< Žalmy 149 >

1 Halelujah. Zpívejte Hospodinu píseň novou, chválu jeho v shromáždění svatých.
యెహోవాను స్తుతించండి. యెహోవాకు నూతన గీతం పాడండి. భక్తులు సమకూడే ప్రతిచోటా ఆయనకు స్తుతి గీతాలు పాడండి.
2 Vesel se Izrael v tom, kterýž ho učinil, synové Sionští plésejte v králi svém.
ఇశ్రాయేలు ప్రజలు తమ సృష్టికర్తను బట్టి సంతోషిస్తారు గాక. సీయోను ప్రజలు తమ రాజును బట్టి ఆనందిస్తారు గాక.
3 Chvalte jméno jeho na píšťalu, na buben a na citaru prozpěvujte jemu.
వాళ్ళు నాట్యం చేస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తారు గాక. తంబుర, సితారా మోగిస్తూ ఆయనను గూర్చి ఆనంద గీతాలు గానం చేస్తారు గాక.
4 Nebo zalíbilo se Hospodinu v lidu jeho; onť ozdobuje pokorné spasením.
యెహోవా తన ప్రజలందరినీ అమితంగా ప్రేమిస్తున్నాడు. దీనులైన తన ప్రజలకు రక్షణ భాగ్యం ప్రసాదించాడు.
5 Plésati budou svatí v Boží slávě, a zpívati v pokojích svých.
ఆయన భక్తులు ఘనమైన స్థితిలో సంతోషంతో ఉప్పొంగిపోతారు గాక. తమ పడకలపై వాళ్ళు సంతోషంగా పాటలు పాడతారు గాక.
6 Oslavování Boha silného bude ve rtech jejich, a meč na obě straně ostrý v rukou jejich,
దేవుణ్ణి కీర్తించేందుకు వాళ్ళ నోటినిండా ఉత్సాహ గీతాలు ఉన్నాయి.
7 K vykonávání pomsty nad pohany, a k strestání národů,
వాళ్ళ చేతుల్లో రెండంచుల ఖడ్గం ఉంది. ఆ ఖడ్గం చేబూని వాళ్ళు అన్యులకు ప్రతీకారం చేస్తారు, వాళ్ళను శిక్షిస్తారు.
8 K svazování králů jejich řetězy, a šlechticů jejich pouty železnými,
వాళ్ళ రాజులను గొలుసులతో, వాళ్ళలో ఘనత వహించిన వారిని ఇనుప సంకెళ్లతో బంధిస్తారు.
9 K nakládání s nimi podlé práva zapsaného, k slávě všechněm svatým jeho. Halelujah.
తీర్పులో శిక్ష పొందిన వాళ్లకు శిక్ష అమలు పరుస్తారు. ఆయన భక్తులందరికీ ఈ ఉన్నతమైన గౌరవం దక్కుతుంది. యెహోవాను స్తుతించండి.

< Žalmy 149 >