< Římanům 11 >
1 Protož pravím: Zdaliž Bůh zavrhl lid svůj? Nikoli; nebo i já Izraelský jsem, z semene Abrahamova, z pokolení Beniaminova.
౧అలాగైతే నేనడిగేది ఏమిటంటే, దేవుడు తన ప్రజలను విడిచి పెట్టేశాడా? కానే కాదు. నేను కూడా ఇశ్రాయేలీయుణ్ణే, అబ్రాహాము సంతానంలో బెన్యామీను గోత్రంలో పుట్టాను.
2 Nezavrhlť Bůh lidu svého, kterýž předzvěděl. Zdali nevíte, co písmo praví o Eliášovi, kterak se modlí Bohu proti lidu Izraelskému, řka:
౨తాను ముందుగానే ఎరిగిన తన ప్రజలను దేవుడు విడిచి పెట్టలేదు. ఏలీయా గురించిన లేఖనభాగం చెప్పింది మీకు తెలియదా? అదేవిధంగా ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా దేవునితో విన్నవించుకొన్నాడో తెలియదా?
3 Pane, proroky tvé zmordovali, a oltáře tvé rozkopali, já pak zůstal jsem sám, a i méť duše hledají?
౩“ప్రభూ, వారు నీ ప్రవక్తలను చంపారు, నీ బలిపీఠాలను పడదోశారు. నేనొక్కడినే మిగిలాను. వారు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు.”
4 Ale co jemu dí odpověď Boží? Pozůstavil jsem sobě sedm tisíců mužů, kteříž neskláněli kolen před Bálem.
౪అయితే అతనికి దేవుడిచ్చిన జవాబు వినండి, “బయలుకు మోకరించని 7,000 మంది పురుషులు నాకున్నారు.”
5 Takť i nyní ostatkové podlé vyvolení milosti zůstali,
౫అప్పటి కాలంలోలాగా ఇప్పుడు కూడా కృప మూలమైన ఏర్పాటు చొప్పున శేషం మిగిలి ఉంది.
6 A poněvadž z milosti, tedy ne z skutků, sic jinak milost již by nebyla milost. Pakli z skutků, již není milost, jinak skutek nebyl by skutek.
౬అది కృప వలన జరిగినదైతే అది క్రియల మూలమైనది కాదు. అలా కాకపోతే కృప ఇంక కృప అనిపించుకోదు.
7 Což tedy? Čeho hledá Izrael, toho nedošel, ale vyvolení došli toho, jiní pak zatvrzeni jsou,
౭అప్పుడేమైంది? ఇశ్రాయేలు ప్రజలు దేనినైతే వెదికారో అది వారికి దొరకలేదు, దేవుని కృప ద్వారా ఎన్నికైన వారికే అది దొరికింది. మిగిలినవారు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు.
8 (Jakož psáno jest: Dal jim Bůh ducha zkormoucení, oči aby neviděli, a uši, aby neslyšeli, ) až do dnešního dne.
౮దీని గురించి, “నేటి వరకూ దేవుడు వారికి స్పష్టతలేని మనసు, చూడని కళ్ళు, వినని చెవులు ఇచ్చాడు” అని రాసి ఉంది.
9 A David dí: Budiž jim stůl jejich osídlem a pastmi a pohoršením i odplacením.
౯దీనికి దావీదు ఏమన్నాడంటే, “వారి భోజనం వారికి ఒక వలగా, ఒక బోనుగా, ఒక అడ్డుబండగా, ఒక ప్రతీకార చర్యగా ఉండు గాక.
10 Zatmětež se oči jejich, ať nevidí, a hřbet jejich vždycky shýbej.
౧౦వారు చూడలేకుండేలా వారి కళ్ళకు చీకటి కమ్ము గాక. వారి వీపులు ఎప్పుడూ వంగిపోయి ఉండు గాక.”
11 Pravím tedy: Tak-liž pak klesli, aby padli? Nikoli, ale jejich pádem spasení přišlo pohanům, aby je k závidění přivedl.
౧౧కాబట్టి నేనడిగేది ఏమిటంటే, వారు పడిపోవడం కోసమే తొట్రుపడ్డారా? అలా కానేకాదు. వారి తొట్రుపాటు వలన యూదేతరులకు పాపవిమోచన కలిగి, అది యూదులు రోషం తెచ్చుకోడానికి కారణమైంది.
12 A poněvadž pak jejich pád jest bohatství světa, a zmenšení jejich jest bohatství pohanů, čím více plnost jich?
౧౨వారి అపరాధం లోకానికి, వారి నష్టం యూదేతరులకు ఐశ్వర్యంగా ఉంటే, వారి పరిపూర్ణత ఇంకెంత ఎక్కువ ఐశ్వర్యకరమౌతుందో!
13 Vámť zajisté pravím pohanům, že jelikož jsem já apoštol pohanský, přisluhování své oslavuji,
౧౩యూదేతరులైన మీతో నేను మాట్లాడుతున్నాను. నేను యూదేతరులకు అపొస్తలుడుగా ఉన్నందుకు నా పరిచర్య విషయంలో అతిశయిస్తాను.
14 Zda bych jak k závidění vzbuditi mohl tělo mé, a k spasení přivesti některé z nich.
౧౪ఎలాగైనా నా రక్తసంబంధులకు రోషం కలిగించడం ద్వారా వారిలో కొందరినైనా రక్షించాలని నా కోరిక.
15 Nebo kdyžť zavržení jich jest smíření světa, co pak zase jich přijetí, než život z mrtvých?
౧౫వారు తిరస్కారం పొందడం లోకాన్ని దేవునితో సమాధానపరచడం అయితే, వారిని స్వీకరించడం చనిపోయిన వారు సజీవులుగా లేచినట్టే అవుతుంది గదా?
16 Poněvadž prvotiny svaté, takéť i těsto; a jestliť kořen svatý, i ratolesti.
౧౬ముద్దలో మొదటి పిడికెడు పవిత్రమైతే ముద్దంతా పవిత్రమే. వేరు పవిత్రమైతే కొమ్మలు కూడా పవిత్రమే.
17 Žeť jsou pak některé ratolesti vylomeny, a ty, byv planou olivou, vštípen jsi místo nich, a učiněn jsi účastník kořene i tučnosti olivy.
౧౭అయితే కొమ్మల్లో కొన్నిటిని విరిచి వేసి, అడవి ఒలీవ కొమ్మలాంటి నిన్ను వాటి మధ్య అంటు కట్టి, ఒలీవ చెట్టు సారవంతమైన వేరులో నీకు భాగం ఇస్తే,
18 Nechlub se proti ratolestem. Pakli se chlubíš, věz, že ne ty kořen neseš, ale kořen tebe.
౧౮నీవు ఆ కొమ్మల పైన విర్రవీగ వద్దు. ఎందుకంటే వేరే నిన్ను భరిస్తున్నది గాని నీవు వేరును భరించడం లేదు.
19 Pakli díš: Vylomeny jsou ratolesti, abych já byl vštípen,
౧౯అందుకు, “ఆ కొమ్మలను విరిచింది నన్ను అంటు కట్టడానికే” అని నీవు చెప్పవచ్చు.
20 Dobře. Pro nevěru vylomeny jsou, ale ty věrou stojíš. Nebudiž vysokomyslný, ale boj se.
౨౦నిజమే. వారి అవిశ్వాసాన్ని బట్టి విరిచివేయడం జరిగింది. నీవైతే విశ్వాసాన్ని బట్టి నిలిచి ఉన్నావు. నిన్ను నీవు హెచ్చించుకోక, భయం కలిగి ఉండు.
21 Nebo poněvadž Bůh ratolestem přirozeným neodpustil, věz, žeť by ani tobě neodpustil.
౨౧ఎందుకంటే దేవుడు సహజమైన కొమ్మలనే వదల్లేదంటే నిన్ను కూడా వదలడు గదా!
22 A protož viz dobrotivost i zůřivost Boží. K těm zajisté, kteříž padli, zůřivost, ale k tobě dobrotivost, ač budeš-li trvati v dobrotě. Sic jinak i ty vyťat budeš.
౨౨కాబట్టి దేవుని అనుగ్రహాన్ని, ఆయన కాఠిన్యాన్ని చూడు. అంటే ఆయన ఒక వైపు పడిపోయిన యూదుల మీద కాఠిన్యం చూపించాడు. మరొకవైపు నీవు ఆయన దయలో నిలిచి ఉంటే నీ మీద తన అనుగ్రహాన్ని చూపించాడు. నీవు అలా నిలిచి ఉండకపోతే నిన్ను కూడా నరికివేస్తాడు.
23 Ano i oni, jestliže nezůstanou v nevěře, zase vštípeni budou. Mocenť jest zajisté Bůh zase vštípiti je.
౨౩అంతేకాక, వారు తమ అవిశ్వాసంలో కొనసాగకుండా వెనక్కి తిరిగితే వారిని తిరిగి అంటు కడతాడు. దేవుడు వారిని మళ్ళీ అంటు కట్టడానికి సమర్ధుడు.
24 Nebo poněvadž ty vyťat jsi z přirozené plané olivy, a proti přirození vštípen jsi v dobrou olivu, čím více ti, kteříž podlé přirození jsou, vštípeni budou v svou vlastní olivu.
౨౪ఎలాగంటే, నిన్ను ఒక అడవి ఒలీవ చెట్టు నుండి కోసి, అసహజంగా మంచి ఒలీవ చెట్టుకు అంటుకట్టగలిగిన వాడు సహజమైన కొమ్మలను మరి నిశ్చయంగా తమ సొంత ఒలీవ చెట్టుకు అంటుకట్టగలడు కదా!
25 Neboť nechci, bratří, abyste nevěděli tohoto tajemství, (abyste nebyli sami u sebe moudří, ) že zatvrdilost z částky přihodila se Izraelovi, dokudž by nevešla plnost pohanů.
౨౫సోదరులారా, మీకు మీరే తెలివైన వారని తలంచకుండా ఉండాలని ఈ రహస్య సత్యాన్ని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. అదేమంటే, యూదేతరుల ప్రవేశం సంపూర్ణం అయ్యే వరకూ ఇశ్రాయేలు ప్రజల్లో కొందరి హృదయాలు కఠినమయ్యాయి.
26 A takť všecken Izrael spasen bude, jakož psáno jest: Přijde z Siona vysvoboditel, a odvrátíť bezbožnosti od Jákoba.
౨౬“విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు.
27 A tatoť bude smlouva má s nimi, když shladím hříchy jejich.
౨౭నేను వారి పాపాలను తీసివేసేటప్పుడు వారితో నేను చేసుకొనే నిబంధన ఇదే” అని రాసి ఉన్నట్టు ఇశ్రాయేలు ప్రజలంతా రక్షణ పొందుతారు.
28 A tak s strany evangelium jsouť nepřátelé pro vás, ale podlé vyvolení jsou milí pro otce.
౨౮సువార్త విషయమైతే మిమ్మల్ని బట్టి వారు ద్వేషించబడి ఉండవచ్చు గానీ, దేవుని ఎన్నిక విషయమైతే పితరులను బట్టి వారు దేవునికి ప్రియమైన వారు.
29 Darů zajisté svých a povolání Bůh nelituje.
౨౯ఎందుకంటే, దేవుని కృపావరాలు, ఆయన పిలుపు విషయాల్లో ఆయన మార్పు లేని వాడు.
30 Nebo jakož i vy někdy jste nebyli poslušni Boha, ale nyní milosrdenství jste došli pro jejich nevěru,
౩౦గతంలో మీరు దేవునికి అవిధేయులు. ఇప్పుడు యూదుల అవిధేయత మూలంగా మీరు కనికరం పొందారు.
31 Tak i oni nyní neuposlechli, aby pro učiněné vám milosrdenství i oni milosrdenství dosáhli.
౩౧అలాగే మీపై చూపిన కనికరాన్ని బట్టి ఇప్పుడు కనికరం పొందడం కోసం, వారు ఇప్పుడు అవిధేయులుగా ఉన్నారు.
32 Zavřel zajisté Bůh všecky v nevěře, aby se nade všemi smiloval. (eleēsē )
౩౨అందరి పైనా తన కనికరం చూపాలని, దేవుడు అందరినీ లోబడని స్థితిలో మూసివేసి బంధించాడు. (eleēsē )
33 Ó hlubokosti bohatství i moudrosti i umění Božího! Jak jsou nezpytatelní soudové jeho, a nevystižitelné cesty jeho.
౩౩ఆహా, దేవుని తెలివి, జ్ఞానాల ఐశ్వర్యం ఎంత లోతైనది! ఆయన తీర్పులను పరీక్షించడం ఎవరి తరం. ఆయన మార్గాలు మన ఊహకు అందనివి.
34 Nebo kdo poznal mysl Páně? Aneb kdo jemu radil?
౩౪“ప్రభువు మనసు తెలిసిన వాడెవడు? ఆయనకు సలహాలు ఇచ్చేదెవరు?
35 Nebo kdo prvé dal jemu, a budeť mu odplaceno?
౩౫ఆయన దగ్గర నుండి తిరిగి పొందాలని ముందుగా ఆయనకు ఇవ్వగలవాడెవడు?”
36 Nebo z něho, a skrze něho, a v něm jsou všecky věci, jemuž sláva na věky. Amen. (aiōn )
౩౬సమస్తమూ ఆయన మూలంగా, ఆయన ద్వారా, ఆయన కోసం ఉన్నాయి. యుగయుగాలకు ఆయనకు మహిమ కలుగు గాక. ఆమేన్. (aiōn )