< Zjevení Janovo 11 >

1 I dána mi třtina, podobná prutu, a postavil se tu anděl, a řekl mi: Vstaň, a změř chrám Boží, i oltář, i ty, kteříž se modlí v něm.
కొలబద్దలా ఉపయోగించడానికి ఒక చేతి కర్రను నాకిచ్చారు. అప్పుడు అతడు నాతో ఇలా అన్నాడు. “నువ్వు లే. దేవుని ఆలయం, బలిపీఠం కొలతలు తీసుకో. ఆలయంలో ఎంతమంది ఆరాధిస్తున్నారో లెక్క పెట్టు.
2 Ale síň, kteráž vně jest, vyvrz ven, a neměř jí. Neboť jest dána pohanům, a budouť tlačiti město svaté za čtyřidceti a dva měsíce.
ఆలయం బయటి ఆవరణం మాత్రం కొలవకు. అది యూదేతరులది. వారు నలభై రెండు నెలల పాటు ఈ పరిశుద్ధ పట్టణాన్ని తమ కాళ్ళ కింద తొక్కుతారు.
3 Ale dám jej dvěma svědkům svým, kteříž budou prorokovati tisíc dvě stě a šedesáte dnů, oblečeni jsouce v pytle.
“నా ఇద్దరు సాక్షులు గోనెపట్ట కట్టుకుని 1, 260 రోజులు దేవుని మాటలు ప్రకటించడానికి వారికి అధికారం ఇస్తాను.”
4 Tiť jsou dvě olivy a dva svícnové, stojící před obličejem Boha Pána vší země.
భూమికి ప్రభువైన వాని సన్నిధిలో ఉండే రెండు ఒలీవ చెట్లు, రెండు దీపస్తంభాలు వీరే.
5 Jimžto jestliže by kdo chtěl ubližovati, oheň vyjde z úst jejich, a sžíře nepřátely jejich; a takť musí zabit býti, kdož by koli jim škoditi chtěl.
ఎవరైనా వీరికి హని చేయాలని చూస్తే, వారి నోటి నుండి అగ్ని జ్వాలలు బయల్దేరి వారి శత్రువులను దహించి వేస్తాయి. కాబట్టి ఎవరైనా హాని చేయాలని చూస్తే వారికి అలాంటి మరణమే కలగాలి.
6 Tiť mají moc zavříti nebe, aby nepršel déšť za dnů proroctví jejich; a mají moc nad vodami, obrátiti je v krev, a bíti zemi všelikou ranou, kolikrát by koli chtěli.
తాము ప్రవచించే రోజుల్లో వాన కురవకుండా ఆకాశాన్ని మూసి ఉంచే అధికారం వారికి ఉంటుంది. అలాగే తాము తలచుకున్నపుడల్లా నీటిని రక్తంగా చేయడానికీ అన్ని రకాల పీడలతో భూమిని వేధించడానికీ వారికి అధికారం ఉంది.
7 Ale když dokonají svědectví své, šelma vystupující z propasti válku povede proti nim, a zvítězí nad nimi, i zmorduje je. (Abyssos g12)
వారు తమ సాక్షాన్ని ప్రకటించి ముగించగానే లోతైన అగాధంలో నుండి వచ్చే కౄర మృగం వారితో యుద్ధం చేస్తుంది. వారిని ఓడించి చంపుతుంది. (Abyssos g12)
8 A ležeti budou těla jejich mrtvá na ryncích města velikého, kteréž slove duchovně Sodoma a Egypt, kdežto i Pán náš ukřižován jest.
వారి మృత దేహాలు ఆ మహా పట్టణం వీధుల్లో పడి ఉంటాయి. ఆ పట్టణానికి ఉపమాన రూపకంగా ఈజిప్టు, సోదొమ అనే పేర్లు ఉన్నాయి. ఇక్కడే వారి ప్రభువును కూడా సిలువ వేసి చంపారు.
9 A vídati budou mnozí z pokolení, a z lidu, a z jazyků, i z národů těla jejich mrtvá za půl čtvrta dne, ale těl jejich mrtvých nedadí pochovati v hrobích.
మనుషుల్లో, అన్ని జాతుల వారిలో, రకరకాల భాషలు మాట్లాడే వారిలో, తెగల వారిలో కొందరు వీరి మృత దేహాలను చూస్తూ మూడున్నర రోజులు వీరిని సమాధిలో పెట్టనివ్వరు.
10 Anobrž ti, kteříž přebývají na zemi, radovati se budou nad nimi a veseliti se, a dary budou posílati jedni druhým; nebo ti dva proroci trápili ty, jenž přebývají na zemi.
౧౦ఈ ఇద్దరు ప్రవక్తలు భూమిపై నివసించే వారిని వేధించారు గనక వారికి పట్టిన గతిని చూసి వారంతా సంతోషిస్తారు. సంబరాలు చేసుకుంటారు. ఒకరికొకరు బహుమానాలు పంపుకుంటారు.
11 Ale po půl čtvrtu dni duch života od Boha poslaný vstoupil do nich, i postavili se na nohách svých, a bázeň veliká spadla na ty, kteříž je viděli.
౧౧కాని మూడున్నర రోజులైన తరువాత దేవుని దగ్గర నుండి జీవాన్నిచ్చే ఊపిరి వచ్చి వారిలో ప్రవేశిస్తుంది. వారు లేచి తమ కాళ్ళపై నిలబడతారు. ఇది చూసిన వారికి విపరీతమైన భయం కలుగుతుంది.
12 Potom slyšeli hlas veliký s nebe, řkoucí k nim: Vstupte sem! I vstoupili na nebe v oblace, a hleděli na ně nepřátelé jejich.
౧౨అప్పుడు, “ఇక్కడికి పైకి రండి” అని ఒక స్వరం బిగ్గరగా తమకు చెప్పడం వారు విని మేఘాలపై ఎక్కి పరలోకానికి వెళ్ళిపోతారు. వారు వెళ్తుండగా వారి శత్రువులు వారిని చూస్తారు.
13 A v tu hodinu stalo se země třesení veliké, a desátý díl města padl, a zbito jest v tom země třesení sedm tisíců lidu, a jiní zstrašeni jsou, a vzdali slávu Bohu nebeskému.
౧౩సరిగ్గా ఆ గంటలోనే ఒక మహా భూకంపం వస్తుంది. దాని మూలంగా పట్టణంలో పదవ భాగం కూలిపోతుంది. ఆ భూకంపంలో ఏడు వేలమంది చచ్చిపోతారు. చావకుండా మిగిలి ఉన్నవారు భయకంపితులై పరలోకంలో ఉన్న దేవుణ్ణి కీర్తిస్తారు.
14 Bída druhá pominula, a aj, třetí bída přijde rychle.
౧౪రెండవ యాతన ముగిసింది. ఇప్పుడు మూడవ యాతన త్వరలో ప్రారంభం కానుంది.
15 A sedmý anděl zatroubil, i stali se hlasové velicí v nebi, řkoucí: Učiněnať jsou království všeho světa Pána našeho a Krista jeho, a kralovatiť bude na věky věků. (aiōn g165)
౧౫ఏడవ దూత బాకా ఊదాడు. అప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు వినిపించాయి. ఆ స్వరాలు ఇలా పలికాయి, “ఈ లోక రాజ్యం మన ప్రభువు రాజ్యమూ, ఆయన క్రీస్తు రాజ్యమూ అయింది. ఆయన యుగయుగాలు పరిపాలన చేస్తాడు.” (aiōn g165)
16 Tedy těch čtyřmecítma starců, kteříž před obličejem Božím sedí na stolicích svých, padli na tváři své, a klaněli se Bohu,
౧౬అప్పుడు దేవుని ఎదుట సింహాసనాలపై కూర్చున్న ఇరవై నలుగురు పెద్దలూ సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించారు.
17 Řkouce: Díky činíme tobě, Pane Bože všemohoucí, Kterýž jsi, a Kterýžs byl, a Kterýž přijíti máš; nebo jsi přijal moc svou velikou a království ujal.
౧౭“ప్రభువైన దేవా, సర్వ శక్తిశాలీ, పూర్వం ఉండి ప్రస్తుతం ఉన్నవాడా, నువ్వు నీ మహాశక్తి సమేతంగా పాలించడం ప్రారంభించినందుకు నీకు మా కృతజ్ఞతలు.
18 I rozhněvali se národové, a přišel hněv tvůj, a čas mrtvých, aby souzeni byli, a aby dána byla odplata služebníkům tvým prorokům, i jiným svatým i všechněm, jenž se bojí jména tvého, malým i velikým, a aby zkaženi byli ti, kteříž nakažují zemi.
౧౮జనాలకు క్రోధం పెరిగిపోయింది. కాని నీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. చనిపోయిన వారికి తీర్పు తీర్చడానికీ, నీ సేవకులైన ప్రవక్తలకీ పరిశుద్ధులకీ గొప్పవారైనా అనామకులైనా నీ పేరు అంటే భయభక్తులు ఉన్న వారికి పారితోషికాలు ఇవ్వడానికీ, భూమిని నాశనం చేసే వారిని లేకుండా చేయడానికీ సమయం వచ్చింది” అన్నారు.
19 I otevřín jest chrám Boží na nebi, a vidína jest truhla smlouvy jeho v chrámě jeho. I stalo se blýskání, a hlasové, a hromobití, a země třesení, i krupobití veliké.
౧౯అప్పుడు పరలోకంలో దేవుని ఆలయం తెరుచుకుంది. దేవుని నిబంధన మందసం అందులో కనిపించింది. అప్పుడు మెరుపులూ, గొప్ప శబ్దాలూ, ఉరుములూ, భూకంపమూ కలిగాయి. పెద్ద వడగళ్ళు పడ్డాయి.

< Zjevení Janovo 11 >