< Efezským 3 >
1 Pro tu věc já Pavel, jsem vězeň Krista Ježíše pro vás pohany,
౧ఈ కారణం చేత యూదేతర విశ్వాసులైన మీకోసం క్రీస్తు యేసు ఖైదీనైన పౌలు అనే నేను ప్రార్థిస్తున్నాను.
2 Jestliže však jste slyšeli o milosti Boží, kteréž jest mi uděleno k přisluhování vám,
౨మీ విషయంలో దేవుడు నాకు అనుగ్రహించిన కృపను గూర్చి మీరు వినే వుంటారు.
3 Že skrze zjevení oznámil mi tajemství, (jakož jsem vám prve psal krátce;
౩అదేమంటే దర్శనం ద్వారా నాకు క్రీస్తు మర్మం వెల్లడైంది. దీని గురించి మీకు కూడా తెలిసిన సంగతి ఇంతకు ముందు క్లుప్తంగా రాశాను.
4 Z čehož můžete, čtouce, porozuměti známosti mé v tajemství Kristovu; )
౪మీరు దాన్ని చదివితే ఆ క్రీస్తు మర్మం విషయంలో నేను పొందిన పరిజ్ఞానం గ్రహించగలరు.
5 Kteréž za jiných věků nebylo známo synům lidským, tak jako nyní zjeveno jest svatým apoštolům jeho a prorokům skrze Ducha,
౫ఈ మర్మం ఇప్పుడు ఆత్మ ద్వారా దేవుని పరిశుద్ధులైన అపొస్తలులకూ ప్రవక్తలకూ వెల్లడైనట్టుగా పూర్వకాలాల్లోని మనుషులకు తెలియలేదు.
6 Totiž že by měli býti pohané spoludědicové a jednotělní, i spoluúčastníci zaslíbení jeho v Kristu skrze evangelium,
౬ఈ మర్మం ఏమిటంటే, సువార్త ద్వారా యూదులతో పాటు యూదేతరులు కూడా క్రీస్తు యేసులో సమాన వారసులు, ఒకే శరీరంలోని అవయవాలు, వాగ్దానంలో పాలిభాగస్తులు అనేదే.
7 Kteréhož já učiněn jsem slouha z daru milosti Boží mně dané, podle působení moci jeho.
౭నేను ఆ సువార్తకు సేవకుడినయ్యాను. దేవుని శక్తిని బట్టి ఆయన కృప వల్లనే ఇది సాధ్యమైంది.
8 Mně nejmenšímu ze všech svatých dána jest milost ta, abych mezi pohany zvěstoval nestihlá bohatství Kristova,
౮పరిశుద్ధులందరిలో అత్యల్పుణ్ణి అయినా మన ఊహకందని క్రీస్తు ఐశ్వర్యాన్ని యూదేతరులకు ప్రకటించడానికీ,
9 A vysvětlil všechněm, kteraké by bylo obcování tajemství skrytého od věků v Bohu, kterýž všecko stvořil skrze Ježíše Krista, (aiōn )
౯సర్వ సృష్టికర్త అయిన దేవునిలో అనాది నుండీ దాగి ఉన్న ఆ మర్మాన్ని అందరికీ వెల్లడిపరచడానికీ దేవుడు ఆ కృపను నాకు అనుగ్రహించాడు. (aiōn )
10 Aby nyní oznámena byla knížatstvu a mocem na nebesích skrze církev rozličná moudrost Boží,
౧౦తన బహుముఖ జ్ఞానం సంఘం ద్వారా వాయుమండలంలోని ప్రధానులూ అధికారులూ తెలుసుకోవాలని దేవుని ఉద్దేశం.
11 Podle předuložení věčného, kteréž jest uložil v Kristu Ježíši Pánu našem, (aiōn )
౧౧అది మన ప్రభువైన క్రీస్తు యేసులో చేసిన ఆయన నిత్య సంకల్పం. (aiōn )
12 V němžto máme smělost a přístup s doufáním skrze víru jeho.
౧౨క్రీస్తుపై మన విశ్వాసం చేత ఆయనను బట్టి మనకి ధైర్యం, దేవుని సన్నిధిలోకి ప్రవేశించే నిబ్బరం కలిగింది.
13 Protož prosím, abyste nehynuli v čas soužení mých pro vás, kteráž jsou sláva vaše.
౧౩కాబట్టి మీ నిమిత్తం నాకు కలిగిన హింసలు చూసి మీరు అధైర్యపడవద్దని చెబుతున్నాను. ఇవి మీకు మహిమ కారకాలుగా ఉంటాయి.
14 A pro tu příčinu klekám na kolena svá před Otcem Pána našeho Jezukrista,
౧౪ఈ కారణం వలన పరలోకంలో,
15 Z něhožto všeliká rodina na nebi i na zemi jmenuje se,
౧౫భూమి మీదా ఉన్న ప్రతి కుటుంబం ఎవరిని బట్టి తన కుటుంబం అని పేరు పొందిందో ఆ తండ్రి ముందు నేను మోకాళ్ళూని ప్రార్థిస్తున్నాను.
16 Aby vám dal, podle bohatství slávy své, mocí posilněnu býti skrze Ducha svého na vnitřním člověku,
౧౬ఆయన మీలో ఉన్న తన ఆత్మ ద్వారా తన మహిమైశ్వర్యాన్ని బట్టి శక్తితో మిమ్మల్ని బలపరచడం అనే వరం ఇవ్వాలి.
17 Aby Kristus skrze víru přebýval v srdcích vašich,
౧౭క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసించాలి. మీరు ఆయన ప్రేమలో వేరు పారి స్థిరంగా ఉండాలి. ఇదే నా ప్రార్థన
18 Abyste v lásce vkořeněni a založeni jsouce, mohli stihnouti se všemi svatými, kteraká by byla širokost, a dlouhost, a hlubokost, a vysokost,
౧౮పరిశుద్ధులందరితో కలిసి దాని పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో పూర్తిగా గ్రహించగలగాలనీ
19 A poznati přenesmírnou lásku Kristovu, abyste tak naplněni byli ve všelikou plnost Boží.
౧౯జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోడానికి తగిన శక్తి పొందాలనీ నా ప్రార్థన.
20 Tomu pak, kterýž mocen jest nade všecko učiniti mnohem hojněji, nežli my prosíme aneb rozumíme, podle moci té, kterouž dělá v nás,
౨౦మనలో పని చేసే తన శక్తి ప్రకారం మనం అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే ఎంతో ఎక్కువగా చేయ శక్తి గల దేవునికి,
21 Tomu, pravím, buď sláva v církvi svaté skrze Krista Ježíše po všecky věky věků. Amen. (aiōn )
౨౧సంఘంలో క్రీస్తు యేసులో తరతరాలకూ నిరంతరం మహిమ కలుగు గాక. ఆమేన్. (aiōn )