< Filipským 2 >

1 Protož jestli jaké potěšení v Kristu, jestli které utěšení lásky, jestli která společnost Ducha, jsou-li která střeva a slitování,
క్రీస్తులో ఎలాంటి ప్రోత్సాహం గానీ, ప్రేమ ద్వారా ఎలాంటి ఆదరణ గానీ, దేవుని ఆత్మతో ఎలాంటి సహవాసం గానీ, సున్నితమైన ఎలాంటి కనికరం, వాత్సల్యం గానీ ఉన్నట్టయితే,
2 Naplňte radost mou, abyste jednostejného smyslu byli, jednostejnou lásku majíce, jednodušní jsouce, jednostejně smýšlejíce,
మీరంతా ఒకే మనసు, ఒకే విధమైన ప్రేమ, ఆత్మలో సహవాసం ఒకే ఉద్దేశం కలిగిఉండి నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి.
3 Nic nečiníce skrze svár aneb marnou chválu, ale v pokoře jedni druhé za důstojnější nežli sebe majíce.
స్వార్ధంతో గానీ వృథాతిశయంతో గానీ ఏమీ చేయవద్దు. వినయమైన మనసుతో ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి.
4 Nehledejte jeden každý jen svých věcí, ale každý také toho, což jest jiných.
మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాలను కూడా పట్టించుకోవాలి.
5 To tedy, ciťte při sobě, co i při Kristu Ježíši.
క్రీస్తు యేసుకున్న ఇలాంటి ప్రవృత్తినే మీరూ కలిగి ఉండండి.
6 Kterýž jsa v způsobu Božím, nepoložil sobě toho za loupež rovný býti Bohu,
ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు. దేవునితో తన సమానత్వాన్ని విడిచిపెట్ట లేనిదిగా ఎంచుకోలేదు.
7 Ale samého sebe zmařil, způsob služebníka přijav, podobný lidem učiněn.
అయితే, దానికి ప్రతిగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు. బానిస రూపం తీసుకున్నాడు. మానవుల పోలికలో కనిపించాడు. ఆకారంలో ఆయన మనిషిగా కనిపించాడు.
8 A v způsobu nalezen jako člověk, ponížil se, poslušný byv až do smrti, a to smrti kříže.
చావు దాకా, అంటే, సిలువ మీద చావుకైనా సరే, తనను తాను తగ్గించుకుని, లోబడ్డాడు.
9 Protož i Bůh povýšil ho nade vše, a dal jemu jméno nad každé jméno,
అందుచేత పరలోకంలోనూ, భూమి మీదా, భూమి కిందా ఉన్న ప్రతి ఒక్కరి మోకాలు యేసు నామంలో వంగేలా, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమ కోసం యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించేలా, దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించి, అందరికంటే ఉన్నతమైన నామాన్ని ఆయనకు ఇచ్చాడు.
10 Aby ve jménu Ježíše každé koleno klekalo, těch, kteříž jsou na nebesích, a těch, kteříž jsou na zemi, i těch, kteříž jsou pod zemí,
౧౦
11 A každý jazyk aby vyznával, že Ježíš Kristus jest Pánem v slávě Boha Otce.
౧౧
12 A tak, moji milí, jakož jste vždycky poslušni byli, netoliko v přítomnosti mé, ale nyní mnohem více v nepřítomnosti mé, s bázní a s třesením spasení své konejte.
౧౨నా ప్రియ సహ విశ్వాసులారా, మీరెప్పుడూ లోబడుతున్నట్టుగానే, నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, మరి ఎక్కువగా మీతో లేనప్పుడు, భయభక్తులతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి.
13 Bůh zajisté jest, kterýž působí v vás i chtění i skutečné činění, podlé dobře libé vůle své.
౧౩ఎందుకంటే దేవుడే మీరు తనకిష్టమైన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి కావలసిన సంకల్పాన్ని, కార్యసిద్ధిని కలుగజేయడానికి మీలో పని చేస్తూ ఉన్నాడు.
14 Všecko čiňte bez reptání, a bez pochybování,
౧౪మీరు చేసేవన్నీ, ఫిర్యాదులూ వాదాలూ లేకుండా చేయండి.
15 Abyste byli bez úhony, a upřímí synové Boží, bez obvinění u prostřed národu zlého a převráceného. Mezi kterýmižto svěťte jako světla na světě,
౧౫దానివలన మీరు కుటిలమైన వక్రమైన ఈ తరం ప్రజల మధ్య నిర్దోషులు, నిందారహితులు, నిష్కళంకులైన దేవుని కుమారులుగా, లోకంలో దీపాలుగా వెలుగుతుంటారు.
16 Slovo života zachovávajíce, ku poctivosti mé v den Kristův, že jsem ne nadarmo běžel, ani nadarmo pracoval.
౧౬జీవవాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. అప్పుడు క్రీస్తు తిరిగి వచ్చే రోజున నేను వ్యర్థంగా పరుగెత్తలేదనీ నా పని వృధా కాలేదనీ నాకు తెలుస్తుంది. గొప్పగా చెప్పుకోడానికి నాకొక కారణం ఉంటుంది.
17 A bychť pak i obětován byl pro obět a službu víře vaší, raduji se, a spolu raduji se se všechněmi vámi.
౧౭మీ విశ్వాస బలిదాన పరిచర్యలో నేను పానార్పణగా పోయబడినా, నేను సంతోషిస్తూ మీ అందరితో ఆనందిస్తాను.
18 A též i vy radujte se, a spolu radujte se se mnou.
౧౮అలాగే మీరు కూడా సంతోషిస్తూ నాతోబాటు ఆనందించండి.
19 Mámť pak naději v Pánu Ježíši, že Timotea brzy pošli vám, abych i já pokojné mysli byl, zvěda, kterak vy se máte.
౧౯మీరెలా ఉన్నారో తెలుసుకుని నాకు ప్రోత్సాహం కలిగేలా, ప్రభు యేసు చిత్తమైతే త్వరలో తిమోతిని మీ దగ్గరికి పంపాలనుకుంటున్నాను.
20 Nebo žádného tak jednomyslného nemám, kterýž by tak vlastně o vaše věci pečoval.
౨౦తిమోతి లాగా మీ గురించి అంతగా పట్టించుకొనే వాడు నాకెవరూ లేరు.
21 Všickni zajisté svých věcí hledají, a ne těch, kteréž jsou Krista Ježíše.
౨౧మిగతా వారంతా తమ సొంత పనుల్నే చూసుకుంటున్నారు గాని, యేసు క్రీస్తు విషయాలు చూడడం లేదు.
22 Ale jej zkušeného býti víte, že jako syn s otcem, se mnou přisluhoval v evangelium.
౨౨తిమోతి తనను తాను రుజువు చేసుకున్నాడు. ఎందుకంటే, తండ్రికి కొడుకు ఎలా సేవ చేస్తాడో అలాగే అతడు నాతో కూడ సువార్త ప్రచారంలో సేవ చేశాడని మీకు తెలుసు.
23 Tohoť hle, naději mám, že pošli, jakž jen uzřím, co se bude díti se mnou.
౨౩అందుచేత నాకు ఏం జరగబోతున్నదో తెలిసిన వెంటనే అతన్ని పంపాలనుకుంటున్నాను.
24 Mámť pak naději v Pánu, že i sám brzo přijdu k vám.
౨౪నేను త్వరలో వస్తానని ప్రభువునుబట్టి నమ్ముతున్నాను.
25 Ale zdálo se mi za potřebné Epafrodita, bratra a pomocníka a spolurytíře mého, vašeho pak apoštola i služebníka, v potřebě mé poslati k vám,
౨౫నా సోదరుడు, జతపని వాడు, సాటి యోధుడు, మీ ప్రతినిధి, నాకు అవసరమైనప్పుడు సేవ చేసే వాడు అయిన ఎపఫ్రొదితును మీ దగ్గరికి పంపడం అవసరమనుకున్నాను.
26 Poněvadž toužil po všech vás, a velmi těžek nad tím byl, že jste o něm slyšeli, že by byl nemocen.
౨౬అతడు జబ్బు పడ్డాడని మీకు తెలిసింది కాబట్టి అతడు మీ అందరితో ఉండాలని చాలా బెంగగా ఉన్నాడు.
27 A bylť jistě nemocen, i blízek smrti, ale Bůh se nad ním smiloval, a ne nad ním toliko, ale i nade mnou, abych zámutku na zámutek neměl.
౨౭అతడు చావుకు దగ్గరగా వెళ్ళాడు, కానీ దేవుడు అతని మీద జాలి చూపించాడు. అతని మీదే కాదు, దుఃఖం వెంట దుఃఖం కలగకుండా నా మీద కూడా జాలి చూపాడు.
28 Protož tím chtivěji poslal jsem ho, abyste, vidouce jej zase, radovali se, a já abych byl bez zámutku.
౨౮కాబట్టి మీరు అతన్ని మళ్ళీ చూసి సంతోషించేలా, నా విచారం తగ్గేలా అతన్ని త్వరపెట్టి పంపుతున్నాను.
29 Přijmětež jej tedy v Pánu se vší radostí, a mějtež takové v poctivosti.
౨౯ఎపఫ్రొదితును పూర్ణానందంతో ప్రభువు పేరిట చేర్చుకోండి. అలాంటి వారిని గౌరవంగా చూడండి.
30 Neboť pro dílo Kristovo až k smrti se přiblížil, opováživ se života, aby doplnil to, v čemž jste vy měli nedostatek při posloužení mně.
౩౦ఎందుకంటే అతడు క్రీస్తు పనిలో దాదాపు చావును ఎదుర్కొన్నాడు. నాకు సేవ చేయడానికీ మీరు తీర్చలేకపోయిన నా అవసరాలను మీ బదులు తీర్చడానికి, అతడు తన ప్రాణం సైతం లెక్కచేయలేదు.

< Filipským 2 >