< 2 Samuelova 10 >
1 Stalo se také potom, že umřel král Ammonitský, a kraloval Chanun syn jeho po něm.
౧ఆ తరువాత అమ్మోను రాజు చనిపోయినప్పుడు అతని కొడుకు హానూను ఆ దేశానికి రాజు అయ్యాడు.
2 I řekl David: Učiním milosrdenství s Chanunem synem Náhasovým, jakož otec jeho učinil milosrdenství nade mnou. Tedy poslal David, aby ho potěšil skrze služebníky své pro otce jeho. I přišli služebníci Davidovi do země Ammonitských.
౨దావీదు “హానూను తండ్రి నాహాషు నాకు చేసిన సహాయానికి బదులు నేను హానూనుకు ఏదైనా మేలు చేయాలి” అనుకుని అతని తండ్రి చనిపోయినందుకు అతన్ని తన తరపున ఓదార్చడానికి మనుషులను పంపించాడు. వారు అమ్మోనీయుల దేశానికి వెళ్ళారు.
3 I řekla knížata Ammonitská k Chanunovi, pánu svému: Cožť se zdá, že David činí poctivost otci tvému, že poslal k tobě, kteříž by tě potěšili? Zdaliž ne proto, aby shlédl město a vyšpehoval je, a potom je podvrátil, poslal David služebníky své k tobě?
౩అప్పుడు అమ్మోనీయుల ప్రజల నాయకులు రాజైన హానూనుతో ఇలా చెప్పారు “నీ తండ్రి మీద గౌరవంతో మాత్రమే దావీదు నిన్ను ఓదార్చడానికి నీ దగ్గరికి మనుషులను పంపాడని నువ్వు నిజంగా అనుకుంటున్నావా? ఈ పట్టణాన్ని ఆక్రమించుకోడానికి దాన్ని పరిశీలించడానికి అతడు తన గూఢచారులను పంపించాడని నీకు అనిపించలేదా?”
4 A tak Chanun vzav služebníky Davidovy, oholil každému půl brady, a zustřihoval roucha jejich až do polovice, totiž až do zadků jejich, a propustil je.
౪ఈ మాటలు విన్న హానూను దావీదు పంపిన మనుషులను పట్టుకుని, సగం గడ్డం గొరిగించి, వారు తొడుక్కొన్న బట్టలు వెనక వైపు నడుము కింద వరకూ మధ్యకు కత్తిరించి వారిని వెళ్లగొట్టాడు.
5 To když oznámili Davidovi, poslal proti nim, (nebo muži ti zohaveni byli velice), a řekl jim král: Pobuďte v Jerichu, dokudž neobrostou brady vaše, potom se navrátíte.
౫ఆ మనుషులు ఎంతో అవమానం పొందారని దావీదు విన్నప్పుడు, వారిని కలుసుకోవడానికి మనుషులను పంపించి “మీ గడ్డాలు పెరిగే వరకూ యెరికో పట్టణంలో ఆగిపోయి ఆ తరువాత యెరూషలేము రండి” అని వారికి చెప్పమన్నాడు.
6 Vidouce pak Ammonitští, že se zošklivili Davidovi, poslavše, najali ze mzdy z Syrie z domu Rohob, a z Syrie Soba dvadcet tisíců pěších, a od krále Maacha tisíc mužů, a od Istoba dvanácte tisíc mužů.
౬అమ్మోనీయులు, దావీదు విషయంలో తాము అతనికి అసహ్యులం అయ్యామని గ్రహించారు. వారు దావీదుకు భయపడి, తమ మనుషులను పంపి, బేత్రెహోబులో, అరాము సోబాలో ఉన్న అరామీయ సైన్యంలో నుండి ఇరవై వేలమంది సైనికులను జీతానికి మాట్లాడుకున్నారు. మయకా రాజు దగ్గరనుండి వెయ్యిమంది సైనికులను, టోబులో నుండి పన్నెండు వేలమంది సైనికులను జీతమిచ్చి పిలిపించుకున్నారు.
7 Což uslyšev David, poslal Joába se vším vojskem udatných.
౭ఈ సంగతి విన్న దావీదు యోవాబును, తన సైన్యమంతటినీ వారి పైకి పంపించాడు.
8 A tak vytáhše Ammonitští, šikovali se k boji u brány, Syrští také, Soba a Rohob, a Istob i Maacha zvláště byli na poli.
౮అమ్మోనీయులు బయలుదేరి తమ నగర సింహద్వారాలకు ఎదురుగా బారులు తీరి నిలబడ్డారు. సోబా నుంచి, రెహోబు నుంచి అరామీయులు, మయకావారు, టోబువారు విడివిడిగా పొలాల్లో కాపు కాశారు.
9 A protož vida Joáb proti sobě sšikovaný boj s předu i s zadu, vybrav některé ze všech výborných Izraelských, sšikoval je také proti Syrským.
౯తనకు వెనకా, ముందూ యుద్ధపంక్తులుగా నిలబడి ఉన్న సైనికులను చూసి యోవాబు ఇశ్రాయేలీయుల్లో మహా వీరులైన కొందరిని ఎన్నుకుని వరుసలుగా నిలబెట్టి అరామీయులను ఎదుర్కోడానికి సిద్ధపడ్డాడు.
10 Ostatek pak lidu dal pod správu Abizai bratra svého, a sšikoval jej proti Ammonitským.
౧౦మిగిలినవారిని అమ్మోనీయులను ఎదుర్కోడానికి తన సోదరుడు అబీషైకి అప్పగించాడు.
11 A řekl: Jestliže Syrští budou silnější mne, přispěješ mi na pomoc; jestliže pak Ammonitští silnější budou tebe, také přispěji, abych pomohl tobě.
౧౧యోవాబు అబీషైతో “అరామీయుల సైన్యం నా గుంపును ఓడిస్తుంటే నీ సైన్యం వచ్చి నన్ను ఆదుకోవాలి, అమ్మోనీయుల సైన్యం నీ బలానికి మించిపోతే నేను వచ్చి నిన్ను ఆదుకొంటాను.
12 Posiliž se, a buďme udatní, bojujíce za lid náš a za města Boha našeho, Hospodin pak učiní, což se jemu dobře líbiti bude.
౧౨ధైర్యం తెచ్చుకో. మన ప్రజలనూ, దేవుని పట్టణాన్నీ తలంచుకుని బలం తెచ్చుకొందాం. యెహోవా ఆయన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేస్తాడు గాక” అని చెప్పాడు.
13 I přistoupil Joáb s lidem svým k bitvě proti Syrským, a oni utekli před ním.
౧౩యోవాబు, అతని సైన్యం యుద్ధం ప్రారంభించగానే అరామీయులు వారి ముందు నిలవలేక పారిపోయారు.
14 Tedy Ammonitští vidouce, že utíkají Syrští, utekli i oni před Abizai a vešli do města. I navrátil se Joáb od Ammonitských a přišel do Jeruzaléma.
౧౪అరామీయులు పారిపోవడం చూసిన అమ్మోనీయులు కూడా అబీషైని ఎదిరించలేక పారిపోయారు. వారు తమ పట్టణాలకు పారిపోయినప్పుడు యోవాబు అమ్మోనీయులను వదిలిపెట్టి యెరూషలేము వచ్చాడు.
15 Ale Syrští vidouce, že by poraženi byli od Izraele, sebrali se vespolek.
౧౫ఇశ్రాయేలీయుల చేతిలో తాము పరాజయం పాలయ్యామని అరామీయులు గ్రహించి మళ్ళీ సమావేశమయ్యారు.
16 Poslal také Hadarezer a vyvedl Syrské, kteříž bydlejí za řekou, a přišli k Helam; Sobach pak, hejtman vojska Hadarezerova, vedl je.
౧౬హదదెజరు నది అవతలి వైపున ఉన్న అరామీయులను పిలిపించాడు. వారు హేలాముకు చేరుకున్నారు. హదదెజరు సైన్యానికి షోబకు సైన్యాధిపతిగా ఉన్నాడు.
17 I oznámeno to Davidovi. Kterýžto shromáždiv všecken lid Izraelský, přepravil se přes Jordán, a přitáhli k Helam. I sšikovali se Syrští proti Davidovi, a bojovali proti němu.
౧౭దావీదుకు ఈ వార్త తెలిసినప్పుడు అతడు ఇశ్రాయేలు యోధులందరినీ సమకూర్చి యొర్దాను నది దాటి హేలాముకు వచ్చాడు.
18 Tedy utekli Syrští před Izraelem, a porazil David z Syrských sedm set vozů a čtyřidceti tisíc jezdců. Sobacha také hejtmana vojska toho ranil, i umřel tu.
౧౮అరామీయులు యుద్ధ వ్యూహం సిద్ధపరచుకుని దావీదును ఎదుర్కున్నారు. దావీదు అరామీయుల్లో ఏడు వందలమంది రథికులను, నలభై వేలమంది గుర్రపు రౌతులను హతమార్చాడు. యుద్ధంలో ఇశ్రాయేలీయుల ముందు నిలబడలేక పారిపోయారు. వారి సైన్యాధిపతి షోబకు దావీదు చేతిలో ఓడిపోయి అక్కడే చనిపోయాడు.
19 Když pak viděli všickni králové, kteříž byli při Hadarezerovi, že jsou poraženi od Izraele, vešli v pokoj s Izraelem a sloužili jemu. A nesměli již více Syrští táhnouti na pomoc Ammonitským.
౧౯హదదెజరు సామంతులంతా తాము ఇశ్రాయేలీయుల ముందు నిలవలేక ఓడిపోవడం చూసి భయకంపితులయ్యారు. వారంతా ఇకపై అమ్మోనీయులకు సహాయం చేయడం మానుకుని ఇశ్రాయేలీయులకు లోబడి వారితో సంధి చేసుకున్నారు.