< Matouš 5 >
1 Vida pak Ježíš zástupy, vstoupil na horu; a když se posadil, přistoupili k němu učedlníci jeho.
౧యేసు ఆ ప్రజా సమూహాన్ని చూసి కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు.
2 I otevřev ústa svá, učil je, řka:
౨ఆయన తన నోరు తెరచి ఇలా ఉపదేశించ సాగాడు.
3 Blahoslavení chudí duchem, nebo jejich jest království nebeské.
౩“ఆత్మలో దీనత్వం గలవారు ధన్యులు, పరలోకరాజ్యం వారిదే.
4 Blahoslavení lkající, nebo oni potěšeni budou.
౪దుఃఖించే వారు ధన్యులు, వారికి ఓదార్పు కలుగుతుంది.
5 Blahoslavení tiší, nebo oni dědictví obdrží na zemi.
౫సాధుగుణం గలవారు ధన్యులు, ఈ భూమికి వారు వారసులవుతారు.
6 Blahoslavení, kteříž lačnějí a žíznějí spravedlnosti, nebo oni nasyceni budou.
౬నీతిన్యాయాల కోసం ఆకలిదప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పొందుతారు.
7 Blahoslavení milosrdní, nebo oni milosrdenství důjdou.
౭కనికరం చూపే వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు.
8 Blahoslavení čistého srdce, nebo oni Boha viděti budou.
౮పవిత్ర హృదయం గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు.
9 Blahoslavení pokojní, nebo oni synové Boží slouti budou.
౯శాంతి కుదిర్చేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనిపించుకుంటారు.
10 Blahoslavení, kteříž protivenství trpí pro spravedlnost, nebo jejich jest království nebeské.
౧౦నీతి కోసం నిలబడి హింసల పాలయ్యేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది.
11 Blahoslavení budete, když vám zlořečiti budou a protivenství činiti, a mluviti všecko zlé o vás, lhouce, pro mne.
౧౧“నన్ను బట్టి మనుషులు మిమ్మల్ని అవమానించి, హింసించి మీమీద అన్ని రకాల అపనిందలు అన్యాయంగా వేసినప్పుడు మీరు ధన్యులు.
12 Radujte se a veselte se, nebo odplata vaše hojná jest v nebesích. Takť zajisté protivili se prorokům, kteříž byli před vámi.
౧౨అప్పుడు సంతోషించండి! ఉప్పొంగిపొండి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు ముందు వచ్చిన ప్రవక్తలను కూడా మనుషులు ఇలాగే హింసించారు.
13 Vy jste sůl země. Jestliže sůl zmařena bude, čím bude osolena? K ničemuž se nehodí více, než aby byla ven vyvržena a od lidí pošlapána.
౧౩“లోకానికి మీరు ఉప్పు. ఉప్పు తన రుచి కోల్పోతే దానికి ఆ రుచి మళ్ళీ ఎలా వస్తుంది? అలాంటి ఉప్పు బయట పారేసి కాళ్ళ కింద తొక్కడానికి తప్ప ఇక దేనికీ పనికిరాదు.
14 Vy jste světlo světa. Nemůžeť město na hoře ležící skryto býti.
౧౪ప్రపంచానికి మీరు వెలుగుగా ఉన్నారు. కొండ మీద ఉండే ఊరు కనబడకుండా ఉండదు.
15 Aniž rozsvěcují svíce a stavějí ji pod kbelec, ale na svícen; i svítí všechněm, kteříž jsou v domě.
౧౫ఎవరూ దీపం వెలిగించి బుట్ట కింద పెట్టరు. దీపస్తంభం మీదే పెడతారు. అప్పుడు ఆ దీపం ఇంట్లో అందరికీ వెలుగు ఇస్తుంది.
16 Tak svěť světlo vaše před lidmi, ať vidí skutky vaše dobré, a slaví Otce vašeho, kterýž jest v nebesích.
౧౬మీ వెలుగు మనుషుల ముందు ప్రకాశించనీయండి. అప్పుడు వారు మీ మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు.
17 Nedomnívejte se, že bych přišel rušiti zákona aneb proroků. Nepřišelť jsem rušiti, ale naplniti.
౧౭“నేను ధర్మశాస్త్రాన్ని గానీ ప్రవక్తల మాటలను గానీ రద్దు చేయడానికి వచ్చాననుకోవద్దు. వాటిని నెరవేర్చడానికే వచ్చాను గానీ రద్దు చేయడానికి కాదు.
18 Amen zajisté pravím vám: Dokudž nepomine nebe i země, jediná literka aneb jeden puňktík nepomine z zákona, až se všecky věci stanou.
౧౮నేను కచ్చితంగా చెబుతున్నాను. ఆకాశం, భూమి నశించే వరకూ ధర్మశాస్త్రమంతా నెరవేరే వరకూ ధర్మశాస్త్రం నుంచి ఒక్క పొల్లు అయినా, ఒక సున్నా అయినా తప్పిపోదు.
19 Protož zrušil-li by kdo jedno z přikázaní těchto nejmenších, a učil by tak lidi, nejmenší slouti bude v království nebeském. Kdož by pak koli činil i učil, ten veliký slouti bude v království nebeském.
౧౯కాబట్టి ఈ ఆజ్ఞల్లో ఎంత చిన్న దానినైనా సరే అతిక్రమించి, ఇతరులకు కూడా అలా చేయమని బోధించేవాణ్ణి పరలోకరాజ్యంలో అతి తక్కువ వాడుగా ఎంచుతారు. కానీ ఈ ఆజ్ఞల ప్రకారం చేస్తూ, వాటిని బోధించేవాణ్ణి పరలోక రాజ్యంలో గొప్పవాడుగా లెక్కిస్తారు.
20 Nebo pravím vám: Nebude-liť hojnější spravedlivost vaše nežli zákonníků a farizeů, nikoli nevejdete do království nebeského.
౨౦ధర్మశాస్త్ర పండితుల, పరిసయ్యుల నీతికన్నా మీ నీతి మిన్నగా ఉండకపోతే మీరు పరలోకరాజ్యంలో ఎంత మాత్రమూ ప్రవేశించలేరని మీతో చెబుతున్నాను.
21 Slyšeli jste, že říkáno jest starým: Nezabiješ. Pakli by kdo zabil, povinen trpěti soud.
౨౧“‘హత్య చేయవద్దు. హత్య చేసేవాడు శిక్షకు లోనవుతాడు’ అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు.
22 Ale jáť pravím vám: Že každý, kdož se hněvá na bratra svého bez příčiny, musí trpěti soud. Kdož by pak řekl bratru svému: Rácha, povinen bude před radou státi; a kdož by řekl: Blázne, musí pekelný oheň trpěti. (Geenna )
౨౨అయితే నేను మీతో చెప్పేదేమిటంటే తన సోదరుని మీద కోపం పెట్టుకొనే ప్రతివాడూ శిక్షకు లోనవుతాడు. తన సోదరుణ్ణి ‘పనికి మాలినవాడా’ అని పిలిచే ప్రతివాడూ మహాసభ ముందు నిలబడాలి. ‘మూర్ఖుడా’ అనే ప్రతివాడికీ నరకాగ్ని తప్పదు. (Geenna )
23 Protož obětoval-li bys dar svůj na oltář, a tu bys se rozpomenul, že bratr tvůj má něco proti tobě:
౨౩“కాబట్టి నీవు నీ కానుకను బలిపీఠం వద్ద అర్పించే ముందు, నీ సోదరునికి నీ మీద ఏదైనా విరోధ భావం ఉందని నీకు గుర్తుకు వచ్చిందనుకో.
24 Nechejž tu daru svého před oltářem a odejdi; prvé smiř se s bratrem svým, a potom přijda, obětuj dar svůj.
౨౪నీ కానుకను అక్కడే, బలిపీఠం ఎదుటే వదిలి వెళ్ళు. ముందు నీ సోదరునితో రాజీ పడు. ఆ తరువాత వచ్చి నీ కానుకను అర్పించు.
25 Vejdi v dobrou vůli s protivníkem svým rychle, dokudž jsi s ním na cestě, aťby snad nedal tebe protivník tvůj soudci, a soudce dal by tě služebníku, a byl bys uvržen do žaláře.
౨౫నీపై నేరం ఆరోపించేవాడితో న్యాయస్థానానికి వెళ్ళే దారిలోనే త్వరగా రాజీపడు. లేకపోతే అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడేమో. ఆ న్యాయాధిపతి నిన్ను అధికారికి అప్పగించి చెరసాల్లో వేయిస్తాడేమో.
26 Amen pravím tobě: Nevyjdeš odtud, dokudž i posledního haléře nenavrátíš.
౨౬చెల్లించాల్సి ఉన్నదంతా చెల్లించే వరకూ నీవు అక్కడ నుండి బయట పడలేవని కచ్చితంగా చెబుతున్నాను.
27 Slyšeli jste, že říkáno bylo starým: Nezcizoložíš.
౨౭“‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పడం మీరు విన్నారు గదా.
28 Ale jáť pravím vám: Že každý, kdož by pohleděl na ženu ku požádání jí, již zcizoložil s ní v srdci svém.
౨౮కానీ నేను మీతో చెప్పేదేమిటంటే ఎవరైనా ఒక స్త్రీని కామంతో చూస్తే అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించాడు.
29 Jestliže pak oko tvé pravé horší tě, vylup je a vrz od sebe; neboť jest užitečněji tobě, aby zahynul jeden oud tvůj, než by celé tělo tvé uvrženo bylo do ohně pekelného. (Geenna )
౨౯నీవు పాపం చేయడానికి నీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా. (Geenna )
30 A pakli ruka tvá pravá horší tě, utni ji a vrz od sebe; nebo užitečněji jest tobě, aby zahynul jeden oud tvůj, než by všecko tělo tvé uvrženo bylo do pekelného ohně. (Geenna )
౩౦నీ కుడి చెయ్యి నీవు పాపం చేయడానికి కారణమైతే దాన్ని నరికి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే నీ శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా. (Geenna )
31 Též řečeno jest: Kdož by koli propustil manželku svou, aby jí dal lístek rozloučení.
౩౧“‘తన భార్యను వదిలేసేవాడు ఆమెకు విడాకుల పత్రం రాసివ్వాలి’ అని చెప్పడం కూడా మీరు విన్నారు.
32 Jáť pak pravím vám: Že kdožkoli propustil by manželku svou, kromě příčiny cizoložstva, uvodí ji v cizoložstvo, a kdož propuštěnou pojme, cizoloží.
౩౨నేను మీతో చెప్పేదేమిటంటే వ్యభిచార కారణం కాకుండా తన భార్యను వదిలేసే ప్రతివాడూ ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. వదిలేసిన ఆమెను పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.
33 Opět slyšeli jste, že říkáno bylo starým: Nebudeš křivě přisahati, ale splníš Pánu přísahy své.
౩౩“‘నీవు అబద్ధ ప్రమాణం చేయకూడదు. ప్రభువుకు చేసిన ప్రమాణాలను నిలబెట్టుకోవాలి’ అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు గదా.
34 Ale jáť pravím vám: Abyste nepřisahali všelijak, ani skrze nebe, nebo trůn Boží jest;
౩౪అయితే నేను మీతో చెప్పేదేమిటంటే ఎంతమాత్రం ఒట్టు పెట్టుకోవద్దు. పరలోకం మీద ఒట్టు పెట్టుకోవద్దు, అది దేవుని సింహాసనం.
35 Ani skrze zemi, nebo podnož jeho jest; ani skrze Jeruzalém, nebo město velikého toho Krále jest.
౩౫భూమి తోడు అనవద్దు. అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడు అనవద్దు. అది మహారాజు నగరం.
36 Ani skrze hlavu svou budeš přisahati, nebo nemůžeš jednoho vlasu učiniti bílého aneb černého.
౩౬నీ తల తోడని ప్రమాణం చేయవద్దు. నీవు ఒక వెంట్రుకైనా తెల్లగా గాని నల్లగా గాని చేయలేవు.
37 Ale buď řeč vaše: Jistě, jistě; nikoli, nikoli. Což pak nad to více jest, to od zlého jest.
౩౭మీ మాట ‘అవునంటే అవును, కాదంటే కాదు’ అన్నట్టే ఉండాలి. అలా కాని ప్రతిదీ అపవాది సంబంధమైనదే.
38 Slyšeli jste, že říkáno bylo: Oko za oko, a zub za zub.
౩౮“‘కంటికి బదులు కన్ను, పన్నుకు బదులు పన్ను’ అని చెప్పింది మీరు విన్నారు గదా.
39 Jáť pak pravím vám: Abyste neodpírali zlému. Ale udeří-li tě kdo v pravé líce tvé, nasaď jemu i druhého.
౩౯కానీ నేను మీతో చెప్పేదేమిటంటే దుష్టుణ్ణి ఎదిరించవద్దు. ఎవరైనా నిన్ను కుడి చెంప మీద కొడితే అతన్ని మరొక చెంప మీద కూడా కొట్టనియ్యి.
40 A tomu, kdož se s tebou chce souditi a sukni tvou vzíti, nech mu i pláště.
౪౦ఎవరైనా నీ అంగీ విషయం వివాదం పెట్టుకుని దాన్ని లాక్కుంటే అతనికి నీ పైచొక్కా కూడా ఇచ్చివెయ్యి.
41 A nutil-li by tě kdo míli jednu, jdi s ním dvě.
౪౧ఎవరైనా ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే అతనితో రెండు మైళ్ళు వెళ్ళు.
42 A prosícímu tebe dej, a od toho, kdo by chtěl vypůjčiti od tebe, neodvracuj se.
౪౨నిన్ను అడిగిన వాడికి ఇవ్వు. నిన్ను అప్పు అడగాలనుకొనే వాడికి నీ ముఖం చాటు చేయవద్దు.
43 Slyšeli jste, že říkáno bylo: Milovati budeš bližního svého, a nenáviděti budeš nepřítele svého.
౪౩“‘నీ పొరుగువాణ్ణి ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పింది మీరు విన్నారు గదా.
44 Ale jáť vám pravím: Milujte nepřátely své, dobrořečte těm, kteříž vás proklínají, dobře čiňte nenávidícím vás, a modlte se za ty, kteříž vás utiskují a vám se protiví,
౪౪నేను మీతో చెప్పేదేమంటే, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి.
45 Abyste byli synové Otce svého, kterýž jest v nebesích; nebo slunci svému velí vzchoditi na dobré i na zlé, a déšť dává na spravedlivé i na nespravedlivé.
౪౫ఆ విధంగా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులవుతారు. ఎందుకంటే ఆయన చెడ్డవారిపైనా మంచివారిపైనా తన సూర్యుణ్ణి ఉదయింపజేసి, నీతిమంతులపైనా దుర్మార్గులపైనా వాన కురిపిస్తున్నాడు.
46 Nebo milujete-li ty, kdož vás milují, jakou odplatu máte? Zdaliž i publikáni téhož nečiní?
౪౬మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకు ఏం లాభం? పన్నులు వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు గదా.
47 A budete-li pozdravovati toliko bratří svých, což více činíte? Však i publikáni to činí.
౪౭మీరు మీ సోదరులనే గౌరవిస్తుంటే ఇతరులకంటే ఎక్కువేం చేస్తున్నారు? యూదేతరులూ అలాగే చేస్తున్నారు గదా.
48 Buďtež vy tedy dokonalí, jako i Otec váš, kterýž jest v nebesích, dokonalý jest.
౪౮మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి.