< Habakuk 3 >
1 Modlitba Abakuka proroka podlé Šigejonót:
౧ప్రవక్త అయిన హబక్కూకు చేసిన ప్రార్థన (వాద్యాలతో పాడదగినది).
2 Ó Hospodine, uslyšev pohrůžku tvou, ulekl jsem se. Hospodine, dílo své u prostřed let při životu zachovej, u prostřed let známé učiň, v hněvě na milosrdenství se rozpomeň.
౨యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. యెహోవా, ఈ సంవత్సరాల్లో నీ కార్యం నూతన పరచు. ఈ రోజుల్లో నీ పనులు తెలియచెయ్యి. కోపంలో కనికరం మరచిపోవద్దు.
3 Když se Bůh bral od poledne, a Svatý s hory Fáran, (Sélah) slávu jeho přikryla nebesa, a země byla plná chvály jeho.
౩దేవుడు తేమానులో నుండి వచ్చాడు. పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేస్తున్నాడు (సెలా) ఆయన మహిమ ఆకాశమండలమంతటా కనబడుతున్నది. భూమి ఆయన స్తుతితో నిండి ఉంది.
4 Blesk byl jako světlo, rohy po bocích svých měl, a tu skryta byla síla jeho.
౪ఆయన హస్తాలనుండి కిరణాలు వెలువడుతున్నాయి. అక్కడ ఆయన తన బలం దాచి ఉంచాడు.
5 Před tváří jeho šlo morní nakažení, a uhlí řeřavé šlo před nohama jeho.
౫ఆయనకు ముందుగా తెగుళ్లు నడుస్తున్నాయి. ఆయన అడుగుజాడల్లో అరిష్టాలు వెళ్తున్నాయి.
6 Zastavil se, a změřil zemi; pohleděl, a rozptýlil národy. Zrozrážíny jsou hory věčné, sklonili se pahrbkové věční, cesty jeho jsou věčné.
౬ఆయన నిలబడి భూమిని కొలిచాడు. రాజ్యాలను కంపింప జేశాడు. నిత్య పర్వతాలు బద్దలైపోయాయి. పురాతన గిరులు అణిగి పోయాయి. ఆయన మార్గాలు శాశ్వత మార్గాలు.
7 Viděl jsem, že stanové Chusan jsou pouhá marnost, a třásli se kobercové země Madianské.
౭కూషీయుల డేరాల్లో ఉపద్రవం కలగడం నేను చూశాను. మిద్యాను దేశస్థుల గుడారాల తెరలు గజగజ వణికాయి.
8 Zdaliž se na řeky, ó Hospodine, zdaliž se na řeky rozpálil hněv tvůj? Zdali proti moři rozhněvání tvé, když jsi jel na koních svých a na vozích svých spasitelných?
౮యెహోవా, నదుల మీద నీకు కోపం కలిగిందా? నదుల మీద నీకు ఉగ్రత కలిగిందా? సముద్రం మీద నీకు ఆగ్రహం కలిగిందా? నువ్వు నీ గుర్రాల మీద స్వారీ చేస్తూ నీ రక్షణ రథం ఎక్కి రావడం అందుకేనా?
9 Patrně jest zjeveno lučiště tvé pro přísahy pokolením lidu tvého stalé, (Sélah) Řeky země jsi rozdělil,
౯విల్లు వరలోనుండి తీశావు. బాణాలు ఎక్కుపెట్టావు. భూమిని బద్దలు చేసి నదులు ప్రవహింపజేశావు.
10 Viděly tě hory, třásly se, povodeň vod ustoupila; vydala propast hlas svůj, hlubina rukou svých pozdvihla.
౧౦పర్వతాలు నిన్ను చూసి మెలికలు తిరిగాయి. జలాలు వాటిపై ప్రవాహాలుగా పారుతాయి. సముద్రాగాధం ఘోషిస్తూ తన కెరటాలు పైకెత్తుతుంది.
11 Slunce a měsíc v obydlí svém zastavil se, při světle střely tvé létaly, při blesku stkvoucí kopí tvé.
౧౧నీ ఈటెలు తళతళలాడగా ఎగిరే నీ బాణాల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ ఉన్నత నివాసాల్లో ఆగిపోతారు.
12 V hněvě šlapal jsi zemi, v prchlivosti mlátil jsi pohany.
౧౨బహు రౌద్రంతో నీవు భూమి మీద సంచరిస్తున్నావు. మహోగ్రుడివై జాతులను అణగదొక్కుతున్నావు.
13 Vyšel jsi k vysvobození lidu svého, k vysvobození s pomazaným svým; srazil jsi hlavu s domu bezbožníka až do hrdla, obnaživ základ. (Sélah)
౧౩నీ ప్రజలను రక్షించడానికి నీవు బయలుదేరుతున్నావు. నీవు నియమించిన అభిషిక్తుణ్ణి రక్షించడానికి బయలు దేరుతున్నావు. దుష్టుల కుటుంబికుల్లో ప్రధానుడొకడైనా ఉండకుండాా వారి తలను మెడను ఖండించి నిర్మూలం చేస్తున్నావు (సెలా)
14 Holemi jeho probodl jsi hlavu vsí jeho, když se bouřili jako vichřice k rozptýlení mému, plésali, jako by sežrati měli chudého v skrytě.
౧౪పేదలను రహస్యంగా మింగివేయాలని ఉప్పొంగుతూ తుఫానులాగా వస్తున్న యోధుల తలల్లో వారి ఈటెలే నాటుతున్నావు.
15 Bral jsi se po moři na koních svých, skrze hromadu vod mnohých.
౧౫నీవు సముద్రాన్ని తొక్కుతూ సంచరిస్తున్నావు. నీ గుర్రాలు మహాసముద్ర జలరాసులను తొక్కుతాయి.
16 Slyšel jsem, a zatřáslo se břicho mé, k hlasu tomu drkotali rtové moji, kosti mé práchnivěly, a všecken jsem se třásl, že se mám upokojiti v den ssoužení, když přitáhne na lid, aby jej válečně hubil.
౧౬నేను వింటుంటే నా అంతరంగం కలవరపడుతున్నది. ఆ శబ్దానికి నా పెదవులు వణుకుతున్నాయి. నా ఎముకలు కుళ్లిపోతున్నాయి. నా కాళ్లు వణకుతున్నాయి. జనాలపై దాడి చేసే వారు సమీపించే దాకా నేను ఊరుకుని బాధ దినం కోసం కనిపెట్టవలసి ఉంది.
17 Byť pak fík nekvetl, a nebylo úrody na vinicích; byť i ovoce olivy pochybilo, a rolí nepřinesla užitky; a od ovčince odřezován byl brav, a nebylo žádného skotu v chlévích:
౧౭అంజూరపు చెట్లు పూత పట్టకపోయినా, ద్రాక్షచెట్లు ఫలింపక పోయినా, ఒలీవచెట్లు కాపులేక ఉన్నా, చేనులో పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, కొట్టంలో పశువులు లేకపోయినా,
18 Já však v Hospodinu veseliti se budu, plésati budu v Bohu spasení svého.
౧౮నేను యెహోవా పట్ల ఆనందిస్తాను. నా రక్షణకర్తయైన నా దేవుణ్ణి బట్టి నేను సంతోషిస్తాను.
19 Hospodin Panovník jest síla má, kterýž činí nohy mé jako laní, a na vysokých místech mých cestu mi způsobuje. Přednímu zpěváku na můj neginot.
౧౯ప్రభువైన యెహోవాయే నాకు బలం. ఆయన నా కాళ్లను లేడికాళ్లలాగా చేస్తాడు. ఉన్నత స్థలాల మీద ఆయన నన్ను నడిపిస్తాడు.