే బాప్తిసం ఇవ్వలేదు, ఆయన శిష్యులు ఇస్తూ ఉన్నారు.
3 Aby zabránil případnému střetnutí s náboženskými vůdci, opustil Ježíš Judsko a vrátil se do Galileje.
౩అప్పుడు ఆయన యూదయ దేశం నుండి ప్రయాణమై గలిలయ దేశానికి వెళ్ళాడు.
౪మార్గంలో సమరయ ప్రాంతం గుండా ఆయన ప్రయాణం చేయాల్సి వచ్చింది.
5 Kolem poledne přišel k Jákobově studni u městečka Sychar.
౫అలా ఆయన సమరయలో ఉన్న సుఖారు అనే ఊరికి వచ్చాడు. ఈ ఊరి దగ్గరే యాకోబు తన కొడుకు యోసేపుకు కొంత భూమిని ఇచ్చాడు.
౬యాకోబు బావి అక్కడ ఉంది. యేసు ప్రయాణంలో అలిసిపోయి ఆ బావి దగ్గర కూర్చున్నాడు. అది మిట్ట మధ్యాహ్నం.
7 Jeho učedníci odešli do města nakoupit něco k jídlu. Ježíš si chtěl u studny odpočinout. Sotva usedl, jedna z místních žen přišla pro vodu. „Prosím tě, dej mi napít, “obrátil se na ni Ježíš.
౭ఒక సమరయ స్త్రీ నీళ్ళు తోడుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చింది. యేసు ఆమెతో, “తాగడానికి నీళ్ళు ఇస్తావా?” అని అడిగాడు.
౮ఆయన శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోకి వెళ్ళారు.
9 „Jak to, že žádáš službu od Samařanky, když jsi Žid?“(Mezi Židy a Samařany vládlo totiž napětí.)
౯ఆ సమరయ స్త్రీ యేసుతో ఇలా అంది, “నువ్వు యూదుడివి. సమరయ స్త్రీ అయిన నన్ను నీళ్ళు ఎలా అడుగుతున్నావు?” ఎందుకంటే యూదులు సమరయులతో ఎలాంటి సంబంధాలూ పెట్టుకోరు.
10 Ježíš jí odpověděl: „Kdybys věděla, kdo jsem a co ti nabízím, prosila bys ty mne, abych ti dal napít té životodárné vody.“
౧౦దానికి యేసు, “నువ్వు దేవుని బహుమానాన్నీ, తాగడానికి నీళ్ళు కావాలని నిన్ను అడుగుతున్న వ్యక్తినీ తెలుసుకుంటే నువ్వే ఆయనను అడిగేదానివి. ఆయన నీకు జీవజలం ఇచ్చి ఉండేవాడు” అన్నాడు.
11 „Vždyť nemáš žádnou nádobu! Jak chceš nabrat vodu z tak hluboké studny?“namítla žena.
౧౧అప్పుడా స్త్రీ, “అయ్యా, ఈ బావి చాలా లోతు. తోడుకోడానికి నీ దగ్గర చేద లేదు. ఆ జీవజలం నీకెలా దొరుకుతుంది?
12 „Jsi snad mocnější, než byl náš praotec Jákob, který ji vyhloubil? Čerpal z ní vodu pro sebe, svou rodinu i svůj dobytek.“
౧౨మన తండ్రి అయిన యాకోబు ఈ బావి నీళ్ళు తాగాడు. తన సంతానానికీ, తన పశువులకూ తాగడానికి ఈ నీళ్ళే ఇచ్చాడు. మాకూ తాగడానికి ఈ బావిని ఇచ్చాడు. నువ్వు ఆయన కంటే గొప్పవాడివా?” అంది.
13 Nato jí Ježíš odpověděl:
౧౩దానికి యేసు, “ఈ నీళ్ళు తాగే ప్రతి ఒక్కరికీ మళ్ళీ దాహం వేస్తుంది.
14 „Voda, kterou nabízím já, uhašuje žízeň navždy a naplňuje touhu po věčnosti.“ (aiōn , aiōnios )
౧౪కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగే వారికి ఇక ఎప్పటికీ దాహం వేయదు. నేను వారికిచ్చే నీళ్ళు అయితే వారిలో నిత్య జీవానికి ఊరుతూ ఉండే ఊట అవుతాయి” అన్నాడు. (aiōn , aiōnios )
15 „Pane, tu vodu mi dej ať už sem nemusím chodit, “prosila ho žena.
౧౫అప్పుడు ఆమె ఆయనతో, “అయ్యా, నీళ్ళు చేదుకోడానికి నేను ఇంత దూరం రానవసరం లేకుండా ఆ నీళ్ళు నాకివ్వు” అంది.
16 „Jdi a přiveď svého muže, “přikázal jí Ježíš.
౧౬యేసు ఆమెతో, “నువ్వు వెళ్ళి నీ భర్తను ఇక్కడికి తీసుకురా” అన్నాడు.
17 „Nemám muže, “odpověděla žena. „To máš pravdu, “řekl jí Ježíš.
౧౭దానికి ఆ స్త్రీ, “నాకు భర్త లేడు” అంది. యేసు ఆమెతో, “‘భర్త లేడని సరిగ్గానే చెప్పావు.
18 „Vystřídala jsi jich pět a ani ten, se kterým žiješ nyní, není tvůj muž.“
౧౮ఎందుకంటే నీకు ఐదుగురు భర్తలున్నారు. ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు. ఈ విషయంలో నువ్వు బాగానే చెప్పావు” అన్నాడు.
19 „Pane, vidím, že jsi prorok, “vyhrkla s údivem.
౧౯అప్పుడా స్త్రీ, “అయ్యా, నువ్వు ఒక ప్రవక్తవి అని నాకు అర్థమౌతున్నది.
20 „To bys mi mohl odpovědět, proč vy Židé považujete jen Jeruzalém za místo vhodné k uctívání Boha. Naši předkové se od nepaměti modlili na této hoře.“
౨౦మా పూర్వీకులు ఈ కొండ పైన ఆరాధించారు. కానీ ఆరాధించే స్థలం యెరూషలేములో ఉందనీ అందరూ అక్కడికే వెళ్ళి ఆరాధించాలనీ మీరు అంటారు” అంది. అందుకు యేసు ఇలా చెప్పాడు.
21 Ježíš jí odpověděl: „Věř mi, blíží se doba, kdy lidé nebudou uctívat Boha ani v Jeruzalémě, ani na této hoře.
౨౧“అమ్మా, తండ్రిని ఈ కొండ మీదో, యెరూషలేములోనో ఆరాధించని కాలం వస్తుంది. నా మాట నమ్ము.
22 My známe smysl naší bohoslužby, ale vy ho neznáte, protože Mesiáš vyjde ze Židů.
౨౨మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తారు. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాము. ఎందుకంటే రక్షణ యూదుల్లో నుండే వస్తుంది.
23 Nastává však doba, kdy nebude záležet na tom, kde se kdo modlí, ale jak se modlí. Skuteční vyznavači budou ctít Otce upřímně a neformálně. O takové vyznavače Otci jde.
౨౩నిజమైన ఆరాధికులు తండ్రిని హృదయ పూర్వకంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కాలం వస్తుంది. ఇప్పటికే వచ్చేసింది. తనను ఆరాధించేవారు అలాటివారే కావాలని తండ్రి చూస్తున్నాడు.
24 Bůh je duchovní bytost a ti, kdo ho vzývají, mají tak činit opravdově a pod vedením Ducha svatého.“
౨౪దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించే వారు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి.”
25 „Vím, že přijde Mesiáš, “pravila žena, „ten nám všechno vysvětlí.“
౨౫అప్పుడు ఆ స్త్రీ ఆయనతో, “క్రీస్తు అని పిలిచే మెస్సీయ వస్తున్నాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మాకు అంతా వివరిస్తాడు” అంది.
26 „Ten Mesiáš jsem já, “řekl jí nato Ježíš.
౨౬అది విని యేసు, “నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ని” అని చెప్పాడు.
27 V té chvíli se učedníci vrátili z města a byli překvapeni, když Ježíše zastihli v rozhovoru se ženou. Neodvážili se však zeptat, proč s ní mluví.
౨౭ఇదే సమయానికి ఆయన శిష్యులు తిరిగి వచ్చారు. ఆ స్త్రీతో ఆయన మాట్లాడుతూ ఉండడం చూసి ‘ఎందుకు మాట్లాడుతున్నాడా’ అని ఆశ్చర్యపడ్డారు. కానీ ‘నీకేం కావాలని’ గానీ ‘ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు’ అని గానీ ఎవరూ అడగలేదు.
28 Žena nechala své vědro ležet u studny a spěchala do města, kde řekla lidem:
౨౮ఇక ఆ స్త్రీ తన నీళ్ళ కుండ అక్కడే వదిలిపెట్టి ఊరిలోకి వెళ్ళింది.
29 „Pojďte se podívat na člověka, s nímž jsem se dosud nesetkala, a přesto o mně všechno ví. Není to snad Mesiáš?“
౨౯ఆ ఊరి వారితో, “మీరు నాతో వచ్చి నేను చేసిన పనులన్నిటినీ నాతో చెప్పిన వ్యక్తిని చూడండి. ఈయన క్రీస్తు కాడా?” అంది.
30 Lidé z města se tedy vydali za Ježíšem.
౩౦వారంతా ఊరి నుండి బయలు దేరి ఆయన దగ్గరికి వచ్చారు.
31 Učedníci ho zatím pobízeli, aby se najedl.
౩౧ఆలోగా శిష్యులు, “బోధకా, భోజనం చెయ్యి” అని ఆయనను బతిమాలారు.
32 On však odmítl: „Nebudu jíst. Mám jiný pokrm, který neznáte.“
౩౨దానికి ఆయన, “తినడానికి మీకు తెలియని ఆహారం నాకుంది” అని వారితో చెప్పాడు.
33 „Kdo mu přinesl jídlo?“říkali si.
౩౩“ఆయన తినడానికి ఎవరైనా భోజనం ఏదైనా తెచ్చారా ఏమిటి?” అని శిష్యులు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
34 Ježíš je hned vyvedl z nejistoty: „Sytím se tím, že konám Boží vůli. Dokončit jeho dílo – to je můj pokrm.
౩౪యేసు వారిని చూసి, “నన్ను పంపించిన వాని ఇష్టాన్ని చేయడం, ఆయన పని చేసి ముగించడమే నా ఆహారం.
35 Obilí bude zralé za čtyři měsíce, ale lidé jsou již zralí ke žni.
౩౫పంట కోయడానికి కోతకాలం రావాలంటే ఇంకా నాలుగు నెలలు ఉన్నాయని మీరు చెబుతారు కదా! మీ తలలెత్తి పొలాలను చూడండి. అవి ఇప్పటికే పక్వానికి వచ్చి కోతకు సిద్ధంగా ఉన్నాయని మీతో చెబుతున్నాను.
36 Ten, kdo bude sklízet a shromažďovat tuto úrodu pro věčnost, dostane za svou práci odměnu. A ten, kdo rozséval, bude se radovat spolu s ním. (aiōnios )
౩౬విత్తనాలు చల్లేవాడూ పంట కోసేవాడూ కలసి సంతోషించేలా కోసేవాడు జీతం తీసుకుని శాశ్వత జీవం కోసం ఫలాన్ని సమకూర్చుకుంటున్నాడు. (aiōnios )
37 Neříká se nadarmo, že jeden zasévá a druhý žne.
౩౭ఈ విషయంలో “విత్తనాలు చల్లేది ఒకరు, పంట కోసేది మరొకరు, అనే మాట నిజమే.
38 Já vás posílám sklízet pole, které jste neosévali. Jiní se před vámi lopotili a vy sbíráte výsledky jejich práce.“
౩౮మీరు దేని కోసం ప్రయాస పడలేదో దాన్ని కోయడానికి మిమ్మల్ని పంపాను. ఇతరులు చాకిరీ చేశారు. వారి కష్టఫలాన్ని మీరు అనుభవిస్తున్నారు” అన్నాడు.
39 Na základě svědectví té ženy uvěřilo v Ježíše mnoho Samařanů ze Sychar.
౩౯‘నేను చేసినవన్నీ ఆయన నాతో చెప్పాడు’ అంటూ సాక్ష్యం ఇచ్చిన స్త్రీ మాటను బట్టి ఆ పట్టణంలోని అనేక మంది సమరయులు ఆయనలో విశ్వాసముంచారు.
40 Prosili ho, aby u nich zůstal. Zdržel se tam dva dny, mluvil k nim a jejich víra rostla.
౪౦ఆ సమరయ వారు ఆయన దగ్గరికి వచ్చి తమతో ఉండమని ఆయనను వేడుకున్నారు. కాబట్టి ఆయన అక్కడ రెండు రోజులు ఉన్నాడు.
౪౧ఆయన మాటలు విని ఇంకా చాలా మంది ఆయనలో విశ్వాసముంచారు. వారు ఆ స్త్రీతో, “మేము విశ్వసించింది కేవలం నీ మాట మీదే కాదు.
42 Ženě řekli: „Teď už věříme ne pro to, co jsi o něm pověděla, ale slyšeli jsme ho a víme, že je opravdu Spasitel světa.“
౪౨మేము కూడా ఆయన మాటలు విన్నాం. ఇప్పుడు ఈయన నిజంగా ఈ లోక రక్షకుడని తెలుసుకున్నాం” అన్నారు.
43 Po dvou dnech pokračoval Ježíš v cestě do Galileje.
౪౩ఆ రెండు రోజులయ్యాక ఆయన గలిలయకు ప్రయాణమై వెళ్ళాడు.
44 I když doma nebývá nikdo ve vážnosti, přijali ho Galilejští velmi srdečně. I oni byli totiž o Velikonocích v Jeruzalémě a stali se tam svědky některých jeho zázraků.
౪౪ఎందుకంటే ఏ ప్రవక్తా తన స్వదేశంలో గౌరవం పొందడని ఆయనే స్వయంగా ప్రకటించాడు.
౪౫ఆయన గలిలయకు వచ్చినప్పుడు గలిలయులు ఆయనకు స్వాగతం పలికారు. పండగ ఆచరించడం కోసం గలిలయులు కూడా యెరూషలేముకు వెళ్తారు. అక్కడ ఆయన చేసిన పనులన్నీ వారు చూశారు.
46 Když Ježíš procházel Galileou, zastavil se také v Káni, kde před nedávnem při svatbě proměnil vodu ve víno. Nedaleko odtud leželo město Kafarnaum. Zde žil jeden královský úředník, jehož syn těžce onemocněl.
౪౬యేసు గలిలయలోని కానా అనే ఊరికి వచ్చాడు. ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చింది ఇక్కడే. అదే సమయంలో కపెర్నహూములో ఒక అధికారి కొడుకు జబ్బుపడి ఉన్నాడు.
47 Jakmile se dověděl o Ježíšově návratu, hned ho vyhledal a prosil o pomoc. Žádal ho, aby s ním šel domů a vrátil zdraví umírajícímu synovi.
౪౭యేసు యూదయ నుండి గలిలయకు వచ్చాడని అతడు విన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. తన కొడుకు చావడానికి సిద్ధంగా ఉన్నాడనీ వచ్చి బాగుచేయాలనీ ఆయనను వేడుకున్నాడు.
48 Ježíš mu odpověděl: „Cožpak mi neuvěříte, pokud neuvidíte zázraky?“
౪౮యేసు అతడితో ఇలా అన్నాడు, “సూచనలూ అద్భుతాలూ చూడందే మీరు నమ్మనే నమ్మరు.”
49 Královský úředník úpěnlivě prosil: „Pane, pojď hned se mnou, vždyť mi doma umírá syn.“
౪౯అందుకా అధికారి, “ప్రభూ, నా కొడుకు చావక ముందే రా” అని వేడుకున్నాడు.
50 Ježíš mu však jen krátce řekl: „Vrať se domů. Tvůj syn je zdráv.“Úředník jeho slovům uvěřil a rychle spěchal domů.
౫౦యేసు అతడితో, “నువ్వు వెళ్ళు. నీ కొడుకు బతుకుతాడు” అని చెప్పాడు. ఆ మాట నమ్మి అతడు వెళ్ళి పోయాడు.
51 Již cestou potkal své sluhy, kteří mu běželi naproti se zprávou o synově uzdravení.
౫౧అతడు దారిలో ఉండగానే అతడి సేవకులు ఎదురొచ్చారు. అతని కొడుకు బతికాడని తెలియజేశారు.
52 Ten se jich dychtivě zeptal, v kterou dobu se jeho syn uzdravil. „Včera v jednu hodinu odpoledne mu přestala horečka, “odpověděli.
౫౨“ఏ సమయంలో వాడు బాగవ్వడం ప్రారంభమైంది” అని అతడు వారిని అడిగాడు. వారు, “నిన్న ఒంటి గంటకు జ్వరం తగ్గడం మొదలైంది” అని చెప్పారు.
53 Radostí naplněný otec si uvědomil, že právě v tu chvíli mu Ježíš řekl: „Tvůj syn je zdráv.“Po této události královský úředník uvěřil, že Ježíš je pravý Mesiáš. A uvěřila tomu i jeho rodina a všechno služebnictvo.
౫౩‘నీ కొడుకు బతికి ఉన్నాడు’ అని యేసు తనతో చెప్పిన సమయం సరిగ్గా అదేనని అతడు తెలుసుకున్నాడు. కాబట్టి అతడూ, అతని ఇంట్లో అందరూ నమ్మారు.
54 Tak Ježíš učinil druhý zázrak v Galileji po svém návratu z Judska.
౫౪ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచకక్రియ.