< Žalmy 91 >

1 Ten, kdož v skrýši Nejvyššího přebývá, v stínu Všemohoucího odpočívati bude.
సర్వోన్నతుడి చాటున నివసించే వాడు సర్వశక్తిశాలి నీడలో నిలిచి ఉంటాడు.
2 Dím Hospodinu: Útočiště mé a hrad můj, Bůh můj, v němž naději skládati budu.
ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడు, అని నేను యెహోవాను గురించి చెబుతాను.
3 Onť zajisté vysvobodí tě z osídla lovce, a od nejjedovatějšího nakažení morního.
వేటగాడు పన్నిన ఉచ్చు నుంచి ప్రాణాంతకవ్యాధి నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు.
4 Brky svými přikryje tě, a pod křídly jeho bezpečen budeš; místo štítu a pavézy budeš míti pravdu jeho.
ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం దొరుకుతుంది. ఆయన నమ్మకత్వం నిన్ను కాపాడే కవచంగా ఉంటుంది.
5 Nebudeš se báti přístrachu nočního, ani střely létající ve dne.
రాత్రిలో కలిగే భయభ్రాంతులకు, పగటివేళ ఎగిరి వచ్చే బాణాలకూ నువ్వు భయపడవు.
6 Ani nakažení morního, vlekoucího se v mrákotě, ani povětří morního, v polední čas hubícího.
చీకట్లో తచ్చాడే రోగానికిగానీ మధ్యాహ్నం సోకే వ్యాధికి గానీ నువ్వు బెదిరిపోవు.
7 Padne jich po boku tvém tisíc, a deset tisíců po pravici tvé, ale k tobě se to nepřiblíží.
నీ పక్కన వేయి మంది, నీ కుడిపక్కన పదివేల మంది నేలకూలినా అది నీ దరిదాపులకు రాదు.
8 Očima toliko svýma to spatříš, a odplatě bezbožných se podíváš.
దుర్మార్గులకు పడే శిక్ష నువ్వు చూస్తూ ఉంటావు.
9 Poněvadž jsi Hospodina, kterýž útočiště mé jest, a Nejvyššího za svůj příbytek položil,
యెహోవా నా ఆశ్రయం. మహోన్నతుణ్ణి నీకు కూడా శరణుగా చేసుకో.
10 Nepřihodí se tobě nic zlého, aniž se přiblíží jaká rána k stánku tvému.
౧౦ఏ హానీ నిన్ను ముంచెత్తదు. ఏ ఆపదా నీ ఇంటి దరిదాపులకు రాదు.
11 Nebo andělům svým přikázal o tobě, aby tě ostříhali na všech cestách tvých.
౧౧నువ్వు చేసే వాటన్నిటిలో నిన్ను కాపాడడానికి ఆయన తన దూతలను పురమాయిస్తాడు.
12 Na rukou ponesou tě, abys neurazil o kámen nohy své.
౧౨నువ్వు జారి బండ రాయిపై పడిపోకుండా వాళ్ళు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు.
13 Po lvu a bazališku choditi budeš, a pošlapáš lvíče i draka.
౧౩నువ్వు సింహాలనూ నాగుపాములను నీ కాళ్ళ కింద తొక్కుతావు, సింహం కూనలను, పాములను అణగదొక్కుతావు.
14 Poněvadž mne, dí Bůh, zamiloval, vysvobodím jej, a vyvýším; nebo poznal jméno mé.
౧౪అతనికి నా మీద భక్తి విశ్వాసాలున్నాయి గనక నేనతన్ని రక్షిస్తాను. అతడు నా పట్ల స్వామిభక్తి గలవాడు గనక నేనతన్ని కాపాడతాను.
15 Vzývati mne bude, a vyslyším jej; já s ním budu v ssoužení, vytrhnu a oslavím jej.
౧౫అతడు నాకు మొరపెడితే నేనతనికి జవాబిస్తాను. కష్టాల్లో నేను అతనితో ఉంటాను, అతనికి విజయమిచ్చి అతన్ని సత్కరిస్తాను.
16 Dlouhostí dnů jej nasytím, a ukáži jemu spasení své.
౧౬దీర్ఘాయుష్షుతో అతన్ని తృప్తిపరుస్తాను. నా రక్షణ అతనికి చూపిస్తాను.

< Žalmy 91 >