< Józua 12 >
1 Tito pak jsou králové té země, kteréž pobili synové Izraelští, a opanovali zemi jejich, za Jordánem k východu slunce, od potoku Arnon až k hoře Hermon i všecky roviny k východu:
౧ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల ఉన్న అర్నోను లోయ నుండి హెర్మోను కొండ వరకూ తూర్పు మైదానమంతటిలో ఉన్న వారిని ఓడించి వారి దేశాలను ఆక్రమించుకొన్న రాజులు ఎవరంటే,
2 Seon, král Amorejský, kterýž bydlil v Ezebon, a panoval od Aroer, kteréž leží při břehu potoka Arnon, a u prostřed potoka toho, a polovici Galád, až do potoka Jabok, kterýž jest na pomezí synů Ammon,
౨అమోరీయుల రాజు సీహోను. అతడు హెష్బోనులో నివసిస్తూ అర్నోను నదీ తీరంలోని అరోయేరు నుండి, అంటే ఆ నదీ లోయ మధ్య నుండి గిలాదు అర్థభాగమూ అమ్మోనీయులకు సరిహద్దుగా ఉన్న యబ్బోకు నది లోయ వరకూ
3 A od rovin až k moři Ceneret k východu, a až k moři pouště, jenž jest moře slané k východu, kudyž se jde k Betsimot, a od polední strany ležící pod horou Fazga.
౩తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రం వరకూ తూర్పు దిక్కున బెత్యేషీమోతు మార్గంలో ఉప్పు సముద్రంగా నున్న అరాబా సముద్రం వరకూ దక్షిణం వైపున పిస్గాకొండ చరియల కింద ఉన్న మైదానం వరకూ పరిపాలించాడు.
4 Pomezí také Oga, krále Bázan, z ostatků Refaimských, kterýž bydlil v Astarot a v Edrei,
౪ఇశ్రాయేలీయులు బాషాను రాజైన ఓగును పట్టుకున్నారు. అతడు రెఫాయీయుల్లో మిగిలిన వారిలో ఒకడు. అతడు అష్తారోతులో ఎద్రెయిలో నివసించి గెషూరీయుల, మాయకాతీయుల సరిహద్దు వరకూ బాషాను అంతటా సల్కా,
5 A kterýž panoval na hoře Hermon a v Sálecha, i ve vší krajině Bázan až ku pomezí Gessuri a Machati, a nad polovicí Galád, ku pomezí Seona, krále Ezebon.
౫హెర్మోను, హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకూ గిలాదు అర్థభాగంలో పాలించినవాడు.
6 Mojžíš, služebník Hospodinův, a synové Izraelští pobili je; a dal ji Mojžíš služebník Hospodinův k vládařství pokolení Rubenovu, Gádovu a polovici pokolení Manassesova.
౬యెహోవా సేవకుడు మోషే, ఇశ్రాయేలీయులూ వారిని ఓడించారు. యెహోవా సేవకుడు మోషే, ఆ భూమిని రూబేనీయులకూ గాదీయులకూ మనష్షే అర్థగోత్రపు వారికీ స్వాస్థ్యంగా ఇచ్చాడు.
7 Tito pak jsou králové země té, kteréž pobil Jozue a synové Izraelští za Jordánem k západu, od Balgad, kteréž jest na poli Libánském, až k hoře lysé, kteráž se táhne až do Seir, a dal ji Jozue pokolením Izraelským k vládařství po dílích jejich,
౭యొర్దానుకు అవతల, అంటే పడమరగా లెబానోను లోయలో ఉన్న బయల్గాదు నుండి శేయీరు వరకూ వ్యాపించిన హాలాకు కొండవరకూ ఉన్న దేశాల రాజులను యెహోషువ, ఇశ్రాయేలీయులు జయించారు. యెహోషువ దాన్ని ఇశ్రాయేలీయులకు వారి గోత్రాల ప్రకారం స్వాస్థ్యంగా ఇచ్చాడు.
8 Na horách i na rovinách, i po polích, i v údolích, i na poušti a na poledne, zemi Hetejského, Amorejského, Kananejského, Ferezejského, Hevejského a Jebuzejského:
౮కొండ ప్రాంతాల్లో, లోయలో షెఫేలా ప్రదేశంలో చరియల ప్రదేశాల్లో అరణ్యంలో దక్షిణ దేశంలో ఉన్న హిత్తీయులూ అమోరీయులూ కనానీయులూ పెరిజ్జీయులూ హివ్వీయులూ యెబూసీయులూ అనేవారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టుకున్నారు.
9 Král Jericha jeden, král Hai, kteréž bylo na straně Bethel, jeden;
౯వారెవరంటే, యెరికో రాజు, బేతేలు పక్కన ఉన్న హాయి రాజు, యెరూషలేము రాజు,
10 Král Jeruzalémský jeden, král Hebron jeden;
౧౦హెబ్రోను రాజు, యర్మూతు రాజు,
11 Král Jarmut jeden, král Lachis jeden;
౧౧లాకీషు రాజు, ఎగ్లోను రాజు,
12 Král Eglon jeden, král Gázer jeden;
౧౨గెజెరు రాజు, దెబీరు రాజు,
13 Král Dabir jeden, král Gader jeden;
౧౩గెదెరు రాజు, హోర్మా రాజు,
14 Král Horma jeden, král Arad jeden;
౧౪అరాదు రాజు, లిబ్నా రాజు,
15 Král Lebna jeden, král Adulam jeden;
౧౫అదుల్లాము రాజు, మక్కేదా రాజు,
16 Král Maceda jeden, král Bethel jeden;
౧౬బేతేలు రాజు, తప్పూయ రాజు,
17 Král Tafua jeden, král Chefer jeden;
౧౭హెపెరు రాజు, ఆఫెకు రాజు,
18 Král Afek jeden, král Sáron jeden;
౧౮లష్షారోను రాజు, మాదోను రాజు,
19 Král Mádon jeden, král Azor jeden;
౧౯హాసోరు రాజు, షిమ్రోన్మెరోను రాజు,
20 Král Simron Meron jeden, král Achzaf jeden;
౨౦అక్షాపు రాజు, తానాకు రాజు,
21 Král Tanach jeden, král Mageddo jeden;
౨౧మెగిద్దో రాజు, కెదెషు రాజు.
22 Král Kedes jeden, král Jekonam z Karmelu jeden;
౨౨కర్మెలులో యొక్నెయాము రాజు, దోరు మెరక ప్రాంతాల్లో ఉన్న దోరు రాజు,
23 Král Dor z krajiny Dor jeden, král z Goim v Galgal jeden;
౨౩గిల్గాలులో గోయీయుల రాజు, తిర్సా రాజు.
24 Král Tersa jeden. Všech králů třidceti a jeden.
౨౪వారంతా కలిసి ముప్ఫై ఒక్క మంది రాజులు.