< Židům 7 >
1 Nebo ten Melchisedech byl král Sálem, kněz Boha nejvyššího, kterýž vyšel v cestu Abrahamovi, navracujícímu se od pobití králů, a dal jemu požehnání.
౧రాజులను హతమార్చి తిరిగి వస్తున్న అబ్రాహామును షాలేం పట్టణానికి రాజైన మెల్కీసెదెకు కలుసుకుని ఆశీర్వదించాడు.
2 Kterémuž Abraham i desátek dal ze všeho. Kterýž nejprvé vykládá se král spravedlnosti, potom pak i král Sálem, to jest král pokoje,
౨అబ్రాహాము తాను యుద్ధంలో పట్టుకున్న వాటిలో పదవ వంతు అతనికి ఇచ్చాడు. “మెల్కీసెదెకు” అనే అతని పేరుకు నీతికి రాజు అనీ, ఇంకా, “షాలేం రాజు”, అంటే శాంతికి రాజు అనీ అర్థం.
3 Bez otce, bez matky, bez rodu, ani počátku dnů, ani skonání života nemaje, ale připodobněn jsa Synu Božímu, zůstává knězem věčně.
౩అతడు తండ్రి లేకుండానూ, తల్లి లేకుండానూ ఉన్నాడు. ఇతనికి పూర్వీకులంటూ ఎవరూ లేరు. ఇతని జీవిత కాలానికి ప్రారంభం లేదు. జీవితానికి అంతం అంటూ లేదు. దేవుని కుమారుడిలా ఇతడు కలకాలం యాజకుడై ఉన్నాడు.
4 Pohleďtež tedy, kteraký ten byl, jemuž i desátky z kořistí dal Abraham patriarcha.
౪ఇప్పుడు ఇతడెంత గొప్పవాడో గమనించండి. మన పూర్వికుడైన అబ్రాహాము యుద్ధంలో తాను కొల్లగొట్టిన శ్రేష్ఠమైన వస్తువుల్లో పదోవంతు ఇతనికి ఇచ్చాడు.
5 A ješto ti, kteříž jsou z synů Léví kněžství přijímající, přikázaní mají desátky bráti od lidu podlé zákona, to jest od bratří svých, ačkoli pošlých z bedr Abrahamových,
౫లేవి వంశం వారిలో నుండి యాజకులైన వారు, ఇతర గోత్రాల ప్రజలు అబ్రాహాము సంతతి వారైనప్పటికీ, వారి దగ్గర పదవ వంతును కానుకగా సేకరించాలని ధర్మశాస్త్రం ఆదేశిస్తుంది.
6 Tento pak, jehož rod není počten mezi nimi, desátky vzal od Abrahama, a tomu, kterýž měl zaslíbení, požehnání dal.
౬కానీ లేవీతో ఎలాంటి సంబంధమూ లేని మెల్కీసెదెకు అబ్రాహాము దగ్గర పదోవంతు కానుకలు స్వీకరించి అబ్రాహామును ఆశీర్వదించాడు.
7 A jistě beze všeho odporu menší od většího požehnání béře.
౭ఆశీర్వదించేవాడు అధికుడనీ దాన్ని అందుకునేవాడు తక్కువ వాడన్నది కాదనలేని విషయం.
8 A tuto desátky berou smrtelní lidé, ale tamto ten, o němž se vysvědčuje, že jest živ.
౮లేవీ క్రమంలో యాజకుడై కానుక స్వీకరించేవాడు ఒకరోజు మరణిస్తాడు. అయితే అబ్రాహాము కానుకను స్వీకరించిన వాడు శాశ్వతంగా జీవిస్తూ ఉన్నట్టుగా వివరణ ఉంది.
9 A ať tak dím, i sám Léví, kterýž desátky béře, v Abrahamovi desátky dal.
౯ఒక రకంగా చెప్పాలంటే పదోవంతు కానుకలను స్వీకరించిన లేవీ తాను కూడా అబ్రాహాము ద్వారా పదవ వంతు కానుకలు ఇచ్చాడు.
10 Nebo ještě v bedrách otce byl, když vyšel proti němu Melchisedech.
౧౦ఇది ఎలాగంటే, లేవీ అబ్రాహాము నుండే రావాలి కాబట్టి, అబ్రాహాము మెల్కీసెదెకుకు కానుక ఇచ్చినప్పుడు అతని గర్భవాసంలో లేవీ ఉన్నాడు.
11 A protož byla-liť dokonalost skrze Levítské kněžství, (nebo za něho vydán jest lidu zákon, ) jakáž toho byla potřeba, aby jiný kněz podlé řádu Melchisedechova povstal, a nebyl podlé řádu Aronova jmenován?
౧౧లేవీయులు యాజకులై ఉన్నప్పుడే దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కాబట్టి ఒకవేళ ఆ యాజక వ్యవస్థ వల్లనే పరిపూర్ణత కలిగిందీ అనుకుంటే లేవీయుడైన అహరోను క్రమంలో కాకుండా మెల్కీసెదెకు క్రమంలో వేరే యాజకుడు రావలసిన అవసరమేంటి?
12 A poněvadž jest kněžství přeneseno, musiloť také i zákona přenesení býti.
౧౨యాజకత్వం మారినప్పుడు యాజక ధర్మం కూడా మారాలి.
13 Nebo ten, o kterémž se to praví, jiného jest pokolení, z kteréhož žádný při oltáři v službě nebyl.
౧౩ప్రస్తుతం ఈ విషయాలన్నీ వేరే గోత్రంలో పుట్టిన వ్యక్తిని గూర్చి చెప్పుకుంటున్నాం. ఈ గోత్రంలో పుట్టిన వారిెవరూ బలిపీఠం వద్ద సేవ చేయలేదు.
14 Zjevné jest zajisté, že z pokolení Judova pošel Pán náš, o kterémžto pokolení nic z strany kněžství nemluvil Mojžíš.
౧౪మన ప్రభువు యూదా గోత్రంలో పుట్టాడు అనేది తెలిసిన విషయమే. యాజకులను గూర్చి మాట్లాడేటప్పుడు ఈ గోత్రాన్ని మోషే ఏనాడూ ప్రస్తావనే చేయలేదు.
15 Nýbrž hojněji to ještě zjevné jest, že povstal jiný kněz podlé řádu Melchisedechova,
౧౫మెల్కీసెదెకు వంటి మరొక యాజకుడు వచ్చాడు కనుక మేము చెబుతున్నది మరింత స్పష్టమవుతూ ఉంది.
16 Kterýž učiněn jest ne podlé zákona přikázaní tělesného, ale podlé moci života neporušitelného.
౧౬ఈ కొత్త యాజకుడు ధర్మశాస్త్రం ప్రకారం వంశం ఆధారంగా రాలేదు. నాశనం కావడం అసాధ్యం అయిన జీవానికి ఉన్న శక్తి ఆధారంగా వచ్చాడు.
17 Nebo svědčí: Ty jsi kněz na věky podlé řádu Melchisedechova. (aiōn )
౧౭“నువ్వు మెల్కీసెదెకు క్రమంలో కలకాలం ఉండే యాజకుడివి” అని లేఖనాలు ఆయనను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. (aiōn )
18 Stalo se zajisté složení onoho předešlého přikázaní, proto že bylo mdlé a neužitečné.
౧౮ఈ విషయంలో ముందు వచ్చిన ఆజ్ఞను పక్కన పెట్టడం జరిగింది. ఎందుకంటే అది బలహీనంగానూ వ్యర్ధమైనదిగానూ ఉంది.
19 Nebo ničeho k dokonalosti nepřivedl zákon, ale na místo jeho uvedena lepší naděje, skrze niž přibližujeme se k Bohu.
౧౯ధర్మశాస్త్రం దేనినీ పరిపూర్ణం చేయలేదు. భవిష్యత్తు గూర్చి అంత కంటే శ్రేష్ఠమైన ఆశాభావం మనలను దేవుని దగ్గరికి చేరుస్తూ ఉంది.
20 A to i podlé toho, že ne bez přísahy jest uvedena.
౨౦ఈ శ్రేష్ఠమైన ఆశాభావం ప్రమాణం చేయకుండా కలగలేదు. ఇతర యాజకులైతే ప్రమాణం లేకుండానే యాజకులయ్యారు.
21 Nebo onino bez přísahy kněžími učiněni bývali, tento pak s přísahou, skrze toho, kterýž řekl k němu: Přisáhl Pán, a nebudeť toho litovati: Ty jsi kněz na věky podlé řádu Melchisedechova. (aiōn )
౨౧అయితే యేసును గూర్చి మాట్లాడుతూ దేవుడు ఇలా ప్రమాణం చేశాడు, “నువ్వు కలకాలం యాజకుడిగా ఉంటావని దేవుడు ప్రమాణం చేశాడు. ఆయన తన ఆలోచనను మార్చుకోడు.” (aiōn )
22 Podlé čehož lepší smlouvy prostředníkem učiněn jest Ježíš.
౨౨ఈ విధంగా మరింత శ్రేష్ఠమైన ఒప్పందానికి ఆయన పూచీ అయ్యాడు.
23 A také onino mnozí bývali kněží, proto že smrt bránila jim vždycky trvati;
౨౩ఈ యాజకులు కలకాలం సేవ చేయకుండా వారిని మరణం నిరోధిస్తుంది. అందుకే ఒకరి తరువాత మరొకరుగా అనేకమంది యాజకులు అయ్యారు.
24 Ale tento poněvadž zůstává na věky, věčné má kněžství. (aiōn )
౨౪యేసు కలకాలం జీవిస్తాడు కనుక ఆయన యాజకత్వం కూడా మార్పులేనిదిగా ఉంటుంది. (aiōn )
25 A protož i dokonale spasiti může ty, kteříž přistupují skrze něho k Bohu, vždycky jsa živ k orodování za ně.
౨౫కాబట్టి ఈయన తన ద్వారా దేవుని దగ్గరికి వచ్చేవారిని సంపూర్ణంగా రక్షించడానికి సమర్ధుడుగా ఉన్నాడు. వారి తరపున విన్నపాలు చేయడానికి కలకాలం జీవిస్తూ ఉన్నాడు.
26 Takovéhoť zajisté nám slušelo míti nejvyššího kněze, svatého, nevinného, nepoškvrněného, odděleného od hříšníků, a kterýž by vyšší nad nebesa učiněn byl,
౨౬ఆయన కల్మషం అంటని వాడు, నిందా రహితుడు, పవిత్రుడు, పాపులకు వేరుగా ఉన్నవాడు, ఆకాశాల కంటే ఉన్నతంగా ఉన్నాడు. ఇలాటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు.
27 Kterýž by nepotřeboval na každý den, jako onino kněží, nejprv za své vlastní hříchy oběti obětovati, potom za lid. Nebo učinil to jednou, samého sebe obětovav.
౨౭ఇతర ప్రధాన యాజకుల్లాగా ప్రతిదినం ముందుగా తన సొంత పాపాల కోసం అర్పణలు అర్పించి తరువాత ప్రజల కోసం అర్పించాల్సిన అవసరం ఈయనకు లేదు. ఈయన తనను తానే అర్పణగా ఒక్కసారే అర్పించి ముగించాడు.
28 Zákon zajisté lidi mající nedostatky ustavoval za nejvyšší kněží, ale slovo přísežné, kteréž se stalo po zákonu, ustanovilo Syna dokonalého na věky. (aiōn )
౨౮ధర్మశాస్త్రం బలహీనతలున్న వారిని ముఖ్య యాజకులుగా నియమిస్తుంది. కాని ధర్మశాస్త్రం తరువాత వచ్చిన ప్రమాణ వాక్కు కుమారుణ్ణి ప్రధాన యాజకుడిగా నియమించింది. ఈయన శాశ్వతకాలం నిలిచే పరిపూర్ణత పొందినవాడు. (aiōn )