< 1 Korintským 3 >
1 A já, bratří, nemohl jsem vám mluviti jako duchovním, ale jako tělesným, jako maličkým v Kristu.
౧సోదరులారా, ఆత్మసంబంధులైన మనుషులతో మాట్లాడే విధంగా నేను మీతో మాట్లాడ లేకపోయాను. శరీర స్వభావం గలవారితోనూ, క్రీస్తులో పసిబిడ్డలతోనూ మాట్లాడే విధంగా మీతో మాట్లాడవలసి వచ్చింది.
2 Mlékem jsem vás živil, a ne pokrmem; nebo jste ještě nemohli pokrmů tvrdších užívati, ano i nyní ještě nemůžete.
౨మిమ్మల్ని పాలతోనే పెంచాను గాని బలమైన ఆహారం తినిపించలేదు. ఇప్పుడు కూడా మీరు దాన్ని తీసుకునే స్థితిలో లేరు.
3 Ještě zajisté tělesní jste. Poněvadžť jest mezi vámi nenávist, svárové a různice, zdaž ještě tělesní nejste? a tak podle člověka chodíte.
౩ఎందుకంటే మీరింకా శరీర స్వభావంతోనే ఉన్నారు. మీ మధ్య అసూయ, కలహం ఉన్నాయి. దాన్ని బట్టి మీరు శరీర స్వభావం కలిగి మానవ రీతిగా నడచుకొనేవారే కదా?
4 Nebo když někdo říká: Jáť jsem Pavlův, jiný pak: Já Apollův, zdaliž nejste tělesní?
౪మీలో ఒకడేమో “నేను పౌలుకు చెందినవాణ్ణి,” మరొకడు “నేను అపొల్లోకు చెందిన వాణ్ణి,” అని చెబుతూ ఉంటే మీరు శరీర స్వభావులే కదా
5 Nebo kdo jest Pavel, a kdo jest Apollo, než služebníci, skrze něž jste uvěřili, a jakž jednomu každému dal Pán?
౫అపొల్లో ఎవరు? పౌలు ఎవరు? ఇద్దరూ పరిచారకులే గదా. ఇద్దరికీ ప్రభువు ఇచ్చిన బాధ్యతలకు అనుగుణంగా వారి ద్వారా మీరు నమ్మారు.
6 Jáť jsem štípil, Apollo zaléval, ale Bůh dal zrůst.
౬నేను నాటాను, అపొల్లో నీరు పోశాడు. అయితే దాన్ని నీరు పోశాడు చేసింది దేవుడే.
7 A protož ani ten, kdož štěpuje, nic není, ani ten, jenž zalévá, ale ten, kterýž zrůst dává, Bůh.
౭కాబట్టి పెరిగేలా చేసిన దేవునిలోనే ఉంది గాని, నాటేవాడిలో గాని, నీరు పోసేవాడిలో గాని ఏమీ లేదు.
8 Ten pak, kdož štěpuje, a ten, kdož zalévá, jedno jsou, avšak jeden každý vlastní odplatu vezme podle své práce.
౮నాటే వాడూ నీరు పోసేవాడూ ఒక్కటే. ఒక్కొక్కరు కష్టపడిన కొద్దీ ప్రతిఫలం పొందుతారు.
9 Božíť jsme zajisté pomocníci, Boží rolí, Boží vzdělání jste.
౯మేము దేవునితో కలిసి పని చేసే వాళ్ళం. మీరు దేవుని పొలం, దేవుని కట్టడం.
10 Já podle milosti Boží mně dané, jako moudrý stavitel, základ jsem založil, jiný pak na něm staví. Ale jeden každý viz, jak na něm staví.
౧౦దేవుడు నాకు దయచేసిన కృప వలన నేను నైపుణ్యం గల నిర్మాణకునిగా పునాది వేశాను. మరొకడు దాని మీద నిర్మిస్తున్నాడు. అయితే దాని మీద కడుతున్న ప్రతి ఒక్కరూ తాము ఏ విధంగా కడుతున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి.
11 Nebo základu jiného žádný položiti nemůž, mimo ten, kterýž položen jest, jenž jest Ježíš Kristus.
౧౧పునాది యేసు క్రీస్తే. వేసిన ఈ పునాది కాక, వేరే పునాది ఎవరూ వేయలేరు.
12 Staví-liť pak kdo na ten základ zlato, stříbro, kamení drahé, dříví, seno, strniště,
౧౨ఈ పునాది మీద ఎవరైనా బంగారం, వెండి, విలువైన రాళ్ళు, చెక్క, చెత్త పరకలు, ఇలాటి వాటితో కడితే
13 Jednohoť každého dílo zjeveno bude. Den zajisté to všecko okáže; nebo v ohni zjeví se, a jednoho každého dílo, jaké by bylo, oheň zprubuje.
౧౩వారి వారి పని బయట పడుతుంది. ఆ రోజు దాన్ని స్పష్టంగా వెల్లడి చేస్తుంది. ఎందుకంటే అది అగ్నివల్ల బయట పడుతుంది. ప్రతి ఒక్కరి పనినీ మంటలే పరీక్షిస్తాయి.
14 Zůstane-liť čí dílo, kteréž na něm stavěl, vezme odplatu.
౧౪పునాది మీద ఎవరి పని నిలబడుతుందో అతనికి ప్రతిఫలం దొరుకుతుంది.
15 Pakliť čí dílo shoří, tenť vezme škodu, ale sám spasen bude, avšak tak jako skrze oheň.
౧౫ఎవరి పని కాలిపోతుందో అతనికి నష్టం వస్తుంది. అతడు తప్పించుకుంటాడు గానీ మంటల్లో నుండి తప్పించుకొన్నట్టుగా ఉంటాడు.
16 Zdaliž nevíte, že chrám Boží jste, a Duch Boží v vás přebývá?
౧౬మీరు దేవుని ఆలయమనీ దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనీ మీకు తెలియదా?
17 Jestližeť kdo chrámu Božího poskvrňuje, tohoť zatratí Bůh; nebo chrám Boží svatý jest, jenž jste vy.
౧౭దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు అతణ్ణి పాడు చేస్తాడు. దేవుని ఆలయం పవిత్రమైనది. ఆ ఆలయం మీరే.
18 Žádný sám sebe nesvoď. Zdá-li se komu z vás, že jest moudrý na tomto světě, budiž bláznem, aby byl učiněn moudrým. (aiōn )
౧౮ఎవరూ తనను తాను మోసగించుకోవద్దు. మీలో ఎవరైనా ఈ లోకరీతిగా తాను జ్ఞానం గలవాడిని అనుకుంటే, జ్ఞానం పొందడం కోసం అతడు తెలివి తక్కువవాడు కావాలి. (aiōn )
19 Moudrost zajisté světa tohoto bláznovství jest u Boha. Nebo psáno jest: Kterýž zlapá moudré v chytrosti jejich.
౧౯ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి తెలివి తక్కువతనమే. “జ్ఞానులను వారి కుయుక్తుల్లోనే ఆయన పట్టుకుంటాడు” అనీ,
20 A opět: Znáť Pán přemyšlování moudrých, že jsou marná.
౨౦“జ్ఞానుల ఆలోచనలు వ్యర్థం అని ప్రభువుకు తెలుసు” అనీ రాసి ఉంది కదా.
21 A tak nechlubiž se žádný lidmi; nebo všecky věci vaše jsou.
౨౧కాబట్టి మనుషులను బట్టి ఎవరూ అతిశయించ కూడదు. ఎందుకంటే అన్నీ మీవే.
22 Buďto Pavel, buďto Apollo, buďto Petr, buďto svět, buďto život, buďto smrt, buďto přítomné věci, buďto budoucí, všecko jest vaše,
౨౨పౌలైనా, అపొల్లో అయినా, కేఫా అయినా, లోకమైనా, జీవమైనా, మరణమైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, అన్నీ మీవే.
23 Vy pak Kristovi, a Kristus Boží.
౨౩మీరు క్రీస్తుకు చెందినవారు, క్రీస్తు దేవునికి చెందినవాడు.